మందేసి చిందేసిన బాపట్ల ఎమ్మెల్యే | Bapatla MLA Vegesana Narendra Varma Drunk in Birthday Party: Andhra pradesh | Sakshi
Sakshi News home page

మందేసి చిందేసిన బాపట్ల ఎమ్మెల్యే

Published Tue, Dec 17 2024 3:25 AM | Last Updated on Tue, Dec 17 2024 3:25 AM

Bapatla MLA Vegesana Narendra Varma Drunk in Birthday Party: Andhra pradesh

మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్‌ బర్త్‌డే పార్టీలో రచ్చ 

కైపులో బీజేపీ నేతకు ముద్దులు 

మందుకొట్టి డాన్స్‌ చేసిన బీజేపీ మాజీ ఎమ్మెల్సీ సతీష్‌ 

చర్చనీయాంశంగా మారిన టీడీపీ ఎమ్మెల్యే, బీజేపీ మాజీ ఎమ్మెల్సీ కైపు గోల 

సాక్షి ప్రతినిధి, బాపట్ల: బాపట్ల టీడీపీ ఎమ్మెల్యే వేగేశన నరేంద్రవర్మ పీకలదాకా మద్యం తాగి చిందేశారు. కైపులో తీన్మార్‌ డాన్స్‌లు చేస్తూ, పార్టీ ఇచి్చన బీజేపీ నేతకు లిప్‌కిస్‌లు ఇచ్చి మరీ ఊగిపోయారు. ఆ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళితే.. మాజీ ఎమ్మెల్సీ, ప్రస్తుత బీజేపీ నేత అన్నం సతీష్‌ ప్రభాకర్‌ పుట్టిన­రోజు సందర్భంగా ఈ నెల 10న పాండురంగాపురం యాగంటి రిసార్ట్‌లో మందు పార్టీ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి సతీష్‌ అనుచరులు హాజరయ్యారు. అందరూ మద్యం తాగి తందనాలాడారు.

బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్రవర్మ సైతం ఆ పారీ్టకి హాజరయ్యారు. మద్యం మత్తులో అన్నం సతీష్‌ ప్రభాకర్‌ భీమ్లానాయక్‌ పాట పెట్టించుకుని డాన్స్‌ చేశారు. ఎమ్మెల్యే వేగేశన నరేంద్రవర్మ సైతం సతీష్‌తో కలిసి బెల్లీడాన్స్, తీన్మార్‌ స్టెప్పులు వేశారు. అంతటితో ఆగకుండా సతీష్‌ చేతిలోని మద్యం గ్లాసు అందుకుని గటగటా తాగేశారు. ఆ తరువాత సతీష్‌ బుగ్గలు నిమురుతూ ముద్దులతో ముంచెత్తారు.

ఎమ్మెల్యే విన్యాసాలను చూసిన అక్కడి వారు ఆయనకు కైపెక్కిందని గుసగుసలాడుకోగా.. వీడియో చూసిన జనం తాగితే తాగారు గానీ... ఎమ్మెల్యేగా ఉండి బుగ్గలు నిమరడాలు, ముద్దులు పెట్టడాలు ఏమిటంటూ చీదరించుకుంటున్నారు. మొత్తానికి టీడీపీ ఎమ్మెల్యే, బీజేపీ మాజీ ఎమ్మెల్సీ కైపుగోల సోషల్‌ మీడియాల్‌ యమ ట్రెండింగ్‌గా మారింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement