రామలింగరాజును బ్లాక్‌బెయిల్‌ చేసిన రవిప్రకాష్‌ | Vijay Sai Reddy Tweets On TV9 Issue | Sakshi
Sakshi News home page

రామలింగరాజును బ్లాక్‌బెయిల్‌ చేసిన రవిప్రకాష్‌

Published Thu, May 9 2019 8:15 PM | Last Updated on Thu, May 9 2019 8:24 PM

Vijay Sai Reddy Tweets On TV9 Issue - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రవిప్రకాష్‌ లాంటి కొందరు చీడ పురుగుల వల్లే తెలుగు మీడియా ప్రతిష్ఠ మసకబారిందని, వీళ్ల బారినుంచి మీడియా బయట పడితే మళ్లీ 1980ల ముందు నాటి విశ్వసనీయత వస్తుందని రాజ్యసభ సభ్యుడు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వి. విజయసాయి రెడ్డి అన్నారు. దేశంలో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఉద్యమించిన మీడియా ఆ తర్వాత బ్లాక్‌మెయిలర్లు, కుల పిచ్చగాండ్ల చేతికి వెళ్లిందని ట్విటర్‌లో పేర్కొన్నారు. శ్రీనిరాజు సంస్థలో పనిచేస్తూ ఆయన తోడల్లుడు సత్యం రామలింగరాజును బ్లాక్ మెయిల్ చేసిన ఘనుడు రవిప్రకాష్‌ అని వెల్లడించారు. (చదవండి: ‘టీవీ9పై కుట్ర అంతా అక్కడే జరిగింది’)

‘బెయిల్ రావడానికి ముందు చికిత్స కోసం నిమ్స్‌లో చేరాడు. ఆ సమయంలో ఆయన సెల్‌ఫోన్లో మాట్లాడుతుండగా స్పైక్యామ్‌తో రికార్డు చేయించి కోట్లు వసూలు చేశాడని చెబ్తారు. మెరుగైన సమాజం కోసం ‘చెమటలు’ కక్కిన రవిప్రకాష్‌ తక్షణం పోలీసులకు లొంగిపోయి సహకరించారలని పౌర సమాజం కోరుతోంది. మెరుగైన సమాజం కోసం పరివర్తన తీసుకుచ్చే ప్రవక్తలాగా చెలరేగిన రవి ప్రకాష్‌ చేయని దుర్మార్గాలు లేవు. మతాలను కించపర్చడం, కార్పోరేట్ల విబేధాల నుంచి భార్య భర్తల గొడవల వరకు టీవీ స్ర్కీన్ పైకి ఎక్కించి సమాజాన్ని భ్రష్టు పట్ టించాడు. కులం లేదంటూనే గజ్జిని వ్యాప్తి చేశాడు. మెరుగైన సమాజాన్ని అడ్డుకున్న ద్రోహి రవిప్రకాష్‌ బండారం ఎట్టకేలకు బయట పడింది. ఈయన బాధితులు ఒక్కొక్కరు ఇప్పుడు బయటకొస్తున్నారు. ‘కమ్మ’ని నీతులకు కాలం చెల్లింది. చంద్రబాబు ప్రయోగించిన తుప్పు పట్టిన మిస్సైళ్లలో రవిప్రకాష్‌ ఒకడు. ఎర్ర చందనం స్మగ్లర్ల నుంచి తన మనుషుల ద్వారా నెలనెలా మామూళ్లు తీసుకున్న ఆరోపణలపై కూడా రవిప్రకాష్‌పై దర్యాప్తు జరగాలి. ఆ చనువుతోనే స్మగ్లర్లు టివీ9 మీడియా స్టిక్కర్లు వేసిన వాహనాల్లో ఎర్రచందనం తరలించారు. లక్షల కోట్ల ఎర్రచందనం తరలి పోవడంలో మీడియా ప్రముఖుడి పాత్ర కూడా ఉండటం దారుణమ’ని విజయసాయి రెడ్డి ట్వీట్‌ చేశారు.

సినిమాల్లో వేషాలు లేక బ్రోకర్ అవతారం ఎత్తిన శివాజీ ఆదాయ మార్గాలపై దర్యాప్తు జరగాలని డిమాండ్‌ చేశారు. అమరావతిలో భూముల కొనుగోళ్లు, హైదరాబాద్‌లో ఆస్తులు ఎలా కొన్నాడనే లోతుగా విచారణ చేపట్టాలన్నారు. శివాజీ గరుడ పురాణం ఒక కుట్ర అని, టీవీ9 ఆఫీసులో అతడు ఏం చేస్తుంటాడో విచారణ జరగాలన్నారు. రవిప్రకాష్‌ తనకు కొన్ని షేర్లు అమ్మి మోసం చేశాడని ఈ బ్రోకర్ ట్రిబ్యునల్‌కు వెళ్ళడం వెనుక రవిప్రకాష్ ఉన్నాడని, టీవీ9 బోర్డులోకి కొత్త యాజమాన్యం ప్రతినిధులు రాకుండా ఆఖరి నిమిషంలో ఆడిన నాటకమని వివరించారు. (చదవండి: రవిప్రకాశ్‌ భార్యకు నోటీసులు)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement