‘పార్టీలు మారటం నా రక్తం లోనే లేదు’ | YSRCP MLA Kona Raghupathi Press Meet | Sakshi
Sakshi News home page

‘పార్టీలు మారటం నా రక్తం లోనే లేదు’

Published Thu, Mar 3 2016 8:23 PM | Last Updated on Fri, Aug 10 2018 8:16 PM

‘పార్టీలు మారటం నా రక్తం లోనే లేదు’ - Sakshi

‘పార్టీలు మారటం నా రక్తం లోనే లేదు’

తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నానని బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి పేర్కొన్నారు. తుదిశ్వాస వరకు కాంగ్రెస్ పార్టీతోనే ఉన్న తన తండ్రి కోన ప్రభాకర్‌రావు మాదిరిగా తాను కూడా చివరి వరకు వైఎస్సార్ కాంగ్రెస్‌లోనే ఉండి పూర్తి స్థాయిలో సేవలందిస్తానని స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా బాపట్లలో ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ తాను రంగులు మార్చే రాజకీయ నాయకుడున్నికానని, పార్టీలు మారే సంస్కృతి తన రక్తంలోనే లేదని చెప్పారు.

నియోజకవర్గ అభివృద్ధి పేరు చెప్పి కొందరు ఎమ్మెల్యేలు పార్టీని వీడి టీడీపీలో చేరటం దురదృష్టకరమని, పార్టీ మారకుండానూ ప్రజాసేవ చేయవచ్చని అభిప్రాయపడ్డారు. ఇటీవల కొందరు టీడీపీ నాయకులు తాను కూడా పార్టీ మారుతున్నట్లు అసత్య ప్రచారం చేస్తున్నారని, ఒకప్పడు రఘుపతి సేవలు తమ పార్టీకి అవసరం లేదని చెప్పిన పాలక పక్ష నే తలే ఇప్పుడు తనపై బురద చల్లడం ఎంత వరకు సబబో వారి విజ్ఞతకే వదలి వేస్తున్నానని చెప్పారు. ఎవరెన్ని కుయుక్తులు పన్నినా ఎమ్మెల్యేగా తనకు గుర్తింపునిచ్చిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వెంటే తాను జీవితాంతం ఉంటానని స్పష్టం చేశారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement