మన్సూరాబాద్: అక్రమంగా మద్యం అమ్ముతున్న వ్యక్తిపై కేసు నమోదు చేసిన సంఘటన ఎల్‌బీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... ఎల్‌బీనగర్ ఎన్‌టీఆర్‌నగర్‌లో నివాసముండే నందగిరి దినేష్ (24) అక్రమంగా మద్యం అమ్ముతున్నాడనే సమాచారం అందుకున్న పోలీసులు శనివారం ఉదయం దాడి చేసి అక్రమంగా నిల్వ ఉంచిన 8 మద్యం బాటిళ్లను, రూ.700 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు పోలీసులు దినేష్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.