సాక్షి, హైదరాబాద్ : ఫోర్జరీ, నిధుల మళ్లింపు కేసుల్లో నిందితుడిగా ఉన్న టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌కు తెలంగాణ హైకోర్టు శుక్రవారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. పోలీసుల విచారణకు సహకరించాలని హైకోర్టు ఆదేశించింది. వారానికి ఒకసారి పోలీసుల ముందు హాజరు కావాలని హైకోర్టు పేర్కొంది. అదే విధంగా కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి ఎక్కడికి వెళ్లకూడదని రవిప్రకాశ్‌ను ఆదేశించింది.
కాగా గతంలో రవిప్రకాశ్ రెండు సార్లు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అయితే తీవ్ర ఆర్థిక నేరాలకు పాల్పడిన రవిప్రకాశ్‌కు బెయిల్ మంజూరు చేస్తే సాక్షుల్ని ప్రభావితం చేస్తారని, కేసు దర్యాప్తుపై తీవ్ర ప్రతికూల ప్రభావం ఉండేలా చేయగలరని ఆయనకు బెయిల్ ఇవ్వద్దని న్యాయవాదులు కోరారు. దాంతో తెలంగాణ హైకోర్టు రవిప్రకాశ్‌కు బెయిల్ నిరాకరించింది. అయితే హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ రవి ప్రకాశ్ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే, అక్కడ కూడా ఆయనకు ఎదురుదెబ్బ తగిలింది. ముందస్తు బెయిల్ కోసం హైకోర్టుకే వెళ్లాలని సుప్రీం కోర్టు రవి ప్రకాశ్‌కు సూచించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment