లొంగిపోయిన టీవీ9 సీఈఓ రవిప్రకాశ్ | TV9 CEO ravi prakash Surrendered in LB Nagar police station | Sakshi
Sakshi News home page

లొంగిపోయిన టీవీ9 సీఈఓ రవిప్రకాశ్

Published Sun, Aug 17 2014 2:39 AM | Last Updated on Sat, Aug 11 2018 6:42 PM

లొంగిపోయిన టీవీ9 సీఈఓ రవిప్రకాశ్ - Sakshi

లొంగిపోయిన టీవీ9 సీఈఓ రవిప్రకాశ్

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రజాప్రతినిధులను, ముఖ్యమంత్రిని, అసెంబ్లీని కించపరిచే కార్యక్రమాన్ని ప్రసారం చేసిన కేసులో టీవీ9 సీఈఓ రవిప్రకాశ్ హైకోర్టు ఆదేశాల మేరకు శనివారం ఎల్‌బీ నగర్ పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయారు. రూ.25వేల వ్యక్తిగత బాండ్, ఇద్దరు ఉద్యోగుల ష్యూరిటీతోపాటు పాస్‌పోర్ట్‌ను స్వాధీనం చేసుకుని వ్యక్తిగత పూచీకత్తుపై ఆయనకు కండీషన్ బెయిలు మంజూరు చేశారు. తెలంగాణ అసెంబ్లీని కించపరిచేలా టీవీ9 కథనాలు ప్రసారం చేసిందంటూ న్యాయవాది సుంకరి జనార్దన్‌గౌడ్ సైబరాబాద్ 2వ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో ఫిర్యాదు దాఖలు చేసిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement