BAPATLA MLA
-
మందేసి చిందేసిన బాపట్ల ఎమ్మెల్యే
సాక్షి ప్రతినిధి, బాపట్ల: బాపట్ల టీడీపీ ఎమ్మెల్యే వేగేశన నరేంద్రవర్మ పీకలదాకా మద్యం తాగి చిందేశారు. కైపులో తీన్మార్ డాన్స్‌లు చేస్తూ, పార్టీ ఇచి్చన బీజేపీ నేతకు లిప్‌కిస్‌లు ఇచ్చి మరీ ఊగిపోయారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళితే.. మాజీ ఎమ్మెల్సీ, ప్రస్తుత బీజేపీ నేత అన్నం సతీష్ ప్రభాకర్ పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 10న పాండురంగాపురం యాగంటి రిసార్ట్‌లో మందు పార్టీ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి సతీష్ అనుచరులు హాజరయ్యారు. అందరూ మద్యం తాగి తందనాలాడారు.బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్రవర్మ సైతం ఆ పారీ్టకి హాజరయ్యారు. మద్యం మత్తులో అన్నం సతీష్ ప్రభాకర్ భీమ్లానాయక్ పాట పెట్టించుకుని డాన్స్ చేశారు. ఎమ్మెల్యే వేగేశన నరేంద్రవర్మ సైతం సతీష్‌తో కలిసి బెల్లీడాన్స్, తీన్మార్ స్టెప్పులు వేశారు. అంతటితో ఆగకుండా సతీష్ చేతిలోని మద్యం గ్లాసు అందుకుని గటగటా తాగేశారు. ఆ తరువాత సతీష్ బుగ్గలు నిమురుతూ ముద్దులతో ముంచెత్తారు.ఎమ్మెల్యే విన్యాసాలను చూసిన అక్కడి వారు ఆయనకు కైపెక్కిందని గుసగుసలాడుకోగా.. వీడియో చూసిన జనం తాగితే తాగారు గానీ... ఎమ్మెల్యేగా ఉండి బుగ్గలు నిమరడాలు, ముద్దులు పెట్టడాలు ఏమిటంటూ చీదరించుకుంటున్నారు. మొత్తానికి టీడీపీ ఎమ్మెల్యే, బీజేపీ మాజీ ఎమ్మెల్సీ కైపుగోల సోషల్ మీడియాల్ యమ ట్రెండింగ్‌గా మారింది. -
సంక్షేమ ఫలాలను సద్వినియోగం చేసుకోవాలి
–బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి సూచన –ఘనంగా సాగిన బ్రాహ్మణుల ఆత్మీయ సమ్మేళనం అనంతపురం కల్చరల్ : బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి సూచించారు. ఏపీ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య ఆధ్వర్యంలో ఆదివారం నగరంలో నిర్వహించిన 'బ్రాహ్మణ ఆత్మీయ సమ్మేళనం'లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ కార్పొరేషన్ అందిస్తున్న పథకాలన్నీ అందరూ సద్వినియోగం చేసుకోలేక పోవడంతో గతంలో విడుదలైన నిధుల్లో సగానికి పైగా మిగిలిపోయాయని విచారం వ్యక్తం చేశారు. కార్పొరేషన్ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన ఐవైఆర్ కృష్ణారావుకు అందరం రుణపడి ఉండాలన్నారు. ఒకప్పుడు జాతి మొత్తాన్ని ప్రభావితం చేసిన బ్రాహ్మణులు నిస్తేజం అవుతున్నారని, పూర్వ వైభవం కోసం పాటుపడాలన్నారు. మొత్తం 178 మంది ఎమ్మెల్యేలలో ఒకే ఒక్క బ్రాహ్మణ ఎమ్మెల్యే అని తనను అందరూ కొనియాడుతున్నా బ్రాహ్మణుల ఆధిపత్యం తగ్గిపోతున్నందుకు బాధగా ఉందన్నారు. ప్రస్తుతం బ్రాహ్మణ సంఘాల్లో ఆధిపత్య పోరు నడుస్తుండడం బాధాకరమన్నారు. త్వరలో గుంటూరు వేదికగా లక్షలాది మంది బ్రాహ్మణులతో బ్రాహ్మణ గర్జన నిర్వహిస్తామని అన్ని సంఘాల వారు ఒకే వేదికపైకి వచ్చేలా చూస్తామన్నారు. బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హెమ్మనూరు సుదర్శన శర్మ మాట్లాడుతూ ప్రస్తుతం బ్రాహ్మణ సమాజాన్ని అసభ్యకరంగా, అసహ్యకరంగా చిత్రీకరిస్తున్నారని, ఇటువంటి భావజాలాన్ని తీవ్రంగా ఖండించాలన్నారు. ఆ సంఘం రాష్ట్ర నాయకులు రాంజీ, రామరాజు, బలరామకృష్ణమూర్తి, బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్ శ్యామారావు, జిల్లా కో ఆర్డినేటర్ సూగూరు రఘునాథరావు, సోమశేఖర శర్మ, రవిప్రసాద్ తదితరులు మాట్లాడారు. కోన రఘుపతి దంపతులను ఘనంగా సన్మానించారు. వైఎస్సార్సీపీ నాయకులు రెడ్డివారి నాగరాజు, శ్యామసుందర శాస్త్రి తదితరులతో పాటు అనంతపురం, కర్నూలు, కడప జిల్లాల బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
'బాపట్ల ఆసుపత్రిలో పరిస్థితులు దారుణం'
హైదరాబాద్ : గుంటూరు జిల్లా బాపట్ల ఏరియా అసుపత్రిలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని స్థానిక ఎమ్మెల్యే కోన రఘుపతి ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం ఏపీ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో కోన రఘుపతి మాట్లాడుతూ... ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ సిబ్బందికి జీతాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఆసుపత్రి పరిసరాలు కూడా అపరిశుభ్రంగా ఉన్నాయన్నారు. వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోన రఘుపతి డిమాండ్ చేశారు. -
‘పార్టీలు మారటం నా రక్తం లోనే లేదు’
తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నానని బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి పేర్కొన్నారు. తుదిశ్వాస వరకు కాంగ్రెస్ పార్టీతోనే ఉన్న తన తండ్రి కోన ప్రభాకర్‌రావు మాదిరిగా తాను కూడా చివరి వరకు వైఎస్సార్ కాంగ్రెస్‌లోనే ఉండి పూర్తి స్థాయిలో సేవలందిస్తానని స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా బాపట్లలో ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ తాను రంగులు మార్చే రాజకీయ నాయకుడున్నికానని, పార్టీలు మారే సంస్కృతి తన రక్తంలోనే లేదని చెప్పారు. నియోజకవర్గ అభివృద్ధి పేరు చెప్పి కొందరు ఎమ్మెల్యేలు పార్టీని వీడి టీడీపీలో చేరటం దురదృష్టకరమని, పార్టీ మారకుండానూ ప్రజాసేవ చేయవచ్చని అభిప్రాయపడ్డారు. ఇటీవల కొందరు టీడీపీ నాయకులు తాను కూడా పార్టీ మారుతున్నట్లు అసత్య ప్రచారం చేస్తున్నారని, ఒకప్పడు రఘుపతి సేవలు తమ పార్టీకి అవసరం లేదని చెప్పిన పాలక పక్ష నే తలే ఇప్పుడు తనపై బురద చల్లడం ఎంత వరకు సబబో వారి విజ్ఞతకే వదలి వేస్తున్నానని చెప్పారు. ఎవరెన్ని కుయుక్తులు పన్నినా ఎమ్మెల్యేగా తనకు గుర్తింపునిచ్చిన వైఎస్ జగన్మోహన్రెడ్డి వెంటే తాను జీవితాంతం ఉంటానని స్పష్టం చేశారు.