'బాపట్ల ఆసుపత్రిలో పరిస్థితులు దారుణం' | Lack of problems in Bapatla area hospital, says kona raghupathi | Sakshi
Sakshi News home page

'బాపట్ల ఆసుపత్రిలో పరిస్థితులు దారుణం'

Published Tue, Mar 8 2016 11:27 AM | Last Updated on Sat, Aug 18 2018 5:15 PM

Lack of problems in Bapatla area hospital, says kona raghupathi

హైదరాబాద్ : గుంటూరు జిల్లా బాపట్ల ఏరియా అసుపత్రిలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని స్థానిక ఎమ్మెల్యే కోన రఘుపతి ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం ఏపీ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో కోన రఘుపతి మాట్లాడుతూ... ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ సిబ్బందికి జీతాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఆసుపత్రి పరిసరాలు కూడా అపరిశుభ్రంగా ఉన్నాయన్నారు. వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోన రఘుపతి డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement