ఈ ‘మీడియా నయీం’ను ఏ ‘బాబు’ రక్షిస్తాడో! | vijaysai reddy takes on tv9 ex ceo raviprakash | Sakshi
Sakshi News home page

ఈ ‘మీడియా నయీం’ను ఏ ‘బాబు’ రక్షిస్తాడో!

Published Wed, May 15 2019 12:12 PM | Last Updated on Wed, May 15 2019 12:14 PM

vijaysai reddy takes on tv9 ex ceo raviprakash - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : పరారీలో ఉన్న టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి పలు వంగ్యోక్తులు విసిరారు. ‘పోలీసులు వస్తే ఇంట్లో కనిపించడు. నోటీసులకు స్పందించడు. పరారీలో లేనంటాడు. పోలీసులు, చట్టాలు, కోర్టులు తనంతటి ‘ప్రవక్త’ను టచ్‌ చేయవన్న భ్రమలో ఉన్నాడు. బెయిల్ పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. తప్పించుకునే దారులన్నీ బంద్‌. ఇక ఈ ‘మీడియా నయీం’ను ఏ ‘బాబు’ రక్షిస్తాడో చూడాలి. నిజం చెప్పులు తొడుక్కునే లోపు అబద్దం పరారైపోయింది!. విచారణకు రండి అని పోలీసులు చాలా మర్యాదగా రవిప్రకాష్‌ ఇంటికి నోటీసులు అంటిస్తుంటే ‘నకిలీ ప్రవక్త’ రాత్రికి రాత్రి దొడ్డి దారిలో గోడ దూకేసి బోర్డర్‌ దాటేశాడు. రేపో మాపో మాల్యాతో సెల్ఫీ దిగుతూ కనిపించి పట్టుకోండి చూద్దాం అంటాడేమో!’  అని ఆయన ట్విట్‌ చేశారు. 

మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై కూడా ఆయన సెటైర్లు వేశారు. ‘సొంత పార్టీ నేతలే ఎక్కడికక్కడ వెన్నుపోటు పొడిచారంటూ ఎన్నికల సమీక్షల్లో తమ్ముళ్ళు బావురుమంటుంటే వారిని ఎలా ఓదార్చాలో తెలియక బాబు బిక్క చచ్చిపోతున్నారట. పార్టీ శ్రేణుల్లో ధైర్యం నూరిపోయడం సంగతి సరే. సమీక్షలను ఇలాగే కొనసాగిస్తే కౌంటింగ్‌కు ముందే కొంప కొల్లేరని గ్రహించే రద్దు చేశారట.’ అంటూ విజయసాయి రెడ్డి ట్విటర్‌లో వ్యాఖ్యానించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement