నారా లోకేష్‌పై పోలీసులకు ఫిర్యాదు
నాగోలు: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన నారా లోకేష్‌పై చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర విద్యార్థి విభాగం రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు వి.రాంనర్సింహగౌడ్ శనివారం ఎల్‌బీనగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తెలుగుదేశం పార్టీ నాయకుడు నారా లోకేష్ తెలంగాణ ప్రభుత్వాన్ని రౌడీలు నడిపిస్తున్నారని, శాంతిభద్రతలు అదుపుతప్పి పోయాయని, హిట్లర్ ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని పాలిస్తున్నాడని ట్విట్టర్‌లో పేర్కొన్నట్లు తెలిపారు.
ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వంపై కుట్ర పూరితంగా వ్యవహరించి రాజ్యాంగాన్ని అపహాస్యం చేసే విధంగా మాట్లాడుతూ, విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. నారా రోహిత్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎల్‌బీనగర్ సీఐకి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును స్వీకరించిన ఎల్‌బీనగర్ సీఐ శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ న్యాయపరమైన సలహాలు తీసుకుని తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు.