TV9 News channel
-
దుబాయ్‌లో నటుడు శివాజీకి చేదు అనుభవం
సాక్షి, హైదరాబాద్ : అలంద మీడియా కేసులో నిందితుడిగా ఉన్న సినీ నటుడు, గరుడ పురాణం శొంఠినేని శివాజీకి దుబాయ్ విమానాశ్రయంలో మరోసారి చేదు అనుభవం ఎదురైంది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దుబాయ్ మీదగా అమెరికా వెళుతున్న అతడిని ఈ నెల 26న దుబాయ్ విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు. శివాజీపై క్రిమినల్ కేసులు ఉన్నాయంటూ తిరిగి అతడిని హైదరాబాద్ పంపించివేశారు. టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్‌తో పాటు శివాజీపై హైదరాబాద్ పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. గతంలో కూడా హైదరాబాద్ నుంచి అమెరికా వెళ్లే ప్రయత్నంలో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పట్టుబడ్డారు. ఆ తర్వాత సైబరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులు అతడికి విచారణకు హాజరు కావాలని నోటీసులు కూడా ఇచ్చారు. కాగా విదేశాలకు వెళ్లేందుకు శివాజీపై ఎలాంటి ఆంక్షలు లేవని సైబరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. దుబాయ్ పోలీసులు ఎందుకు ఆపారో తెలియదని అన్నారు. -
రవి ప్రకాశ్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు
సాక్షి, హైదరాబాద్ : ఫోర్జరీ, నిధుల మళ్లింపు కేసుల్లో నిందితుడిగా ఉన్న టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌కు తెలంగాణ హైకోర్టు శుక్రవారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. పోలీసుల విచారణకు సహకరించాలని హైకోర్టు ఆదేశించింది. వారానికి ఒకసారి పోలీసుల ముందు హాజరు కావాలని హైకోర్టు పేర్కొంది. అదే విధంగా కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి ఎక్కడికి వెళ్లకూడదని రవిప్రకాశ్‌ను ఆదేశించింది. కాగా గతంలో రవిప్రకాశ్ రెండు సార్లు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అయితే తీవ్ర ఆర్థిక నేరాలకు పాల్పడిన రవిప్రకాశ్‌కు బెయిల్ మంజూరు చేస్తే సాక్షుల్ని ప్రభావితం చేస్తారని, కేసు దర్యాప్తుపై తీవ్ర ప్రతికూల ప్రభావం ఉండేలా చేయగలరని ఆయనకు బెయిల్ ఇవ్వద్దని న్యాయవాదులు కోరారు. దాంతో తెలంగాణ హైకోర్టు రవిప్రకాశ్‌కు బెయిల్ నిరాకరించింది. అయితే హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ రవి ప్రకాశ్ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే, అక్కడ కూడా ఆయనకు ఎదురుదెబ్బ తగిలింది. ముందస్తు బెయిల్ కోసం హైకోర్టుకే వెళ్లాలని సుప్రీం కోర్టు రవి ప్రకాశ్‌కు సూచించిన సంగతి తెలిసిందే. -
ముగిసిన రవిప్రకాశ్ కేసు విచారణ
సాక్షి, హైదరాబాద్ : ఫోర్జరీ, నిధుల మళ్లింపు కేసుల్లో నిందితుడిగా ఉన్న టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ కేసు విచారణ ముగిసింది. మంగళవారం ఇరువర్గాల వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వడ్‌లో ఉంచింది. రవిప్రకాశ్ తరపున దిల్‌జిత్‌సింగ్ అహువాల్యా వాదనలు వినిపిస్తూ.. టీవీ9 షేర్ల అగ్రిమెంట్ కుట్రపూర్వకంగా జరిదిందని ఆరోపించారు. రవిప్రకాశ్ 40వేల షేర్లను సినీ నటుడు శివాజీకి విక్రయించిన విషయం వాస్తవమన్నారు. టీవీ9 లోగో రవిప్రకాశ్‌కే చెందుతుందని తెలిపారు. ప్రభుత్వం తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. టీవీ9 షేర్ల కొనుగోలు నిబంధనల ప్రకారమే జరిగిందన్నారు. అగ్రిమెంట్‌కు సంబంధించిన పేపర్లను కోర్టుకు సమర్పించారు. టీవీ9 లోగో ఒక వ్యక్తి ప్రాపర్టీ కాదని, అది కంపెనీ ప్రాపర్టీగా ఉంటుందన్నారు. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌లో ఎలాంటి కేసు పెండింగ్‌లో లేదన్నారు. రవిప్రకాశ్, శివాజీలకు సంబంధించిన పిటిషన్‌పై నేషనల్ కంపెనీ అప్లియేట్ లా ట్రిబ్యునల్ స్టే ఇచ్చిందని హైకోర్టుకు తెలియజేశారు. అనంతరం తీర్పును రిజర్వడ్‌లో పెట్టినట్లు హైకోర్టు వెల్లడించింది. -
రవిప్రకాశ్‌కు మరో షాక్
సాక్షి, హైదరాబాద్: ఫోర్జరీ, నిధుల మళ్లింపు కేసుల్లో నిందితుడిగా ఉన్న టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌కు మరో షాక్ తగిలింది. ఆయన వాడుతున్న ఖరీదైన కార్లను అలంద మీడియా యాజమాన్యం స్వాధీనం చేసుకుంది. టీవీ9 నుంచి అలంద మీడియా రవిప్రకాశ్‌ను తొలగించినప్పటికీ.. కంపెనీ వాహనాలను మాత్రం తిరిగి ఇవ్వలేదు. దీంతో యాజమాన్యం కోర్టును ఆశ్రయించింది. తమ వాహనాలకు తిరిగి ఇప్పించాలని వారు కోర్టును కోరారు. రవిప్రకాశ్ వాడుతున్న ఖరీదైన వాహనాలకు అలంద మీడియా యాజమాన్యానికి తిరిగి ఇవ్వాలని కోర్టు ఆదేశించడంతో కార్లను స్వాధీన పరుచుకున్నారు. కోర్టు ఆదేశాలతో రవి ప్రకాశ్ ఇంటికి చేరుకున్న పోలీసులు ముందుగా కార్లను సీజ్ చేశారు. ఆయన డ్రైవర్స్ ఫోన్లను తీసుకున్నారు. అయితే ముందస్తు నోటీసులు లేకుండా ఇంటికి ఎలా వస్తారని రవిప్రకాశ్ భార్య పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తీవ్ర ఆర్థిక నేరాలకు పాల్పడిన రవిప్రకాశ్‌కు బెయిల్ మంజూరు చేస్తే సాక్షుల్ని ప్రభావితం చేస్తారని, కేసు దర్యాప్తుపై తీవ్ర ప్రతికూల ప్రభావం ఉండేలా చేయగలరని ఆయనకు బెయిల్ ఇవ్వద్దని ఇదివరకే న్యాయవాదులు కోరిన విషయం తెలిసిందే. రవిప్రకాశ్‌పై వచ్చిన ఆరోపణలను విచారిస్తున్న ధర్మాసనం ఇరువర్గాల వాదనలు విన్న అనంతరం.. కేసు విచారణ వచ్చే మంగళవారానికి వాయిదా వేస్తున్నట్లు ఇదివరకే ప్రకటించింది. -
టీవీ9 షేర్లకు ఒక్క రూపాయి ఇవ్వలేదు : అలందా
సాక్షి, హైదరాబాద్ : టీవీ9 కొనేందుకు హవాలా డబ్బును వాడారన్న ఆ చానెల్ మాజీ సీఈవో రవిప్రకాశ్ ఆరోపణలను అలందా మీడియా తీవ్రంగా ఖండించింది. నిబంధనల ప్రకారమే టీవీ9 షేర్లను కొనుగోలు చేశామని సృష్టం చేసింది. కేసును తప్పుదోవ పట్టించేందుకే రవిప్రకాశ్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడింది. ఈ మేరకు మంగళవారం అలందా సంస్థ ఓ ప్రకటన విడుదల చేసింది. టీవీ9 షేర్లను పూర్తిగా బ్యాంకు రూపంలోనే కొనుగోలు చేశామని, ఒక్క రూపాయి కూడా నగదు రూపంలో ఇవ్వలేదని పేర్కొంది. షేర్ల కొనుగోలుకు హవాల డబ్బు వాడారన్న రవిప్రకాశ్ ఆరోపణలు అవాస్తవాలని, కేసు నుంచి తప్పించుకోవడానికే ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని తెలిపింది. కాగా టీవీ 9 ఏర్పాటు సమయంలో మారిషస్ నుంచి ఫెమా నిబంధనలకు విరుద్ధంగా రూ. 60 కోట్ల అక్రమ నిధులు వచ్చాయని రవిప్రకాశ్ ఆరోపించిన సంగతి తెలిసిందే. టీవీ 9లో వాటాను విక్రయించిన సందర్భంలో కూడా హవాలా మార్గాల్లోనే నిధులు సమకూర్చారని ఆయన ఆరోపించారు. కశ్మీర్లో ఉగ్రవాదులకు నిధులను అందజేసే మార్గాల్లో ఈ నిధులను తరలించారని సంచలన ఆరోపణలు చేశారు. వీటిపై దర్యాప్తు చేయాలంటూ సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లకు తాను ఇటీవల ఫిర్యాదు చేశానని, అప్పటి నుంచి తెలంగాణ ప్రభుత్వం తనను వేధిస్తోందని రవిప్రకాశ్ ఆరోపించారు. టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ ఫోర్జరీకి పాల్పడినట్టు అలంద మీడియా ఫిర్యాదు చేయడంపై కోర్టులో విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. నిన్న హైకోర్టులో ఈ కేసు విచారణకు రాగా.. నేటికి వాయిదా వేశారు. నేడు ఇరువర్గాల వాదనలు విన్న ధర్మాసనం.. కేసు విచారణ వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది. -
రవిప్రకాశ్ కేసు విచారణ మళ్లీ వాయిదా
సాక్షి, హైదరాబాద్ : ఫోర్జరీ, నిధుల మళ్లింపు కేసుల్లో నిందితుడిగా ఉన్న టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ కేసు విచారణ మళ్లీ వాయిదా పడింది. నేడు ఇరువర్గాల వాదనలు విన్న ధర్మాసనం.. కేసు విచారణ వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది. టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ ఫోర్జరీకి పాల్పడినట్టు అలంద మీడియా ఫిర్యాదు చేయడంపై కోర్టులో విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. నిన్న హైకోర్టులో ఈ కేసు విచారణకు రాగా.. నేటికి వాయిదా వేశారు. నేడు హైకోర్టులో ప్రారంభమైన రవిప్రకాశ్ కేసు విచారణలో ఇరు వర్గాలు తమ వాదనలు వినిపించాయి. రవిప్రకాశ్‌కు బెయిల్ ఇవ్వొద్దని పోలీసుల తరపు లాయర్ వాదనలు వినిపించారు. సాక్షులను ప్రలోభాలకు గురిచేసే అవకాశం ఉందని... అందుకే బెయిల్‌ను నిరాకరించాలని హైకోర్టుకు విన్నవించారు. దేవేందర్ అగర్వాల్ రిజైన్ లెటర్లో సంతకం ఫోర్జరీ చేసినట్లు ఆధారాలతో సహా హైకోర్టుకు పోలీసులు చూపించారు. సాక్షులను ప్రలోభాలకు గురిచేస్తూ.. వారితో జరిపిన ఫోన్ చాటింగ్ స్ర్కీన్‌షాట్స్‌ను కూడా హోకోర్టుకు సమర్పించారు. రవిప్రకాశ్ విచారణకు సహకరించడంలేదని పోలీసులు తెలిపారు. ఈ కేసులో లోతైన దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందని, అందుకే రవిప్రకాశ్‌కు బెయిల్ ఇవ్వొద్దని పోలీసుల తరపు లాయర్ హైకోర్టులో వాదనలు వినిపించారు. రవిప్రకాశ్‌కు బెయిల్ ఇవ్వమని ఆయన తరపు న్యాయవాది హైకోర్టును కోరగా.. ఏ ప్రాతిపదికన బెయిల్ మంజూరు చేయాలని హైకోర్టు ప్రశ్నించింది. ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు.. ఈ కేసును వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది. -
రవిప్రకాశ్‌కు బెయిలా? జైలా?
సాక్షి, హైదరాబాద్: ఫోర్జరీ కేసు నిందితుడు, టీవీ 9 మాజీ సీఈవో రవి ప్రకాష్ అరెస్ట్ ఎప్పుడనేది మంగళవారం తేలే అవకాశం కనిపిస్తోంది. రవిప్రకాశ్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టు తన విచారణను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేసింది. పలు నేరారోపణ కేసులలో రవిప్రకాష్ తనకు బెయిల్ కావాలని కోరుతుంటే.. రవికి బెయిల్ ఇస్తే సాక్ష్యాధారాలను తారుమారు చేసే ప్రమాదం ఉందని, కాబట్టి బెయిల్ ఇవ్వద్దని పోలీసుల తరపు న్యాయవాదులు హైకోర్టుకు విజ్ఞప్తి చేసుకున్నారు. ఇరువర్గాల వాదనలూ విన్న న్యాయస్థానం సోమవారం తన విచారణను మంగళవారానికి వాయిదా వేసిన సంగతి తెలిసిందే. టీవీ9 చానెల్లో పలు ఆర్ధిక అవకతవకలు, అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటోన్న మాజీ సీఈవో రవిప్రకాష్ సైబర్ క్రైమ్ విచారణకు హాజరైనా ఏ మాత్రం విచారణకు సహకరించడంలేదన్నది పోలీసులు అంటున్నారు. అదేవిధంగా టీవీ 9 లోగోని పాతసామాను అమ్మేసినట్లు 99 వేలకి చిల్లరగా అమ్మేసిన కేసులో బంజారాహిల్స్ పోలీసులు రవిని విచారించారు. అయితే ఈ విచారణలోనూ రవిప్రకాష్ పోలీసుల ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పకుండా తప్పించుకున్నాడని తెలుస్తోంది. మొత్తానికి రవి ప్రకాష్ పై నమోదైన కేసులకు సంబంధించి అన్ని సాక్ష్యాధారాలనూ సేకరించిన పోలీసులు విచారణ అనంతరం నివేదికను రూపొందించి హైకోర్టుకు సమర్పించారు. -
రవిప్రకాశ్ కేసు విచారణ వాయిదా
సాక్షి, హైదరాబాద్ : ఫోర్జరీ, నిధుల మళ్లింపు కేసుల్లో నిందితుడిగా ఉన్న టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ ముందస్తు బెయిల్ పిటిషన్ కేసు రేపటికి వాయిదా పడింది. టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ ఫోర్జరీకి పాల్పడినట్టు అలంద మీడియా ఫిర్యాదు చేయడంపై కోర్టులో విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనిపై సైబర్ క్రైమ్ పోలీసులు కూడా దర్యాప్తు చేసి రవిప్రకాశ్ ను కొన్నిరోజులపాటు విచారించారు. ఈ రోజు(సోమవారం) హైకోర్టులో ఈ కేసు విచారణ జరిగింది. రవిప్రకాశ్ దర్యాప్తు నివేదికను పోలీసులు హైకోర్టుకు సమర్పించారు. అడ్వొకేట్ జనరల్(ఏజీ) తమ వాదనలు వినిపిస్తూ..రవిప్రకాశ్ తన 9శాతం షేర్లలో 40 వేల షేర్లను నటుడు శివాజీకి అమ్మినట్లు తప్పుడు ధ్రువపత్రాలు సృష్టించారని ఆరోపించారు. మెజారిటీ షేర్హోల్డర్స్కు తెలియకుండా రూ. 99వేలకు టీవీ9 లోగోను రవిప్రకాశ్ అమ్మేశాడని కోర్టుకు తెలిపారు. కావాలనే శివాజీతో ఎన్సీఎల్టీలో కేసులు వేయించాడని ఆరోపించారు. పోలీసులు ఎన్నిసార్లు విచారణకు పిలిచిన హాజరు కాలేదని, ఏ తప్పు చేయకపోతే ఎందుకు విచారణకు హాజరు కాలేదని ప్రశ్నించారు. సైబర్ క్రైమ్ పోలీసులు ఇప్పటికే రవిప్రకాశ్ కు 41 సీఆర్పీసీ కింద నోటీసులు జారీచేసిన క్రమంలో ఆయన అరెస్ట్ తప్పదన్న భావనలు వ్యక్తమవుతున్నాయి. అంతకుముందు ఫోర్జరీ కేసులో బెయిల్ కోరుతూ రవిప్రకాశ్ హైకోర్టును ఆశ్రయించగా, ఆయన పిటిషన్ తిరస్కరణకు గురైంది. దీంతో ఆయన సుప్రీంకోర్టుకు వెళ్లినా ఫలితం దక్కలేదు. దిగువ కోర్టుకే వెళ్లాలని, పోలీసుల ముందు విచారణకు హాజరవ్వాల్సిందేనని సుప్రీం స్పష్టం చేయడంతో రవిప్రకాశ్ అజ్ఞాతం వీడి సైబర్ క్రైమ్ పోలీసుల ముందు విచారణకు వచ్చారు. ఈ క్రమంలో రవిప్రకాశ్ ను అరెస్ట్ చేయాలంటే 48 గంటల ముందు నోటీసులు ఇచ్చిన తర్వాతే అదుపులోకి తీసుకోవాలని సుప్రీం పేర్కొనడంతో, సైబర్ క్రైమ్ పోలీసులు ఆయనకు 41 సీఆర్పీసీ కింద నోటీసులు పంపారు. ఈ నేపథ్యంలో, కోర్టు తీర్పును అనుసరించి రవిప్రకాశ్ ను అరెస్ట్ చేసే అవకాశాలు ఆధారపడి ఉన్నాయి. -
రవిప్రకాశ్ సమాధానాల్లో వాస్తవాలు వెలికితీస్తాం
-
అరెస్ట్‌కు రంగం సిద్ధం
-
రవి ప్రకాష్‌కు బంజారాహిల్స్ పోలీసుల నోటీసులు
-
రవిప్రకాశ్కి శల్యపరీక్ష!
-
కొనసాగుతున్న రవిప్రకాశ్ విచారణ
-
ముందస్తు బెయిల్ రద్దు.. పోలీసుల ఎదుటకు రవిప్రకాశ్
-
రవిప్రకాశ్‌కు సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ
-
సుప్రీంకోర్టులో రవిప్రకాశ్‌కు చుక్కెదురు
సాక్షి, న్యూఢిల్లీ : ఫోర్జరీ, డేటా చౌర్యం కేసులో టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌కు మరోసారి చుక్కెదురైంది. తెలంగాణ పోలీసులు నమోదు చేసిన మూడు కేసుల్లో ఆయనకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ కేసును హైకోర్టులోనే తేల్చుకోవాలని స్పష్టం చేసింది. ఈ విషయంలో గతంలో ఇచ్చిన ఉత్తర్వులను పక్కనపెడుతూ తాజాగా మెరిట్ ఆధారంగా కేసును విచారించాలని హైకోర్టును ఆదేశించింది. ముందస్తు బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టేయడాన్ని సవాల్ చేస్తూ రవిప్రకాశ్ ఇటీవల దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ ఇందూ మల్హోత్రా, జస్టిస్ ఎంఆర్ షాలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం సోమవారం విచారించింది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం తరఫున మాజీ సొలిసిటర్ జనరల్ రంజిత్ కుమార్ వాదనలు వినిపిస్తూ.. సీఆర్పీసీ సెక్షన్లు 160, 41ఏ కింద రెండు సార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ రవిప్రకాశ్ విచారణకు హాజరుకాలేదని వాదించారు. రవిప్రకాశ్ తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపిస్తూ.. రవిప్రకాశ్‌ను అరెస్టు చేసే ఉద్దేశంతోనే పోలీసులు పదేపదే ఆయన ఇంటికొచ్చి సోదాలు చేస్తున్నారని చెప్పగా, అది తప్పుడు విశ్లేషణ అంటూ తెలంగాణ ప్రభుత్వం తరఫు న్యాయవాది కౌంటర్ చేశారు. కాగా, సీఆర్పీసీ సెక్షన్ 41ఏ కింద పోలీసులు నోటీసులు జారీ చేస్తే తప్పుకుండా విచారణకు హాజరుకావాలని స్పష్టం చేసిన ధర్మాసనం, ఈ కేసులో తాము ముందస్తు బెయిల్ ఇవ్వబోమని తెలిపింది. ముందస్తు బెయిల్ కోసం తిరిగి హైకోర్టునే ఆశ్రయించాలని చెప్పింది. హైకోర్టు రవిప్రకాశ్ బెయిల్ పిటిషన్‌ను మెరిట్స్ ఆధారంగా విచారణ జరపకుండా కొట్టేయడంతో.. ఈ కేసును హైకోర్టు తిరిగి విచారించాలని ఆదేశించింది. గతంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను పక్కనపెట్టింది. జూన్ 10న మెరిట్స్ ఆధారంగా కేసును విచారించి తేల్చాలని ఆదేశించింది. పోలీసులు ఒకవేళ రవిప్రకాశ్‌ను అరెస్టు చేయదలిస్తే 48 గంటల ముందు నోటీసులు జారీ చేసి అరెస్టు చేయవచ్చునని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
రవిప్రకాశ్‌కు సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ
-
ఆ ముగ్గురు కనబడుట లేదు!
-
ఇంకా అజ్ఞాతంలో రవిప్రకాశ్
-
అజ్ఞాతం నుంచి రవిప్రకాశ్ వీడియో సందేశం!
సాక్షి, హైదరాబాద్ : ఫోర్జరీ, డేటాచౌర్యంతోపాటు పలు కేసులు ఎదుర్కొంటు అజ్ఞాతంలో ఉన్న టీవీ 9 చానల్ మాజీ సీఈవో రవిప్రకాశ్ బుధవారం ఓ వీడియోను విడుదల చేశారు. టీవీ9 కొత్త యాజమాన్యంతో నెలకొన్న వివాదం వల్లే తనపై తప్పుడు కేసులు పెట్టారని ఆరోపించారు. తన కేసుల విషయంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని, ఓ ఉగ్రవాదిలా ట్రీట్ చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. టీవీ9 స్థాపన దగ్గర నుంచి అమ్మకం వరకు చోటు చేసుకున్న పరిణామాలను వివరించారు. తనను పాలేరులా పనిచేయాలన్నారని, దీనికి అంగీకరించకపోవడంతోనే కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపించారు. మరోవైపు రవిప్రకాశ్ కోసం తెలంగాణ పోలీసులు గాలింపును తీవ్రతరం చేశారు. తాజాగా విడుదల చేసిన వీడియో ఆధారంగా రవిప్రకాష్ ఎక్కడ ఉన్నాడనే కూపీ లాగుతున్నట్లు సమాచారం. ఇక ముందస్తు బెయిల్ కోసం రవిప్రకాశ్ మూడు పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు నేడు విచారించే అవకాశముంది. రవిప్రకాశ్‌పై సైబరాబాద్ సైబర్‌క్రైమ్‌లో రెండు, బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఒక కేసు నమోదైంది. -
రవిప్రకాశ్ మరోసారి...
సాక్షి, హైదరాబాద్: ఫోర్జరీ, డేటాచౌర్యంతోపాటు పలు కేసులు ఎదుర్కొంటున్న టీవీ 9 చానల్ మాజీ సీఈవో రవిప్రకాశ్ ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. తాజాగా మరోసారి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ కోసం ఆయన మూడు పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు నేడు విచారించే అవకాశముంది. రవిప్రకాశ్‌పై సైబరాబాద్ సైబర్‌క్రైమ్‌లో రెండు, బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఒక కేసు నమోదైంది. మరోవైపు రవిప్రకాశ్ కోసం తెలంగాణ పోలీసులు గాలింపును తీవ్రతరం చేశారు. హైదరాబాద్, సైబరాబాద్ పోలీసులతోపాటు టాస్క్‌ఫోర్స్ పోలీసుల బృందం రవిప్రకాశ్ జాడ కనిపెట్టేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. సినీనటుడు శొంఠినేని శివాజీ కూడా తెలంగాణ పోలీసుల విచారణకు హాజరుకాకుండా కోర్టులో మాత్రం ముందస్తు బెయిల్ కోసం పిటిషన్లు వేస్తూ వస్తున్నారు. వీరిద్దరిని ప్రశ్నిస్తేనే కేసులు కొలిక్కి వస్తాయని పోలీసులు భావిస్తున్నారు. -
రవిప్రకాశ్ ఆస్ట్రేలియా జారుకున్నట్లు పోలీసుల అనుమానం
-
శివాజీ, రవిప్రకాశ్‌పై లుక్ అవుట్ నోటీసులు జారీ
-
రవిప్రకాశ్, శివాజీపై లుక్ అవుట్ నోటీసులు జారీ
సాక్షి, హైదరాబాద్ : నిధుల మళ్లింపు, ఫోర్జరీకి పాల్పడి అజ్ఞాతంలో ఉన్న టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌పై సైబరాబాద్ పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. రవిప్రకాశ్‌తో పాటు సినీ నటుడు గరుడ పురాణం శివాజీ, మాజీ సీఎఫ్‌వో మూర్తికి కూడా నిన్న అర్థరాత్రి సమయంలో ఈ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు దేశంలోని అన్ని ఎయిర్‌పోర్టులను పోలీసులు అప్రమత్తం చేశారు. వీరిరువురు దేశం విడిచి పారిపోకుండా ఉండేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. కాగా ఇప్పటికే రవిప్రకాశ్ పాస్‌పోర్టును పోలీసులు సీజ్ చేసిన విషయం విదితమే. ఈ కేసులో విచారణకు హాజరు కావాలని రవిప్రకాశ్‌తో పాటు శివాజీకి పోలీసులు పలుమార్లు నోటీసులు ఇచ్చినా...వారు గైర్హాజరు అయ్యారు. దీంతో వాళ్లకు ఇచ్చిన గడువు పూర్తి కావడంతో రవిప్రకాశ్, శివాజీలను సైబరాబాద్ పోలీసులు ఏ క్షణంలో అయినా అరెస్టు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు మాజీ సీఎఫ్‌వో మూర్తి విచారణ నిమిత్తం సైబరాబాద్ పోలీసుల ఎదుట హాజరు అయ్యారు. ఈ విచారణలో ఆయన పలు కీలక విషయాలు వెల్లడించినట్లు సమాచారం. ఇక టీవీ9లో వీరు చేసిన అక్రమాలు, తప్పుడు అగ్రిమెంట్లు, ఫోర్జరీ సంతకాలతో తప్పుదోవ పట్టించటం, నిధులు మళ్లింపు, టీవీ9 లోగోను విక్రయించాలనే దురాలోచన... ఇలాంటి అక్రమాలపై ఇప్పటికే సైబర్ క్రైం, బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు అయ్యాయి. 2018 ఫిబ్రవరిలో నటుడు శివాజీ, రవి ప్రకాష్, శక్తి, టీవీ9 మాజీ సీఎఫ్‌వో మూర్తి, మోజో టీవీ చైర్మన్ హరికిషణ్ మధ్య ఈ-మెయిల్స్ ద్వారా జరిగిన కుట్రను కూడా సైబర్ క్రైం పోలీసులు బయటపట్టారు. టీవీ9 లోగోను సైతం రూ. 99వేలకు విక్రయించటానికి తప్పుడు అగ్రిమెంట్ కూడా చేసినట్లు పోలీసులు గుర్తించారు. తాజాగా పోలీసులు లుక్ ఔట్ నోటీసులు జారీ చేయడంతో ఇప్పటికైనా రవి ప్రకాష్, శివాజీ అజ్ఞాతం వీడుతారా ? లేదా ? మరింత ఆసక్తిగా మారింది. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : శివాజీ, రవిప్రకాశ్‌పై లుక్ అవుట్ నోటీసులు జారీ -
ఫోర్జరీ కేసు.. రోజుకో మలుపు!