
ఫోర్జరీ, డేటాచౌర్యంతోపాటు పలు కేసులు ఎదుర్కొంటున్న టీవీ 9 చానల్ మాజీ సీఈవో రవిప్రకాశ్ ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.
సాక్షి, హైదరాబాద్: ఫోర్జరీ, డేటాచౌర్యంతోపాటు పలు కేసులు ఎదుర్కొంటున్న టీవీ 9 చానల్ మాజీ సీఈవో రవిప్రకాశ్ ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. తాజాగా మరోసారి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ కోసం ఆయన మూడు పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు నేడు విచారించే అవకాశముంది. రవిప్రకాశ్‌పై సైబరాబాద్ సైబర్‌క్రైమ్‌లో రెండు, బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఒక కేసు నమోదైంది.
మరోవైపు రవిప్రకాశ్ కోసం తెలంగాణ పోలీసులు గాలింపును తీవ్రతరం చేశారు. హైదరాబాద్, సైబరాబాద్ పోలీసులతోపాటు టాస్క్‌ఫోర్స్ పోలీసుల బృందం రవిప్రకాశ్ జాడ కనిపెట్టేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. సినీనటుడు శొంఠినేని శివాజీ కూడా తెలంగాణ పోలీసుల విచారణకు హాజరుకాకుండా కోర్టులో మాత్రం ముందస్తు బెయిల్ కోసం పిటిషన్లు వేస్తూ వస్తున్నారు. వీరిద్దరిని ప్రశ్నిస్తేనే కేసులు కొలిక్కి వస్తాయని పోలీసులు భావిస్తున్నారు.