
సాక్షి, హైదరాబాద్ : ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జనప్రియ కాలనీలోని ఫ్యామిలీ కేర్ సర్వీస్ సెంటర్‌లో అర్ధరాత్రి దారుణం చోటుచేసుకుంది. అక్కడ విధులు నిర్వహిస్తున్న హేమలత అనే మహిళ హత్యకు గురైన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సహ ఉద్యోగి వెంకటేశ్వరరావు ఈ ఘటనకు ఒడిగట్టాడు. అతడు హేమలతపై లైంగిక దాడికి యత్నించగా ఆమె ప్రతిఘటించడంతో మెడ భాగంతో కత్తితో పొడిచి హతమార్చాడు. హేమలత మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మృతురాలి తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు, వెంకటేశ్వరరావును అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.