TV9 CEO ravi prakash
-
బుకాయింపు.. సమర్థింపు!
సాక్షి, హైదరాబాద్: టీవీ9 లోగో విక్రయం కేసులో బంజారాహిల్స్ పోలీసుల విచారణ పూర్తయింది. రెండోరోజు విచారణకు హాజరైన ఆ సంస్థ మాజీ సీఈఓ రవిప్రకాశ్ తీరు ఏమాత్రం మారలేదని సమాచారం. ఏ ప్రశ్న అడిగినా బుకాయించడం, చేసిన పనిని సమర్థించుకోవడం, కొన్ని ప్రశ్నలకు సమాధానాలు దాటవేయడం వంటి పాత ధోరణే ప్రదర్శించినట్టు తెలిసింది. టీవీ9 లోగో, కాపీరైట్స్, ట్రేడ్ మార్కులను మీడియా నెక్ట్స్ ఇండియా కంపెనీకి బదలాయించడంపై బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసు విచారణ కోసం రెండోరోజు శనివారం ఉదయం 11.00 గంటలకు బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ చేరుకున్న రవిప్రకాశ్‌ను పోలీసులు ఆరు గంటలపాటు విచారించారు. ముందుగానే సిద్ధం చేసుకున్న 48 ప్రశ్నలను ఆయనపైకి సంధించారు. మోజో టీవీకి టీవీ9 లోగోను ఎందుకు విక్రయించారన్న ప్రశ్నకు.. తాను అంతా చట్ట ప్రకారమే చేశానని, తనకు అన్ని హక్కులూ ఉన్నందునే లోగోను విక్రయించానని రవిప్రకాశ్ సమర్థించుకున్నట్లు తెలిసింది. దాదాపు అన్ని ప్రశ్నలకూ సమర్థించుకునే ధోరణిలో.. తానే కరెక్టు అంటూ చెప్పినట్టు సమాచారం. కొన్ని ప్రశ్నలకు వెటకారపు ధోరణిలో సమాధానాలిచ్చినట్టు తెలిసింది. పోలీసులు విచారణ ప్రక్రియ మొత్తాన్ని వీడియో తీయడం విశేషం. శుక్రవారం పోలీసుల ఆదేశాల మేరకు టీవీ9 లోగోను విక్రయించిన పత్రాలను రవిప్రకాశ్ సమర్పించగా.. విశ్వసనీయతను నిర్ధారించుకునేందుకు పోలీసులు ఆ పత్రాలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపనున్నట్లు సమాచారం. అవసరమనుకుంటే మరోసారి పిలుస్తాం.. రెండు రోజుల విచారణలో రవిప్రకాశ్ చెప్పిన సమాధానాలను నిజమో కాదో తెలుసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నామని ఏసీపీ రావు మీడియాకు తెలిపారు. వాటి ఆధారంగానే తదుపరి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఒకవేళ ఆయన చెప్పిన విషయాలు వాస్తవాలు కాదని తేలితే, తదుపరి చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు. అవసరమనుకుంటే మరోసారి రవిప్రకాశ్‌ను విచారణకు పిలిపిస్తామని చెప్పారు. రవిప్రకాశ్‌పై నిఘా... రవిప్రకాశ్ తిరిగి పరారయ్యే అవకాశాలు ఉండటంతో సైబరాబాద్‌కు చెందిన ఓ షాడో టీం ఆయన్ను నిత్యం నీడలా వెంటాడుతోంది. శుక్రవారం బంజారాహిల్స్‌లో విచారణ పూర్తయిన అనంతరం రవిప్రకాశ్ ఖైరతాబాద్‌లోని హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌కు మరో వ్యక్తితో కలిసి వెళ్లాడు. అక్కడ ఆయన ఎవరితోనూ మాట్లాడలేదు. ఆయన్నూ ఎవరూ పలకరించలేదు. ఆయన ఎక్కడికి వెళ్లినా, ఎవరిని కలిసినా ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు స్పష్టమైన సమాచారం చేరుతోంది. కాగా, రవిప్రకాశ్‌ను అరెస్టు చేసే విషయంలో ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది. న్యాయనిపుణల నుంచి న్యాయ సలహా ఇంకా అందకపోవడంతో అరెస్టులో జాప్యం జరుగుతోంది. న్యాయ సలహా రాగానే దాని ఆధారంగా చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు ‘సాక్షి’కి తెలిపారు. -
మరోసారి హైకోర్టును ఆశ్రయించిన రవిప్రకాశ్
-
మరోసారి పోలీసుల ముందుకు మూర్తి
-
టీవీ-9 సిఈఓ రవిప్రకాశ్ ఔట్
-
మెరుగైన సమాజం కోసం కులం గోడలు కూల్చేద్దాం!
-
బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అత్యవసర భేటీ
-
ఫోర్జరీ మెరుగైన సమాజం కోసం..
-
ఫోర్జరీ నిధులు దుర్వినియోగం కేసులో రవిప్రకాశ్‌పై వేటు
-
రవిప్రకాశ్ ఫోర్జరీ కేసుపై విజయసాయిరెడ్డి కామెంట్
-
రామలింగరాజును బ్లాక్‌బెయిల్ చేసిన రవిప్రకాష్
సాక్షి, హైదరాబాద్: రవిప్రకాష్ లాంటి కొందరు చీడ పురుగుల వల్లే తెలుగు మీడియా ప్రతిష్ఠ మసకబారిందని, వీళ్ల బారినుంచి మీడియా బయట పడితే మళ్లీ 1980ల ముందు నాటి విశ్వసనీయత వస్తుందని రాజ్యసభ సభ్యుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వి. విజయసాయి రెడ్డి అన్నారు. దేశంలో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఉద్యమించిన మీడియా ఆ తర్వాత బ్లాక్‌మెయిలర్లు, కుల పిచ్చగాండ్ల చేతికి వెళ్లిందని ట్విటర్లో పేర్కొన్నారు. శ్రీనిరాజు సంస్థలో పనిచేస్తూ ఆయన తోడల్లుడు సత్యం రామలింగరాజును బ్లాక్ మెయిల్ చేసిన ఘనుడు రవిప్రకాష్ అని వెల్లడించారు. (చదవండి: ‘టీవీ9పై కుట్ర అంతా అక్కడే జరిగింది’) ‘బెయిల్ రావడానికి ముందు చికిత్స కోసం నిమ్స్‌లో చేరాడు. ఆ సమయంలో ఆయన సెల్ఫోన్లో మాట్లాడుతుండగా స్పైక్యామ్‌తో రికార్డు చేయించి కోట్లు వసూలు చేశాడని చెబ్తారు. మెరుగైన సమాజం కోసం ‘చెమటలు’ కక్కిన రవిప్రకాష్ తక్షణం పోలీసులకు లొంగిపోయి సహకరించారలని పౌర సమాజం కోరుతోంది. మెరుగైన సమాజం కోసం పరివర్తన తీసుకుచ్చే ప్రవక్తలాగా చెలరేగిన రవి ప్రకాష్ చేయని దుర్మార్గాలు లేవు. మతాలను కించపర్చడం, కార్పోరేట్ల విబేధాల నుంచి భార్య భర్తల గొడవల వరకు టీవీ స్ర్కీన్ పైకి ఎక్కించి సమాజాన్ని భ్రష్టు పట్ టించాడు. కులం లేదంటూనే గజ్జిని వ్యాప్తి చేశాడు. మెరుగైన సమాజాన్ని అడ్డుకున్న ద్రోహి రవిప్రకాష్ బండారం ఎట్టకేలకు బయట పడింది. ఈయన బాధితులు ఒక్కొక్కరు ఇప్పుడు బయటకొస్తున్నారు. ‘కమ్మ’ని నీతులకు కాలం చెల్లింది. చంద్రబాబు ప్రయోగించిన తుప్పు పట్టిన మిస్సైళ్లలో రవిప్రకాష్ ఒకడు. ఎర్ర చందనం స్మగ్లర్ల నుంచి తన మనుషుల ద్వారా నెలనెలా మామూళ్లు తీసుకున్న ఆరోపణలపై కూడా రవిప్రకాష్‌పై దర్యాప్తు జరగాలి. ఆ చనువుతోనే స్మగ్లర్లు టివీ9 మీడియా స్టిక్కర్లు వేసిన వాహనాల్లో ఎర్రచందనం తరలించారు. లక్షల కోట్ల ఎర్రచందనం తరలి పోవడంలో మీడియా ప్రముఖుడి పాత్ర కూడా ఉండటం దారుణమ’ని విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు. సినిమాల్లో వేషాలు లేక బ్రోకర్ అవతారం ఎత్తిన శివాజీ ఆదాయ మార్గాలపై దర్యాప్తు జరగాలని డిమాండ్ చేశారు. అమరావతిలో భూముల కొనుగోళ్లు, హైదరాబాద్‌లో ఆస్తులు ఎలా కొన్నాడనే లోతుగా విచారణ చేపట్టాలన్నారు. శివాజీ గరుడ పురాణం ఒక కుట్ర అని, టీవీ9 ఆఫీసులో అతడు ఏం చేస్తుంటాడో విచారణ జరగాలన్నారు. రవిప్రకాష్ తనకు కొన్ని షేర్లు అమ్మి మోసం చేశాడని ఈ బ్రోకర్ ట్రిబ్యునల్‌కు వెళ్ళడం వెనుక రవిప్రకాష్ ఉన్నాడని, టీవీ9 బోర్డులోకి కొత్త యాజమాన్యం ప్రతినిధులు రాకుండా ఆఖరి నిమిషంలో ఆడిన నాటకమని వివరించారు. (చదవండి: రవిప్రకాశ్ భార్యకు నోటీసులు) -
‘టీవీ9పై కుట్ర అంతా అక్కడే జరిగింది’
సాక్షి, హైదరాబాద్: టీవీ9 చానల్‌ను అడ్డుపెట్టకుని ఇన్నాళ్లు చంద్రబాబు నాయుడు సాగించిన నాటకం బట్టబయలైందని రాజ్యసభ సభ్యుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వి. విజయసాయి రెడ్డి అన్నారు. టీవీ9పై పెత్తనం రవిప్రకాష్ చేతుల్లోంచి జారిపోతే రాజకీయంగా తనకు తీరని నష్టం జరుగుతుందన్న భయంతో నటుడు శివాజీని అడ్డం పెట్టుకుని చంద్రబాబు పావులు కదుపుతున్నారని ఆరోపించారు. కొత్త యాజమాన్యాన్ని అడ్డుకోవడానికి కుయుక్తులు పన్నారని తెలిపారు. టీవీ9లో చోటుచేసుకున్న తాజా పరిణామాలపై తన ఫేస్బుక్ పేజీలో విజయసాయిరెడ్డి స్పందించారు. విజయసాయిరెడ్డి ఫేస్బుక్ పోస్ట్.... మెరుగైన సమాజం కోసం... కులం గోడలు కూల్చేద్దాం...! అంటూ మహత్తరమైన ఆదర్శాలను వల్లి వేస్తూ ఒక సాదాసీదా జర్నలిస్టు బుల్లి తెరపై దూసుకువచ్చినపుడు సమాజం ఆశగా అతనిని అక్కున చేర్చుకుంది. అదే జర్నలిస్టు తాను వల్లించిన ఆదర్శాలను తుంగలో తొక్కేసి కల్లబొల్లి వార్తలతో అనేక మందిని బ్లాక్ మెయిల్ చేస్తూ, బెదిరిస్తూ బలవంతపు వసూళ్ళకు నడుంకట్టినపుడు ఈ పగటి మోసగాడిని చూసి సమాజం సిగ్గుతో తలవంచుకుంది. కులం గోడలు కూల్చడానికి బదులుగా తానే కులం రొచ్చులో పీకల వరకు మునిగి చంద్రబాబు నాయుడే ఆదర్శంగా జర్నలిజంలో విలువలు, సంప్రదాయాలను అధఃపాతాళానికి దిగజార్చాడు. ఒక పారిశ్రామికవేత్త కూడా సాధించలేని రీతిలో అతి తక్కువ కాలంలోనే వందల కోట్లకు పడగలెత్తాడు. అక్రమంగా ఆర్జించిన వందల కోట్లను విదేశాల్లో ముఖ్యంగా దక్షిణాఫ్రికాలో పెట్టుబడులుగా పెట్టాడు. ఆదరించి, అక్కున చేర్చుకున్న పౌర సమాజానికి, తాను ఎంచుకున్న జర్నలిజం వృత్తికి అపారమైన నష్టం కలిగించాడు రవిప్రకాష్. ఒక కులానికి ఛత్రీ పడుతూ కులం గోడలను చైనా గోడకంటే ఎత్తుగా కట్టేశాడు. ఆ ఆదర్శవాది ఇప్పుడు జైలు గోడలు తప్పించుకోవడానికి పోలీసులకు దొరక్కుండా చంద్రబాబు అండతో అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయాడు. నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో మీకు ఈపాటికి అర్థమయ్యే ఉంటుందని భావిస్తున్నా..! సంస్థ నిధులు కాజేసి, ఫోర్జరీ పత్రాలు సృష్టించారన్న అభియోగంపై టీవీ9 సీఈఓ రవిప్రకాష్ నివాసంలో ఈరోజు తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు సోదాలు జరిపారన్న బ్రేకింగ్ న్యూస్ నిజానికి నాకేమీ ఆశ్చర్యంగా అనిపించలేదు. టీవీ9 చానల్లో 91 శాతం వాటాలు కొనుగోలు చేసిన అలందా మీడియా సంస్థ ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు రవిప్రకాష్‌తోపాటు ఆయన రహస్య మిత్రుడు, చంద్రబాబు పెయిడ్ ఆర్టిస్ట్ ‘గరుడ పురాణం’ శివాజీ ఇంట్లో కూడా సోదాలు చేయడం కొంత ఆసక్తికరంగా అనిపించింది. రవిప్రకాష్, ‘శుంఠ’ శివాజీల మధ్య బంధం ఈనాటిది కాదు. కొన్నేళ్ళుగా కొనసాగుతున్న వారి రహస్య మైత్రి వెనుక బలమైన ఒక రాజకీయ అజెండా ఉందన్న మా అనుమానం తిరుగులేని సత్యమని ఈ ఉదంతం ధృవపరుస్తోంది. మెరుగైన సమాజం వెనుక చీకటి రాజ్యం... టీవీ9తో తెలుగు జర్నలిజంలో నిన్నటి వరకు ఒక వెలుగు వెలిగిన రవిప్రకాష్‌కు అంతే చీకటి చరిత్ర కూడా ఉందన్న విషయం జర్నలిస్టు మిత్రులలో చాలా మందికి తెలిసిందే. గత ఏడాది టీవీ9లో 91 శాతం వాటాలను శ్రీనిరాజు విక్రయించినప్పటి నుంచి రవిప్రకాష్ ‘మెరుగైన జీవితం’లో చీకట్లు అలుముకోవడం మొదలయ్యాయి. టీవీ9 చానల్ కొత్త యాజమాన్యం చేతిలోకి వచ్చినప్పటి నుంచి రవిప్రకాష్ చీకటి సామ్రాజ్యం గుట్లు ఒక్కొక్కటిగా వెలుగులోకి రావడం ప్రారంభం అయ్యాయి. అప్పటి వరకు తన మాటే శాసనంగా చానల్‌ను నడిపించిన రవిప్రకాష్ ఈ దశాబ్దంన్నర కాలంలో పాల్పడిన అక్రమాలు జాబితా రాస్తే ఒక పెద్ద గ్రంధమే అవుతుంది. వాటిలో మచ్చుకు కొన్ని... 1. టీవీ9ను అడ్డం పెట్టుకుని రవిప్రకాష్ ఉభయ తెలుగు రాష్ట్రాల్ల అనేక మందిని బ్లాక్ మెయిల్ చేసి కూడబెట్టిన సంపాదనే వందల కోట్లు దాటిపోయింది. ఎవరికీ చెప్పుకోలేక లోలోపలే కుమిలిపోయన రవి ప్రకాష్ బాధితుల సంఖ్య వేలల్లోనే ఉంది. 2. సీఈవోగా టీవీ9 రాబడిని, నిధులను రవి ప్రకాష్ భారీ ఎత్తున అక్రమ మార్గంలో తన సొంత ఖాతాలకు మళ్ళించుకున్నట్లు కొత్త యాజమాన్యం చేసిన ఆడిట్లో వెల్లడైంది. దక్షిణాఫ్రికాలో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టాడు. 3. ఇటీవల ప్రారంభించిన భారత్‌వర్ష్ హిందీ జాతీయ చానల్ విషయంలోను రవి ప్రకాష్ కొన్ని నిధులు స్వాహా చేయడం వలన ఆ చానల్ నాణ్యత బాగా దెబ్బతిన్నట్లు వెల్లడైంది. 4. టీవీ9పై తన పెత్తనం యధాప్రకారం కొనసాగేందుకు రాజకీయంగా కూడా రవి ప్రకాష్ పావులు కదిపాడు. 5. టీవీ9పై రవి ప్రకాష్ పెత్తనం కొనసాగించమని చంద్రబాబు నాయుడుతోపాటు ఆయన అనుచరగణం (గూండాలు) కొత్త యాజమాన్యాన్ని తీవ్రస్థాయిలో బెదిరించడం కూడా జరిగింది. చంద్రబాబు నాయుడు పదికాలాల పాటు అధికారంలో నిర్విఘ్నంగా కొనసాగేందుకు టీవీ9 తెర ముందు శివాజీ, తెర వెనుక రవిప్రకాష్ తమ పాత్రలను శక్తి వంచన లేకుండా పోషిస్తూ వచ్చారు. చంద్రబాబు రాసిన స్క్రిప్ట్ ప్రకారమే వీరిద్దరూ ప్రత్యక్షంగా, పరోక్షంగా మా పార్టీపైన, మా పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారిపైనా టీవీ9 ద్వారా విషం కక్కుతూ, విషపూరిత కథనాలు, గరుడ పురాణాలు ప్రసారం చేస్తూ వచ్చారు. అదే విషయం మేము అనేకసార్లు బాహాటంగానే చెప్పాం కూడా. పాపం బద్దలయ్యే సమయం దగ్గర పడింది. కాబట్టే వారి రహస్య బంధం కూడా బట్టబయలైంది. రవిప్రకాష్ టీవీ9లోని తన వాటాల్లో కొన్ని నాకు అమ్మి ఆ షేర్లు బదలాయించకుండా నన్ను మోసం చేశారంటూ శివాజీ నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ (ఎన్సీఎల్టీ)ని ఆశ్రయించి మరో పెద్ద నాటకానికి తెర తీశాడు. షేర్ల కొనుగోలు కోసం వీళ్ళద్దరూ ఒక తెల్ల కాగితంపై ఒప్పందం రాసుకున్నారంటేనే ఇంత ఎంత హంబగ్గో అర్థం చేసుకోవచ్చు. ఎవరైనా వాటాలు