intrusive comments
-
సీజేఐపైనే అనుచిత వ్యాఖ్యలా?
న్యూఢిల్లీ: ఓ పిటిషన్ అత్యవసర విచారణకు నిరాకరించినందుకు ప్రధాన న్యాయమూర్తిని కించపరిచేలా పరోక్షంగా వ్యాఖ్యానించిన లాయర్‌కు సుప్రీంకోర్టు చీవాట్లు పెట్టింది. సామాజిక మాధ్యమాల్లో సదరు లాయర్ చేసిన వ్యాఖ్యలు, పంపిన సందేశాలు ఎంతమాత్రం సమర్థనీయం కాదని మండిపడింది. అలాంటి ఆరోపణలు న్యాయవ్యవస్థ ప్రతిష్టకు భంగం కలిగిస్తాయని సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌ల ధర్మాసనం పేర్కొంది. తామిచ్చే తీర్పులను ఏ వేదికపై చర్చించినా అభ్యంతరం లేదని, కానీ న్యాయమూర్తులను లక్ష్యంగా చేసుకుని వ్యాఖ్యలు చేయడం సరికాదని హితవు పలికింది. ‘కుప్పలుతెప్పలుగా వచ్చిపడే పిటిషన్లలో వేటిని అత్యవసరంగా విచారించాలో సీజేఐ నిర్ణయిస్తారు. ఏదైనా పిటిషన్ అత్యవసర విచారణకు నిరాకరించినంత మాత్రాన సీజేఐని లక్ష్యంగా చేసుకుని సదరు లాయర్ సామాజిక మాధ్యమాల్లో నిరాధార ఆరోపణలు చేస్తారా?’ అని జస్టిస్ చంద్రచూడ్ ప్రశ్నించారు. ఇటీవలే పదవీ విరమణ పొందిన ఓ జడ్జి వ్యాఖ్యలను లాయర్ ఉటంకించడాన్ని కూడా బెంచ్ తప్పుపట్టింది. కోర్టులో ఊరట లభించకపోతే జడ్జీలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం మంచిది కాదని బెంచ్ పేర్కొంది. -
మజ్లిస్ మెప్పు కోసమే...
-
మజ్లిస్ మెప్పు కోసమే...
సాక్షి, హైదరాబాద్: మజ్లిస్ మెప్పు పొందేందుకే ప్రధాని మోదీపై కేసీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. ఎన్నికలు దగ్గర పడడం, టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజాగ్రహం పెల్లుబుకుతున్న నేపథ్యంలో ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మెప్పు పొందేందుకు నానా పాట్లు పడుతున్న కేసీఆర్, బీజేపీపై, ప్రధానిపై విమర్శలకు దిగుతున్నారని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా రైతాంగ సంక్షేమంకోసం ప్రధాని చేపడుతున్న చర్యలను ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణ రైతాంగం కోసం కేంద్రం నుంచి కోట్ల రూపాయల నిధులు వస్తున్నా, వాటిని ఖర్చుచేయలేక, ఆ విషయం జనం గమనించి ఎక్కడ ఈసడించుకుంటారోనన్న ఆందోళనతోనే కేసీఆర్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. బుధవారం ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించి నాలుగేళ్లు నిద్రమత్తులో జోగిన సీఎం, ఎన్నికల ఏడాది కావటంతో రైతు సమన్వయ కమిటీల పేరుతో జిమ్మిక్కులు మొదలుపెట్టారని విమర్శించారు. సిర్పూర్ కాగజ్‌నగర్ మిల్లు తెరిపించలేక చేతులెత్తేసి, కమీషన్ల వేటలో మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ అంటూ కాంట్రాక్టర్లతో మిలాఖత్ అయ్యారని ఆరోపించారు. ప్రధానిని కించపరిచేలా మాట్లాడిన సీఎం కేసీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ బీజేపీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేపట్టాయి. మండల కేంద్రాల్లో దిష్టిబొమ్మలు దహనం చేశాయి. కొన్నిచోట్ల రాస్తారోకోలు చేయగా పోలీసులు అడ్డుకున్నారు. -
కశ్మీర్, పాకిస్తాన్ అవిభాజ్యాలు
దేశ విభజన అసంపూర్ణ ఎజెండా ♦ పాక్ ఆర్మీ చీఫ్ అనుచిత వ్యాఖ్యలు ♦ తప్పుడు ఆలోచనలంటూ భారత్ స్పందన న్యూఢిల్లీ/ఇస్లామాబాద్: అనుచిత వ్యాఖ్యలతో పాక్ మరోసారి భారత్‌తో మాటల యుద్ధానికి తెర తీసింది. ఆ దేశ నేషనల్ డిఫెన్స్ వర్సిటీ విద్యార్థులనుద్దేశించి బుధవారం ప్రసంగిస్తూ.. 1947 నాటి దేశ విభజన అసంపూర్ణ ఎజెండా అని, పాకిస్తాన్, కశ్మీర్లు అవిభాజ్యాలని పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ రహీల్ షరీఫ్ అన్నారు. ఐక్యరాజ్య సమితి తీర్మానం మేరకు కశ్మీర్ సమస్యను పరిష్కరిస్తేనే భారత్‌తో శాంతి సాధ్యమన్నారు. ‘పాక్, కశ్మీర్లు విడదీయడానికి వీల్లేనివి. ఈ ప్రాంతంలో శాంతి, సుస్థిరత నెలకొనాలంటే కశ్మీర్ ప్రజల ఆకాంక్షల మేరకు కశ్మీర్ సమస్యకు న్యాయమైన పరిష్కారం లభించాలన్నదే మన అభిమతం’ అన్నారు. రహీల్ ప్రసంగ భాగాలను పాక్ ఆర్మీ ప్రతినిధి సలీమ్ బాజ్వా ట్వీట్ చేశారు. ‘దేశాన్ని అస్థిరతపాలు చేసేందుకు మన శత్రువు పరోక్ష యుద్ధం చేస్తున్నాడు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నాడు’ అని ఆరోపించారు. రహీల్ వ్యాఖ్యలపై భారత్ స్పందించింది. ‘వాళ్లు అదే తప్పుడు భావనలో ఉంటున్నారు. తప్పుడు ఆలోచనల వల్ల వాస్తవ పరిస్థితిలో ఎలాంటి మార్పు రాదు’ అని విదేశాంగ సహాయ మంత్రి, ఆర్మీ మాజీ చీఫ్ వీకే సింగ్ పేర్కొన్నారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించైనా సరే.. పాక్‌కు గుణపాఠం నేర్పించాలని శివసేన డిమాండ్ చేసింది. రహీల్ వ్యాఖ్యలు హాస్యాస్పదమని కాంగ్రెస్ అంది.ఈ పరస్పర విమర్శల నేపథ్యంలో.. భారత్‌తో సత్సంబంధాలనే కోరుకుంటున్నామని పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ అన్నారు. భారత్‌లో పాక్ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్ ఇస్లామాబాద్‌లో నవాజ్‌ను కలిసి భారత్, పాక్ సంబంధాల్లోని ఇటీవలి పరిణామాలను వివరించారు. ఈ సందర్భంగా.. పరస్పర విశ్వాసం, సార్వభౌమ సమానత్వం ప్రాతిపదికగా భారత్‌తో సత్సంబంధాలను నెలకొల్పుకోవాలన్నదే తమ అభిమతమని షరీఫ్ అన్నారు. కాగా, పాక్‌కు అమెరికా భారీగా ఆయుధాలను విక్రయించడంపై భారత రక్షణ మంత్రి పారికర్ ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికా రక్షణ మంత్రి కార్టర్‌తో చర్చలకు ముందు ఆయన విలేకర్లతో మాట్లాడారు. మరోపక్క.. కశ్మీర్‌లోని టెలికం టవర్లపై ఉగ్రవాదుల దాడుల నేపథ్యంలో పరిస్థితి సమీక్షించేందుకు అధికారులను కేంద్రం అక్కడికి పంపింది. ధ్వంసం చేసిన వెయ్యి టవర్లులో 600 టవర్లను టెలికం కంపెనీల సాయంతో పునరుద్ధరించారు. పాక్ జెండా ఎగరేస్తే తప్పేంటి?: ఎన్సీ కశ్మీర్లో పాకిస్తాన్ జెండా ఎగరేస్తే తప్పేంటని, దీనిపై కేంద్రం ఎందుకు కలవరపడుతోందని నేషనల్ కాన్ఫెరెన్స్(ఎన్సీ) సీనియర్ నేత ముస్తఫా కమాల్ ప్రశ్నించారు. పొరుగుదేశం జెండాను భారత్ గౌరవించాలని సుద్దులు చెప్పారు. ఎన్సీ అధినేత ఫారూఖ్ అబ్దుల్లాకు ముస్తఫా సోదరుడు. ఇటీవల పాక్ జెండాలను కశ్మీర్లో వేర్పాటువాదులు ఎగరేయడంపై ముస్తఫా పై వ్యాఖ్యలు చేశారు. దీనిపై దుమారం రేగడంతో.. ఆయన వ్యాఖ్యలతో పార్టీకి సంబంధం లేదని, వాటిని తమ పార్టీ ఖండిస్తోందని ఎన్సీ చీఫ్ ఒమర్ అబ్దుల్లా చెప్పారు. -
నారా లోకేష్‌పై పోలీసులకు ఫిర్యాదు
నాగోలు: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన నారా లోకేష్‌పై చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర విద్యార్థి విభాగం రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు వి.రాంనర్సింహగౌడ్ శనివారం ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తెలుగుదేశం పార్టీ నాయకుడు నారా లోకేష్ తెలంగాణ ప్రభుత్వాన్ని రౌడీలు నడిపిస్తున్నారని, శాంతిభద్రతలు అదుపుతప్పి పోయాయని, హిట్లర్ ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని పాలిస్తున్నాడని ట్విట్టర్లో పేర్కొన్నట్లు తెలిపారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వంపై కుట్ర పూరితంగా వ్యవహరించి రాజ్యాంగాన్ని అపహాస్యం చేసే విధంగా మాట్లాడుతూ, విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. నారా రోహిత్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎల్బీనగర్ సీఐకి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును స్వీకరించిన ఎల్బీనగర్ సీఐ శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ న్యాయపరమైన సలహాలు తీసుకుని తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
మంద కృష్ణపై అనుచిత వ్యాఖ్యలు మానుకోవాలి
ఎంఆర్పీఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు తీగల రత్నం నల్లగొండ టౌన్ : ఎస్సీ వర్గీకరణతోపాటు వికలాంగుల హక్కుల కోసం నిరంతరం ఉద్యమిస్తున్న మంద కృష్ణమాదిగపై సొంత సంఘం నేతలు అనుచిత వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని ఎంఆర్పీఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు తీగల రత్నంమాదిగ హితవు పలికారు. ఆదివారం స్థానిక ఆర్అండ్బీ అతిథి గృహంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. గతంలో సంఘం నుంచి సస్పెండై స్వార్థం కోసం తిరిగి చేరిన వ్యక్తులు మంద కృష్ణపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటన్నారు. ఉద్యమాన్ని నీరుగార్చే చర్యలకు పాల్పడవద్దని, మంద కృష్ణను అవమానపర్చితే యావత్ మాదిగజాతిని అవమానపర్చినట్లు అవుతుందని గుర్తుంచుకోవాలన్నారు. ఇకనైన ఆరోపణలు చేయడం మానుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. రాష్ట్ర కార్యదర్శి కనకరాజు సామ్యేలు మాట్లాడుతూ మంద కృష్ణమాదగ గురించి యావత్ రాష్ట్ర ప్రజలకు తెలుసన్నారు. ఉద్యమకారుడిపై ఆరోపణలు చేస్తే జిల్లాలో తిరగనివ్వమని హెచ్చరించారు. వారివెంట సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బకరం శ్రీనివాస్, ఎంఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు కొమిరె స్వామి, శివశంకర్ తదితరులు ఉన్నారు. -
మహిళల పట్ల ఎస్ఐ అనుచిత వ్యాఖ్యలు
వెల్దుర్తి, న్యూస్‌లైన్ : చెరువులో చేపలు పట్టే విషయంలో ఓ వర్గం మహిళలపై స్థానిక ఎస్ఐ అశోక్‌రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా గురువారం మండల పరిధిలోని ఎలుకపల్లికి చెందిన ముది రాజ్ కులస్తులు స్థానిక పోలీస్‌స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. ఈ సందర్భం గా ఎస్ఐ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు యత్నించారు. అయితే ఈ విషయం లో విచారణ చేయిస్తామని సీఐ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. వివరాల్లోకి వెళితే.. వెల్దుర్తి పంచాయతీ ఎలుకపల్లి శివారు అటవీ ప్రాంతంలో ఉన్న కాన్చెరువు (చేపల కోసం) హక్కులపై ఎలుకపల్లికి చెందిన ముదిరాజు లు, వెల్దుర్తికి చెందిన గంగపుత్రుల మధ్య ఆరు నెలలుగా వివాదం నడుస్తోంది. అయితే వారం రోజుల క్రితం చెరువులో చేపల వేట కొనసాగిస్తున్నారని గంగపుత్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముదిరాజ్‌లను ఎస్ఐ స్టేషన్‌కు తీసుకువచ్చారు. బుధవారం స్థానిక ఎస్ఐ పో లీసుల ఆధ్వర్యంలో బందోబస్తు మధ్య చెరువులో ఉన్న చేపలను గంగపుత్రులు వేటాడారు. అయితే మిగిలిన ముదిరాజ్ లు, మహిళలు దీనిని అడ్డుకోడానికి ప్రయత్నించారు. ఇందుకు ఆగ్రహించిన ఎస్ఐ సదరు కులస్తులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ హెచ్చరికలు జారీ చేశా రు. అనంతరం ముదిరాజ్ కులస్తులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంత రం సీఐ సంఘటనా స్థలానికి చేరుకుని వెనుతిరిగారు. గురువారం ముదిరాజ్‌లను రిమాండ్‌కు తరలిస్తుండగా సదరు కులస్తులతో పాటు వెల్దుర్తి సర్పంచ్ మోహన్‌రెడ్డి, టీఆర్ఎస్ నాయకుడు తోట నరసింహులు, ఉపసర్పంచ్ వెంకటేష్‌లు పోలీస్‌స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా సర్పంచ్ మో హన్‌రెడ్డి మాట్లాడుతూ అధికార పార్టీ నేతల అండతో నిరుపేదలైన ముదిరాజులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారంటూ ఆరోపించారు. దీంతో ఆగ్రహా నికి గురైన ఎస్ఐ సర్పంచ్‌ని తీవ్రంగా దూర్భాషలాడారు. దీంతో బాధితులు పోలీస్‌స్టేషన్ నుంచి ర్యాలీగా వచ్చి వె ల్దుర్తి పట్టణాన్ని బంద్ చేయించి బ స్టాండ్ చౌరస్తా వద్ద రాస్తారోకో నిర్వహించారు. అనంతరం ఎస్ఐ దిష్టిబొమ్మతో అంబేద్కర్ చౌరస్తా వరకు శవయాత్ర నిర్విహ ంచి అక్కడ దగ్ధం చేయడానికి ప్రయత్నించారు. అయితే విష యం తెలుసుకున్న తూప్రాన్ సీఐ సం జయ్‌కుమార్ అక్కడికి చేరుకుని ఆందోళనకారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆందోళనకారులు మాట్లాడుతూ ఎస్ఐ మహిళలపై అనుచిత వాఖ్యలు చేశారని, బాంబులు వేసి ఇళ్లను ధ్వం సం చేస్తానని హెచ్చరించారని ఆరోపిం చారు. మంత్రి సునీతారెడ్డికి బంధువునంటూ అమాయక ప్రజలను వేధిస్తున్నాడని, తక్షణమే ఎస్ఐపై చర్యలు తీ సుకోవాలని డిమాండ్ చేశారు. తాను ఎస్ఐపై విచారణ చేపట్టి తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆం దోళన కారులు శాంతించారు. అనంతరం తహశీల్దార్ కార్యాలయం వరకు వెళ్లి అక్కడ ధర్నా నిర్వహించి తహశీల్దార్‌కు మెమోరాండం సమర్పించారు. హక్కులు ముదిరాజులకే : సర్పంచ్ పంచాయతీ పరిధిలో 20 చెరువులు, కుంటలు ఉండగా పంచాయతీ అభివృ ద్ధి కోసం వేలం పాటలు చేశామని సర్పంచ్ మోహన్‌రెడ్డి తెలిపారు. 18 చెరువు, కుంటలకు గంగపుత్రులకు కే టాయించి.. కాన్ చెరువు ముదిరాజుల కు, నర్సిన్ చెరువు ఎస్సీలకు కేటాయించామన్నారు. ఎస్ఐ అతిగా ప్రవర్తిస్తూ పోలీసు బలగాలతో కాన్‌చెరువులో అక్రమంగా గంగపుత్రులచే దగ్గరుండి చేపలు పట్టించడమే కాకుండా అక్రమ కేసులు బనాయించి రిమాండ్‌కు తరలించారని ఆరోపించారు. తండ్రి రిమాండ్‌తో సొమ్మసిల్లిన కుమార్తె చేపల వేటకు వెళ్లిన ముదిరాజలను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అయితే గుడ్డివాడైన కానికే అంజయ్యను రిమాండ్‌కు తరలించడంతో ఆయన కుమార్తె మంజుల సొమ్మసిల్లి పడిపోయింది. దీంతో ఆమెను తోటి మహిళలు ఆస్పత్రికి తరలించారు. డీపీఓ ఆదేశాల మేరకే బందోబస్తు ఇచ్చాం కాన్చెరువు హక్కులు గంగపుత్రులకే ఉంటాయని డీపీఓ ఆదేశాల మేరకే గంగపుత్రులు కాన్‌చెరువులో చేపలు పట్టడానికి బందోబస్తు ఇచ్చామని తూప్రాన్ సీఐ సంజయ్‌కుమార్, స్థానిక ఎస్ఐ అశోక్‌రెడ్డిలు తెలిపారు. కాన్చెరువుపై గంగపుత్రులకు పూర్తి హక్కు ఉంటుందని సర్పంచ్‌కు డీపీఓ నోటీసులు కూడా పంపారన్నారు. ఇందులో భాగంగా ఈ నెల 7న కాన్‌చెరువులో ముదిరాజులు చేపల వేట సాగిస్తున్నారని గంగపుత్రులు తమకు ఫిర్యాదు చేయగా అక్రమంగా చేపలు పడుతున్న ముదిరాజులైన మల్లయ్య, అంజయ్య, స్వామి, భాగయ్య, పోచయ్య, అంజయ్య, మైసయ్య, యాదగిరి, కిష్టయ్యలపై కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించామన్నారు.