Kona Raghupathi
-
పేదల ఇళ్లను కూడా వదల్లేదు.. చంద్రబాబు మరో కుట్ర
-
కూటమి ప్రభుత్వం అన్ని వర్గాలను వంచిస్తోంది
-
చరిత్రలో నిలిచిపోయేలా సిద్ధం ముగింపు సభ
-
ఏపీ సీఎంగా ఎప్పటికీ జగనే ఉండాలంటున్న అంబేద్కర్ అభిమానులు
-
నీ చరిత్ర అందరికీ తెలుసు..కోన రఘుపతి ఫైర్
-
రేపు బాపట్లలో సామాజిక సాధికార బస్సు యాత్ర
-
మా నమ్మకం నువ్వే జగన్ అంటూ ప్రజల నినాదాలు
-
తప్పుడుదారిలో స్థలాలు తీసుకోవటం చంద్రబాబుకే చెల్లింది
బాపట్ల: తప్పుడుదారిలో స్థలాలను తీసుకోవటం, సుప్రీంకోర్టు స్టేలో ఉన్న స్థలంలో సైతం పార్టీ కార్యాలయాలు నిర్మించుకోవటం, దళితులు నివసిస్తున్న భూములను లాక్కుని పార్టీ కార్యాలయం నిర్మించడం చంద్రబాబునాయుడుకే చెల్లుతుందని ఎంపీ, వైఎస్సార్సీపీ బాపట్ల జిల్లా అధ్యక్షుడు మోపిదేవి వెంకటరమణారావు ధ్వజమెత్తారు. వాటిని దగ్గరుండి ప్రోత్సహించే ఈనాడు రామోజీరావు కళ్లకు ఆనాడు ఆ తప్పుడు పనులే కనిపించలేదని ఎద్దేవా చేశారు. బాపట్లలో మంగళవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబునాయుడు అధికారంలో ఉన్నప్పుడు పార్టీ కార్యాలయాలకు స్థలాలను కేటాయించే విధంగా 21–02–2016వ తేదీన జీవో నంబరు 340 ఇచ్చారని గుర్తుచేశారు. ఆ జీవోకు అనుగుణంగా బాపట్లలోని పరిశ్రమలశాఖ నుంచి ఆర్టీసీకి కేటాయించగా వారు నిరుపయోగంగా ఉంచటంతో పలుసార్లు నోటీసులు ఇచ్చి స్వాధీనం చేసుకున్న స్థలాన్ని మాత్రమే కేటాయించమని కోరినట్లు చెప్పారు. ఈ మేరకు పరిశ్రమలశాఖ, రెవెన్యూశాఖ స్వాధీనం చేసుకున్న భూమిని పార్టీ కార్యాలయానికి కేటాయిస్తూ క్యాబినెట్ తీర్మానం చేసిన తరువాతే స్వాధీనం చేసుకుని పార్టీ కార్యాలయానికి శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. చంద్రబాబునాయుడు 1997లో జూబ్లీహిల్స్‌లో కోట్లాది రూపాయల విలువైన స్థలాన్ని ఎన్టీఆర్ భవన్ పేరుతో అద్దెకు తీసుకుని ఆయన్ని పరలోకానికి పంపి ఆభూమిని అన్యాక్రాంతం చేశారని గుర్తుచేశారు. మంగళగిరిలో జాతీయరహదారి పక్కనే కోట్లాది రూపాయిల విలువైన భూమిని పార్టీ కార్యాలయానికి కేటాయించుకోగా సుప్రీంకోర్టు కూడా స్టే ఇచ్చిందని చెప్పారు. స్టేని సైతం లెక్కచేయకుండా చంద్రబాబు పార్టీ కార్యాలయం నిర్మించుకున్న విషయం రామోజీరావుకు కనిపించలేదా అని ప్రశ్నించారు. గుంటూరులో విలువైన పిచ్చుకులకుంటలో 1,500 గజాలకు మరో 100 గజాలు ఆక్రమించుకుని పార్టీ కార్యాలయం నిర్మించడం, శ్రీకాకుళంలో దళితుల భూములను లాక్కుని పార్టీ కార్యాలయం నిర్మించడం, విశాఖపట్నంలో 2,500 గజాల విలువైన భూమి స్వాధీనం వంటివి ఈనాడుకు కనిపించలేదా అని ప్రశ్నించారు. మార్గదర్శి చిట్‌ఫండ్ కంపెనీపై సీబీసీఐడీ విచారణ జరుగుతుంటే విచారణకు ఎందుకు సహకరించలేదని నిలదీశారు. రికార్డుల్లో తప్పులుండటం వల్లనే సీబీసీఐడీకి రికార్డులు చూపించటంలేదని చెప్పారు. ఇప్పటికైనా నిబంధనలకు విరుద్ధంగా ఏంజరుగుతుందో గమనించి మాట్లాడాలని ఆయన సూచించారు. ఈ సమావేశంలో బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి, వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షుడు నరాలశెట్టి ప్రకాశరావు, నాయకుడు చేజర్ల నారాయణరెడ్డి పాల్గొన్నారు. -
వైఎస్ఆర్ ఆశయాలను సీఎం జగన్ నెరవేర్చుతున్నారు : ఎమ్మెల్యే కోన రఘపతి
-
Kona Raghupathi: డిప్యూటీ స్పీకర్‌గా కోన రఘుపతి రాజీనామా
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్‌గా కోన రఘుపతి రాజీనామా చేశారు. స్పీకర్ తమ్మినేని సీతారాం ఆయన రాజీనామాను ఆమోదించారు. సోమవారం కొత్త డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరిగే అవకాశం ఉంది. చదవండి: (అశ్వనీదత్, రాఘవేంద్రరావు కోరుకున్న చోట భూములు: కొడాలి నాని) -
జగన్‌కు వ్యతిరేకంగా పోస్టులు పెట్టాలంటూ యువకుడికి వేధింపులు
సాక్షి, బాపట్ల: సోషల్ మీడియాలో ప్రభుత్వానికి, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి, డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతికి వ్యతిరేకంగా ఓ యువకుడితో పోస్టింగ్‌లు పెట్టించేందుకు బాపట్ల టీడీపీ నేతలు పన్నిన కుట్ర వెలుగులోకి వచ్చింది. టీడీపీ నేతల వేధింపులు తట్టుకోలేక ఆ యువకుడు సోమవారం పోలీస్ స్పందన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ వకుల్‌జిందాల్‌కు ఫిర్యాదు చేశాడు. బాపట్ల టీడీపీ ఇన్చార్జి వేగేశన నరేంద్రవర్మ తన అనుచరులను ఇంటికి పంపి వేధిస్తున్నాడని, నరేంద్రవర్మ ద్వారా తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఫిర్యాదులో వివరాల మేరకు.. ఎంటెక్ చదివిన ధనేంద్రను టీడీపీ టీఎన్ఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శిగా నియమించింది. నరేంద్రవర్మ మాత్రం ధనేంద్రను వ్యక్తిగత సహాయకుడిగా నియమించుకున్నాడు. ప్రభుత్వం, సీఎం వైఎస్ జగన్, స్థానిక ఎమ్మెల్యే కోన రఘుపతికి వ్యతిరేకంగా, అసభ్యకరంగా సోషల్ మీడియాలో పోస్టింగ్‌లు పెట్టాలని ధనేంద్రను నరేంద్రవర్మ నిత్యం వేధించేవాడు. నవరత్నాల లాంటి పథకాలతో పేదలకు న్యాయం చేస్తున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టింగ్‌లు పెట్టలేనని ధనేంద్ర చెప్పడంతో ఆగ్రహించిన నరేంద్రవర్మ అతని ఉద్యోగం పీకేసి ఇంటికి పంపించాడు. ధనేంద్రను ఇటీవల మరోసారి పిలిపించి ఇప్పటికైనా పోస్టింగ్‌లు పెట్టాలంటూ వేధించాడు. అందుకు ససేమిరా అనడంతో నరేంద్రవర్మ తన అనుచరులను ఇంటికి పంపి నిత్యం వేధిస్తున్నాడని బాధితుడు వాపోయాడు. నరేంద్రవర్మ నుంచి కాపాడాలని ఫిర్యాదులో ఎస్పీని వేడుకున్నాడు. -
'ఎన్నో దేవాలయాలు కూలగొట్టిన ఘనత వాళ్లది.. నిర్మించిన ఘనత మాది'
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హిందూ ధర్మాన్ని కాపాడటానికి కృషి చేస్తున్నారని డిప్యూటీ స్పీకర్, బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి అన్నారు. పదేళ్ల తర్వాత రాష్ట్రంలో ధార్మిక పరిషత్ ఏర్పాటైందని తెలిపారు. గతంలో ధార్మిక పరిషత్ ఏర్పాటులో నిర్లక్ష్యం చేయడంతో పాటు తక్కువ చేసి మాట్లాడారన్నారు. వినాయక చవితి సందర్భంగా వారం రోజులుగా ప్రతిపక్షాలు పనికట్టుకుని ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కనీసం ధార్మిక పరిషత్ ఏర్పాటు చేయలేని చంద్రబాబు, బీజేపీ ఈ రోజు చవితి గురించి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ''హిందూ ధర్మాన్ని పాటిస్తూ ఎన్నిసార్లు ఆ ధర్మాన్ని ఎన్నిసార్లు అవహేళన చేసారో గుర్తు తెచ్చుకోవాలన్నారు. బూట్లు వేసుకుని పూజలు చేసిన వ్యక్తి కూడా ఈ రోజు విమర్శలు చేస్తున్నాడు. వచ్చే ఎన్నికల్లో ఆ 23 స్థానాలు కూడా దక్కించుకోవడం కష్టమనే ఆవేదనలో చంద్రబాబు ఉన్నాడు. బీజేపీ, జనసేన, టీడీపీలు తస్మాత్ జాగ్రత్త. బీజేపీలో టీడీపీ బీజేపీ, బీజేపీ అనే రెండు వర్గాలు ఉన్నాయి. పవన్ చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్ చదవడం మానేస్తేనే భవిష్యత్తు ఉంటుంది. అప్పటి వరకు పవన్‌ని ప్రజలు నమ్మరు.. గౌరవించరు. ఎన్నో దేవాలయాలను కూలగొట్టిన ఘనత వాళ్లదైతే మా నాయకుడు నిర్మాణాలు చేస్తున్నారు. వినాయక చవితిపై ఎటువంటి ఆంక్షలు లేవని ప్రజలు గమనించాలని'' కోరారు. చదవండి: (Kuppam: కుప్పంలో టీడీపీ మరో డ్రామా) 'మొదటి నుంచీ ఉత్సవ కమిటీలు, స్థానిక పోలీసులు సమన్వయంతో పనిచేస్తున్నాయి. నీతిమాలిన, దిగజారి పోయిన చంద్రబాబు ఆలోచనలు ఏ స్థాయికైనా వెళ్లొచ్చు.. జాగ్రత్తగా ఉండండి. ఎక్కడా అపశృతి జరగకూడదు అని పోలీస్ శాఖ వివరాలు కోరుతుంది. ఇది మొదటి నుంచి జరుగుతూనే ఉంది.. కొత్త విషయం కాదు. కనీస విద్యుత్ చార్జీని రూ.1000 నుంచి సీఎం రూ.500కి తగ్గించారు. అయినా సరే అవేమీ పట్టనట్లు రాజకీయ కోణంలో విమర్శలు చేస్తున్నారు. ఒక సున్నితమైన అంశాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తే ప్రజలే రానున్న రోజుల్లో బుద్ది చెప్తారని' ఎమ్మెల్యే కోన రఘుపతి హెచ్చరించారు. చదవండి: (ప్రత్యామ్నాయాలపై కేంద్రం చెప్పడం లేదు) -
తాబేళ్ల పిల్లలను సముద్రంలోకి వదిలిన డిప్యూటీ స్పీకర్ సతీమణి
సాక్షి, బాపట్ల: బాపట్ల జిల్లా సూర్యలంక సముద్ర తీరంలో తాబేళ్ల సంరక్షణకు చర్యలు చేపట్టారు. తాబేళ్లను సంరక్షించడం ద్వారా పునరుత్పత్తి కేంద్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకునే అవకాశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. ఆలీవ్ రిడ్లే సముద్రపు తాబేళ్ల పిల్లలను డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి సతీమణి రమాదేవి సముద్రంలోకి శుక్రవారం వదిలారు. జల కాలుష్యం నివారణలో తాబేళ్లు ప్రముఖ పాత్ర పోషిస్తాయని కోన రమాదేవి పేర్కొన్నారు. తాబేళ్ల గుడ్ల సేకరణ, సంరక్షణ, వాటి పునరుత్పత్తి కేంద్రాన్ని బాపట్ల సూర్యలంకలో రాష్ట్ర అటవీ శాఖ ఏలూరు జోన్ అవనిగడ్డ అటవీ రేంజ్ అధికారులు ఇక్కడ ఏర్పాటు చేశారు. చదవండి: (ప్రతి గ్రామానికీ గుడి, బడి, ఆసుపత్రి అవసరం: ఆర్.నారాయణమూర్తి) -
బాంబుల హోరుతో భయం భయంగా..విద్యార్థులు
సాక్షి, నెట్వర్క్ : ఉక్రెయిన్‌లో మూడో రోజూ రష్యా దాడులు కొనసాగుతుండడం.. యుద్ధం తగ్గుముఖం పట్టే సూచనలు కనిపించకపోవడంతో అక్కడ చదువుకుంటున్న తెలుగు విద్యార్థులు బాంబుల హోరుతో బెంబేలెత్తుతున్నారు. రాజధాని కీవ్‌లో చిత్తూరు జిల్లా బి.కొత్తకోటకు చెందిన వైద్య విద్యార్థిని సాయినిఖిత ఉంటున్న అపార్ట్మెంటుకు కిలోమీటర్ దూరంలో శుక్రవారం రాత్రి బాంబులు పడటంతో అక్కడ వారంతా భయంకంపితులయ్యారు. బాంబులు పడిన ప్రాంతమంతా భీకర శబ్దాలతో దద్దరిల్లిందని శనివారం ఆమె ‘సాక్షి’తో మాట్లాడుతూ చెప్పింది. రాత్రంతా బాంబుల శబ్దాలతో నిద్రపోలేదని చెప్పింది. కానీ, శనివారం ఉదయం నుంచీ కర్ఫ్యూ వాతావరణం నెలకొందని వివరించింది. ఎక్కడి వారు అక్కడే ఉండాలంటూ వాట్సప్ గ్రూపులో మెసేజ్‌లు వస్తున్నాయని అక్కడి పరిస్థితిని నిఖిత వివరించింది. వాహనాలు లేనందున ఎక్కడికీ కదల్లేని పరిస్థితని చెప్పింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఉక్రెయిన్ సరిహద్దులకు వెళ్లడం కూడా అంత శ్రేయస్కరం కాదని హెచ్చరించడంతో తామంతా కీవ్‌లోని అపార్ట్మెంట్లోనే ఉండిపోయామని తెలిపింది. రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి ఫోన్లో మాట్లాడి దైర్యం చెప్పారని, ఆయన సిబ్బంది తరచూ మాట్లాడుతున్నారని చెప్పింది. అలాగే, బి.కొత్తకోట శెట్టిపల్లె రోడ్డులో ఉంటున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు రామకృష్ణ కూడా తన కుమారుడు ఎస్. చైతన్య కోసం ఆందోళన చెందుతున్నారు. అయితే శనివారం సాయంత్రం చైతన్య సహా పలువురు విద్యార్థులు బస్సులో రుమేనియా దేశానికి బయలుదేరారు. అక్కడినుంచి ప్రత్యేక విమానంలో ముంబై కాని, ఢిల్లీకాని చేరుకుంటారు. బస్సుల కొరతతో విడతల వారీగా.. ఇక భారత్ ఎంబసీ ఏర్పాటుచేసిన ప్రత్యేక బస్సులో రుమేనియాకు బయల్దేరామని ప్రకాశం జిల్లా కురిచేడు మండలం పడమర వీరాయపాలెంకు చెందిన మోతుకూరు నాగప్రణవ్ తెలిపాడు. శనివారం మధ్యాహ్నం ప్రణవ్ తల్లిదండ్రులకు ఫోన్ చేశాడు. బస్సులో రుమేనియాకు చేరుకునేందుకు ఒకటిన్నర రోజు పడుతుందని, అక్కడ నుంచి స్వదేశానికి వస్తామని తెలిపాడు. ఇక్కడ ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన 70 మంది విద్యార్థులు ఉన్నారని, ప్రస్తుతం 30 మంది బస్సులో రుమేనియా బయలుదేరామని తెలిపాడు. మరో 20 మంది రాత్రికి, మిగతా 20 మంది రేపు బయల్దేరుతారన్నాడు. బస్సుల కొరత కారణంగా విడతల వారీగా రుమేనియాకు వెళ్లాల్సి వస్తోందని ప్రణవ్ ‘సాక్షి’కి వివరించాడు. మరోవైపు.. విమానాలు లేక దాచేపల్లికి చెందిన కటకం మురళీకృష్ణ, లక్ష్మీ దంపతుల కుమార్తె రమ్యశ్రీ అక్కడే ఉండిపోవాల్సిన పరిస్థితి. విమానం టికెట్లు బుక్ చేసుకున్నప్పటికీ ఉపయోగం లేకుండాపోయిందని వారు ఆవేదన వ్యక్తంచేశారు. ఎయిర్‌పోర్టుకు సమీపంలో ఉన్న మరో యూనివర్సిటీకి రమ్యశ్రీతో పాటు మరికొంతమంది విద్యార్థులను అక్కడి అధికారులు తరలించారు. భయపడొద్దు..మేమందరం ఉన్నాం : కోన రఘుపతి ‘ఉక్రెయిన్ నుంచి ప్రతి ఒక్కరినీ క్షేమంగా తీసుకువచ్చేందుకు సీఎం జగన్ సిద్ధంగా ఉన్నారు.. భయపడొద్దు..మేమందరం ఉన్నాం’.. అంటూ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి ఉక్రెయిన్‌లో ఉన్న నోషితకు, ఇక్కడ ఆమె తల్లిదండ్రులు శ్రీదేవి, శ్రీనివాసరావుకు ధైర్యం చెప్పారు. వీడియోకాల్‌లో నోషితతో మాట్లాడిన అనంతరం ఆయన టాస్క్‌ఫోర్స్ కమిటీతో ఉక్రెయిన్‌లోని పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అలాగే, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చొరవతో ప్రత్యేక విమానాల్లో విద్యార్థులను స్వదేశానికి తీసుకువచ్చే ఏర్పాట్లు జరుగుతున్నాయని, అధైర్య పడొద్దని అమలాపురం ఎంపీ అనురాధ తూర్పుగోదావరి జిల్లా ఉప్పలగుప్తం మండలం విలసవల్లికి చెందిన సలాది గంగా భవాని (భవ్య)కు శనివారం వీడియో కాల్చేసి మాట్లాడారు. భవ్యతో పాటు 20 మంది విద్యార్థులు బంకర్లో ఉన్నారు. -
'సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు'
-
'సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు'
సాక్షి, గుంటూరు: బ్రాహ్మణ కార్పొరేషన్‌ను బీసీ కార్పొరేషన్లో చేర్చడంపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి అన్నారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. బ్రాహ్మణులను బీసీలలో చేరుస్తున్నారంటూ వస్తున్న పుకార్లు ఎవరూ నమ్మెద్దు. బీసీ కార్పొరేషన్ ద్వారానే గతంలో బ్రాహ్మణ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేశారు. ఏ లక్ష్యంతో, ఏ ఉద్దేశ్యంతో అయితే కార్పొరేషన్‌ను ఏర్పాటు చేశారో ఆ విధంగానే బ్రాహ్మణ కార్పొరేషన్ పనిచేస్తుంది. పథకాల నిర్వహణ మాత్రమే బీసీ కార్పొరేషన్ పర్యవేక్షణ చేస్తుంది. బ్రాహ్మణ కార్పొరేషన్‌పై రాజకీయ పరంగా విమర్శలు చేయడం తగదు. నవరత్నాల ద్వారా పేద బ్రాహ్మణులకు అన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం. నవరత్నాల్లో లేని పథకాలను బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా అందిస్తాం. అవగాహన లేని వారే సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నూతన జిల్లాల ఏర్పాటు కొనసాగుతోంది. సీఎం చెప్పిన తర్వాత కచ్చితంగా అమలవుతాయి. జనగణన వలన కొంత జాప్యం అవుతుంది. వచ్చే సాధారణ బడ్జెట్‌లోపే జిల్లాల ఏర్పాటు ఉండొచ్చు' అని మంత్రి తెలిపారు. -
బాపట్ల కేంద్రంగా భావపురి జిల్లా
బాపట్ల: ‘బాపట్ల కేంద్రంగా భావపురి జిల్లాను తీసుకువస్తా.... అభివృద్ధి అంటే ఏమిటో రెండేళ్ళులోనే చేసిచూపించాం... ఇంకా అభివృద్ధే ధ్యేయంగా ముందుకుపోతాం....ప్రజల హృదయాల్లో కోన కుటుంబానికి చెరగనిముద్ర ఉంది...ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశయాలకు అనుగుణంగా ప్రజల కన్నీటి కష్టాలు తీర్చేటమే తుదిశ్వాసగా నిలుస్తానంటూ.. డెప్యూటీ స్పీకర్ కోన రఘుపతి పేర్కొన్నారు. మంగళవారం తన నివాసంలో పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్నారు. పార్టీ నాయకులు,అధికారులు, ప్రజలు,కార్యకర్తలు శుభాకాంక్షలు తెలియజేసేందుకు పోటీలుపడ్డారు. కోన నివాసం నుంచి డెప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, ఆయన సతీమణి రమాదేవిని గుర్రపుబండిపై ఊరేగించారు. స్థానిక రధంబజారులో 700 కిలోల భారీ కేక్‌ను కోన రఘుపతి కట్ చేసిన అనంతరం మాట్లాడుతూ.. బాపట్ల ప్రాంతాన్ని టెంపుల్‌టౌన్‌గా అభివృద్ధి చేసి తీరుతామని చెప్పారు. పర్యాటక అభివృద్ధితోపాటు ప్రతి సమస్యను తన భుజంపై వేసుకుని పరిష్కారిస్తున్నానని చెప్పారు. కార్యక్రమాల్లో వైఎస్సార్ సీపీ పట్టణ, మండల అధ్యక్షులు నరాలశెట్టి ప్రకాశరరావు, కోకి రాఘవరెడ్డి, విన్నకోట సురేశ్ ఫ్రెండ్స్ సర్కిల్ విన్నకోట సురేశ్, మున్సిపల్ కమిషనర్ ఏ భానుప్రతాప్, డీఎస్పీ ఏ శ్రీనివాసరావు, ఎంపీడీఓ రాధాకృష్ణ, మార్కెట్‌యార్డు చైర్మన్ గవిని కృష్ణమూర్తి, నాయకులు షేక్.బాజీ, ఎస్.నారాయణరావు, ఇ.విజయశాంతి, పి.శ్రీనివాసరావు పాల్గొన్నారు. కర్లపాలెం: ఏపీ శాసనసభ ఉప సభాపతి కోన రఘుపతి జన్మదిన వేడుకలు మంగళవారం మండల పరిధిలోని పలు గ్రామాలలో వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. కర్లపాలెంలో జరిగిన కోన జన్మదిన వేడుకలలో వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ దొంతిబోయిన సీతారామిరెడ్డి పాల్గొని కేక్ కట్‌చేసి కార్యకర్తలకు తినిపించారు. దుండివారిపాలెంలో సర్పంచ్ పులుగు గోవిందమ్మ మునిరెడ్డి రామాలయం వద్ద ఉన్న వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కోన రఘుపతి జన్మదిన కేక్‌ను కట్‌చేసి కార్యకర్తలకు పంచారు. చింతాయపాలెం, పేరలి, యాజలి గ్రామాలలోని కార్యకర్తలు కోన రఘుపతి జన్మదిన కార్యక్రమాలు జరిగాయి. -
ఢిల్లీ పర్యటనలో ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి
-
‘ఏపీలో పర్యాటక అభివృద్ధికి కృషి చేయాలని కిషన్‌రెడ్డిని కోరా’
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి ఢిల్లీలో పర్యటనలో భాగంగా శనివారం కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, పరాస్ పాశ్వాన్‌ను కలిశారు. మంత్రులతో భేటీ అనంతరం కోనరఘుపతి మీడియాతో మాట్లాడుతూ.. విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ 74శాతం వ్యవసాయంపై ఆధారపడిందని తెలిపారు. ఫుడ్ ప్రాసెసింగ్ మినిస్ట్రీ పథకాలను కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. ఏపీలో పర్యాటక అభివృద్ధికి కృషి చేయాలని కిషన్‌రెడ్డిని కోరినట్లు ఆయన పేర్కొన్నారు. భవిష్యత్‌లో ఏపీ టూరిజం హబ్‌గా మారబోతుందని కోన రఘుపతి చెప్పారు. -
జవాన్ జశ్వంత్‌రెడ్డి కుటుంబానికి రూ.50 లక్షల చెక్కు అందజేత
సాక్షి, గుంటూరు: జమ్మూకశ్మీర్ సరిహద్దుల్లో జరిగిన ఎదురు కాల్పుల్లో వీరమరణం పొందిన జవాన్ జశ్వంత్‌రెడ్డి భౌతికకాయం వద్ద ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, హోంమంత్రి మేకతోటి సుచరిత, కలెక్టర్ వివేక్ యాదవ్ నివాళులు అర్పించారు. అనంతరం జవాన్ జస్వంత్‌రెడ్డి కుటుంబానికి రూ. 50 లక్షల చెక్కును హోంమంత్రి మేకతోటి సుచరిత, డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి అందించారు. తర్వాత హోంమంత్రి మేకతోటి సుచరిత మీడియాతో మాట్లాడుతూ.. జస్వంత్‌రెడ్డి యువతకు స్ఫూర్తిదాయకమని, అతి చిన్న వయసులోనే అతను మరణించటం బాధాకరమన్నారు. దేశ రక్షణ కోసం తన ప్రాణాలు కోల్పోయిన జస్వంత్ త్యాగం మరువ లేనిదని కొనియాడారు. దేశం కోసం బిడ్డ ప్రాణాలు ఇచ్చిన అతని తల్లిదండ్రుల జన్మ చరితార్థమని, ఆ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. జస్వంత్ వంటి సైనికుల బలిదానాల వల్లే మనం క్షేమంగా ఉన్నామని, ముఖ్యమంత్రి సీఎం జగన్ ప్రకటించిన రూ. 50 లక్షల ఆర్థిక సహాయానికి సంబంధించిన చెక్కులను కుటుంబ సభ్యులకు అందించామని పేర్కొన్నారు. జశ్వంత్ రెడ్డి తల్లిదండ్రులు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం అడుగుతున్నారని, దానిపై సీఎం దృష్టికి తీసుకెళతామని తెలిపారు. డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి మాట్లాడుతూ.. చిన్న వయసులోనే దేశం కోసం ప్రాణాలర్పించిన జస్వంత్ రెడ్డి అందరికీ స్ఫూర్తిదాయకమని, అతని కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని తెలిపారు. వీర జవాన్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని, దేశం కోసం జస్వంత్ రెడ్డి ప్రాణాలు అర్పించడం గర్వంగా ఉందదని తెలిపారు. గుంటూరు జిల్లా బాపట్లలోని కొత్తపాలెం స్మశానవాటికలో జశ్వంత్ రెడ్డి అంత్యక్రియలు అధికారిక సైనిక లాంఛనాలతో పూర్తి అయ్యాయి. -
పింగళి వెంకయ్య విగ్రహాలు అరుదుగా కనిపిస్తాయి : కోన రఘుపతి
-
బండ్లమ్మ తల్లికి బంగారు శోభ
సాక్షి, పిట్టలవానిపాలెం (బాపట్ల): మండలంలోని చందోలులో ఉన్న బగళాముఖి బండ్లమ్మ అమ్మ వారి కొలుపులను శుక్రవారం వైభవంగా నిర్వహించారు. అమ్మవారిని బంగారు ఆభరణాలతో అలంకరించారు. అమ్మవారి ముఖ మండప నిర్మాణం సమయంలో లభ్యమైన బంగారు ఆభరణాలను చందోలు ఎస్బీఐ శాఖ లాకరు నుంచి అధికారుల సమక్షంలో కనక తప్పెట్లు, బ్యాండు మేళాల నడుమ శాసన సభ డెప్యూటీ స్పీకర్ కోన రఘుపతి దంపతులు ఆలయానికి తీసుకొచ్చి అమ్మవారికి అలంకరించారు. దేవ దాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, కోన రఘుపతి బండ్లమ్మకు భక్తుల సహకారంతో సిద్ధం చేసిన బంగారు కాసుల హారాన్ని అలంకరించారు. దేవదాయ శాఖ డెప్యూటీ కమిషనర్ జి.చంద్రశేఖర్‌రెడ్డి, సహాయ కమిషనర్ మహేశ్వరరెడ్డి, బాపట్ల ఏఎంసీ వైస్ చైర్మన్ ఉయ్యూరి లీలాశ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ప్రజా ద్రోహులను వదిలిపెట్టం పొన్నూరు: ప్రజల సొమ్ము దోచుకున్న ద్రోహులను వదిలిపెట్టేది లేదని దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. పొన్నూరు వీరాంజనేయస్వామి ఆలయాన్ని ఆయన శుక్రవారం దర్శించుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కరోనా సమయంలోనూ ఎన్నో సంక్షేమ పథకాలు అందిస్తున్నారని పేర్కొన్నారు. టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్రకుమార్ సంగం డెయిరీలో అవినీతి చేశారని, అందుకే ఏసీబీ అధికారులు అరెస్టు చేశారని అన్నారు. టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, ఉమా, చంద్రబాబు నాయుడు చేసిన అవినీతి వ్యవహారాలు ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయని పేర్కొన్నారు. ప్రజల రక్తాన్ని తాగిన ఉమా, అచ్చెన్నాయుడు, చంద్రబాబుకు బుద్ధి చెప్పక తప్పదన్నారు. రాష్ట్రంలో పాల డెయి రీలను నాశనం చేసిన ఘనత టీడీపీ నాయకులదేనని గుర్తుచేశారు. గతంలో చంద్రబాబు హెరిటేజ్ పాల డెయిరీ కోసం ఎన్నో ప్రభుత్వ డెయిరీలను నాశనం చేశారని మండిపడ్డారు. చదవండి: 1,000 పడకలతో కోవిడ్ కేర్ సెంటర్ -
ఊరూరా తిరుగుతూ కరోనాపై అవగాహన
-
‘పనుల గురించి తెలుసుకోవాలనే ఇవాళ వచ్చాను’
సాక్షి, పశ్చిమ గోదావరి : పోలవరం ప్రాజెక్టు నిర్మాణం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అందించిన వరం అని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి అన్నారు. ఎంతో మంది ముఖ్యమంత్రులు పోలవరం ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసినా.. పోలవరం ప్రాజెక్టును ప్రారంభించింది మాత్రం రాజశేఖర్ రెడ్డి అని పేర్కొన్నారు. పోలవరం సందర్శనకు ఆదివారం డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముందుచూపుతో కాల్వలను తవ్వించడం ద్వారా పోలవరం పనులు ముందుకు సాగుతున్నాయని తెలిపారు. ప్రాజెక్ట్ లేకుండా కాలువలు తవ్వుతున్నారని అప్పట్లో ప్రతిపక్షాలు ఎద్దేవా చేశారని, కానీ ఆ కాలువల ద్వారానే ఇప్పుడు నీరు తరలించడం జరుగుతుందన్నారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తున్నారని కొంతమంది వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. చదవండి: పోలవరం నిర్మాణంలో కీలక ఘట్టం పోలవరం ప్రాజెక్టు డిజైన్ ప్రకారమే పనులు జరుగుతున్నాయని డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి అన్నారు. అంతే తప్ప ఏ ఒక్క అంగుళం ఎత్తు తగ్గించడం లేదని స్పష్టం చేశారు. అప్పట్లోనే సేకరణ చేయడం వల్ల ఇప్పుడు కర్చు తగ్గిందని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. పోలవరం పనులు గురించి తెలుసుకోవాలనే ఇవాళ పోలవరం ప్రాజెక్టు సందర్శనకు వచ్చానన్నారు. అనుకున్న ప్రకారం ప్రభుత్వం పోలవరం పూర్తి చేస్తుందని పూర్తి నమ్మకంతో ఉన్నట్లు పేర్కొన్నారు. -
'విశాఖ చరిత్రలో ఆ కుటుంబానికి ఓ పేజీ'
సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే, విశాఖ మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (వీఎంఆర్డీఏ) మాజీ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్‌కు రాష్ట్ర మంత్రులు, పలు పార్టీల నాయకులు సోమవారం ఘన నివాళులు అర్పించారు. డాక్టర్స్ కాలనీలో ద్రోణంరాజు శ్రీనివాస్ భౌతిక కాయాన్నిసందర్శించి పార్టీలకతీతంగా నివాళులు అర్పించారు. విశాఖ అభివృద్ధిలో ద్రోణంరాజు శ్రీనివాస్ చెరగని ముద్ర వేశారని, ఆయన మరణం పార్టీకీ తీరని లోటని వైస్సార్సీపీ నేతలు పేర్కొన్నారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు ద్రోణంరాజుతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. వైజాగ్ అభివృద్ధికి పరితపించే వాడు: కోన రఘుపతి, డిప్యూటీ స్పీకర్ ‘నాకు ద్రోణంరాజు శ్రీనివాస్ మంచి స్నేహితుడు. వైజాగ్ అభివృద్ధిలో కీలక భాగస్వామి అయ్యారు. వైజాగ్ అభివృద్ధి కోసమే శ్రీనివాస్ పరితపించే వాడు. ద్రోణంరాజు మరణం విశాఖపట్నానికి తీరని లోటు. ఆయన ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరించేవారు. భగవంతుడు చాలా త్వరగా ద్రోణంరాజు శ్రీనివాస్‌ను తీసుకెళ్లిపోయారు. ద్రోణంరాజు శ్రీనివాస్ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించమని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పారు. తన మామ గారు చనిపోవడంతో ద్రోణంరాజు అంత్యక్రియలకు రాలేకపోతున్నానని సీఎం జగన్ తెలిపార’ని డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి తెలిపారు. (విశోక సంద్రం.. నగరం మదిలో ద్రోణం'రాజే') అత్యంత విషాద కరమైన రోజు: అవంతి ‘ఈ రోజు అత్యంత విషాద కరమైన రోజు. ద్రోణంరాజు శ్రీనివాస్ నాకు అత్యంత ఆప్తుడు. ఆయన అకాల మరణం నన్ను ఎంతో బాధించింది. పేదల కోసం ఆయన ఎంతో శ్రమించారు. ద్రోణంరాజు విలువలతో కూడిన రాజకీయాలు చేశార’ని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. విశాఖ అభివృద్ధిలో వారిది కీలక పాత్ర: వాసుపల్లి గణేష్ ‘ద్రోణం రాజు మరణాన్ని విశాఖ ప్రజలు జీర్ణించుకోలేక పోతున్నారు. విశాఖ అభివృద్ధిలో ద్రోణంరాజు సత్యనారాయణ ఆయన కుమారుడు శ్రీనివాస్ కీలక పాత్ర పోషించారు. విశాఖ చరిత్రలో ఒక పేజీ వాళ్ళ కుటుంబానికి ఉంటుంద’ని ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్ అన్నారు. (ద్రోణంరాజు శ్రీనివాస్‌కు నివాళులు) ఉత్తరాంధ్ర అభివృద్ధిలో ఓ ల్యాండ్ మార్క్: పాడేరు ఎమ్మెల్యే కొట్టగుల్లి భాగ్యలక్ష్మి ‘గిరిజన ప్రాంత ప్రజలతో ద్రోణంరాజు కుటుంబానికి ఎంతో అనుబంధం ఉంది. ద్రోణంరాజు సత్యనారాయణ, ద్రోణంరాజు శ్రీనివాస్‌లు ఉత్తరాంధ్ర అభివృద్ధిలో ఓ ల్యాండ్ మార్క్’ అని పాడేరు ఎమ్మెల్యే కొట్టగుల్లి భాగ్యలక్ష్మి పేర్కొన్నారు. మంచితనానికి నైతిక విలువలకు ప్రాధాన్యత ఇచ్చే నాయకుడు ద్రోణంరాజు శ్రీనివాస్ అని బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు. -
ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తోంది: కోన రఘుపతి
సాక్షి, మంగళగిరి: కరోనాను ఎదుర్కోవడంలో ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తూ దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని రాష్ట్ర శాసన సభ ఉపసభాపతి కోన రఘుపతి అన్నారు. కరోనా బారిన పడి గుంటూరు జిల్లా చినకాకాని ఎన్ఆర్ఐ ఆసుపత్రిలో చికిత్స తీసుకుని కోలుకున్న ఆయన గురువారం డిశ్చార్జి అయ్యారు. ఆసుపత్రిలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కరోనా బారిన పడితే అధైర్యపడకుండా ఉండాలని ప్రజలకు సూచించారు. జాగ్రత్తలు తీసుకుంటూ చికిత్స తీసుకుంటే కరోనా నుంచి కోలుకోవచ్చన్నారు. కరోనా చికిత్సను ప్రభుత్వం ఆరోగ్యశ్రీలోకి తెచ్చి చికిత్స అందిస్తోందని, దీంతో పేదలు చికిత్స తీసుకుని కోలుకుంటున్నారని చెప్పారు. (రాష్ట్ర పరిధిలోనిదే..) -
శాసనసభ్యులకు కోవిడ్–19 పరీక్షలు
సాక్షి, గుంటూరు: కరోనా మహమ్మారిని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు చేపడుతోందని శాసనసభ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి అన్నారు. మంగళవారం నుంచి శాసనసభా సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు ముందస్తు చర్యలలో భాగంగా సోమవారం నగరంపాలెంలోని ఆర్ అండ్ బీ అతిథి గృహంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కోవిడ్–19 పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా డెప్యూటీ స్పీకర్ కోన రఘుపతి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏ రాష్ట్రంలో లేని విధంగా రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ఎక్కువ కరోనా పరీక్షలు నిర్వహించారని చెప్పారు. చదవండి: అక్రమాలకు అంతే లేదు.. కరోనా పరీక్ష చేయించుకున్న ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు శాసన సభ్యులందరూ తగిన జాగ్రత్తలు తీసుకుని సమావేశాలకు హాజరుకావాలని అన్నారు. పరిమితికి మించి సిబ్బందిని తీసుకురావద్దని సభ్యులకు సూచించారు.అనివార్య కారణాల వలన పరీక్షలకు హాజరుకాని వారికి అసెంబ్లీ వద్ద పరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు. కార్యక్రమంలో హోంమంత్రి మేకతోటి సుచరిత, శాసన మండలి చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు, పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకరరావు, చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజని, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే షేక్ మొహమ్మద్ ముస్తఫా, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాళి గిరిధర్, వేమూరు ఎమ్మెల్యే మేరుగ నాగార్జున, తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి పాల్గొన్నారు. కరోనా పరీక్షకు హాజరైన ఎమ్మెల్యేలు ఆళ్ల రామకృష్ణారెడ్డి, ముస్తఫా -
కరోనా: ఏపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు పరీక్షలు
సాక్షి, గుంటూరు: రేపటి నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభకానున్న నేపథ్యంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సోమవారం కరోనా పరీక్షలు నిర్వహించారు. హోంమంత్రి సుచరిత, డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, పలువురు ఎమ్మెల్యేలు కోవిడ్ టెస్టులు చేయించుకున్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి మాట్లాడుతూ.. కరోనా వైరస్‌ను దృష్టిలో పెట్టుకొని అసెంబ్లీకి ఇతరులను అనుమతించడం లేదని తెలిపారు. కేబినెట్ ర్యాంక్ ఉన్న వారుకుడా ఒకరిని మాత్రమే వెంట తెచ్చుకోవాలని ఆయన స్పష్టం చేశారు. శాసన సభ్యులకు ప్రత్యేకంగా కరోన నిర్ధారణ పరీక్షలు చేయిస్తున్నామని తెలిపారు. (చదవండి: అసెంబ్లీ నిర్వహణపై ఉన్నతస్థాయి సమావేశం) -
అర్చకుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు సీఎం కృషి
సాక్షి, అమరావతి: రాష్ట్ర దేవదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఇటీవల అర్చకుల (ఆగమ) కోర్సులకు నిర్వహించిన అర్చక పరీక్ష ఫలితాలను డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణులతో కలిసి గురువారం మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ విడుదల చేశారు. ఈ సందర్భంగా సచివాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. 2013 నుంచి అర్చకుల (ఆగమ) పరీక్షలను నిర్వహించలేదన్నారు. సీఎం వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత అర్చకుల జీవితాల్లో వెలుగులు పేందుకు చర్యలు తీసుకున్నారని చెప్పారు. ఈ క్రమంలోనే 2019 జూలై 13, 14 తేదీల్లో దేవదాయ, ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో అర్చకులకు ప్రవేశ, వర, ప్రవర ఆగమ పరీక్షలను నిర్వహించామన్నారు. పరీక్షల్లో తప్పిన వారికి సప్లిమెంటరీ నిర్వహిస్తామని, వెరిఫికేషన్‌కు కూడా అవకాశం కల్పిస్తున్నామని తెలిపారు. అర్చకుల (ఆగమ) పరీక్షలు నిర్వహించడం ద్వారా వారికి ఉపాధి అవకాశాలు మెరుగవుతాయన్నారు. డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ.. అర్చక (ఆగమ) పరీక్ష పాసైన వారు విదేశాల్లో కూడా ఉద్యోగాలు పొందే అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర అర్చక సమాఖ్య అధ్యక్షులు కామేశ్ శర్మ పాల్గొన్నారు. 84.93 శాతం ఉత్తీర్ణత ఆగమ పరీక్షలకు 5,176 మంది హాజరవ్వగా.. 4,396 మంది ఉత్తీర్ణత సాధించారు. ప్రథమ శ్రేణిలో 2 వేల మంది, ద్వితీయ శ్రేణిలో 1,156 మంది, తృతీయ శ్రేణిలో 247, మౌఖిక మరియు ప్రయోగ పరీక్షల్లో 993 మంది ఉత్తీర్ణత సాధించారు. ఉత్తీర్ణత శాతం 84.93. రీకౌంటింగ్ కోసం దరఖాస్తు చేసుకునేవారు నవంబరు 25లోగా కమిషనర్, దేవదాయ శాఖ కార్యాలయానికి రూ. 200 డీడీని జతపరిచి వివరాలు పంపాలి. ఫలితాల వివరాలను https://tms.ap.gov.in వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. -
ఏపీ చరిత్రలో ఇదో మైలురాయిగా నిలిచిపోతుంది
-
బ్రాహ్మణుల కల సాకారం : మంత్రి వెల్లంపల్లి
-
‘బ్రాహ్మణుల దశాబ్దాల కల సాకారం’
సాక్షి, విజయవాడ : వంశపారంపర్య అర్చకత్వానికి ఆమోదం తెలిపి సీఎం జగన్మోహన్రెడ్డి బ్రాహ్మణుల దశాబ్దాల కలను సాకారం చేశారని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కొనియాడారు. మంగళవారం డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, ఎమ్మెల్యే మల్లాది విష్ణులతో కలిసి మంత్రి మీడియాతో మాట్లాడారు. ఓటుబ్యాంకు రాజకీయాలు చేసే చంద్రబాబుకు సంక్షేమ సారధి వైఎస్ జగన్‌కు మధ్య తేడాను ప్రజలు గ్రహిస్తున్నారన్నారు. 439 జీవో అమలు చేయడం ద్వారా బ్రాహ్మణులు సంతోషిస్తున్నారని, దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తర్వాత అర్చకుల సంక్షేమం గురించి ఆలోచించిన ఏకైక నాయకుడు జగనేనని ప్రశంసించారు. ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల అర్చకుల కుటుంబాల్లో భయాందోళనలు తొలిగి దేవుని సేవలో నిస్వార్థంగా, సంతోషంగా పనిచేసేందుకు దోహదపడుతుందని ఆనందం వ్యక్తం చేశారు. డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి మాట్లాడుతూ.. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో 33 యాక్ట్‌ను అర్చకుల వంశపారంపర్యం కోసం ప్రతిపాదించారని గుర్తు చేశారు. కానీ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు ఆయన తనయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీని ఆచరణలో చూపి రూ. 234 కోట్లను ధూపదీప నైవేద్యానికి బడ్జెట్లో నిధులు కేటాయించడం, 100 కోట్లతో బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం ముదావహమన్నారు. ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ.. 439 జీవో ద్వారా బ్రాహ్మణులకు న్యాయం జరిగి, చరిత్రలో ఇదో మైలు రాయిగా నిలుస్తుందని వెల్లడించారు. సమస్యల పరిష్కారంతో హిందూ ధర్మాన్ని మరింత ముందుకు తీసుకుపోతామని వ్యాఖ్యానించారు. -
కార్తీక పౌర్ణమికి తీరంలో సౌకర్యాలు కల్పించండి
సాక్షి, బాపట్లటౌన్(గుంటూరు): కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని తీరానికి చేరుకునే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చర్యలు తీసుకోవాలని డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి ఆదేశించారు. కార్తీకపౌర్ణమి ఏర్పాట్లపై ఆదివారం సాయంత్రం తీరంలోని హరితా రిసార్ట్ ఆవరణంలో అన్నిశాఖల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ స్పీకర్ మాట్లాడుతూ సూర్యలంక తీరానికి సుమారు 3 లక్షల మేర పర్యాటకులు, భక్తులు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. భక్తుల రాకపోకలకు, స్నానాలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్లాస్టిక్ నివారణపై ప్రత్యేక దృష్టి కార్తీక పౌర్ణమి రోజున తీరంలో తాగు నీటి ప్యాకెట్లు వాడరాదన్నారు. ట్యాంకర్లు, డ్రమ్ముల సాయంతో తాగునీటి స్టాల్స్‌ను ఏర్పాటు చేయాలని సూచించారు. కార్తీకమాసంలో ప్రతి శని, ఆది, సోమవారాల్లో రోజుకు 40 వేల మందికిపైగా తీరానికి వస్తుంటారని, పారిశుద్ధ్యం మెరుగుకు మున్సిపాల్టీ పరిధిలోని రెండు ట్రాక్టర్లు, ఆటోలు, 50 మంది శానిటరీ సిబ్బందిని వినియోగించాలని చెప్పారు. ఏర్పాట్లపై కలెక్టర్ ఆరా తీరంలో దుస్తులు మార్చుకునేందుకు 150 తాత్కాలిక షెడ్లు, తీరం వెంబడి సామాన్లు భద్రపరుచుకునేందుకు 20 టెంట్లు ఏర్పాటు చేయాలని మంచినీరు, విద్యుత్ సరఫరా సక్రంగా ఉండాలని సిబ్బందిని ఆదేశించారు. తీరంలో 100 మంది గజ ఈతగాళ్లు, 20 ఇంజన్ బోట్లను అందుబాటులో ఉంచాలన్నారు. పట్టణ, మండలంలోని వైద్యాధికారులు తీరం వెంబడి మెడికల్ క్యాంపును ఏర్పాటు చేసి 108, 104 వాహనాలను సిద్ధం చేసుకోవాలని సూచించారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని పోలీస్ శాఖను ఆదేశించారు. 15 బస్సులకు తగ్గకుండా తీరానికి సర్వీసులు నడపాలని ఆర్టీసీని అధికారులకు సూచించారు. పట్టణంలోని వివిధ కళాశాలల నుంచి 200 మంది ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ వలంటీర్ల సాయం తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో సబ్ కలెక్టర్ దినేష్‌కుమార్, పంచాయతీ డీఈ బాపిరెడ్డి, సీఈవో చైతన్య, తహసీల్దార్ కే శ్రీనివాస్, ఎంపీడీవో ఏ రాధాకృష్ణ, డిప్యూటీ తహసీల్దార్ శ్రీచరణ్, సీఐలు కే శ్రీనివాసరెడ్డి, అశోక్‌కుమార్, ఎస్ఐలు ఎం సంధ్యారాణి, హజరత్తయ్య, ఆర్అండ్బీ డీఈ పీ లక్ష్మీనారాయణ, ఆర్టీసీ డీఎం పెద్దన్నశెట్టి, విద్యుత్ శాఖ ఈఈ హనుమయ్య, ఏఈలు పెరుగు శ్రీనివాసరావు, కిరణ్ పాల్గొన్నారు. -
బతుకు బండికి భరోసా
ఆర్థిక పరిస్థితి బాగోలేదు.. బండికి బ్రేక్ ఎలా చేయించాలి..? బీమా ప్రీమియం కోసం ఎక్కడ అప్పు చేయాలి?.. అన్న ఆందోళన అవసరం లేదు.. ఇక నుంచి బ్రేక్ చేయించలేదని.. బీమా ప్రీమియం చెల్లించలేదని పోలీసులు, రవాణాశాఖ అధికారులు జరిమానాలు విధిస్తారన్న భయం అసలే అవసరంలేదు.. ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్ల కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన హామీని నెరవేర్చుతూ ‘వైఎస్సార్ వాహన మిత్ర’ పథకాన్ని అమలులోకి తెచ్చారు. ఈ పథకం కింద సొంత వాహనం ఉన్న ప్రతి డ్రైవర్‌కు రూ.10 వేల ఆర్థిక సాయం పంపిణీ పథకం రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైంది. గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో వైఎస్సార్ వాహన మిత్ర పథకం ప్రారంభోత్సవం శుక్రవారం జరిగింది. సాక్షి, గుంటూరు: ‘వాహనాలకు బ్రేక్ చేయించుకోలేక.. బీమా ప్రీమియం చెల్లించలేక.. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఆటో, మ్యాక్సీ క్యాబ్, ట్యాక్సీల డ్రైవర్లు ఇకపై పోలీసులు, రవాణా శాఖ అధికారులకు భయపడుతూ తిరగాల్సిన అవసరం లేదు. డ్రైవర్ల గౌరవాన్ని పెంచడం కోసమే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ‘వైఎస్సార్ వాహన మిత్ర’ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ పథకం ద్వారా వాహనాలకు ఫిట్నెస్, బీమా, మరమ్మతుల కోసం ఏటా రూ.10 వేల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తోంది’ అని శాసనసభ డెప్యూటీ స్పీకర్ కోన రఘుపతి అన్నారు. గుంటూరు నగరంలోని వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో శుక్రవారం జరిగిన వైఎస్సార్ వాహన మిత్ర పథకం ప్రారంభోత్సవంలో కోన రఘుపతి, మత్స్య, పశు సంవర్ధక, మార్కెటింగ్ శాఖ మంత్రి మోపిదేవి వెంకట రమణ, బాపట్ల ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యేలు బొల్లా బ్రహ్మనాయుడు, అన్నాబత్తు్తని శివకుమార్, కిలారి వెంకట రోశయ్య, విడదల రజని, మేరుగ నాగార్జున, ఎమ్మెల్సీ కె.ఎస్.లక్ష్మణరావు, కలెక్టర్ శామ్యూల్ ఆనంద్‌కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గుంటూరు తూర్పు ఎమ్మెల్యే షేక్ మహమ్మద్ ముస్తఫా అధ్యక్షతన జరిగిన సభలో కోన రఘుపతి మాట్లాడుతూ కుల, మత, రాజకీయాలకు అతీతంగా పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంక్షేమ ప«థకాలు అమలుచేస్తున్నారని, ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీ లను నాలుగు నెలల్లో అమలు చేసిన ఘనత ఆయనకే దక్కిం దని అన్నారు. ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా రూ.400 కోట్లు కేటాయించారని తెలిపారు. రాష్ట్రంలో జనరంజక పాలన మత్స్య, పశుసంవర్ధక శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణారావు మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తనదైన శైలిలో జనరంజకమైన పాలన అందిస్తున్నారని పేర్కొన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో 90 శాతం నాలుగు నెలల వ్యవధిలో అమలు చేసి చరిత్ర సృష్టించారని పేర్కొన్నారు. అవినీతి రహిత పారదర్శకమైన పాలన అందిస్తూ రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్‌వన్‌గా నిలిపేదిశగా జగన్ ముందుకు సాగుతున్నారని వివరించారు. చంద్రబాబు పాలనలో ప్రజాసంక్షేమం విస్మరిం చిన టీడీపీ నాయకులు అనేక అక్రమాలు, అవినీతి కార్యకలాపాలకు పాల్పడ్డారని గుర్తుచేశారు. రాష్ట్రాభివృద్ధిని విస్మరించి సంక్షేమ పథకాలను పక్కన పెట్టి అక్రమాలతో రాష్ట్ర ఖజా నాను ఖాళీ చేసిన ఘనత చంద్రబాబుకే దక్కిం దని విమర్శించారు. సామాన్యుల కోసం రైతు బజార్ల ద్వారా కిలో ఉల్లిని రూ.25లకే అందిస్తున్నామని అన్నారు. ఆటో డ్రైవర్ల మేలు సీఎం లక్ష్యం ఎంపీ నందిగం సురేష్ మాట్లాడుతూ ఆటో డ్రైవర్ల మేలు కోసం సీఎం అనుక్షణం ఆలోచిస్తున్నారని అన్నారు. మద్యం తాగి వాహనాలను నడపవద్దని, ప్రయాణికులను సురక్షితంగా గమ్యానికి చేర్చాలని డ్రైవర్లకు సూచించారు. ఎమ్మెల్యే ముస్తఫా మాట్లాడుతూ ప్రతి కుటుం బంలో సంతోషం నింపడమే లక్ష్యంగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పరిపాలన సాగిస్తున్నారని వివరించారు. ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ ప్రజా సంకల్ప యాత్రలో ప్రజల కష్టాలను దగ్గరగా చూసి వారికి ఇచ్చిన హామీలను అమలు చేసిన నాయకుడు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని చూసి ఓవర్వలేక చంద్రబాబు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ఎమ్మెల్యే మేరుగ నాగార్జున మాట్లాడుతూ రాజకీయ వ్యవస్థలో ఎన్నో అవాంతరాలను ఎదుర్కొని ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న నాయకుడు సీఎం జగన్ అని కొనియాడారు. కులమతాల తేడా లేని పాలన ఎమ్మెల్యే విడదల రజని మాట్లాడుతూ కులం, మతం, ప్రాంతం, రాజకీయాలకు తావులేకుండా అర్హులైతే చాలు అన్న నినాదంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలన ఉందని పేర్కొన్నారు. ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ మాట్లాడుతూ డ్రైవర్లకు రూ.10 వేల ఆర్థిక సహాయంతో ఎంతో మేలు చేకూరనుందని అన్నారు. కలెక్టర్ ఐ శామ్యూల్ ఆనంద్‌కుమార్ మాట్లాడుతూ సెప్టెంబర్ 14న ప్రారంభమైన ఈ పథకంలో జిల్లా వ్యాప్తంగా 14,312 ఆటో, క్యాబ్, ట్యాక్సీ డ్రైవర్లు దరఖాస్తు చేసుకోగా 13,992 మందిని అర్హులుగా గుర్తించి ఆర్థిక సాయం చేస్తున్నామని వివరించారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఏలూరులో జరిగిన ఆర్థిక ససాయం ప్రారంభ కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రసంగాన్ని చూసి డ్రైవర్లు హర్షం వ్యక్తం చేశారు. ప్రసంగం ముగిం పులోనే వైఎస్ జగన్ కంప్యూటర్లో బటన్ ప్రెస్ చేయడంతోనే బ్యాంకు ఖాతాల్లో సెకన్ల సమయంలోనే నగదు జమ కావటంతో ఆటో డ్రైవర్లు సంబర పడిపోయారు. అనంతరం లబ్ధి దారులకు ప«థకం కింద మంజూరు పత్రాలను అందజేశారు. జాయింట్ కలెక్టర్ దినేష్‌కుమార్, జేసీ–2 సత్యనారాయణ, డీటీపీ ఇవ్వల మీరా ప్రసాద్, ఆర్డీఓ భాస్కరరెడ్డి, ఆర్టీఓలు రమేష్, రామస్వామి, అధికారులు అధిక సంఖ్యలో ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లబ్ధిదారులకు రాసిన లేఖను డీటీసీ మీరా ప్రసాద్ చదివి వినిపిం చారు. అనంతరం వైఎస్సార్ వాహన మిత్ర లబ్ధి దారులకు డెప్యూటీ స్పీకర్, మంత్రి, ప్రజాప్రతినిధులు గుర్తింపు పత్రాలను అందజేశారు. దరఖాస్తు గడువు పెంపు లైసెన్సు ఉండి కుటుంబ సభ్యుల పేరుతో ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్ ఉన్న వారందరూ వైఎస్సార్ వాహన మిత్ర పథకం లబ్ధి పొందడానికి అర్హులు. ఇప్పటి వరకూ ఈ పథకానికి దరఖాస్తు చేసుకోలేని వారికి ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. వారు ఈ నెల 30వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఇచ్చింది. మా బాగోగులు పట్టించుకున్న సీఎం జగన్ నేను 30 ఏళ్లుగా ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నా. ఏ ఒక్కరూ మా బాగోగుల గురించి ఆలోచించిన దాఖలాలు లేవు. మొట్టమొదటి సారిగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఒక్కరే మా కష్టాలను గుర్తించారు. ఎన్నికలకు ముందు మాకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. ప్రభుత్వం అందిస్తున్న రూ.10వేల ఆర్థిక సాయం మాకు ఎంతగానో తోడ్పడుతుంది. – ఖాసీం ఖాన్, గుంటూరు సీఎంకు కృతజ్ఞతలు నేను ఆటో నడుపుతూ కుమారుడిని ఇంటర్, కుమార్తెను తొమ్మిదో తరగతి చదివిస్తున్నా. ఆటోకు ఫిట్నెస్ చేయించుకోవడం కోసం చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నా. ఓ వైపు పిల్లల చదువులు, మరోవైపు బీమా, రోడ్ ట్యాక్స్‌లు, ఫిట్నెస్ చార్జీల కోసం అప్పులు చేయాల్సిన పరిస్థితి. మా కష్టాలను చూసి ఆర్థిక సాయం చేస్తున్న జగనన్నకు కృతజ్ఞతలు. ఆటో డ్రైవర్లందరం రుణపడి ఉంటాం. – కమల, గుంటూరు -
అమరావతిలో మూడు రోడ్లు, ఆరు బిల్డింగ్లే!
తెనాలి: అమరావతి అనే మహానగరంలో ఉన్నది కేవలం మూడు రోడ్లు, ఆరు బిల్డింగులు మాత్రమేనని రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కోన రఘుపతి చెప్పారు. ఎంతో అనుభవం కలిగిన మాజీ ముఖ్యమంత్రి రాజధానిలో చేయించిన పనుల్లో రూ.24,600 కోట్ల మేర కాంట్రాక్టర్లకు అప్పు మిగిల్చి వెళ్లారన్నారు. మరో రూ.20 వేల కోట్ల కొత్త పనులకు టెండర్లు పిలిచారని చెప్పారు. గుంటూరు జిల్లా తెనాలిలో బ్రాహ్మణ పరిషత్ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి ఎన్ఆర్కే కళ్యాణమండపంలో విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, తెనాలి, వేమూరు ఎమ్మెల్యేలు అన్నాబత్తుని శివకుమార్, డాక్టర్ మేరుగ నాగార్జునకు జరిగిన అభినందన సభకు పరిషత్ అధ్యక్షుడు పరాశరం రామగోపాల్ అధ్యక్షత వహించారు. కోన రఘుపతి మాట్లాడుతూ.. ఎన్నికల మేనిఫెస్టోలోని అంశాలకు చట్టబద్ధత కల్పిస్తూ ప్రతి హామీ అమలుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిబద్ధతతో కృషిచేస్తుంటే.. ప్రతిపక్షం అవాస్తవాలు మాట్లాడుతుండటం విచారకరమన్నారు. రాజధాని పనులపై ’కాగ్’ నివేదికల్లో వెల్లడైన అవకతవకలు, బీజేపీ చేసిన ప్రస్తావనలను బాధ్యత గల సీఎంగా వైఎస్ జగన్ వాటన్నిటినీ పరిశీలించి ముందుకెళ్లాలా? వద్దా? అని ప్రశ్నించారు. బ్రాహ్మణ అధ్యయన కమిటీ సభ్యుడు పోతావఝల పురుషోత్తమశర్మ స్వాగతం పలికిన సభలో జిల్లా బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు రావూరి ఆంజనేయులు, సుప్రీం కోర్టు న్యాయవాది వరప్రసాద్, ఎన్ఆర్కే శర్మ మాట్లాడారు. -
‘బిల్లులు ఆమోదించినందుకు గర్వపడుతున్నా’
సాక్షి, అనంతపురం : అసెంబ్లీలో చారిత్రక బిల్లులను ఆమోదించినందుకు గర్వపడుతున్నానని డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పారదర్శక పాలన అందించి.. ఇచ్చిన హామీలను నేరవేరుస్తున్నారని కొనియాడారు. ఎమ్మెల్యే మల్లాది విష్ణుతో కలిసి ఆదివారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆలయ భూములను ఆక్రమిస్తే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని డిప్యూటీ స్పీకర్ హెచ్చరించారు. బ్రాహ్మాణుల సంక్షేమానికి సీఎం జగన్ పెద్ద పీట వేస్తున్నారని చెప్పారు. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ దేశంలోనే ఆదర్శవంతమైన పాలన అందిస్తున్నారని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. నవరత్నాలతో అన్ని వర్గాలకు మేలు చేస్తున్నారని చెప్పారు. ఆలయాల్లో దూపదీప నైవేద్యాలకు 235 కోట్లు కేటాయించటం అభినందనీయమని అన్నారు. -
డిప్యూటీ స్పీకర్‌ను కలిసిన టీడీపీ ఎమ్మెల్యేలు
సాక్షి, అమరావతి : సస్పెండ్‌కు గురైన తమ సభ్యులను తిరిగి సభకు అనుమతించాలని ఏపీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతిని టీడీపీ ఎమ్మెల్యేలు కోరారు. ఈమేరకు మంగళవారం టీడీపీ సభ్యులు గంటా శ్రీనివాసరావు, కరణం బలరాంలు డిప్యూటీ స్పీకర్‌ను కలిసి సస్పెన్షన్ ఎత్తివేయాలని విజ్ఞప్తి చేశారు. ఎలాంటి కారణాలు లేకుండానే సస్పెండ్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ సభ్యుల వినతిపై స్పందించిన డిప్యూటీ స్పీకర్.. ఈ అంశాన్ని అధికార పార్టీ దృష్టికి తీసుకెళ్లారు. పార్లమెంట్ వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, ప్రభుత్వ చీప్‌విప్ శ్రీకాంత్‌రెడ్డితో భేటీ అయ్యారు. అధికార, విపక్షాల సభ్యులతో డిప్యూటీ స్పీకర్ చర్చలు జరుపుతున్నారు. (చదవండి : అసెంబ్లీ నుంచి ముగ్గురు టీడీపీ సభ్యుల సస్పెన్షన్) -
అసెంబ్లీలో వీడియో.. బాబు డొల్లతనం బట్టబయలు!
సాక్షి, అమరావతి: ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు.. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని చూసి.. తానే అడ్డంగా బుక్ అయ్యారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు సంబంధించి పెన్షన్ ప్రకటనపై ఓ పేపర్ కటింగ్‌ను చూపిస్తూ.. ఆ పార్టీ నేతలు రాద్ధాంతం చేశారు. ఇదే అంశంపై అధికార పక్ష సభ్యులు పదే పదే వివరణ ఇచ్చినా.. స్వయంగా వైఎస్సార్సీపీ ఎన్నికల మ్యానిఫెస్టోను సభలో చదివి వినిపించినా.. దీనికి సంబంధించిన వీడియోను రెండుసార్లు చేసినా చంద్రబాబు అదే అంశాన్ని లేవనెత్తారు. ఈ విధంగా పూర్తి క్లారిటీ ఇచ్చిన తర్వాత ఒక పేపర్ కటింగ్‌పై ఇంత రాద్ధాంతం చేయడం సరికాదని సభాపతి స్థానంలో ఉన్న డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి కూడా సూచించారు. అయినా, చంద్రబాబు తీరు మారకపోవడంతో.. సభా నాయకుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కల్పించుకొని.. ఈ విషయమై పూర్తి స్పష్టత ఇచ్చారు. ప్రతిపక్ష నేత చూపిస్తున్న పేపర్ కటింగ్ 18-10-2017నాటిదని, ఈ అంశంపై పూర్తి స్పష్టత ఇస్తూ.. 2018 సెప్టెంబర్ మూడో తేదీన విశాఖపట్నం మాడుగుల నియోజకవర్గంలో పాదయాత్ర జరుగుతుండగా.. వైఎస్సార్ చేయూత పథకాన్ని ప్రకటించిన విషయాన్ని సీఎం సభ దృష్టికి తీసుకొచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆయన సభాపతి అనుమతితో సభలో ప్లే చేయించారు. ఈ వీడియోతో చంద్రబాబు డొల్లతనం బట్టబయలు అయింది. వీడియోలో ఏముందంటే.. పాదయాత్రలో భాగంగా మాడుగుల నియోజకవర్గంలో కే.కోటపాడులో నిర్వహించిన బహిరంగ సభలో వైఎస్ జగన్మోహన్రెడ్డి మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు పెన్షన్ పథకం స్థానంలో వైఎస్సార్ చేయూత పథకాన్ని ప్రకటించారు. ఆయన ఏమన్నారంటే.. ‘మేం అధికారంలోకి వచ్చాక అమలు చేయబోయే నవరత్నాల్లో ఇది. నాన్నగారు కలలు కన్నట్టు ప్రతి అక్కా, ప్రతి చెల్లె లక్షాధికారి కావాలి. వారు సంతోషంగా ఉండాలి. వారు సంతోషంగా ఉంటేనే ఇల్లు బాగుంటుంది. ఇల్లు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నమ్మే వ్యక్తిని నేను. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన అక్కలు అనారోగ్యం కారణంగా, మరో కారణంగానో వారం రోజులు పనులకు వెళ్లకపోతే.. వారు ఇంట్లో పస్తులు ఉండాల్సిన పరిస్థితి నెలకొంటుంది. ఈ క్రమంలో ఆ వర్గాల అక్కలకు తోడుగా ఉండాలని 45 ఏళ్లుకు పెన్షన్ ఇవ్వాలని నేను చెబితే.. 45 ఏళ్లకే అక్కలకు పెన్షన్ ఏమిటని కొందరు వెటకారం చేశారు. వెటకారం చేస్తూ వారు చేసిన సూచనలను కూడా పరిగణనలోకి తీసుకొని వైఎస్సార్ చేయూత అనే కొత్త పథకానికి నాందిపలుకుతున్నాం. 45 ఏళ్లు దాటిన ప్రతి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అక్కలకు, ప్రతి కుటుంబానికి అక్షరాల 75వేల రూపాయలు ఉచితంగా ఇస్తాం. రెండో ఏడాది నుంచి దశలవారీగా ఆయా కార్పొరేషన్ల ద్వారా పూర్తి పాదర్శకతతో, ఏమాత్రం అవినీతి తావు లేకుండా.. ప్రతి అక్కకు అందేవిధంగాచూస్తాం’ అని వైఎస్ జగన్ వీడియోలో తెలిపారు. ఈ వీడియోలో ఇంత స్పష్టంగా చెప్పినప్పటికీ.. ఇందులో వక్రీకరణకు తావులేనప్పటికీ.. ఈ అంశాన్ని పట్టుకొని విలువైన సభా సమయాన్ని ప్రతిపక్ష సభ్యులు వృధా చేస్తున్నారని వైఎస్ జగన్ సభలో పేర్కొన్నారు. ఈ విషయంలోనూ రాజకీయ స్వార్థం కోసం చంద్రబాబు ఆరోపణలు చేస్తున్నారని, ఇటువంటి పెద్ద మనిషి ఈ శాసనసభలో ఉండటం నిజంగా బాధపడాల్సిన విషయమని పేర్కొన్నారు. ఇప్పటికైనా ఈ అంశానికి ఫుల్స్టాప్ పెట్టి.. కీలక బిల్లులపై చర్చ చేపట్టాలని సభాపతిని కోరారు. చదవండి: ఈర్ష్యా, ఆక్రోషంతోనే బాబు దిగజారుడు ప్రవర్తన! అధ్యక్షా.. ఈ పక్కన సౌండ్ ప్రూఫ్ గోడ కట్టండి! అసెంబ్లీ నుంచి ముగ్గురు టీడీపీ సభ్యుల సస్పెన్షన్ -
నేడు 2వ రోజు ఎమ్మెల్యే,ఎమ్మెల్సీల శిక్షణ తరగతులు
సాక్షి, అమరావతి : రాష్ట్ర శాసనసభలో అనుసరించాల్సిన నియమ, నిబంధనలపై శాసన సభ్యులకు అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన శిక్షణ తరగతులు గురువారం రెండవ రోజు ప్రారంభంకానున్నాయి. ఏపీ అసెంబ్లీ కమిటీ హాలులో డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు శిక్షణ ఇవ్వనున్నారు. ఈ ఉదయం సుపరిపాలన అంశంపై ఏపీ మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణ రావు ప్రసంగం ఇవ్వనున్నారు. అనంతరం సభ్యులతో ముఖాముఖి కార్యక్రమం ఉండనుంది. మధ్యాహ్నం సంక్షేమ కార్యక్రమాలు, గౌరవ సభ్యుల పాత్ర అనే అంశంపై ఆంధ్రప్రదేశ్ సీఎం ముఖ్య సలహాదారు అజయ్ కల్లాం మాట్లాడతారు. శాసన సభ్యులు రాజకీయ నైతికత, ప్రజామోదం అంశంపై డెమోక్రటిక్ రిఫార్మ్స్ వ్యవస్థాపకులు, జనరల్ సెక్రటరీ జయప్రకాష్ నారాయణ ప్రసంగించనున్నారు. -
సమస్య ఏదైనా నా ఇంటికి రండి
బాపట్లటౌన్: గ్రామీణ ప్రాంతాల్లో అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించడమే నాకు తెలుసు. పేదవాడు ఎక్కడున్నా పేదవాడే. ఇన్నాళ్లు మన చేతిలో అధికారం లేకపోవడం వలన పనులు చేయలేకపోయాను. దేవుని దయ...మీ అందరి ఆశీస్సులతో మరోసారి ఎమ్మెల్యేగా గెలుపొంది సీఎం జగన్మోహన్రెడ్డి చోరవతో ఉప సభాపతి అయ్యాను. ఎవరికి ఎలాంటి సమస్య వచ్చినా నా ఇంటికి ఎప్పుడైనా రావోచ్చు. కులాలు, మతాలు, రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందజేస్తానంటూ డెప్యూటీ స్పీకర్ కోనరఘుపతి శనివారం మండలంలోని కొండుబోట్లవారిపాలెం, ఈస్ట్బాపట్ల, పిన్నిబోయినవారిపాలెం, ముత్తాయపాలెం, మరుప్రోలువారిపాలెం, అసోదివారిపాలెం, వెస్ట్బాపట్ల పంచాయతీల్లో జరిగిన గ్రామసభల్లో మాట్లాడారు -
ఇళ్లు లేని ప్రతి పేదవాడికి ఇళ్లు నిర్మించి ఇస్తాం
-
డిప్యూటీ స్పీకర్‌గా.. కోన రఘుపతి ఏకగ్రీవం
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా గుంటూరు జిల్లా బాపట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోన రఘుపతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయనొక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నికైనట్లు స్పీకర్ తమ్మినేని సీతారాం మంగళవారం అధికారికంగా ప్రకటించారు. అనంతరం సభానాయకుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు తదితరులు కోన రఘుపతిని స్పీకర్ స్థానం దగ్గరకు సాదరంగా తీసుకెళ్లి కూర్చోబెట్టి అభినందనలు తెలిపారు. ఇతర శాసనసభ్యులంతా డిప్యూటి స్పీకర్‌కు అభినందనలు తెలియజేశారు. అంతకుముందు రఘుపతి నామినేషన్‌ను 11మంది ఎమ్మెల్యేలు వేర్వేరుగా ప్రతిపాదించారు. కాగా, ‘కోన’ను అభినందిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, హోంమంత్రి మేకతోటి సుచరిత, ఎమ్మెల్యేలు మేరుగ నాగార్జున, ముస్తఫా, అంబటి రాంబాబు, కరణం బలరామకృష్ణమూర్తి, అనగాని సత్యప్రసాద్, తదితరులు ప్రసంగించారు. ప్రతిపక్షానికీ బాగా మాట్లాడే అవకాశమివ్వండి : జగన్ సభా నాయకుడు వైఎస్ జగన్ మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ తరఫున బాపట్ల నుంచి రెండోసారి ఎన్నిక కావడం.. ఆయన కుటుంబ రాజకీయ చరిత్ర చూసి అందరికీ మంచి చేస్తారన్న ఉద్దేశంతో డిప్యూటీ స్పీకర్‌గా ఎంపిక చేసినట్టు చెప్పారు. ’మీ తండ్రి కోన ప్రభాకరరావు స్పీకర్‌గా, మూడు రాష్ట్రాలకు గవర్నర్‌గా, మంత్రిగా, రాజకీయ ప్రముఖునిగా ఖ్యాతి గడించారు. మీరూ మంచి స్పీకర్‌గా రాణిస్తారని భావించి మిమ్మల్ని ఎన్నుకున్నాం. సభలో అందరికీ మంచి చేస్తారని, ప్రతిపక్షానికి కూడా బాగా మాట్లాడడానికి సమయం ఇస్తారని భావిస్తున్నాం. మీ నాన్నగారి మాదిరే అన్నింటా రాణించాలని ఆశిస్తున్నాం. మీరు ఎన్నికైనందుకు అభినందనలు’.. అని జగన్ అన్నారు. మంచి పేరు తెచ్చుకోవాలి : చంద్రబాబు అంతకుముందు.. ప్రతిపక్ష నేత చంద్రబాబు మాట్లాడుతూ.. కోన రఘుపతి తన తండ్రి బాటలో పయనించి సభకు మంచి పేరు తేవాలని ఆకాంక్షించారు. కోన ప్రభాకరరావు నిర్మొహమాటంగా, విలువలతో కూడిన రాజకీయం చేసేవారని, జాతీయ స్థాయిలో ఆయన గుర్తింపు కలిగిన వ్యక్తని కొనియాడారు. తపన, సామాజిక బాధ్యత కలిగిన కుటుంబం నుంచి వచ్చిన కోన రఘుపతి కూడా మంచి కీర్తి గడించాలన్నారు. సభ్యుల ప్రయోజనాలు కాపాడుతా : కోన కాగా, తనను డిప్యూటీ స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు కోన రఘుపతి సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. శాసన నిర్మాణ వ్యవస్థలో ప్రత్యక్షంగా, పరోక్షంగా తనకు పరిచయం ఉందని, సభ్యుల ప్రయోజనాలను కాపాడేందుకు కృషిచేస్తానని హామీ ఇచ్చారు. అర్థవంతమైన చర్చలతో నిర్మాణాత్మక సూచనలతో ముందుకు సాగుదామన్నారు. పార్టీ ఫిరాయింపుదారులపై తక్షణమే వేటువేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అసెంబ్లీలో చేసిన ప్రకటన దేశ చరిత్రలోనే చారిత్రాత్మకమైనదన్నారు. అంతటి స్ఫూర్తిదాయకమైన ప్రకటనతో సభా ఔన్నత్యాన్ని కాపాడతానని, తన తండ్రి పేరు, ప్రతిష్టలను కాపాడతానని, బాపట్ల ప్రాంత అభివృద్ధికి, రాష్ట్రాభివృద్ధికి పాటుపడతానని చెప్పారు. అధికార పక్ష సభ్యుడు అంబటి రాంబాబు మాట్లాడుతూ.. గత సభలో డిప్యూటీ స్పీకర్ ఐదేళ్ల కాలంలో మహాఅయితే ఏ నాలుగైదు గంటలో ఆ స్థానంలో కూర్చుని విధులు నిర్వహించారని, ఈ సభలో ఆ పరిస్థితి మారాలని ఆకాంక్షించారు. తండ్రి స్పీకర్.. కొడుకు డిప్యూటీ స్పీకర్ బ్రాహ్మణ సామాజికవర్గానికి చెందిన కోన రఘుపతి.. 2014, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరఫున పోటీచేసి రెండుసార్లూ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన తండ్రి కోన ప్రభాకరరావు 1967, 1972, 1978 సంవత్సరాల్లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది హ్యాట్రిక్ సాధించారు. ఈయన రాష్ట్ర ఆర్థిక మంత్రిగా, స్పీకర్‌గా, మహారాష్ట్ర సహా మూడు రాష్ట్రాలకు గవర్నర్‌గా పనిచేశారు. కాగా, కోన ప్రభాకర్ అప్పట్లో స్పీకర్‌గా పనిచేయగా, ప్రస్తుతం ఆయన తనయుడు రఘుపతి డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నికయ్యారు. -
ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా కోన రఘుపతి
-
డిప్యూటీ స్పీకర్‌గా కోన రఘుపతి ఏకగ్రీవ ఎన్నిక
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా గుంటూరు జిల్లా బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నికైనట్లు స్పీకర్ తమ్మినేని సీతారం మంగళవారం అధికారికంగా ప్రకటించారు. అనంతరం సభానాయకుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు తదితరులు కోన రఘుపతిని స్పీకర్ స్థానం దగ్గరకు సాదరంగా తీసుకెళ్లి కూర్చోబెట్టి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా శాసన సభ్యులంతా డిప్యూటి స్పీకర్‌కు అభినందనలు తెలియజేశారు. తండ్రి స్పీకర్.. కోడుకు డిప్యూటీ స్పీకర్ బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన కోన రఘుపతి 2014, 2019 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ చేసి వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. కోన రఘుపతి తండ్రి కోన ప్రభాకరరావు 1967, 1972, 1978 సంవత్సరాల్లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది హ్యాట్రిక్ సాధించారు. కోన ప్రభాకరరావు రాష్ట్ర మంత్రిగా, స్పీకర్‌గా, మహారాష్ట్ర గవర్నర్‌గా కూడా పనిచేశారు. అప్పట్లో తండ్రి కోన ప్రభాకర్ స్పీకర్‌గా పనిచేయగా, ప్రస్తుతం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కోన రఘుపతికి డిప్యూటీ స్పీకర్‌గా అవకాశం కల్పించడం విశేషం. మృదుస్వభావి అయిన కోన రఘుపతికి డిప్యూటీ స్పీకర్ పదవి దక్కడంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. -
డిప్యూటీ స్పీకర్‌గా కోన ఏకగ్రీవంగా ఎన్నిక!
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా గుంటూరు జిల్లా బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి ఎన్నిక కాబోతున్నారు. సోమవారం గడువు ముగిసే సమయానికి ఆయన ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో మంగళవారం శాసనసభలో డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నికైనట్లు అధికారికంగా ప్రకటిస్తారు. సోమవారం గడువు ముగిసే సమయానికి ఆయన ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో మంగళవారం శాసనసభలో డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నికైనట్లు అధికారికంగా ప్రకటిస్తారు. సోమవారం ఉదయం శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారామ్ డిప్యూటీ స్పీకర్ ఎన్నిక నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. సాయంత్రం 5 గంటల వరకూ ఈ పదవికి నామినేషన్లు దాఖలు చేసుకోవచ్చని ప్రకటించారు. శాసనసభ సమావేశం వాయిదా పడిన అనంతరం ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి, మంత్రులు ఆదిమూలపు సురేష్, ప్రభుత్వ చీఫ్‌విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి, విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, అన్నాబత్తుని శివకుమార్, కొరుముట్ల శ్రీనివాసులు, ఆళ్ల రామకృష్ణారెడ్డి, కొట్టుగుళ్ల భాగ్యలక్ష్మి, తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి వెంట రాగా కోన రఘుపతి అసెంబ్లీ కార్యాదర్శి(ఇంచార్జి) పి.బాలకృష్ణమాచార్యులుకు తన నామినేషన్ పత్రాలను ఆయన ఛాంబర్లో అందజేశారు. కోన రఘుపతి నామినేషన్ పత్రాలపై ఆయన అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ ఉప ముఖ్యమంత్రి మేకతోటి సుచరిత, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, కొడాలి నాని, పాలుబోయిన అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు పీడిక రాజన్నదొర, టి.అర్థర్, చెట్టి ఫాల్గుణ, టీజేఆర్ సుధాకర్‌బాబు, మద్దిశెట్టి వేణుగోపాల్ సంతకాలు చేశారు. కాగా మంగళవారం ఉదయం 11గంటలకు డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరగనుంది. చదవండి: డిప్యూటీ స్పీకర్ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల -
తండ్రి స్పీకర్.. తనయుడు డెప్యూటీ స్పీకర్
ఉత్కంఠ వీడింది.. జిల్లాలో ఇద్దరికి మంత్రి పదవులు, మరొకరికి డెప్యూటీ స్పీకర్ పదవి దక్కాయి. తమ కుటుంబాన్ని నమ్ముకుని కష్టనష్టాలను భరించిన మోపిదేవి వెంకటరమణ, మేకతోటి సుచరితకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మంత్రి పదవులు కట్టబెట్టారు. జిల్లాకు రెండు మంత్రి పదవులు దక్కడంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తంచేస్తున్నాయి. సాక్షి, గుంటూరు: విశ్వసనీయతకు మరోసారి ఫలితం దక్కింది. వైఎస్ కుటుంబం నమ్మినవారిని వదిలిపెట్టదన్న విషయం మళ్లీ రుజువైంది. నాడు తమకోసం ఎమ్మెల్యే పదవులను త్యజించా రనే కారణంతో ఎమ్మెల్యే టిక్కెట్లు ఇవ్వడమే కాకుండా ఏకంగా మంత్రి పదవులు కట్టబెట్టారు. సామాజిక న్యాయం పాటిస్తూ జిల్లా నుంచి ఎస్సీ మహిళ మేకతోటి సుచరిత, బీసీ వర్గానికి చెందిన మోపిదేవి వెంకటరమణకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తనక్యాబినెట్లో చోటు కల్పించి తమను నమ్ముకున్నవారికి ఎప్పుడూ అన్యాయం జరగదనే విషయాన్ని మరోసారి రుజువు చేశారు. ఎవరూ ఊహించని విధంగా ఎన్నికల్లో ఓటమి చెందిన మోపిదేవికి మంత్రి పదవి ఇచ్చి అక్కున చేర్చుకున్నారు. బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతికి డెప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చి జిల్లాకు సముచిత స్థానం కల్పించారు. మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ జిల్లాలో మొదటి నుంచి దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డికి అనుచరుడిగా పేరుపొందారు. 1999లో కూచినపూడి నియోజకవర్గం (ప్రస్తుతం రద్దయింది) నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన మోపిదేవి 2004లో సైతం అక్కడి నుంచే విజయం సాధించారు. దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 2004లో ముఖ్యమంత్రి కాగానే మోపిదేవికి తన క్యాబినెట్లో స్థానం కల్పించారు. 2009లో సైతం తన క్యాబినెట్లో మంత్రి పదవి కట్టబెట్టి జిల్లాలో తన అనుచరుడిగా చూసుకుంటూ వచ్చారు. వైఎస్సార్ మరణా నంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో జైలుకు వెళ్లి, ఆరోగ్యం పూర్తిగా దెబ్బతిన్నప్పటికీ వైఎస్సార్ కుటుంబంపై ఉన్న విశ్వాసంతో ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి స్థాపించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి 2014 ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. వైఎస్ జగన్ 2019లో సైతం మోపిదేవిని రేపల్లె నుంచి బరిలో నిలిపారు. అనూహ్యంగా జరిగిన పరిణామాల నేపథ్యంలో స్వల్ప తేడాతో ఆయన ఓటమి పాలయ్యారు. జిల్లాలో 15 మంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేలుగా గెలుపొందిన విషయం తెలిసిందే. వీరిలో ఎవరికి మంత్రి పదవులు దక్కుతాయనే లెక్కలు వేసుకుంటున్న తరుణంలో నమ్ముకున్న వారికి తమ కుటుంబం ఎన్నడూ అన్యాయం చేయదని రుజువు చేస్తూ ఓటమి పాలైన మోపిదేవికి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన క్యాబినెట్లో స్థానం కల్పించారు. బలహీన వర్గానికి చెందిన మోపిదేవికి మంత్రిపదవి దక్కడంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. మోపిదేవికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తగిన న్యాయం చేశారంటూ అంతా ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్నారు. తండ్రి ఎమ్మెల్యేని చేస్తే తనయుడు మంత్రిని చేశాడు జిల్లాలో ఎస్సీ మహిళ ఎమ్మెల్యేగా మూడో సారి గెలుపొందిన ప్రత్తిపాడు ఎమ్మెల్యే మేకతోటి సుచరితకు తన కేబినెట్లో స్థానం కల్పించి ఆమె చేసిన త్యాగం వృథా కాలేదనే విషయాన్ని ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రుజువు చేశారు. 2006లో రాజకీయాల్లోకి వచ్చి ఫిరంగిపురం నుంచి జెడ్పీటీసీగా గెలిచిన మేకతోటి సుచరిత దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశీస్సులతో నియోజకవర్గ పునర్విభజనలో భాగంగా ఎస్సీ రిజర్వుడ్ స్థానమైన ప్రత్తిపాడు టిక్కెట్టు ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిపించారు. ఆమె ఎమ్మెల్యేగా గెలిచిన కొద్దినెలలకే ఆయన దుర్మరణం పాలవడంతో రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలన్ని మారిపోయాయి. కాంగ్రెస్ పార్టీని వదిలి వైఎస్జగన్ బయటకు వచ్చిన మరుక్షణం వైఎస్సార్‌పై ఉన్న అభిమానంతో సుచరిత ఎమ్మెల్యే పదవికి సైతం తృణప్రాయంగా వదిలేసి ఆయన తనయుడు వైఎస్ జగన్ వెంట నడిచారు. ఆమెపై అనర్హత వేటు వేసినప్పటికీ వైఎస్ జగన్ స్థాపించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి 2012 ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014 ఎన్నికల్లో స్వల్ప మెజార్టీతో ఓటమిపాలైనప్పటికీ 2019 ఎన్నికల్లో మాత్రం విజయఢంకా మోగించారు. మూడుసార్లు గెలిచిన సుచరితకు తన కేబినెట్లో స్థానం కల్పించి తమ కుటుం బాన్ని నమ్మిన వారికి అండగా నిలబడతారనే విషయాన్ని వైఎస్జగన్ చేతల్లో చేసి చూపారు. సుచరితను తండ్రి వైఎస్సార్ ఎమ్మెల్యేను చేస్తే ఆయన తనయుడు వైఎస్ జగన్ ఏకంగా మంత్రిని చేసి విశ్వసనీయతకు నిలువెత్తు నిదర్శనంగా నిలి చారు. ఏ సామాజిక వర్గానికి చెందిన వారైనా తమను నమ్మితే వారికి పెద్ద పీట వేస్తామనే విషయాన్ని రుజువు చేసిచూపారు. సుచరితకు మంత్రి పదవి కట్టబెట్టడంపై ఎస్సీ సంఘాల నేతలు, జిల్లాప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. తండ్రి స్పీకర్.. తనయుడు డెప్యూటీ స్పీకర్ బాపట్ల నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి విజయం సాధించిన కోన రఘుపతికి డెప్యూటీ స్పీకర్‌గా అవకాశం కల్పించినట్లు తెలుస్తోంది. బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన కోన రఘుపతి 2014, 2019 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ చేసి వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. కోన రఘుపతి తండ్రి కోన ప్రభాకరరావు 1967, 1972, 1978 సంవత్సరాల్లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది హ్యాట్రిక్ సాధించారు. కోన ప్రభాకరరావు రాష్ట్ర మంత్రిగా, స్పీకర్‌గా, మహారాష్ట్ర గవర్నర్‌గా కూడా పనిచేశారు. అప్పట్లో తండ్రి కోన ప్రభాకర్ స్పీకర్‌గా పనిచేయగా, ప్రస్తుతం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి కోన రఘుపతికి డెప్యూటీ స్పీకర్‌గా అవకాశం కల్పించడం విశేషం. మృదుస్వభావి అయిన కోన రఘుపతికి డెప్యూటీ స్పీకర్ పదవి దక్కడంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. -
ఓడిపోయే బాబుకు సౌండెక్కువ
సాక్షి,సిటీబ్యూరో: గత ఐదేళ్ల పాలనలో అన్ని వ్యవస్థలను సర్వనాశనం చేసిన సీఎం చంద్రబాబు నాయుడు సార్వత్రిక ఎన్నికలు ముగిశాక ఇప్పుడు వ్యవస్థల గురించి, ఈవీఎంల గురించి, ఎలక్షన్ కమిషన్ గురించి మాట్లాటం విడ్డూరంగా ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. తన ప్రజా వ్యతిరేక పాలనకు వ్యతిరేకంగా తీర్పు ఇవ్వబోతున్నారని తెలుసుకొన్న చంద్రబాబు రాష్ట్ర రాజధాని, దేశ రాజధాని ప్రాంతాల్లో నానా యాగీ చేస్తున్నారని దుయ్యబట్టారు. మంగళవారం హైదరాబాద్ లోటస్‌పాండ్‌లోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలంలో మరో ఎమ్మెల్యే కోన రఘుపతితో కలిసి మీడియాతో మాట్లాడారు. ఐటీని పరిచయం చేసింది తానే అని గత పదిహేను సంవత్సరాల నుంచి చంద్రబాబు చెబుతున్న మాటలతో ప్రజలు విసిగి పోయారన్నారు. ఇప్పుడు ఓడిపోతున్నానని తెలిసే చంద్రబాబు ఈవీఎంల పనితీరుపై విమర్శలు చేస్తున్నారని చెప్పారు. ఈవీఎంలపై దేశవ్యాప్తంగా నానా యాగీ చేసిన బాబు తన చేష్ట ద్వారా ఎంతగా దిగాజారారో అర్థమౌతోందని పేర్కొన్నారు. ఒకవైపు తమకు 130 సీట్లు వస్తాయంటూనే మరోవైపు ఈవీఎంలు, వీవీ ప్యాట్లపై నమ్మకం లేదంటూ వితండ వాదం చేస్తున్నారన్నారు. చంద్రబాబు తీరును చూసి జాతీయ నేతలు సైతం అసహ్యించుకుంటున్నారని తెలిపారు. ఓడే బాబు సౌండెక్కువ లాంటి సామెతలు పట్టుకొస్తున్నాయని చెప్పారు. దోపిడీదారులంతా చంద్రబాబు చుట్టూ ... దోపిడీ దారులందరూ చంద్రబాబు పక్కనే ఉన్నారన్నారని శ్రీకాంతరెడ్డి ధ్వజమెత్తారు. గతంలో దొంగనోట్లు ముద్రించిన రామకృష్ణ గౌడ్ చంద్రబాబు మనిషేనని గుర్తు చేశారు. స్టాంప్ కుంభకోణంలో అప్పట్లో చంద్రబాబు కేబినెట్లోని నలుగురు మంత్రుల ప్రమేయం ఉందన్నారు. ఎర్రచందనం దొంగలు అందరూ చంద్రబాబుతోనే ఉన్నారన్నారు. బ్యాంకులు లూటీ చేసిన టాప్ 100 మందిలో సుజనాచౌదరి సహా ఎక్కువ మందికి చంద్రబాబుతో సంబంధాలు ఉన్నాయన్నారు. తెలుగు రాష్ట్ర ప్రజల డేటా చోరీ చేసిన వ్యక్తి అశోక్ చంద్రబాబు మనిషేనని అన్నారు. తిరుపతి – తిరుమల, విజయవాడ ఆలయాల్లో దొంగతనాలు జరిగింది బాబు హయాంలోనే అని చెప్పారు. సీమ వాసుల గొంతు కోసిన బాబు... వర్షపాతానికి సంబంధించి రాష్ట్రానికి మంచిరోజులు రాబోతున్నాయని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. ఇది జగన్ పరిపాలన వస్తుందనేందుకు శుభసంకేతమన్నారు. రాయలసీమకు నీళ్లు ఇచ్చానని అబద్ధపు ప్రచారం చేసుకుంటున్నారని చెప్పారు. ధైర్యం ఉంటే రాయలసీమకు రండి పల్లెల్లో తిరుగుదామని అని శ్రీకాంత్ రెడ్డి సవాల్ విసిరారు. బిందె నీరు తాగేందుకు లేక రాయలసీమలో గ్రామాల ప్రజలు అల్లాడిపోతున్నారన్నారు. చంద్రబాబును పట్టుకుంటే జాతీయ పార్టీలు కూడా మునిగిపోతాయని, ఈ విషయం ఆయా పార్టీల నేతలు తెలుసుకోవాలన్నారు. నీచరాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ అయిన దేనినేని ఉమ ఓడిపోతానని తెలిసి ఆ భయంతో మాట్లాడుతున్నాడని ధ్వజమెత్తారు. గెలుపు ఓటములను హందాగా స్వీకరించే లక్షణం ఉండాలి: కోన రఘుపతి ఎన్నికల్లో ఓటమైనా.. గెలుపైనా హుందాగా స్వీకరించే లక్షణం నాయకులకు ఉండాలని ఎమ్మెల్యే కోన రఘుపతి అన్నారు. 2014లో ఎన్నికల్లో వైఎస్ జగన్ ప్రజాతీర్పును హుందాగా స్వీకరించి ప్రతిపక్షంలో కూర్చున్నారన్నారు. చంద్రబాబు వైఖరి చూస్తుంటే ఓడిపోయే ముందుగానే సాకులు వెతుకుతున్నట్లుగా ఉందన్నారు. 2014లో గెలిచినప్పుడు ఈవీఎంలను అంగీకరించిన బాబు ఇప్పుడు ఓటమి తప్పదని బ్యాలెట్ పద్ధతి పల్లవి అందుకున్నారన్నారు. బాబుకు అనుభవం ఉందని సీఎం చేస్తే రాష్ట్ర పరువు తీయడమేకాక అన్ని వర్గాలను మోసం చేశారన్నారు. కాల్‌మనీ సెక్స్ రాకెట్లో ఇరుకున్న బుద్దా వెంకన్న లాంటి వారి విమర్శలకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. -
బాపట్లలో వైఎస్ షర్మిల రోడ్ షో
-
జగనన్నకి ఒక్క అవకాశం ఇవ్వండి: షర్మిల
సాక్షి, బాపట్ల : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పుట్టినప్పటి నుంచి ఎవరితోనూ పొత్తు లేదని, ఒంటరిగానే పోరాటం చేస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి వైఎస్ షర్మిల అన్నారు. తమకు ఏ పార్టీతో పొత్తు లేదని, ఆ అవసరం కూడా తమకు లేదని అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్ షర్మిల సోమవారం బాపట్లలో రోడ్ షో నిర్వహించారు. చంద్రబాబు ప్రజలకిచ్చిన ఏ ఒక్క హామీ నెలవేర్చలేదని, జయంతి,వర్థంతికి తేడా తెలియని పప్పుకు మూడు శాఖలు కేటాయించడం విడ్డూరమని ఆమె విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా వైఎస్ షర్మిల మాట్లాడుతూ... ‘టీడీపీ గత ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుని నాలుగేళ్లు సంసారం చేసింది. ఇప్పుడు కాంగ్రెస్‌తో పొత్తు అంటూ ముందుకు వెళుతోంది. హరికృష్ణ భౌతికకాయాన్ని పక్కన పెట్టుకునే... ఇంగిత జ్ఞానం లేకుండా టీఆర్ఎస్తో పొత్తు కోసం వెంపర్లాడిన చంద్రబాబు...శవ రాజకీయాలు చేశారు. అలాంటి ఆయన వైఎస్సార్ సీపీ ఆ పార్టీతో పొత్తు, ఈ పార్టీతో పొత్తు పెట్టుకుందని అసత్య ప్రచారాలు చేస్తున్నారు. మాకు బీజేపీతో పొత్తు లేదు, కేసీఆర్‌తో పొత్తులేదు. అసలు మాకు ఆ అవసరం కూడా లేదు. కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన అన్న... ఆ తర్వాత అమ్మ... అనంతరం కూడా ఎవరితో పొత్తు లేకుండా ఒంటరిగానే పోరాటం చేశాడు. సింహం సింగిల్‌గానే వస్తుంది. ఎవరితో పొత్తు లేకుండా సింగిల్‌గానే జగనన్న మీ ముందుకు వస్తున్నారు. రాబోయే ప్రభుత్వంలో మన పార్టీ గెలిచే సీట్లు అన్ని సింగిల్‌గానే గెలుద్దాం. వైఎస్సార్ సీపీ ఏ పొత్తు లేకుండా బంపర్ మెజార్టీతో అధికారంలోకి వస్తుందని సర్వేలు కూడా చెబుతున్నాయి. ఒక్క అవకాశం జగనన్నకు ఇమ్మని, మిమ్మల్ని కోరుకుంటూ ఫ్యాను గుర్తుకు ఓటు వేయమని ప్రార్థిస్తున్నాను. వైఎస్సార్ సీపీ బాపట్ల ఎమ్మెల్యే అభ్యర్థి కోన రఘుపతి, ఎంపీ అభ్యర్థి నందిగం సురేష్‌కు అత్యధిక మెజార్టీతో గెలుపించుకుందాం. మీ అమూల్యమైన ఓటు ఫ్యాను గుర్తుకు వేసి వారిద్దర్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నా.’ అని కోరారు. -
చంద్రబాబు 600 హామీలిచ్చి మరిచారు: కోన రఘుపతి
-
వైఎస్ఆర్సీపీ బ్రాహ్మణ అధ్యయన కమిటీ సమావేశం
-
‘చంద్రబాబుకు కుల గజ్జి పట్టుకుంది’
-
‘చంద్రబాబుకు కుల గజ్జి పట్టుకుంది’
సాక్షి, విజయవాడ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కుల గజ్జి పట్టుకుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు కోన రఘుపతి, మల్లాది విష్ణు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తన సామాజిక వర్గానికి చెందిన పోలీసు అధికారులను కీలక స్థానాల్లో నియమించడమే ఇందుకు నిదర్శనమని దుయ్యబట్టారు. శనివారమిక్కడ విలేరులతో మాట్లాడుతూ... సర్వేల పేరుతో టీడీపీ బరితెగించి అక్రమాలకు పాల్పడుతోందని విమర్శించారు. ఇప్పటికే తమకు వ్యతిరేకులుగా భావిస్తున్న పలువురి ఓట్లను తొలగించిందని ఆరోపించారు. గత ఎన్నికల్లో తమ పార్టీ కేవలం 5 లక్షల ఓట్ల తేడాతో అధికారం కోల్పోయిందని.. అందుకే ప్రస్తుతం చంద్రబాబు కుయుక్తులతో గెలవాలని చూస్తున్నారని మండిపడ్డారు. అందుకే దిగజారుడు చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఓట్ల తొలగింపు, బోగస్ ఓట్ల విషయమై తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారని తెలిపారు. ఇప్పుడు గవర్నర్‌కు కూడా ఫిర్యాదు చేయనున్నారని పేర్కొన్నారు. -
బాబుకు చిత్తశుద్ధి లేదు : కోన రఘుపతి
-
‘వైఎస్ జగన్ తొలి విజయం అదే’
సాక్షి, హైదరాబాద్ : టీడీపీ పగలు కాంగ్రెస్‌తో.. రాత్రి బీజేపీతో చేతులు కలుపుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి, సంక్షేమం సన్నగిల్లిందని విమర్శించారు. మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తే దానిలో 5 శాతం వాటా కాపులకు కేటాయిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పడం ఏమిటని ప్రశ్నించారు. రాష్ట్రంలో టీడీపీ ఖాళీ అవడం ఖాయమని, ప్రజలంతా వైఎస్సార్ సీపీ వైపే ఉన్నారని పేర్కొన్నారు. టీడీపీ నేతలు ఇకనైనా మోసాలు, మాయలు కట్టిపెట్టాలని.. ప్రజలను గందరగోళానికి గురిచేయడం ఆపాలని హితవు పలికారు. బాబుకు చిత్తశుద్ధి లేదు : కోన రఘుపతి రిజర్వేషన్ల విషయంలో సీఎం చంద్రబాబు నాయుడికి చిత్తశుద్ధి లేదని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే కోన రఘుపతి అన్నారు. కాపులు చంద్రబాబు మాటలు నమ్మరని.. అయినా కేంద్రం పరిధిలో ఉన్న విషయాన్ని తాను అమలు చేస్తానని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. నవరత్నాల్లోని రెండు అంశాలు చంద్రబాబు అమలు చేయడాన్ని వైఎస్ జగన్ తొలి విజయంగా రఘుపతి అభివర్ణించారు. -
సాక్షి కార్యాలయం వద్ద అన్నం అనుచరుల దౌర్జన్యం
మంగళగిరి/బాపట్లటౌన్: ప్రభుత్వ భూములు తనఖా పెట్టి బ్యాంకును బురిడీ కొట్టించిన ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ అనుచరులు సాక్షి దినపత్రికపై దౌర్జన్యానికి దిగారు. ఆదివారం ప్రచురితమైన సంచికలో తన బండారం సాక్షి బయటపెట్టిందని అక్కసు వెళ్లగక్కారు. సాక్షి కార్యాలయాలను ముట్టడించాలని అనుచరులు, టీడీపీ కార్యకర్తలను రెచ్చగొట్టారు. దీంతో సోమవారం వారు గుంటూరు జిల్లా మంగళగిరి మండలంలోని ఆత్మకూరు గ్రామంలో ఉన్న సాక్షి కార్యాలయాన్ని ముట్టడించి ధ్వంసం చేయాలని పథకరచన చేశారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు సాక్షి కార్యాలయం వద్దకు చేరుకుని భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆదివారమే ఇలాంటి పథక రచన చేయగా బాపట్ల నుంచి బయలుదేరిన ఆయన అనుచరులను పోలీసులు మధ్యలోనే అడ్డుకున్న విషయం తెలిసిందే. మరోసారి పోలీసులు అడ్డుకోవడంతో వారితో వాగ్వాదానికి దిగారు. దూషణల పర్వం.. బాపట్ల నుంచి వాహనాల్లో అన్నం సతీష్ అనుచరులు బయలుదేరినప్పటినుంచి తమ అనుకూల మీడియాకు సమాచారం ఇస్తూ వచ్చారు. మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో నినాదాలు చేసుకుంటూ సాక్షి కార్యాలయం వద్దకు చేరుకున్న వారిని పోలీసులు లోపలికి అనుమతించలేదు. దీంతో అక్కడే మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌తో పాటు సాక్షి దినపత్రికపై ఇష్టానుసారం దూషణల పర్వం కొనసాగించారు. తమతో తీసుకొచ్చిన రైతులకు ఏం మాట్లాడాలో ముందే చెప్పి మీడియాతో మాట్లాడించారు. బందోబస్తును ఛేదించి కార్యాలయంలోకి వెళ్లాలని ప్రయత్నించినా పోలీసులు గట్టిగా ప్రతిఘటించడంతో కార్యాలయం గేటు ముందు బైఠాయించి నినాదాలు చేశారు. అన్నం యువసేన సత్తా ఏమిటో వైఎస్ జగన్‌కు, సాక్షికి చూపిస్తామంటూ బెదిరించారు. గుంటూరు నార్త్ జోన్ డీఎస్పీ జి.రామకృష్ణ ఆధ్వర్యంలో పట్టణ సీఐ చింతా రవిబాబు, రూరల్ ఎస్ఐ వీరనాయక్ ఆధ్వర్యంలో సుమారు 50 మంది సిబ్బంది, క్యూఆర్టీ బృందంతో బందోబస్తు ఏర్పాటు చేశారు. పత్రికలపై దాడి సరికాదు: కోన రఘుపతి పత్రికలో వార్త వస్తే వాటి కార్యాలయాలపై దాడి చేయటం, యాజమాన్యాలను దూషించడం సరికాదని ఎమ్మెల్యే కోన రఘుపతి తెలిపారు. బాపట్లలో ఆయన విలేకరులతో మాట్లాడారు. సాక్షిలో ప్రచురించిన కథనంపై అధికార పార్టీ నాయకులు పత్రిక కార్యాలయం ముట్టడికి ప్రయత్నించడాన్ని తప్పుబట్టారు. విలేకరులు వారికున్న ఆధారాలతో వార్తలు రాస్తారని, అధికారంలో ఉన్న వ్యక్తులపై ఆరోపణలు వచ్చినప్పుడు వారి దగ్గరున్న ఆధారాలను చూపిస్తూ సమాధానం చెప్పుకోవాలన్నారు. రైతులకు రుణం ఇవ్వడానికి సవాలక్ష నిబంధనలు పెట్టే బ్యాంకు అధికారులు.. అధికార పార్టీ నేత విషయంలో జాగ్రత్త వహించకుండా ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ నేతలు నరాలశెట్టి ప్రకాశరావు, కోకి రాఘవరెడ్డి పాల్గొన్నారు. సాక్షి కార్యాలయం వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసిన పోలీసులు -
బ్రాహ్మణులను చులకనగా చూడకు..
