టీవీ9 సీఈవో రవిప్రకాష్‌పై కేసు | Case filed on TV9 CEO Ravi prakash | Sakshi
Sakshi News home page

టీవీ9 సీఈవో రవిప్రకాష్‌పై కేసు

Published Sat, Jun 21 2014 5:56 AM | Last Updated on Sat, Sep 2 2017 9:10 AM

Case filed on TV9 CEO Ravi prakash

మేజిస్ట్రేట్ ఆదేశాలతో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు
 హైదరాబాద్: తెలంగాణ ప్రజాప్రతినిధులను కించపరిచేలా కథనం ప్రసారం చేసిన టీవీ9 న్యూస్‌చానల్‌పై, ఆ సంస్థ సీఈవో రవిప్రకాష్‌పై ఎల్‌బీనగర్ పోలీస్‌స్టేషన్‌లో శుక్రవా రం కేసు నమోదైంది. ఈనెల 12వ తేదీ రాత్రి8.30 గంటలకు టీవీ9లో తెలంగాణ ప్రజాప్రతినిధులను కించపరిచే విధంగా కథనం ప్రసారం చేసిందని ఆరోపిస్తూ 18 తేదీన ఎల్‌బీనగర్‌కు చెందిన న్యాయవాది సుంకరి జనార్దన్‌గౌడ్ సైబరాబాద్ రెండో మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును స్వీకరించిన న్యాయస్థానం.. టీవీ9 సంస్థ, దాని సీఈవో రవిప్రకాష్‌పై కేసు నమోదు చేయాలని ఆదేశిం చింది. కోర్టు ఆదేశాల మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement