హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో చైన్ స్నాచర్లు మరోసారి రెచ్చిపోయారు. రాజేంద్రనగర్లోని అత్తాపూర్లో బుధవారం నడిచి వెళ్తున్న మహిళపై దాడి చేసి... మెడలోని ఆరు తులాల బంగారం గొలుసు తెంచుకుని... అక్కడి నుంచి పరారైయ్యారు. అలాగే లంగర్హౌస్లో ఓ మహిళ మెడలోంచి చైన్ స్నాచర్లు మూడు తులాల బంగారాన్ని అపహరించి.. పారిపోయారు. సదరు బాధిత మహిళలు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందులోభాగంగా పరిసర ప్రాంతాల్లోని సీసీ ఫూటేజ్లను పోలీసులు పరిశీలిస్తున్నారు.