
సాక్షి, అమరావతి : నిధుల మళ్లింపు, ఫోర్జరీకి పాల్పడి అజ్ఞాతంలో ఉన్న టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్, చంద్రబాబునాయుడుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ వి.విజయసాయిరెడ్డి మండిపడ్డారు. 'బాధితులు పెద్ద సంఖ్యలో టీవీ9 కొత్త మేనేజ్‌మెంటుకు తమ గోడు వెల్లబోసుకుంటున్నారట. జిల్లాకో ఏజెంటును పెట్టి ఆసుపత్రులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, కాంట్రాక్టర్లు, కలప స్మగ్లర్లు, రైస్ మిల్లర్లు, కార్పోరేట్ కాలేజీలను బ్లాక్‌మెయిల్ చేసిన ఆధారాలు బయటకు వస్తున్నాయి.
ఏదో ఒకటి చేసి రక్షించకపోతే చంద్రబాబు రహస్యాలన్నీబయట పెడతానని బ్లాక్‌మెయిల్‌కు దిగాడట మీడియా ‘నయీం’. ఈనెల 23 తర్వాత తన పరిస్థితే ఏమవుతుందో అంతుబట్టక సతమతమవుతుంటే శివాజీ, దాకవరపు అశోక్, హర్షవర్దన్ చౌదరిల బెదిరింపులతో కుంగిపోతున్నాడట. ఇంత ఈజీగా దొరికి పోయారేంటని మొత్తుకుంటున్నాడట.
చంద్రబాబు ఆయన కుల మీడియా పార్ట్‌నర్ల మోసాలు ఒక్కటొక్కటిగా బయట పడుతుంటే నమ్మిన వాళ్లను తడిగుడ్డతో గొంతులు కోయడంలో వాళ్ళ నైపుణ్యం ఏమిటో తెలిసిపోతోంది. గుడితోపాటు గుడిలో లింగాన్ని కూడా మింగటం అనే సామెత వీరిని చూసే పుట్టి ఉంటుంది. బయట పడకపోతే తెలుగు రాష్ట్రాలను శాశ్వతంగా చెరబట్టే వారే' అని విజయసాయిరెడ్డి ట్విటర్‌లో నిప్పులు చెరిగారు.
Comments
Please login to add a commentAdd a comment