సాక్షి, హైదరాబాద్ : ఫోర్జరీ, డేటాచౌర్యంతోపాటు పలు కేసులు ఎదుర్కొంటు అజ్ఞాతంలో ఉన్న టీవీ 9 చానల్ మాజీ సీఈవో రవిప్రకాశ్ బుధవారం ఓ వీడియోను విడుదల చేశారు. టీవీ9 కొత్త యాజమాన్యంతో నెలకొన్న వివాదం వల్లే తనపై తప్పుడు కేసులు పెట్టారని ఆరోపించారు. తన కేసుల విషయంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని, ఓ ఉగ్రవాదిలా ట్రీట్ చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. టీవీ9 స్థాపన దగ్గర నుంచి అమ్మకం వరకు చోటు చేసుకున్న పరిణామాలను వివరించారు. తనను పాలేరులా పనిచేయాలన్నారని, దీనికి అంగీకరించకపోవడంతోనే కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపించారు. మరోవైపు రవిప్రకాశ్ కోసం తెలంగాణ పోలీసులు గాలింపును తీవ్రతరం చేశారు. తాజాగా విడుదల చేసిన వీడియో ఆధారంగా రవిప్రకాష్ ఎక్కడ ఉన్నాడనే కూపీ లాగుతున్నట్లు సమాచారం.
ఇక ముందస్తు బెయిల్ కోసం రవిప్రకాశ్ మూడు పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు నేడు విచారించే అవకాశముంది. రవిప్రకాశ్‌పై సైబరాబాద్ సైబర్‌క్రైమ్‌లో రెండు, బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఒక కేసు నమోదైంది.
Comments
Please login to add a commentAdd a comment