కొనుక్కుంటే తక్షణమే అవి బదిలీ కావాలని కోరుకుంటారు. కానీ ఏడాది తర్వాత చూసుకుందాంలే అనుకున్నారంటేనే దీనిలో నిజానిజాలు ఏమిటో ఎవరికైనా ఇట్టే బోధపడతాయి. టీవీ9పై పెత్తనం కొత్త యాజమాన్యం చేతుల్లోకి పోకుండా నిలువరించేందుకు ఏడాది క్రితమే పెయిడ్ ఆర్టిస్ట్ శివాజీని రవిప్రకాష్ రంగంలోకి దింపాడు. ఈ వ్యూహ రచన అంతా అమరావతిలోని కరకట్టపైనే జరిగింది. దానికి అనుగుణంగానే శివాజీ తెరపైకి వచ్చి ఎన్సీఎల్టీలో తన షేర్ల పురాణం విప్పాడు. రవి ప్రకాష్, శివాజీ తెర వెనుక నడిపిస్తున్న బాగోతం ఏమిటో ఆరా తీయడానికే సైబర్ క్రైమ్ పోలీసులు ఈరోజు వారి ఇళ్ళల్లో సోదాలు చేసినట్లు తెలుస్తోంది. టీవీ9పై పెత్తనం రవిప్రకాష్ చేతుల్లోంచి జారిపోతే అది రాజకీయంగా తమకు తీరని నష్టం జరుగుతుందన్న ఆందోళనతోనే దీనిని ఒక లీగల్ సమస్యగా మార్చి యాజమాన్య మార్పును అడ్డుకోవడానికి శివాజీ లాంటి కేరెక్టర్లను అడ్డం పెట్టుకుని చంద్రబాబు పావులు కదుపుతున్నారు. -
రవిప్రకాశ్ భార్యకు నోటీసులు
సాక్షి, హైదరాబాద్: నిధుల మళ్లింపు, ఫోర్జరీ ఆరోపణలు ఎదుర్కొంటున్న టీవీ9 సీఈవో రవిప్రకాశ్‌కు సైబర్ క్రైమ్ పోలీసులు గురువారం నోటీసులు జారీ చేశారు. రవిప్రకాశ్ పరారీలో ఉండటంతో ఆయన భార్యకు నోటీసులు అందజేశారు. సీఆర్పీసీ 160 కింద నోటీసులిచ్చారు. రేపు తమ ఎదుట హాజరుకావాలని రవిప్రకాశ్‌ను పోలీసులు ఆదేశించారు. నటుడు శివాజీ కూడా పోలీసులు నోటీసులు ఇచ్చారు. మరోవైపు దర్యాప్తులో భాగంగా టీవీ9 కార్యాలయం నుంచి 12 హార్డ్‌డిస్క్‌లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటిని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపనున్నారు. టీవీ9 కార్యాలయంలో సోదాలు కొనసాగుతున్నట్టు సమాచారం. క్లూస్ టీమ్ కూడా సోదాల్లో పాల్గొన్నాయి. షేర్ల బదలాయింపుపై పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు. రవిప్రకాశ్ ఆర్థిక లావాదేవీలతో పాటు ఫోర్జరీలపై ఆరా తీస్తున్నారు. శివాజీకి రవిప్రకాశ్ ఇచ్చినట్టుగా చెబుతున్న షేరు ఎవరివి? ఉద్యోగుల షేర్లను శివాజీకి బదలాయించారా? తదితర అంశాలపై పోలీసులు దృష్టి పెట్టారు. టీవీ9 చానల్‌ను తన గుప్పిట్లో పెట్టుకునేందుకు రవిప్రకాశ్ చేసిన కుట్రను కొత్త యాజమాన్యం రట్టు చేయడంతో ఆయన ఇబ్బందుల్లో పడ్డారు. ఏబీసీఎల్ కార్పొరేషన్ నుంచి 90శాతం షేర్లు కొనుగోలు చేసి టీవీ9ను అలంద మీడియా టేకోవర్ చేసింది. యాజమాన్యం మారిన తర్వాత కొత్తగా నలుగురు డైరెక్టర్లను తీసుకోవాలన్న ప్రతిపాదనకు రవిప్రకాశ్ మోకాలొడ్డారు. అంతేకాదు ఏకంగా ఫోర్జరీ సంతకంతో నకిలీ డాక్యుమెంట్‌ను సృష్టించి కుయుక్తులు పన్నారని రవిప్రకాశ్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సంబంధిత వార్తలు టీవీ9 సీఈవో రవిప్రకాశ్‌పై కేసు నమోదు రవిప్రకాశ్ పాస్‌పోర్ట్ స్వాధీనం, శివాజీ ఇంట్లో సోదాలు టీవీ9 సీఈవోగా రవిప్రకాశ్ తొలగింపు -
నటుడు శివాజీ నివాసంలో సోదాలు..
-
టీవీ9 సీఈవోగా రవిప్రకాశ్ తొలగింపు
-
టీవీ9 నుంచి రవిప్రకాశ్‌కు ఉద్వాసన
సాక్షి, హైదరాబాద్ : నిధుల మళ్లింపు, ఫోర్జరీ ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఈవో రవిప్రకాశ్‌కు టీవీ9 ఉద్వాసన పలికింది. ఆయనను సీఈవో బాధ్యతల నుంచి యాజమాన్యం తప్పించింది. సంస్థ నిర్వహణలో వైఫల్యంతో పాటు, సంస్థలో కీలక ఉద్యోగి సంతకాన్ని ఫోర్జరీ చేసిన ఆరోపణల నేపథ్యంలో యాజమాన్యం గురువారం ఈ నిర్ణయం తీసుకుంది. కాగా అసోసియేట్ బ్రాడ్ కాస్టింగ్ కంపెనీ లిమిటెడ్ (ఎబీసీఎల్) వ్యవస్థాపకుడు, సీఈవో రవిప్రకాశ్‌కు కేవలం ఎనిమిది శాతం వాటా మాత్రమే ఉన్నప్పటికీ నూతన యాజమాన్యానికి సహకరించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. తన నిర్ణయాలే చెల్లుబాటు అయ్యేలా ఒత్తిడి తేవడంతో పాటు, టీవీ9 తన ఆధ్వర్యంలోనే నడవాలని షరతులు పెట్టినట్లు తెలుస్తోంది. కాగా టీవీ9లో మెజారిటీ వాటా కలిగిన శ్రీనిరాజు తన వాటాలను అలంద మీడియాకు విక్రయించిన విషయం విదితమే. చదవండి:(టీవీ9 సీఈవో రవిప్రకాశ్‌పై కేసు నమోదు) మరోవైపు టీవీ9 వ్యవహారంలో నటుడు శివాజీ నివాసంలో కూడా పోలీసులు సోదాలు నిర్వహించినట్లు సమాచారం. టీవీ9లో నటుడు శివాజీకి కూడా వాటా ఉన్నట్లు ... రవిప్రకాశ్ నుంచి ఆయన ఈ షేర్లు కొన్నట్లు తెలుస్తోంది. టీవీ9ను అలంద మీడియా టేకోవర్ చేసుకున్న అనంతరం ఈ కొనుగోలు ప్రక్రియను సవాల్ చేస్తూ శివాజీ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌లో సవాల్ కూడా చేశాడు. అయితే రవిప్రకాశ్ ప్రోద్బలంతోనే శివాజీ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించినట్లు వార్తలు వెలువడ్డాయి. ఆ వార్తలకు ఊతమిస్తూ రవిప్రకాశ్, శివాజీ కలిసి ఉన్న ఓ ఫోటో గత ఏడాది సోషల్ మీడియాలో వైరల్ అయింది. అందుకే ఆరునెలలకు ఓసారి ఆపరేషన్ ’గరుడ’ అంటూ హడావుడి చేసే శివాజీకి టీవీ9 ఓ రేంజ్లో హైప్ క్రియేట్ చేసిందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో శివాజీని కూడా పోలీసులు ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే...టీవీ9 పేరుతో తెలుగు, మరాఠీ, కన్నడ, గుజరాతీ, ఇంగ్లీషు, హిందీ ఛానళ్లు నిర్వహిస్తున్న అసోసియేటెడ్ బ్రాడ్‌కాస్టింగ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ (ఏబీసీఎల్)ను వ్యాపారవేత్త శ్రీనిరాజుకు చెందిన చింతలపాటి హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ , ఐల్యాబ్స్ వెంచర్ కేపిటల్ ఫండ్ కలిపి ప్రారంభించాయి. ఏబీసీఎల్ కంపెనీలో ఈ రెండు సంస్థలకు కలిపి 90 శాతానికి పైగా వాటా ఉండగా, ఆ సంస్థలో ఓ ఉద్యోగిగా చేరి సీఈవో, డైరెక్టర్‌గా హోదా పొందిన రవిప్రకాశ్, ఆయన అసోసియేట్స్‌కు సంస్థలో దాదాపు 8 శాతం వాటా ఉంది. ఏబీసీఎల్లో 90 శాతానిపైగా వాటా ఉన్న రెండు సంస్థల నుంచి ఆ వాటాను కొనుగోలు చేసేందుకు హైదరాబాద్‌కు చెందిన అలందా మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్‌ప్రైవేట్ లిమిటెడ్ ఆగస్టు 23, 2018న ఒప్పందం కుదుర్చుకుని ఆగస్టు (24) 25న నగదు కూడా చెల్లించింది. దీనికి అనుగుణంగానే ఆ షేర్లు మొత్తం కూడా అలందా మీడియా పేరు మీద ఆగస్టు 27వ తేదీన డి-మ్యాట్ రూపంలో బదిలీ కూడా జరిగింది. దీంతో ఏబీసీఎల్ యాజమాన్యం అలందా చేతికి మారినట్లయ్యింది. ఈ లావాదేవీని గుర్తిస్తూ, ఏబీసీఎల్ కంపెనీ తన రికార్డుల్లో నమోదు కూడా చేసుకుంది. సంబంధిత పత్రాలను రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ కార్యాలయంలో దాఖలు కూడా చేశారు. ఏబీసీఎల్ యాజమాన్యం చేతులు మారడంతో అలందా మీడియా సంస్థ తరపున నలుగురు డైరెక్టర్లను ఏబీసీఎల్ డైరెక్టర్ల బోర్డులో నియమించేందుకు కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ అనుమతి కోరుతూ కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖకు అధికారికంగా పంపించింది. ఈ తీర్మానాల మీద ఒకసారి రవిప్రకాశ్, మరోసారి ఎంకెవీఎన్ మూర్తి అనే మరో డైరెక్టర్ ఏబీసీఎల్ డైరెక్టర్ల హోదాలో సంతకాలు చేశారు. ఈ దరఖాస్తును పరిశీలించిన కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ మార్చి 29, 2019న అనుమతి మంజూరు చేస్తూ ఏబీసీఎల్కు సమాచారం పంపింది. అన్ని అనుమతులు ఉన్నప్పటికీ, కొత్త డైరెక్టర్లతో బోర్డు మీటింగ్ నిర్వహించేందుకు రవిప్రకాశ్ శతవిధాలా అడ్డుపడుతూ వచ్చారు. దీంతో ఏబీసీఎల్లో 90 శాతానికి పైగా వాటా పొందిన అలందా మీడియాకు చెందిన నలుగురు డైరెక్టర్లు ఏప్రిల్ 23, 2019న సమావేశమై తమ నియామకానికి చెందిన పత్రాలను రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ కార్యాలయంలో దాఖలు చేయాల్సిందిగా ఈ బాధ్యతలు నిర్వహిస్తున్న కంపెనీ సెక్రటరీని కోరారు. రవిప్రకాశ్, ఆయన సహచరులు కొందరు దీన్ని అడ్డుకునే దురుద్దేశంతో, ఆ కంపెనీ సెక్రటరీ రాజీనామా చేసినట్లు పాత తేదీతో ఫోర్జరీ డాక్యుమెంట్‌ను సృష్టించారు. ఇదే విషయాన్ని సదరు కంపెనీ సెక్రటరీ రాతపూర్వకంగా రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్‌కు ఫిర్యాదు చేయడమే కాక, తన సంతకాన్ని ఫోర్జరీ చేసి తాను రాజీనామా చేసినట్లు నకిలీ పత్రాన్ని సృష్టించారని వివరించారు. కంపెనీలో 90 శాతానికి పైగా వాటా ఉన్న కొత్త యాజమాన్యానికి ఆ కంపెనీ నిర్వహణలో అడుగడుగునా అడ్డుపడుతూ, కంపెనీల చట్టంలోని నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని కొత్త యాజమాన్యం ఆరోపించింది. మెజార్టీ వాటాదారుల హక్కులను అణగదొక్కే విధంగా కుట్రపూరిత చర్యలకు పాల్పడ్డారంటోంది అలందా మీడియా. సంస్థ నిర్వహణకు సంబంధించి రవిప్రకాశ్ పాల్పడిన అక్రమాలపై టీవీ9 యాజమాన్యం అతనిపై చీటింగ్ కేసు కూడా పెట్టింది. సంస్థకు హాని కలిగించే ఉద్దేశంతో కొందరు వ్యక్తులతో కుమ్మక్కై ఫోర్జరీ పత్రాలు సృష్టించడమే కాక, కంపెనీ నిర్వహణలో యాజమాన్యానికి ఇబ్బందులు కలిగించే రీతిలో వ్యవహరిస్తున్నారని టీవీ9 యాజమాన్యం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. -
రవిప్రకాశ్ కోసం తెలంగాణ పోలీసుల వేట
-
టీవీ9 కార్యాలయంలో పోలీసుల సోదాలు
-
నటుడు శివాజీతో కలిసి రవిప్రకాశ్ కుట్ర..
సాక్షి, హైదరాబాద్ : ఫోర్జరీతోపాటు యాజమాన్యానికి తెలియకుండా నిధులు మళ్లించారంటూ ఆరోపణలతో టీవీ9 సీఈవో రవిప్రకాశ్‌పై సైబర్ క్రైమ్‌లో ఐపీసీ 406, 420, 467, 469, 471, 120B, 90, 160..ఐటీ యాక్ట్ 66,72 సెక్షన్ల కింద కేసు నమోదు అయింది. ఈ నేపథ్యంలో ఆయన కోసం రెండు రోజుల నుంచి తెలంగాణ పోలీసులు గాలిస్తున్నారు. నిధుల మళ్లింపు జరిగిందని ఆరోపిస్తూ అలంద మీడియా ఎంటర్టైన్మెంట్స్ సంస్థ...సీఈవోపై ఫిర్యాదు చేసింది. అంతేకాకుండా తన సంతకాన్ని రవిప్రకాశ్ ఫోర్జరీ చేశారంటూ అలంద మీడియా కార్యదర్శి కౌశిక్ రావు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అలంద సంస్థ ఫిర్యాదుతో రవిప్రకాశ్ నివాసంతో పాటు టీవీ9 కార్యాలయంలో పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. చదవండి: రవిప్రకాశ్ పాస్‌పోర్ట్ స్వాధీనం, శివాజీ ఇంట్లో సోదాలు టీవీ9 నుంచి రవిప్రకాశ్‌కు ఉద్వాసన కాగా కొద్దిరోజుల కిందటే ఏబీసీఎల్ కార్పొరేషన్ నుంచి 90శాతం షేర్లు కొనుగోలు చేసి టీవీ9ను అలంద మీడియా టేకోవర్ చేసిన విషయం తెలిసిందే. యాజమాన్యం మారిన తర్వాత కొత్తగా నలుగురు డైరెక్టర్లను తీసుకోవాలని అలంద మీడియా ప్రతిపాదించింది. డైరెక్టర్ల నియామకానికి కేంద్ర సమచారశాఖ అనుమతి ఇచ్చినా... ఆ ప్రతిపాదనను రవిప్రకాశ్ వ్యతిరేకించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా డైరెక్టర్ల నియామకాన్ని వ్యతిరేకిస్తూ బోర్డు మీటింగ్‌లో కొత్తవారిని తీసుకోవద్దంటూ ప్రతిపాదిస్తూ ఇప్పటికే ఉన్న ఓ డైరెక్టర్ సంతకంతో డాక్యుమెంట్ తయారు చేయించి, అక్రమాలకు పాల్పడ్డారని సమాచారం. అయితే ఆ సంతకం తాను చేయలేదని, డాక్యుమెంట్లో ఉన్న సంతకాన్ని రవిప్రకాశ్ ఫోర్జరీ చేశారని బాధిత డైరెక్టర్ ఆరోపించారు. దీంతో అలంద సంస్థ కార్యదర్శి పోలీసుల్ని ఆశ్రయించారు. ఇక కేవలం 9శాతం వాటా మాత్రమే కలిగి ఉన్న ఆయన యాజమాన్య మార్పును అడ్డుకునేందుకు కుటిలయత్నం చేసినట్లు భోగట్టా. టీవీ9 తన నియంత్రణలోనే ఉండాలంటూ షరతులు విధించిన రవిప్రకాశ్ కొత్త యాజమాన్యాన్ని ఇబ్బంది పెట్టినట్లు సమాచారం. మరోవైపు టీవీ9 కార్యాలయం నుంచి కొన్ని ఫైల్స్, ల్యాప్‌టాప్‌తో పాటు హార్డ్‌డిస్క్‌లు మాయం అయినట్లు పోలీసులు గుర్తించారు. రెండు రోజులుగా అజ్ఞాతంలో ఉన్న రవిప్రకాశ్‌తో పాటు ఆయన అనుచరుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
లొంగిపోయిన టీవీ9 సీఈఓ రవిప్రకాశ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రజాప్రతినిధులను, ముఖ్యమంత్రిని, అసెంబ్లీని కించపరిచే కార్యక్రమాన్ని ప్రసారం చేసిన కేసులో టీవీ9 సీఈఓ రవిప్రకాశ్ హైకోర్టు ఆదేశాల మేరకు శనివారం ఎల్బీ నగర్ పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయారు. రూ.25వేల వ్యక్తిగత బాండ్, ఇద్దరు ఉద్యోగుల ష్యూరిటీతోపాటు పాస్‌పోర్ట్‌ను స్వాధీనం చేసుకుని వ్యక్తిగత పూచీకత్తుపై ఆయనకు కండీషన్ బెయిలు మంజూరు చేశారు. తెలంగాణ అసెంబ్లీని కించపరిచేలా టీవీ9 కథనాలు ప్రసారం చేసిందంటూ న్యాయవాది సుంకరి జనార్దన్‌గౌడ్ సైబరాబాద్ 2వ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో ఫిర్యాదు దాఖలు చేసిన విషయం తెలిసిందే.