LB Nagar Police station
-
చర్చికి వెళ్లొచ్చేసరికి ఇల్లు గుల్ల
నాగోలు: ఇంటి తాళాలు పగలగొట్టి బంగారం, వెండి ఆభరణాలు రూ. లక్ష నగదు దోచుకెళ్లిన ఘటన ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు బాధితుల వివరాల ప్రకారం.. నాగోలు బండ్లగూడలోని కేతన ఎన్‌క్లేవ్‌లో ఉండే లాలయ్య, మాదాపూర్‌లో విప్రో సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. వరసగా రెండ్రోజులు సెలవులు ఉండడంతో భార్య, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి శనివారం అబ్దుల్‌పూర్‌మెట్ సమీపంలోని చర్చికి వెళ్లారు. రాత్రి అక్కడ బస చేశారు. ఆదివారం ఉదయం లాలయ్య ఇంటికి వచ్చే సరికి గ్రిల్స్‌కు ఉన్న తాళం పగలగొట్టి ఉంది లోపలికెళ్లి చూడగా అల్మారా పగల గొట్టి అందులో ఉన్న 49 తులాల బంగారు ఆభరణాలు, రూ. 1 లక్ష నగదు, 8 తులాల వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లారు. లాలయ్య ఫిర్యాదు మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీమ్, పోలీస్ డాగ్స్‌తో తనిఖీలు చేసి అక్కడి వేలిముద్రాలు సేకరించారు. కాలనీలోని సీసీ కెమెరాలను పరిశీలించారు. లాలయ్య ఇంట్లో పనిచేసేవారు తరుచూ ఇంటికి వచ్చే వారిని పోలీసులు విచారిస్తున్నారు. బాధితుడు చర్చికి వెళ్లిన విషయం తెలుసుకున్న వారే చోరీ పాల్పడినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. (చదవండి: కోళ్ల చోరికి వచ్చిన యువకుడిపై దాడి) -
పల్లీపట్టీలు కావాలని వచ్చి... పుస్తెలు అపహరణ!
నాగోలు: పల్లీపట్టీ కావాలని వచ్చిన ఓ దుండగుడు షాపులో ఉన్న మహిళ మెడలోని బంగారు పుస్తెలు తెంచుకొని పారిపోయాడు. ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... హస్తినాపురం, అనుపమనగర్‌లో నివసించే పెబ్బేటి స్వప్న (35) అదే కాలనీలో జై సంతోషిమాత పింగి గిర్నీ నిర్వహిస్తోంది. గురువారం మధ్యాహ్నం గుర్తుతెలియని యువకుడు దుకాణానికి వచ్చి పల్లీపట్టి కావాలని అడిగి ఆమె మెడలోని పుస్తెలతాడు తెచ్చేందుకు యత్నించాడు. ఆమె తాడును గట్టిగా పట్టుకోవడంతో రెండు పుస్తెలు తెంచుకుని పారిపోయాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఎల్బీనగర్ పోలీస్‌లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఇంట్లో తెలియకుండా పెళ్లి.. నవ వధువు అనుమానాస్పద మృతి
నాగోలు: అనుమానాస్పద స్థితిలో నవ వధువు మృతి చెందిన ఘటన ఎల్బీనగర్ ఠాణా పరిధిలో జరిగింది. కుటుంబ సభ్యులు, పోలీసుల వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా, చింతపల్లి మండలం, జర్పుల తండాకు చెందిన జర్పుల మంత్రు, మారెమ్మ దంపతుల కుమార్తె అమూల్య (22), కొత్తపేటలోని ఓ కాఫీ షాపులో పని చేసేది. అక్కడ పని చేస్తున్న నాగర్‌కర్నూల్‌కు చెందిన కంతుల డేవిడ్(25)తో పరిచయమై మార్చి 24న సాయిబాబా గుడిలో పెళ్లి చేసుకుని వనస్థలిపురంలో కొన్ని రోజులు ఉండి, గత 20 రోజుల క్రితం ఎల్బీనగర్లోని శివగంగాకాలనీలో ఇల్లు అద్దెకు తీసుకొని ఉంటున్నారు. నాటి నుంచి అమూల్య పెళ్లి విషయం కుటుంబ సభ్యులకు తెలియకుండా జాగ్రత్త పడుతూ వచ్చింది. మూడ్రోజుల క్రితం హస్తినాపురంలో ఉండే తన అక్క ఇంటికి వెళ్లగా మెడలోని నల్లపూసలు గురించి కుటుంబ సభ్యులు అడిగినట్లు సమాచారం. అక్కడ నుంచి 17న హాస్టల్‌కు వెళ్తున్నానని చెప్పి తన భర్త వద్దకు వచ్చింది. అదే రోజు రాత్రి తల్లికి ఫోన్‌చేసి తాను కులాంతర వివాహం చేసుకున్నానని మీ వద్దనున్న తన బంగారు ఆభరణాలు, డబ్బులు ఇవ్వాలని అడిగినట్లు సమాచారం. ఉదయం బాత్రూంలో అమూల్య చున్నీతో అనుమానాస్పద స్థితిలో ఉండటంతో గమనించిన డేవిడ్ కామినేని హాస్పిటల్‌కు తరలించగా పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు ధ్రువీకరించారు. అమూల్య మృతి చెందిన సంగతి తెలుసుకున్న కుటుంబ సభ్యులు, గిరిజన సంఘాలు పెద్ద సంఖ్యలో ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. డేవిడ్ తన కుమార్తెను హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడని మృతురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అమూల్య మృతికి డేవిడ్ కారణమంటూ అతడిని కఠినంగా శిక్షించాలని గిరిజన సంఘాల నాయకులు పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్సీ రాములు ఎల్బీనగర్ ఏసీపీ శ్రీధర్‌రెడ్డి, సీఐ అశోక్‌రెడ్డితో మాట్లాడి వివరాలను తెలుసుకున్నాడు. పోస్ట్‌మార్టం రిపోర్టు వస్తే పూర్తి వివరాలు తెలుస్తాయని పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా రాములు నాయక్ మాట్లాడుతూ.. అమూల్య మృతికి కారణమైన నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యమంత్రి, హోంమంత్రి, గిరిజన సంక్షేమ మంత్రి స్పందించి అమూల్య కుటుంబానికి రూ.కోటి నష్ట పరిహారం, ఇంట్లో ఒకరికి ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. -
ఎల్బీ నగర్లో మహిళ దారుణ హత్య
సాక్షి, హైదరాబాద్ : ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జనప్రియ కాలనీలోని ఫ్యామిలీ కేర్ సర్వీస్ సెంటర్లో అర్ధరాత్రి దారుణం చోటుచేసుకుంది. అక్కడ విధులు నిర్వహిస్తున్న హేమలత అనే మహిళ హత్యకు గురైన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సహ ఉద్యోగి వెంకటేశ్వరరావు ఈ ఘటనకు ఒడిగట్టాడు. అతడు హేమలతపై లైంగిక దాడికి యత్నించగా ఆమె ప్రతిఘటించడంతో మెడ భాగంతో కత్తితో పొడిచి హతమార్చాడు. హేమలత మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మృతురాలి తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు, వెంకటేశ్వరరావును అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. -
‘ఎస్సై మాతో దురుసుగా ప్రవర్తించాడు’
సాక్షి, హైదరాబాద్ : లాక్డౌన్ సమయంలో కేంద్రం వలస కూలీలు స్వస్థలాకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వడంతో వారు పెద్ద ఎత్తున సమీపంలోని పోలీస్ స్టేషన్లకు చేరకుంటున్నారు. ఈ క్రమంలోనే సోమవారం అనుమతి పత్రాల కోసం ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ భారీగా వలస కూలీలు తరలివచ్చారు. అయితే పోలీసులు మాత్రం స్వంత వాహనాలు ఉంటేనే స్వస్థలాకు వెళ్లేందుకు అనుమతి పత్రాలు ఇస్తామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ పరిసరాల్లో గందగోళం ఏర్పడింది. మరోవైపు అనుమతి పత్రాల కోసం వచ్చిన తమపై ఎల్బీ నగర్ ఎస్సై సుధాకర్ దురుసుగా ప్రవర్తించారని శ్రీకాకుళంకు చెందిన చండీశ్వరి ఆరోపించారు. తమ దంపతులను ఎస్సై బుద్ధి ఉందా అంటూ తిట్టారని చెప్పారు. ఇంకా చండీశ్వరి దంపతులు మాట్లాడుతూ.. ‘మా కూతురు గర్భవతి. ఆమెకు ఆపరేషన్ ఉండటంతో మమ్మల్ని శ్రీకాకుళానికి పంపించమని పోలీసులను వేడుకున్నప్పటికీ వారు కనికరించలేదు. పైగా అనుమతి పత్రాలు కావాలంటే కారు తెచ్చుకోవాలని చెప్తున్నారు. అలా అయితేనే అనుమతి ఇస్తామని అంటున్నారు. తినడానికి తిండి లేని తాము కారు ఎక్కడి నుంచి తీసుకువస్తాం’ అని ఆవేదన వ్యక్తం చేశారు. -
దుబాయ్ నుంచి వచ్చాడని..
సాక్షి, హైదరాబాద్ : దుబాయ్ నుంచి వచ్చి బస్సులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తిని తోటి ప్రయాణికులు అడ్డుకున్నారు. కరోనా లక్షణాల ఉండటంతో అతన్ని బస్సులో నుంచి దించివేశారు. ఈ ఘటన ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన మండపాటి నాని(22) దుబాయ్ నుంచి విమానంలో ముంబై చేరుకున్నాడు. అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చిన నాని ప్రైవేటు బస్సులో భీమవరం బయలుదేరాడు. అయితే నాని చేతిపై స్టాంప్‌ను గుర్తించిన తోటి ప్రయాణికులు దాని గురించి ఆరా తీశారు. వారు అలా అడిగేసరికి నాని కంగారు పడ్డాడు. దీంతో నాని ప్రవర్తనపై అనుమానం వచ్చిన తోటి ప్రయాణికులు అతన్ని బస్సులో నుంచి కిందికు దింపారు. అనంతరం అధికారులకు సమచారం అందజేశారు. దీంతో రంగంలోకి దిగిన ఎల్బీ నగర్ పోలీసులు నానిని అదుపులోకి తీసుకుని వివరాలు సేకరించారు. కాగా, ముంబై క్వారంటైన్ సెంటర్ నుంచి నాని తప్పించుకుని హైదరాబాద్ చేరుకున్నట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ తర్వాత పోలీసులు అతడిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. మరోవైపు భారత్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరగడం ఆందోళక కలిగిస్తుంది. ముఖ్యంగా కరోనా సోకినవారిలో విదేశాల నుంచి వచ్చినవారే అధికంగా ఉన్నారు. దీంతో కరోనా నియంత్రణలో భాగంగా విదేశాల నుంచి భారత్ చేరుకున్నవారికి ఎయిర్‌పోర్ట్‌లలో స్క్రీనింగ్ నిర్వహించడంతో.. క్వారంటైన్‌కు తరలిస్తున్నారు. అలాగే కరోనా లక్షణాలు లేనివారికి ముందు జాగ్రత్తగా సెల్ఫ్ క్వారంటైన్లో ఉంటే మంచిందని సూచిస్తున్నారు. కొన్ని చోట్ల విదేశాల నుంచి వచ్చినవారి చేతులపై స్టాంప్‌లు వేస్తున్నారు. ఇప్పటివరకు భారత్‌లో 223 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. -
కట్టుకున్నోడే కాలయముడు
నాంపల్లి (మునుగోడు): అవును ఆ తమ్ముడి అనుమానమే నిజమైంది. మూడేళ్లు అక్క ఆచూకీ కోసం ఆ సోదరుడు ఓ డిటెక్టివ్‌లా చేసిన పరిశోధన ఆఖరికి పోలీసుల సహకారంతో ఫలించింది. కట్టుకున్నోడే మూడేళ్లు చిత్రహింసలు పెట్టి.. ఆపై చిదిమేసి బావిలో పడవేసినట్టు ఆధారాలు లభ్యమయ్యాయి. నల్లగొండ జిల్లాలో సంచలనంగా మారిన ఓ హత్య కేసు మిస్టరీ తొమ్మిదేళ్ల అనంతరం వీడింది. వివరాల్లోకి వెళితే.. నార్కట్‌పల్లి మండలం మాండ్ర గ్రామానికి చెందిన జంగయ్యకు ప్రియాంక (26.. అదృశ్యమైన నాటి వయసు), ఉపేందర్ సంతానం. బతుకుదెరువు నిమిత్తం జంగయ్య భార్య, బిడ్డలతో కలసి 2006లో హైదరాబాద్‌లోని ఎల్బీనగర్కు వలస వెళ్లాడు. అక్కడే కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకున్నాడు. ఈ క్రమంలో ప్రియాంకకు అక్కడే క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్న మర్రిగూడ మండలం వెంకెపల్లి గ్రామానికి చెందిన మోరా హనుమంతు పరిచయమయ్యాడు. అది కాస్తా ప్రేమకు దారితీసింది. పెద్దలకు తెలియకుండా వివాహం హనుమంతు.. తన మాయమాటలతో ప్రియాంకను ప్రేమలోకి దింపి 2006లోనే వివాహం చేసుకున్నాడు. అప్పటి నుంచి ప్రియాంకతో వారి కుటుంబ సభ్యులకు తెలియకుండా హైదరాబాద్‌లోనే మకాం పెట్టాడు. వీరి దాంపత్యానికి ఓ కుమారుడు, కుమార్తె జన్మించారు. కుమార్తె తనకు జన్మించలేదంటూ.. కొత్త జీవితం ప్రారంభించిన ప్రియాంక ఆనందం ఎంతో కాలం నిలవలేదు. అప్పటివరకు ఎంతో అన్యోన్యంగా సాగిన వారి కాపురంలో అనుమానం చిచ్చురేపింది. కుమార్తె తనకు జన్మించలేదంటూ హనుమంతు భార్యను చిత్రహింసలు పెట్టడం ప్రారంభించాడు. కుమార్తెను సాకలేనంటూ.. మరొకరికి ఇచ్చేద్దామని ఒత్తిడితెచ్చాడు. దీంతో అతడితో వేగలేకపోయిన ప్రియాంక అతడి ఒత్తిడికి తలొగ్గి కన్నపేగును హైదరాబాద్‌లోనే ఒకరికి దత్తత ఇచ్చేసింది. మూడేళ్లు నరకమే.. ఇద్దరు బిడ్డలకు జన్మనిచ్చిన ప్రియాంక జీవితం మూడేళ్ల పాటు నరకప్రాయంగానే సాగింది. భర్త ఎన్ని చిత్రహింసలు పెట్టినా కుమారుడి కోసం బతుకు బండిని సాగించింది. అయినా, అతడిలో మానవత్వం లేకుండా పోయింది. గ్రామంలో వ్యవసాయ పనులు చూసుకుంటున్నానని చెబుతూ పెద్దలు కుదిర్చిన మరో యువతితో వివాహం చేసుకుని రెండు నావలపై ప్రయాణం సాగించాడు. ప్రియాంక బాగోగులు చూడకుండా స్వగ్రామంలో ఎక్కువ కాలం గడుపుతుండేవాడు. దీంతో ప్రియాంక నుంచి ఒత్తిడి ఎక్కువైంది. దీనిని హనుమంతు తట్టుకోలేకపోయాడు. పథకం ప్రకారం.. ప్రియాంక తన సంతోషానికి అడ్డు తగులుతోందని, ఆమెను ఎలాగైనా అంతమొందించాలని హనుమంతు నిర్ణయించుకున్నాడు. అదను కోసం వేచి చూడటం ప్రారంభించాడు. 2009 చివరలో హనుమంతు రెండోభార్య, అతడి తల్లిదండ్రులు ఓ శుభకార్యం కోసం ఊరెళ్లారు. ఇదే అదనుగా భావించిన హనుమంతు, ప్రియాంక వద్దకు వచ్చి మాయమాటలు చెప్పాడు. వ్యవసాయ పనులు చక్కబెట్టొద్దామంటూ కారులో మర్రిగూడ మండలం వెంకెపల్లికి తీసుకొచ్చాడు. అదే రోజు రాత్రి ఆమెతో గొడవపడి ప్లాస్టిక్ వైరుతో గొంతునులిమి అంతమొందించాడు. ఆపై గోనెసంచిలో మూటకట్టి కారు డిక్కీలో వేసుకుని, రాంరెడ్డిపల్లి శివారుకు తీసుకెళ్లి ఓ పడావుబావిలో పడవేశాడు. అనంతరం ప్రియాంకకు పుట్టిన కుమారుడిని కొండమల్లేపల్లికి చెందిన తన సమీప బంధువుకు ఇచ్చేసి అప్పటినుంచి రెండోభార్య, పిల్లలతో దర్జాగా జీవనం సాగిస్తున్నాడు. ఫేస్బుక్ ఆధారంగా.. 2006 నుంచి కానరాకుండా పోయిన సోదరి ప్రియాంక కోసం ఉపేందర్ అన్వేషణ ప్రారంభించాడు. 2016లో ప్రియాంక, హనుమంతు, ఓ బాలుడితో దిగిన ఫొటో ఫేస్బుక్లో కనిపించడంతో పరిశోధన ప్రారంభించాడు. ఎట్టకేలకు తన సోదరితో ఉన్న వ్యక్తి మోరా హనుమంతుగా తెలుసుకుని వివరాలు సేకరించాడు. ఇటీవల మర్రిగూడ మండలం వెంకెపల్లికి చేరుకుని సోదరి ప్రియాంక గురించి ఆరా తీశాడు. స్థానికులు, ఘోరం జరిగిపోయి ఉంటుందనే అనుమానం వ్యక్తం చేయడంతో తట్టుకోలేకపోయాడు. ఎల్బీనగర్ పోలీసులను ఆశ్రయించి.. తన సోదరి హత్యకు గురైందనే అనుమానంతో ఉపేందర్ వెంటనే ఎల్బీనగర్ పోలీసులను ఆశ్రయించి తన పరిశోధనలో వెలుగు చూసిన వాస్తవాలను బయటపెట్టాడు. అనంతరం అక్కడి పోలీసులు కేసును స్థానిక పోలీసులకు పురమాయించడంతో నాంపల్లి సీఐ ప్రభాకర్‌రెడ్డి రంగంలోకి దిగారు. హనుమంతును రెండు రోజుల క్రితం అదుపులోకి తీసుకున్నారు. తమదైన పద్ధతిలో విచారణ సాగించగా హత్యోదంతం తీరును హనుమంతు వివరించాడు. ఎముకల వెలికితీత మోర హనుమంతు వెల్లడించిన సమాచారం మేరకు పోలీసులు శనివారం రాంరెడ్డిపల్లి శివారులోని పడావుబావిలో ఎముకలు సేకరించారు. తొమ్మిదేళ్ల క్రితం మృతదేహాన్ని మూటగట్టిన గోనెసంచి అవశేషాలు, నాడు హనుమంతు ప్రియాంక మృతదేహంతో పాటు పడవేసిన కారు మ్యాట్‌ను, పుర్రె, ఎముకలు, కేశాలు, ప్లాస్టిక్ చెప్పులు, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. ఎముకలు, కేశాలను పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపించనున్నట్టు సీఐ ప్రభాకర్‌రెడ్డి మీడియాకు తెలిపారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. -
పోలీస్ స్టేషన్ ముందే బైక్ చోరీ
హైదరాబాద్ : సాధారణంగా మన వాహనాలు చోరీ అయితే పోలీస్‌స్టేషన్‌కు వెళ్ళి ఫిర్యాదు చేస్తాం. అదే పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడానికి వెళ్లిన వ్యక్తి బైక్ చోరీ అయితే ఎవరికి చెప్పుకోవాలి? అప్పుడేంటి పరిస్థితి. సరిగ్గా అదే జరిగింది. వివరాల్లోకి వెళితే... ఎల్ బీ నగర్ ప్రాంతంలోని ఎన్టీఆర్ నగర్‌కు చెందిన కేతావత్ రాజు బుధవారం ఉదయం ఓ కేసు విషయంలో ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్‌కు వచ్చారు. తన ద్విచక్ర వాహనాన్ని (ఏపీ29 బీయూ 9016) పోలీస్‌స్టేషన్ ముందు పార్క్ చేసి వెళ్లాడు. గంట తరువాత తిరిగి వచ్చే సరికి అక్కడ బైక్ కనిపించలేదు. కొద్దిసేపు పరిసరాలు వెతికినా ఎక్కడా కనిపించలేదు. దాంతో రాజు అయోమయానికి గురై అదే పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు దర్యాప్తు చేపట్టి స్టేషన్లో నూతనంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలలో వీడియోఫుటేజీని పరిశీలించగా గుర్తు తెలియని వ్యక్తి ఎరుపు కలర్ టీషర్ట్ వేసుకొని స్టేషన్ ముందు పార్క్ చేసిన ద్విచక్ర వాహనాల తాళాలు తీయడం స్పష్టంగా కనిపించింది. ఆ ప్రయత్నంలో ఏ బైక్ రాకపోవడంతో రాజు బైక్ తాళం వెళ్లడంతో క్షణం ఆలస్యం చేయకుండా బైక్ స్టార్ట్ చేసుకుని దర్జాగా పారిపోయాడు. పోలీస్ స్టేషన్ ముందే బైక్ పార్క్ చేస్తే చోరీకి గురవ్వడంతో ఇక ఇతర ప్రాంతాల్లో బైక్‌లు పెడితే అవి ఉంటాయని నమ్మకం పోయిందని పలువురు పేర్కొన్నారు. ఇదే పోలీస్‌స్టేషన్ పార్కింగ్‌లో గతంలో కూడా ఏకంగా ఓ కానిస్టేబుల్ బైక్ పోవడం విశేషం. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
వృద్ధురాలి గొంతు కోసి ఆభరణాలతో పరార్
నాగోల్‌లో సంఘటన హైదరాబాద్: బంధువని ఆత్మీయంగా ఆహ్వానించి అన్నం పెట్టిన ఓ వృద్ధురాలి గొంతునే కోసి బంగారు నగలతో ఉడాయించాడో దుర్మార్గుడు. ఈ సంఘటన హైదరాబాద్‌లోని ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన కొమ్మూరి దినేశ్‌రెడ్డి, శిరీషలు నగరానికి వచ్చి నాగోలు జైపురికాలనీ బాలాజీ ఎన్‌క్లేవ్‌లో నివాసముంటున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. దినేశ్‌రెడ్డి తల్లి సువర్ణ (60) కూడా వీరితో పాటే ఉంటోంది. దినేశ్‌రెడ్డి మార్కెటింగ్ ఉద్యోగం చేస్తుండగా శిరీష చెంగిచెర్లలోని ప్రభుత్వ పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తోంది. గురువారం భార్యాభర్తలు ఇద్దరు విధులకు వెళ్లారు. దినేశ్‌రెడ్డి కుమారుడు స్కూల్‌కు వెళ్లగా ఇంట్లో కూతురు, సువర్ణ మాత్రమే ఉన్నారు. ఈ క్రమంలో శిరీష పెద్దమ్మ కుమారుడు శ్యామ్ ఇంటికి వచ్చాడు. సువర్ణ అతన్ని ఇంట్లోకి ఆహ్వానించి అన్నం పెట్టింది. అనంతరం వెళ్లి నిద్ర పోతుండగా శ్యామ్ ఇంట్లో ఉన్న కత్తి తీసుకుని ఆమె ఒంటిపై ఉన్న బంగారాన్ని ఇవ్వాలని బెదిరించాడు. దీనికి సువర్ణ నిరాకరించడంతో శ్యామ్ కత్తితో గొంతు కోసి ఆమె మెడలోని 4 తులాల బంగారు గొలుసు, చేతికున్న 4 బంగారు గాజులు, 2 బంగారు ఉంగరాలను తీసుకుని పారిపోయాడు. వెంటనే దినేశ్‌రెడ్డి కూతురు, సువర్ణ కేకలు వేయడంతో స్థానికులు వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. వృద్ధురాలిని చికిత్స నిమిత్తం నాగోలులోని సుప్రజ ఆసుపత్రికి తరలించారు. దినేశ్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
పోలీసుల బైకుపై చైన్ స్నాచర్లు పరార్
హైదరాబాద్: ఎల్బీ నగర్ పోలీసు స్టేషన్ లో పరిధిలో చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. ఏకంగా పోలీసుల వాహనంపైనే ఉడాయించారు. చైన్ స్నాచింగ్ కు పాల్పడిన దుండుగులు బైకుపై పారిపోతుండగా పోలీసులు వెంబడించారు. కొంతదూరం వెళ్లిన తర్వాత చైన్ స్నాచర్ల బైకు అకస్మాత్తుగా ఆగిపోయింది. బండిలో పెట్రోల్ అయిపోవడంతో మొరాయించింది. వారిని వెంబడిస్తూ పోలీసులు అక్కడి చేరుకున్నారు. దుండగులు మారణాయుధాలతో బెదిరించి పోలీసుల బైక్ లాక్కున్నారు. అదే వాహనంపై అక్కడి నుంచి పారిపోయారు. విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు ఈ ఘటనపై దర్యాప్తుకు ఆదేశించారు. దొంగలను పట్టుకునేందుకు పోలీసులు విస్తృత గాలింపు చేపట్టారు. సీసీ టీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. పోలీసులనే బెదిరించి చైన్ స్నాచర్లు పరారవడం పట్ల స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. -
కుక్క కోసం కొట్టుకున్నారు...
హైదరాబాద్ : ఆస్తి కోసం కొట్టుకోవడం చూశాం....అమ్మాయి కోసం కొట్టుకుంటారని విన్నాం...కానీ ఇదేం విచిత్రమో కుక్క కోసం ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. కుక్కే కదా అని తీసిపారేయకండి. చివరకు ఈ పంచాయితీ పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కింది. కుక్క నాదంటే... నాదంటూ నడిరోడ్డుపై కొట్లాటకు దిగిన ఈ సంఘటన హైదరాబాద్ ఎల్బీనగర్లో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం ఎల్బీనగర్కు చెందిన సురేందర్ రెడ్డి కొన్ని రోజుల క్రితం స్నేహితుడి వద్ద నుంచి ఓ కుక్కను తెచ్చుకుని పెంచుకుంటున్నాడు. సరూర్‌నగర్‌కు చెందిన ఉపేందర్‌రెడ్డి పెంచుకుంటున్న కుక్క అయిదు నెలల క్రితం తప్పిపోయింది. దీంతో పోలీస్‌స్టేషన్‌లో కంప్లైట్ ఇచ్చాడు. సోమవారం రాత్రి సురేందర్ రెడ్డి తన కుక్కను తీసుకుని రోడ్డు మీదకి వచ్చాడు. అదే సమయంలో ఉప్పల్ వెళ్తున్న ఉపేందర్ సిరినగర్ కాలనీ వద్ద తన కారు ఆపాడు. సురేందర్‌రెడ్డి అనే వ్యక్తి దగ్గర కుక్క కనిపించింది. అంతేకాదు ఉపేందర్‌ను గుర్తుపెట్టి కారు కూడా ఎక్కిందట. దీంతో ఆ కుక్క తనదే అంటున్నాడు ఉపేందర్. సురేందర్‌రెడ్డి మాత్రం ఓ కుటుంబం అమెరికా వెళ్తూ ఆ కుక్కను తనకు అప్పగించి వెళ్లారని చెప్తున్నారు. కుక్కను తీసుకెళ్లేందుకు ప్రయత్నించడంతో ఉపేందర్... సురేందర్ మధ్య గొడవ మొదలైంది. ఇద్దరూ ఒకరినొకరు కొట్టేసుకున్నారు. స్థానికులు గమనించి ఎల్బీనగర్ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఈ వివాదం పోలీస్ స్టేషన్‌కు చేరింది. -
20 తులాల బంగారు ఆభరణాలు చోరీ
నాగోలు: ఇంటి తాళాలు పగులగొట్టి 20 తులాల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన సంఘటన ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... రాక్‌టౌన్‌కాలనీలోని ఓ అపార్ట్మెంటులో గడ్డం ప్రియదర్శిని ప్రైవేటు ఉద్యోగిని. శనివారం రాత్రి ఉద్యోగానికి వెళ్లి ఆదివారం ఉదయం తిరిగి ఇంటికి వెళ్లింది. అప్పటికే ఇంటి తాళాలు పగులగొట్టి బీరువాలోని సుమారు 20 తులాల బంగారు ఆభరణాలను దొంగలు ఎత్తుకెళ్లారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
అక్రమంగా మద్యం అమ్ముతున్న వ్యక్తిపై కేసు నమోదు
మన్సూరాబాద్: అక్రమంగా మద్యం అమ్ముతున్న వ్యక్తిపై కేసు నమోదు చేసిన సంఘటన ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... ఎల్బీనగర్ ఎన్టీఆర్నగర్లో నివాసముండే నందగిరి దినేష్ (24) అక్రమంగా మద్యం అమ్ముతున్నాడనే సమాచారం అందుకున్న పోలీసులు శనివారం ఉదయం దాడి చేసి అక్రమంగా నిల్వ ఉంచిన 8 మద్యం బాటిళ్లను, రూ.700 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు పోలీసులు దినేష్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రేమించాలని వేధిస్తున్నందుకు...
నాగోలు: పెళ్లి చేసుకోమని ఓ యువతి వెంటపడి వేధిస్తున్న యువకునిపై కేసు నమోదైంది. ఈ ఘటన ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బండ్లగూడ ప్రాంతానికి చెందిన యువతి (24) కళాశాలకు వెళ్లే క్రమంలో అదే ప్రాంతానికి చెందిన మల్లేశ్ ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకోవాలని వేధించసాగాడు. ఈ క్రమంలో ఆరు నెలల క్రితం నాగోలు చౌరస్తాలో అసభ్యంగా ప్రవర్తించాడు. ఇటీవల ఆ యువతికి వివాహం నిశ్చయం అయింది. సెల్ఫోన్లో తీసిన ఫొటోలను అభ్యంతరకరంగా మార్ఫింగ్ చేసి పెళ్లి కొడుకుకు మల్లేశ్ పంపాడు. ఇది తెలుసుకున్న బాధితురాలు శనివారం ఎల్బీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
మమతను చంపి.. మానవత మరచి
♦ ఓ సవతి తల్లి పైశాచికం.... సహకరించిన తండ్రి ♦ ఏడాది పాటు యువతి గృహనిర్బంధం... ♦ బతికుండగానే నరకం చూపించిన వైనం.... ♦ బాలల హక్కుల పరిరక్షణ కమిటీ చొరవతో విముక్తి హైదరాబాద్ : మానవత్వం మరిచిపోయి తనలోని పైశాచికత్వాన్ని ఓ యువతిపై ప్రదర్శించి ప్రత్యక్ష నరకం చూపించింది ఆ సవతి తల్లి. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తండ్రి సైతం కన్నకూతురిని బాధలు పెడ్తుంటే సహకరించడంతో ఓ యువతి ఏడాదిగా నరకం చూసింది. ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న బాలల హక్కుల పరిరక్షణ కమిటీ సభ్యుడు అచ్యుతరావు బుధవారం ఎల్బీనగర్ ఎస్ఐ నర్సింహారెడ్డి సాయంతో బాధితురాలు ఉంటున్న ఇంటిపై దాడి చేసి యువతికి విముక్తి కల్పించారు. పోలీసుల కథనం మేరకు చిప్ప రమేష్ నాగోలు బండ్లగూడ ఆనంద్‌నగర్‌లో నివాసముంటూ జూనియర్ టెలికం అధికారిగా పనిచేస్తున్నారు. 1991లో పుత్లీబౌలి ప్రాంతానికి చెందిన సరళాదేవితో అతనికి వివాహమైంది. వీరికి ప్రత్యూష జన్మించింది. భార్యాభర్తల మధ్య స్పర్థ్ధలు రావడంతో 2003లో విడిపోయారు. అనంతరం రమేష్ 2008లో సికిం ద్రాబాద్‌కు చెందిన చాముండేశ్వరి అలియాస్ శ్యామలను రెండో వివాహం చేసుకున్నారు. 2010లో మొదటి భార్య చనిపోవడంతో ప్రత్యూషను ఆమె కుటుంబీకులు మూసాపేటలోని ఓ అనాథ ఆశ్రమంలో చేర్పించారు.దీంతో మైనార్టీ తీరిన పాపను 2014లో తండ్రి రమేష్ తన ఇంటికి తీసుకొచ్చారు. ఇది నచ్చని అతని రెండో భార్య చాముండేశ్వరి అప్పటి నుంచి ప్రత్యూషను గృహనిర్బంధం చేసి చిత్రహింసలు పెడుతోంది. ఇనుప చువ్వలను కాల్చి వాతలు పెట్టేది. యువతి శరీరమంతా కత్తితో గాయపరిచింది.ఆమెతో బలవంతంగా టాయిలెట్లు శుభ్రపరిచే హార్పిక్, యాసిడ్, సర్ఫ్ వంటి వాటిని తాగించేది. ఆహారం కూడా సరిగా పెట్టకపోవడంతో ప్రత్యూష శారీరకం గా, మానసికంగా దయనీయస్థితికి చేరుకుంది. ఈ విషయాలన్నీ తెలిసినా తండ్రి రమేష్ భార్యకే వత్తాసు పలికేవాడు. ఇది ప్రత్యూషను మరింత కుంగదీసింది. ఏడాదిగా సాగిన ఈ అకృత్యాల వల్ల ప్రత్యూష నడవలేని, మాట్లాడలేని దుస్థితికి చేరింది. బాధలకు తాళలేక పలుమార్లు ఇంట్లో నుంచి పారిపోదామని యత్నించినా చాముండేశ్వరి చితకబాది అడ్డుకునేది. ఈ సమాచారం అందుకున్న బాలల హక్కుల పరిరక్షణ కమిటీ సభ్యుడు అచ్యుతరావు, ఎల్బీనగర్ పోలీసులు బుధవారం ఉదయం వారి ఇంటిపై దాడి చేసి ప్రత్యూషకు విముక్తి కల్పించారు. ఆమెను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రత్యూషపై లైంగిక దాడులు జరిగాయా... అన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఎల్బీనగర్ పోలీసులు చాముండేశ్వరిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. తండ్రి రమేష్ కోసం గాలిస్తున్నా రు. వీరిపై హత్యాయత్నం, అక్రమ నిర్బంధం, తీవ్రంగా గాయపరిచినందుకు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. వేధించిన ఇద్దరిపై హత్యాయత్నం కేసులు నమోదు చేయాలి: అచ్యుతరావు ప్రత్యూషను గృహ నిర్బంధం చేసి చిత్రహింసలకు గురిచేసిన తండ్రి రమేష్, మారుతల్లి చాముండేశ్వరిలపై హత్యాయత్నం కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని బాలల హక్కుల పరిరక్షణ సమితి సభ్యుడు అచ్యుతరావు పోలీసులను ఆదేశించారు. కాగా ప్రత్యూష ఎల్బీనగర్ అవేర్‌గ్లోబల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె పరిస్థితి అత్యంత దుర్భరంగా ఉంది. దుస్తులు కూడా సరిగా లేవు. మందులు, ఆహారం, దుస్తులు అవసరం. సహాయం చేయదలిచిన దాతలు వస్తు రూపంలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలికకు నేరుగా అప్పగించవచ్చని, మరిన్ని వివరాలకు 9866342424 ఫోన్ నెంబర్‌కు సంప్రదించాలని అచ్యుతరావు తెలిపారు. -
బాలికను బలిగొన్న చెరువు
బండ్లగూడ చెరువు వద్ద ఘటన నాగోలు: ప్రమాదవశాత్తు చెరువులో పడి విద్యార్థిని మృతి చెందింది. ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం ఈ విషాద ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... మహబూబ్‌నగర్ జిల్లా ఆమనగల్ గ్రామానికి చెందిన మహ్మద్ జహంగీర్, సైదా భార్యాభర్తలు. వీరికి ముగ్గురు కుమార్తెలు, కుమారుడు సంతానం. వీరు జీవనోపాధి కోసం నగరానికి వచ్చి నాగోలు సాయినగర్‌లోని గుడిసెల్లో ఉంటున్నారు. జహంగీర్ పెయింటర్ పని చేస్తుండగా.., సైదా ఇళ్లల్లో పని చేస్తోంది. వీరి చిన్న కూతురు సనా(10) స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 3వ తరగతి చదువుతోంది. గురువారం ఉదయం తన స్నేహితురాలు హస్రత్ఫాతిమా(9)తో కలిసి చెత్త వేసేందుకు బండ్లగూడ చెరువు వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు సనా చెరువులో పడిపోయింది. స్నేహితురాలు హస్రత్ కాపాడేందుకు యత్నించినా ఫలితం లేకుండాపోయింది. సనా నీటిలో మునిగిపోవడంతో వెంటనే హస్రత్ ఫాతిమా ఇంటికి వచ్చి తల్లిదండ్రులకు విషయం చెప్పగా వారు ఘటనా స్థలానికి చేరుకొని గాలించారు. ఆచూకీ దొరక్కపోవడంతో పోలీసులకు సమాచారం ఇవ్వగా గజ ఈతగాళ్లను రప్పించి వెతికించారు. ఉదయం నుంచీ గాలించగా మధ్యాహ్నానానికి మృతదేహం లభించింది. దీంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తలించి, కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
నారా లోకేష్‌పై కేసు
టీఆర్ఎస్వీ ఫిర్యాదుతో నమోదు చేసిన పోలీసులు నాగోలు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కుమారుడు నారా లోకేష్‌పై ఎల్బీనగర్ పోలీసు స్టేషన్లో మంగళవారం కేసు నమోదైంది. తెలంగాణ రాష్ట్రప్రభుత్వంతో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కించపరిచేలా లోకేష్ వ్యాఖ్యానించాడని, అతనిపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర విద్యార్థి విభాగం రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు వి.రాంనర్సింహగౌడ్ ఈనెల 15న చేసిన ఫిర్యాదు మేరకు 504, 505, 66/ఏ, ఐటీ యాక్ట్‌ల కింద కేసు నమోదు చేసినట్టు ఎల్బీనగర్ సీఐ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. తెలంగాణలో హిట్లర్ పాలన కొనసాగుతోందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై ఆంధ్రజ్యోతి పత్రికలో, తెలంగాణ ప్రభుత్వాన్ని రౌడీలు నడిపిస్తున్నారంటూ ట్విట్టర్లోను లోకేష్ పేర్కొన్నాడని రాంనర్సింహగౌడ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని, సీఎం కేసీఆర్‌ను అవమానపర్చడమేనని ఆయన ఆరోపించారు. ప్రజల్లో ద్వేషాన్ని నింపుతూ రెచ్చగొట్టేలా వాఖ్యలు చేసిన లోకేష్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన సీఐని కోరారు. దీనిపై న్యాయపరమైన సలహాలు తీసుకుని కేసు నమోదు చేశామని, ఈ కేసును సైబరాబాద్ క్రైం విభాగానికి అప్పగిస్తామని సీఐ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. కేసు నమోదు చేయండి: మెజిస్ట్రేట్ రంగారెడ్డి జిల్లా కోర్టులు: తెలంగాణలో ప్రభుత్వాన్ని రౌడీలు నడుపుతున్నారంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన నారా లోకేష్‌పై కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని సైబరాబాద్ 2వ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ మంగళవారం ఎల్బీనగర్ పోలీసులను ఆదేశించారు. లోకేష్ వాఖ్యలపై నిరసన వ్యక్తం చేస్తూ ఎల్బీనగర్ ఆర్టీసీకాలనీకి చెందిన న్యాయవాదులు రవికుమార్, అభిలాష్‌రావు మంగళవారం కోర్టులో ఫిర్యాదు దాఖలు చేశారు. ఫిర్యాదును స్వీ కరించిన సైబరాబాద్ 2వ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ యూసుఫ్... 153ఏ, 153బీ, 295, 120బీ భారతీయ శిక్ష్మాస్మృతి కింద లోకేష్‌పై కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని పోలీసులను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. -
నారా లోకేష్‌పై పోలీసులకు ఫిర్యాదు
నాగోలు: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన నారా లోకేష్‌పై చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర విద్యార్థి విభాగం రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు వి.రాంనర్సింహగౌడ్ శనివారం ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తెలుగుదేశం పార్టీ నాయకుడు నారా లోకేష్ తెలంగాణ ప్రభుత్వాన్ని రౌడీలు నడిపిస్తున్నారని, శాంతిభద్రతలు అదుపుతప్పి పోయాయని, హిట్లర్ ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని పాలిస్తున్నాడని ట్విట్టర్లో పేర్కొన్నట్లు తెలిపారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వంపై కుట్ర పూరితంగా వ్యవహరించి రాజ్యాంగాన్ని అపహాస్యం చేసే విధంగా మాట్లాడుతూ, విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. నారా రోహిత్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎల్బీనగర్ సీఐకి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును స్వీకరించిన ఎల్బీనగర్ సీఐ శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ న్యాయపరమైన సలహాలు తీసుకుని తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
లొంగిపోయిన టీవీ9 సీఈఓ రవిప్రకాశ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రజాప్రతినిధులను, ముఖ్యమంత్రిని, అసెంబ్లీని కించపరిచే కార్యక్రమాన్ని ప్రసారం చేసిన కేసులో టీవీ9 సీఈఓ రవిప్రకాశ్ హైకోర్టు ఆదేశాల మేరకు శనివారం ఎల్బీ నగర్ పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయారు. రూ.25వేల వ్యక్తిగత బాండ్, ఇద్దరు ఉద్యోగుల ష్యూరిటీతోపాటు పాస్‌పోర్ట్‌ను స్వాధీనం చేసుకుని వ్యక్తిగత పూచీకత్తుపై ఆయనకు కండీషన్ బెయిలు మంజూరు చేశారు. తెలంగాణ అసెంబ్లీని కించపరిచేలా టీవీ9 కథనాలు ప్రసారం చేసిందంటూ న్యాయవాది సుంకరి జనార్దన్‌గౌడ్ సైబరాబాద్ 2వ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో ఫిర్యాదు దాఖలు చేసిన విషయం తెలిసిందే. -
టీవీ9 సీఈవో రవిప్రకాష్‌పై కేసు
మేజిస్ట్రేట్ ఆదేశాలతో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు హైదరాబాద్: తెలంగాణ ప్రజాప్రతినిధులను కించపరిచేలా కథనం ప్రసారం చేసిన టీవీ9 న్యూస్‌చానల్‌పై, ఆ సంస్థ సీఈవో రవిప్రకాష్‌పై ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్‌లో శుక్రవా రం కేసు నమోదైంది. ఈనెల 12వ తేదీ రాత్రి8.30 గంటలకు టీవీ9లో తెలంగాణ ప్రజాప్రతినిధులను కించపరిచే విధంగా కథనం ప్రసారం చేసిందని ఆరోపిస్తూ 18 తేదీన ఎల్బీనగర్కు చెందిన న్యాయవాది సుంకరి జనార్దన్‌గౌడ్ సైబరాబాద్ రెండో మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును స్వీకరించిన న్యాయస్థానం.. టీవీ9 సంస్థ, దాని సీఈవో రవిప్రకాష్‌పై కేసు నమోదు చేయాలని ఆదేశిం చింది. కోర్టు ఆదేశాల మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.