సాక్షి, హైదరాబాద్ : నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌లో సినీనటుడు, గరుడ పురాణం శివాజీకి చుక్కెదురు అయింది. ఇప్పటికే అలందా మీడియాకు అనుకూలంగా ఢిల్లీలోని ఎన్‌సీఎల్‌టీ అప్పిలేట్ ట్రిబ్యునల్ ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో ఈ పిటిషన్‌పై ప్రస్తుతం ప్రొసీడింగ్స్ జరపలేమని తేల్చి చెప్పింది. కాగా టీవీ9 మాతృసంస్థ ఏబీసీఎల్‌లో జరిగిన మార్పులు, తనకు తెలియకుండా రవిప్రకాశ్ మోసపూరితంగా వ్యవహరించారని, ఏబీసీఎల్‌లో మార్పులపై స్టే విధించి యధాతథ స్థితిని కొనసాగించాలంటూ ఆయన ఎన్‌సీఎల్‌టీని ఆశ్రయించిన విషయం తెలిసిందే.
మరోవైపు అలందా మీడియా ఒప్పందాలపై స్టే కోరుతూ రవిప్రకాశ్ కూడా వారం క్రితం ఎన్‌సీఎల్‌టీలో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన ట్రిబ్యునల్ ఎనిమిది మందికి నోటీసులు ఇచ్చింది. అయితే దీన్ని సవాల్ చేస్తూ.. ఏబీసీఎల్‌ను టేకోవర్ చేసిన అలంద మీడియా నేషనల్ ఢిల్లీలోని కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్‌లో అప్పీల్ పిటిషన్ వేసింది. దీనిపై విచారణ జరిపిన ట్రిబ్యునల్ ...హైదరాబాద్ ఎన్‌సీటీఎల్‌లో జరిగే కేసు విచారణపై జూలై 9వ తేదీ వరకూ స్టే ఇచ్చింది.
దీంతో స్టే కారణంగానే జూలై 12 వరకూ ఎలాంటి ప్రొసిడింగ్స్ జరగడానికి వీల్లేదని ఎన్‌సీఎల్‌టీ స్పష్టం చేస్తూ తదుపరి విచారణను జూలై 12వ తేదీకి వాయిదా వేసింది. ఈ కేసు విచారణకు రవిప్రకాశ్, శివాజీ గైర్హాజరు కాగా, వాళ్ల తరఫు న్యాయవాదులు హాజరు అయ్యారు. మరోవైపు ఎన్‌సీఎల్‌టీ వద్ద సైబర్ క్రైమ్, ఎస్‌వోటీ పోలీసులు కూడా మోహరించారు.
సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి :
ఎన్‌సీఎల్‌టీలో శివాజీకి ఎదురు దెబ్బ
Comments
Please login to add a commentAdd a comment