పోలీసుల బైకుపై చైన్ స్నాచర్లు పరార్ | Chain Snatchers fled with Police Bike | Sakshi
Sakshi News home page

పోలీసుల బైకుపై చైన్ స్నాచర్లు పరార్

Published Tue, Apr 19 2016 11:17 AM | Last Updated on Tue, Aug 21 2018 6:21 PM

పోలీసుల బైకుపై చైన్ స్నాచర్లు పరార్ - Sakshi

పోలీసుల బైకుపై చైన్ స్నాచర్లు పరార్

హైదరాబాద్: ఎల్బీ నగర్ పోలీసు స్టేషన్ లో పరిధిలో చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. ఏకంగా పోలీసుల వాహనంపైనే ఉడాయించారు. చైన్ స్నాచింగ్ కు పాల్పడిన దుండుగులు బైకుపై పారిపోతుండగా పోలీసులు వెంబడించారు. కొంతదూరం వెళ్లిన తర్వాత చైన్ స్నాచర్ల బైకు అకస్మాత్తుగా ఆగిపోయింది. బండిలో పెట్రోల్ అయిపోవడంతో మొరాయించింది. వారిని వెంబడిస్తూ పోలీసులు అక్కడి చేరుకున్నారు.

దుండగులు మారణాయుధాలతో బెదిరించి పోలీసుల బైక్ లాక్కున్నారు. అదే వాహనంపై అక్కడి నుంచి పారిపోయారు. విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు ఈ ఘటనపై దర్యాప్తుకు ఆదేశించారు. దొంగలను పట్టుకునేందుకు పోలీసులు విస్తృత గాలింపు చేపట్టారు. సీసీ టీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. పోలీసులనే బెదిరించి చైన్ స్నాచర్లు పరారవడం పట్ల స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement