టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ సీసీఎస్ పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. ఫోర్జరీ, డేటా చౌర్యం కేసుల్లో నిందితుడిగా ఉన్న రవిప్రకాశ్ గత కొన్ని రోజులుగా అజ్ఞాతంలో ఉన్న సంగతి తెలిసిందే. తెలంగాణ పోలీసులు నమోదు చేసిన కేసుల్లో ముందస్తు బెయిల్ తెచ్చుకోవడానికి రవిప్రకాశ్ తీవ్రంగా ప్రయత్నించారు. అలంద మీడియా ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు రవిప్రకాశ్‌పై ఫొర్జరీ కేసు నమోదు చేశారు. అయితే ఆయన పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్లు అటు హైకోర్టు, ఇటు సుప్రీంకోర్టు తిరస్కరించాయి. దారులన్నీ మూసుకుపోవడంతో రవిప్రకాశ్ పునారాచనలో పడినట్టుగా తెలుస్తోంది. దీంతో ఆయన మంగళవారం సీసీఎస్ పోలీసుల ఎదుట విచారణకు హాజరయినట్టుగా తెలుస్తోంది.