![Telangana High Court Reserved Verdict Of Ravi Prakash Case - Sakshi](/styles/webp/s3/article_images/2019/06/18/ravi-prakash.jpg.webp?itok=8e5uDjcp)
సాక్షి, హైదరాబాద్ : ఫోర్జరీ, నిధుల మళ్లింపు కేసుల్లో నిందితుడిగా ఉన్న టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ కేసు విచారణ ముగిసింది. మంగళవారం ఇరువర్గాల వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వడ్‌లో ఉంచింది. రవిప్రకాశ్ తరపున దిల్‌జిత్‌సింగ్ అహువాల్యా వాదనలు వినిపిస్తూ.. టీవీ9 షేర్ల అగ్రిమెంట్ కుట్రపూర్వకంగా జరిదిందని ఆరోపించారు. రవిప్రకాశ్ 40వేల షేర్లను సినీ నటుడు శివాజీకి విక్రయించిన విషయం వాస్తవమన్నారు. టీవీ9 లోగో రవిప్రకాశ్‌కే చెందుతుందని తెలిపారు. ప్రభుత్వం తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. టీవీ9 షేర్ల కొనుగోలు నిబంధనల ప్రకారమే జరిగిందన్నారు. అగ్రిమెంట్‌కు సంబంధించిన పేపర్లను కోర్టుకు సమర్పించారు. టీవీ9 లోగో ఒక వ్యక్తి ప్రాపర్టీ కాదని, అది కంపెనీ ప్రాపర్టీగా ఉంటుందన్నారు. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌లో ఎలాంటి కేసు పెండింగ్‌లో లేదన్నారు. రవిప్రకాశ్, శివాజీలకు సంబంధించిన పిటిషన్‌పై నేషనల్ కంపెనీ అప్లియేట్ లా ట్రిబ్యునల్ స్టే ఇచ్చిందని హైకోర్టుకు తెలియజేశారు. అనంతరం తీర్పును రిజర్వడ్‌లో పెట్టినట్లు హైకోర్టు వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment