మహిళలపై దుండగుల ఆగడాలు రోజురోజుకీ మితిమీరుతున్నాయి. ఒంటరిగా మహిళలు కనిపిస్తే పాపం.. వారికి దాడికి తెగపడుతున్నారు.
వరంగల్: మహిళలపై దుండగుల ఆగడాలు రోజురోజుకీ మితిమీరుతున్నాయి. ఒంటరిగా మహిళలు కనిపిస్తే పాపం.. వారిపై దాడికి తెగపడుతున్నారు. ఆడవాళ్లనే లక్ష్యంగా చేసుకుని చైన్ స్నాచర్లు విలువైన అభరణాలను అపహరిస్తున్నారు. ప్రతిఘటిస్తే మహిళలు అని చూడకుండా వారిపై దాడి చేసి, హత్యాయత్నానికి పాల్పడుతున్న ఘటనలు ఎక్కడో ఒకచోట నిత్యం వెలుగుచూస్తూనే ఉన్నాయి. తాజాగా వరంగల్ జిల్లాలోని శాంతినగర్లోని ఓ మహిళ మెడలోనుంచి 15తులాల బంగారాన్ని దుండగులు ఎత్తుకెళ్లారు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.