సాక్షి అమరావతి: బ్రాహ్మణులు ఏం చేస్తార్లే అనే దురహంకారం, చులకన భావంతో టీడీపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కోన రఘుపతి ధ్వజమెత్తారు. వారి జంధ్యం పోగులే టీడీపీ ప్రభుత్వానికి ఉరి తాళ్లుగా మారుతాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. శనివారం వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురంలో ప్రభుత్వ వేధింపులు భరించలేక ఫణికుమారాచార్యులు అనే అర్చకుడు ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమన్నారు. గురువు స్థానంలో ఉంచి గౌరవించాల్సిన అర్చకుడిని.. ఆత్మహత్య చేసుకునేలా పురిగొల్పడం దారుణమన్నారు. సీఎం చంద్రబాబు అన్ని వ్యవస్థలను నాశనం చేశారని ధ్వజమెత్తారు. రైతులు, విద్యార్థులు, మహిళలు ఇలా ప్రతి ఒక్కర్నీ మోసం చేశారని దుయ్యబట్టారు. చివరకు భగవంతుడిని కూడా రాజకీయాల కోసం వాడుకునే దుస్థితికి చంద్రబాబు దిగజారిపోయాడని విమర్శించారు. మచిలీపట్నం కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసేందుకు వచ్చిన ఓ వ్యక్తి అధికారుల ఎదుటే ఆత్మహత్యకు పాల్పడ్డాడంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చన్నారు. అర్చకుల వంశపారంపర్య హక్కుపై హైకోర్టు ఇచ్చిన తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి చెంప పెట్టు అని పేర్కొన్నారు. వారికి శక్తి ఉన్నంతకాలం అర్చకులుగా కొనసాగవచ్చని కోర్టు తీర్పిచ్చినా పట్టించుకోకుండా.. ప్రభుత్వం బ్రాహ్మణులను ఇబ్బందులకు గురి చేస్తోందని ఆరోపించారు. కోర్టు తీర్పును గౌరవించి వంశపారంపర్య హక్కును కొనసాగించాలని డిమాండ్ చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జీవో 76ను అమలు చేస్తూ అర్చకులు వంశపారపర్యంగా కొనసాగే హక్కును కల్పించారని కోన రఘుపతి గుర్తు చేశారు. ఆ జీవో అమలు చేయకుండా చంద్రబాబు కాలయాపన చేస్తున్నారని ధ్వజమెత్తారు. బ్రాహ్మణులెవరూ ఆత్మవిశ్వాసం కోల్పోయి ఆత్మహత్యలకు పాల్పడవద్దని విజ్ఞప్తి చేశారు. టీడీపీ ప్రయోజనాల కోసమే బ్రాహ్మణ కార్పొరేషన్.. టీడీపీ ప్రయోజనాల కోసమే బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు తప్ప.. బ్రాహ్మణుల సమస్యలను పరిష్కరించేందుకు కాదని కోన విమర్శించారు. ఇప్పటికీ పేద బ్రాహ్మణ విద్యార్థులు ఫీజులు చెల్లించలేక అత్యంత దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ.. టీడీపీ అధికారంలోకి వచ్చాక పుష్కరాల్లో వందల ఆలయాలను కూల్చివేశారని మండిపడ్డారు. తిరుపతి, శ్రీశైలం, విజయవాడ తదితర ప్రాంతాల్లోని ప్రధాన ఆలయాల్లో వివాదాలు నెలకొన్నా పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. ట్రస్ట్ బోర్డు సభ్యులు సైతం అర్చకులను వేధిస్తున్నారన్నారు. ప్రభుత్వ వేధింపులు భరించలేక ఇద్దరు అర్చకులు ఆత్మహత్యకు పాల్పడగా.. ప్రభుత్వ తీరును నిరసించినవారిపై కేసులు నమోదు చేయడం దారుణమన్నారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే దేవాలయ వ్యవస్థలకు సంబంధించి ప్రత్యేక నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. -
ఎమ్మెల్యేపై అనర్హత: అసెంబ్లీ కార్యదర్శిని కలిసిన వైఎస్సార్సీపీ నేతలు
సాక్షి, మడకశిర: అనంతపురం జిల్లా మడకశిర టీడీపీ ఎమ్మెల్యే ఈరన్నపై అనర్హత వేటు వేస్తూ సుప్రీంకోర్టు, హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రతులను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు శనివారం ఏపీ అసెంబ్లీ కార్యదర్శికి అందజేశారు. టీడీపీ ఎమ్మెల్యేపై వేటు వేసి.. ఆయన స్థానంలో మడకశిర నియోజకవర్గం వైఎస్సార్సీపీ అభ్యర్థి డాక్టర్ తిప్పేస్వామిని ఎమ్మెల్యేగా కొనసాగించాలని న్యాయస్థానాలు ఉత్తర్వులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ నెల 20లోగా తనతో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయించాలని స్పీకర్ కోడెల శివప్రసాదరావు, అసెంబ్లీ కార్యదర్శిని తిప్పేస్వామి కోరుతున్నారు. శాసనసభ ఆవరణలో అసెంబ్లీ కార్యాదర్శి కార్యాలయానికి వెళ్లిన తిప్పేస్వామి వెంట వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు కోన రఘుపతి, ఆదిములపు సురేష్ తదితరులు ఉన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం మడకశిర తదుపరి ఎమ్మెల్యేగా తనను గుర్తించాలని తిప్పేస్వామి అసెంబ్లీ కార్యదర్శిని కోరారు. ఇప్పటికే స్పీకర్‌కు, అసెంబ్లీ కార్యదర్శికి తనను ఎమ్మెల్యేగా ప్రకటిస్తూ హైకోర్టు, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రతులను ఫ్యాక్స్, ఈ–మెయిల్ ద్వారా పంపానని ఆయన వెల్లడించారు. స్పీకర్ పిలుపు కోసం ఎదురు చూస్తున్నానని, కోర్టు ఉత్తర్వులను గౌరవించి తనతో ఎమ్మెల్యేగా ప్రమాణం చేయిస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు. కాగా, ఢిల్లీలో శుక్రవారం కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారిని తిప్పేస్వామి కలిసి కోర్టులు ఇచ్చిన తీర్పు ప్రతులను కేంద్ర ఎన్నికల సంఘానికి అందించారు. -
రాబోయే రోజుల్లో 76 జీవో అమలు చేస్తాం: కోన
హైదరాబాద్: విశాఖపట్నంలో జరిగిన బ్రాహ్మణ ఆత్మీయ సమావేశంలో బ్రాహ్మణుల సమస్యలు పరిష్కారిస్తామని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కోన రఘుపతి గుర్తు చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో కోన విలేకరులతో మాట్లాడుతూ..ఆర్ధికంగా చితికిపోయిన బ్రాహ్మణులను ఆదుకోవాలనే సంకల్పంతో బ్రాహ్మణ కార్పొరేషన్‌ను రూ. వెయ్యి కోట్లతో ఏర్పాటు చేయాలని వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. కానీ చంద్రబాబు ఐదేళ్లకు గానూ రూ.205 కోట్లు మాత్రమే కేటాయించి ఇప్పటి వరకు రూ.170 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని తెలిపారు. టీడీపీ ప్రభుత్వం ఐవైఆర్ కృష్ణా రావుని అవమానించిందని గుర్తు చేశారు. అలాగే టీటీడీ మాజీ అర్చకులు రమణ దీక్షితుల్ని అవమానించి ఆయనకు అన్యాయం చేసిందని విమర్శించారు. బ్రాహ్మణ ద్వేషంతో చంద్రబాబు ఉన్నారని, గత ఎన్నికల్లో టీడీపీ నుంచి ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా బ్రాహ్మణులకు కేటాయించలేదని తెలిపారు. తిరుమల కొండపై అన్యమత ప్రచారం చేయవద్దని వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్పష్టంగా చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. అర్చకుల సమస్యలు చంద్రబాబుకు పట్టవన్నారు. జాతీయ భావనే చంద్రబాబుకు లేదని, రాబోయే రోజుల్లో 76 జీవో అమలు చేస్తామని చెప్పారు. బ్రాహ్మణుల అభ్యున్నతికి వైఎస్సార్సీపీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. బ్రాహ్మణుల సమస్యలపై వైఎస్సార్సీపీ అధ్యయన కమిటీ ఏర్పాటు చేసి మల్లాది విష్ణుతో కలిసి అన్ని జిల్లాల్లో పర్యటించి సమస్యలు అధ్యయనం చేస్తామని చెప్పారు. -
హోదాకు అడ్డుపడింది చంద్రబాబు కాదా?: కోన రఘుపతి
సాక్షి, హైదరాబాద్ : అసెంబ్లీ సమావేశాల చివరిరోజున ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మరోసారి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కోన రఘుపతి విమర్శించారు. ప్రత్యేక హోదాపై అసెంబ్లీలో నాలుగోసారి తీర్మానం ప్రవేశపెట్టి చంద్రబాబు మరోసారి ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. ఇప్పుడు పదవీకాలం అంతా అయిపోయాక అసెంబ్లీలో తీర్మానం ఎందుకు అని ప్రశ్నించారు. గత నాలుగున్నరేళ్లగా ఏపీ ప్రజలను చంద్రబాబు అన్నిరకాలుగా నిరాశకు గురిచేస్తూ వచ్చారని మండిపడ్డారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రత్యేక హోదాకు అడ్డుపడింది చంద్రబాబు కాదా? అని కోన రఘుపతి ప్రశ్నించారు. ప్యాకేజీ పేరిట ప్రత్యేక హోదాను ఆయన పక్కన పెట్టేసిన విషయాన్ని గుర్తుచేశారు. మొదట కేంద్రం బ్రహ్మాండమైన పాకేజీ ఇస్తుందని ఊరించిన చంద్రబాబు ఇప్పుడు ప్రత్యేక హోదా గురించి పోరాడుదామంటూ యూ టర్న్ తీసుకుంటున్నారని విమర్శించారు. ప్రత్యేక హోదా విషయమై చంద్రబాబు నాలుగోసారి తీర్మానం పెట్టారని గుర్తుచేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ పెంచేందుకు ప్రయత్నిస్తామంటూ విద్యార్థులను బాబు మోసగిస్తున్నారని విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను మరిచిపోయి చంద్రబాబు.. నిరుద్యోగులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ రిమోట్ కంట్రోల్ నాలుగేళ్లుగా బీజేపి ఆఫీస్‌లో ఉందని, బీజేపీ ఆఫీస్‌లో రిమోట్ కంట్రోల్ ఉండటం వల్లే.. ఓటుకు నోటు కేసుకు భయపడి చంద్రబాబు పారిపోయి వచ్చారని ఎద్దేవా చేశారు. ప్రతిపక్షంలో ఉన్న తమకు రిమోట్ కంట్రోల్ ఎందుకు అని ప్రశ్నించారు. ప్రతిపక్షంపై పసలేని ఆరోపణలు చేస్తూ చంద్రబాబు కాంగ్రెస్‌తో అంటకాగుతున్నారని దుయ్యబట్టారు. -
ప్రత్యేక హోదాకు అడ్డుపడింది చంద్రబాబు కాదా?
-
నామినేటెడ్ పదవుల్లో బ్రాహ్మణులకు సముచిత స్థానం కల్పించాలి
-
‘నమ్మినవారే వైఎస్ జగన్‌ను మోసం చేశారు’
సాక్షి, విశాఖపట్నం: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి బ్రాహ్మణుల సంక్షేమానికి పెద్దపీట వేశారని వైఎస్సార్ సీపీ నాయకులు మల్లాది విష్ణు అన్నారు. విశాఖలో బ్రాహ్మణ సంఘాలతో జరిగిన ఆత్మీయ సమావేశానికి వైఎస్సార్ సీపీ అధ్యకుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి, ఆ పార్టీ నాయకులు మల్లాది విష్ణు, కోన రఘుపతి, మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ.. టీడీపీ తొలి నుంచి బ్రాహ్మణులను ఇబ్బంది పెడుతోందని విమర్శించారు. అర్చకులకు రిటైర్మెంట్ లేకున్నా.. రమణ దీక్షితులను తొలగించారని మండిపడ్డారు. ఆయనను ఎందుకు తొలగించారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్ బ్రాహ్మణుల సంక్షేమానికి వెయ్యి కోట్లు ఖర్చుపెడితే.. చంద్రబాబు మాత్రం అరకొర నిధులే ఖర్చు చేశారని తెలిపారు. ప్రజాస్వామ్యం నిలబడాలంటే వైఎస్ జగన్‌ను సీఎం చేయాలని అన్నారు. వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే దేవాలయ భూముల పరిరక్షణకు, బ్రాహ్మణ సంక్షేమానికి చర్యలు తీసుకుంటారని తెలిపారు. బ్రాహ్మణులంతా సంఘటితంగా ఉండి వైఎస్ జగన్‌ను ఆశీర్వదించాలని కోరారు. కోన రఘపతి మాట్లాడుతూ.. నామినేటెడ్ పదవుల్లో బ్రాహ్మణులకు సముచిత స్థానం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వైఎస్ జగన్ మాట మీద నిలబడే వ్యక్తి అని తెలిపారు. వైఎస్ జగన్ ఎవరినీ మోసం చేయలేదని.. నమ్మినవారే ఆయన్ని మోసం చేశారని తెలిపారు. కాంగ్రెస్, టీడీపీలు కుమ్మకై వైఎస్ జగన్‌పై కేసులు పెట్టాయని గుర్తుచేశారు. వారు పెట్టిన ఒక్క కేసులో కూడా బలం లేదని పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై ఏ రాజకీయ నాయకుడు చేయనన్నీ పోరాటాలు వైఎస్ జగన్ చేశారని చెప్పారు. ఆదివారం కంచరపాలెంలో వైఎస్ జగన్ సభకు హాజరైన జన సునామీని చూసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెట్రోల్‌పై 2 రూపాయలు తగ్గించారని అన్నారు. -
రమణ దీక్షితులను ఎందుకు తొలగించారు
-
బ్రాహ్మణులంటే బాబుకు లెక్కలేదు: కోన
సాక్షి, విశాఖపట్నం: ఏపీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడి ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన బ్రాహ్మణ కార్పొరేషన్ మీద అనేక ఆరోపణలు వస్తున్నాయని, ఈ ప్రభుత్వ పోకడ చూస్తుంటే చంద్రబాబుకు బ్రాహ్మణులంటే లెక్కేలేదని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కోన రఘుపతి వ్యాఖ్యానించారు. విశాఖలో విలేకరులతో మాట్లాడుతూ.. ఐవైఆర్ కృష్ణారావు లాంటి సీనియర్ ఐఏఎస్ అధికారిని బయటకు పంపించిన ఘనత చంద్రబాబు ప్రభుత్వంలో చూశామన్నారు. రమణ దీక్షితులు లాంటి ఆగమ శాస్త్ర పండితులను అన్యాయంగా టీడీపీ ప్రభుత్వం బయటకు పంపించిందని విమర్శించారు. చంద్రబాబు దయవల్ల ఈ రోజు ఎన్నికలు క్యాష్, కాస్ట్ ఉంటేనే రావాల్సిన పరిస్థితి ఏర్పడిందని వ్యాఖ్యానించారు. బ్రాహ్మణ సంఘాలతో ఆత్మీయ సమావేశం ఈ నెల 10న మధ్యాహ్నాం 2 గంటలకు సిరిపురం విజ్ఞాన్ స్కూల్ గ్రౌండ్స్‌లో బ్రాహ్మణ సంఘాల ఆత్మీయ సమావేశం ఉంటుందని, దీనికి వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్య అతిధిగా హాజరవుతారని కోన రఘుపతి వెల్లడించారు. రాబోయే ఎన్నికల్లో బ్రాహ్మణ సామాజిక వర్గం అభివృద్ధికి వైఎస్సార్సీపీ చేయబోయే అంశాల మీద సమావేశంలో చర్చించనున్నట్లు తెలిపారు. -
చికాగోలో ఘనంగా వైఎస్సార్ జయంతి వేడుకలు
చికాగో: దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని చికాగో తెలుగు కమ్యూనిటీ ఘనంగా నిర్వహించింది. స్థానిక థుమ్కా బాంకెట్ హోటల్లో నిర్వహించిన ఈ వేడుకకు భారీ ఎత్తున వైఎస్సార్ అభిమానులు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు వైఎస్సార్‌తో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ముఖ్యమంత్రిగా వైఎస్సార్ పేదప్రజలకు, విదేశాల్లో ఉన్న తెలుగువారికి అందించిన సేవలను కొనియాడారు. అదేవిధంగా తండ్రి బాటలో ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ప్రజాపక్షనేతగా ఎదిగినతీరు పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి పద్మజా రెడ్డి, చికాగో పార్టీ ఇంచార్జ్ రామిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి (ఆర్వీ రెడ్డి) ముఖ్య అతిథులుగా హాజరయ్యారు . కార్యక్రమంలో రమణా అబ్బరాజు, మనోజ్ సింగమశెట్టి, రాంభూపాల్ రెడ్డి కందుల, కేకే రెడ్డి, వెంకట్ రెడ్డి లింగారెడ్డిగారి, జయదేవ్ మెట్టుపల్లి, క్రిష్ణా రంగరాజు, శ్రీని వోరుగంటి, రమాకాంత్ రెడ్డి, హరిందర్ రెడ్డి, జగదీశ్, శివ, రవి కిషోర్ ఆల్లా, సేతుకుమార్ కర్రి, ప్రమోద్ ముత్యాల, రామిరెడ్డి పెద్దిరెడ్డి, వెంకట్ పులుసు, గోపీ పిట్టల, మోహన్, రాజ్ అడ్డగట్ల, సురేష్ శంక, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. -
కోన రఘుపతిని సత్కరించిన ఎన్నారైలు
వాషింగ్టన్ డీసీ : నాటా సభలకు హాజరైన వైఎస్సార్సీపీ బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతిని ఘనంగా సత్కరించారు. పిలిచిన వెంటనే.. ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు నాటా సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే కోన రఘుపతిని శాలువా కప్పి సత్కరించారు. అనంతరం పలువురు మాట్లాడుతూ.. ఎళ్లవేళలా సహాయ సహకారాలు అందించాలని కోరుతూ.. నాటా కోరిక మేరకు సభలో పాల్గొన్నందుకు వచ్చినందుకు కోన రఘుపతికి కృతజ్ఞతలు తెలిపారు. -
కోన రఘుపతిని సత్కరించిన నాటా సభ్యులు
-
‘టీడీపీ నేతలవి ఊసరవెళ్లి రాజకీయాలు’
సాక్షి, గుంటూరు : టీడీపీ నేతల ఊసరవెళ్లి రాజకీయాలను జనం గమనిస్తూనే ఉన్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి అన్నారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. విభజన హామీలను సాధించడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఘోరంగా విఫలమయ్యారని ఆయన విమర్శించారు. ప్రత్యేక హోదా కోసం మొదటి నుంచీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీయే పోరాటం చేస్తోందన్నారు. చిత్తశుద్ధి ఉండబట్టే ఇంకా సంవత్సరం సమయం ఉన్నా తమ పార్టీ ఎంపీలు పదవులను తృణప్రాయంగా వదిలేశారని.. ప్రాణాలు సైతం లెక్కచేయకుండా ఆమరణ నిరాహార దీక్ష కూడా చేశారని తెలిపారు. దీక్షలు, పోరాటాలు వైఎస్సార్ సీపీకే సాధ్యమని.. తమతోనే ప్రత్యేక హోదా సాధ్యమవుతుందని ఆయన వ్యాఖ్యానించారు. -
‘బాబు చేసింది తక్కువ.. చెప్పుకునేది ఎక్కువ’
సాక్షి, విజయవాడ: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసింది తక్కువ.. చెప్పుకునేది ఎక్కువని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోన రఘుపతి అన్నారు. బ్రాహ్మణ ఐక్య వేదిక ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. రాష్ట్రంలో నాలుగు శాతం మేర బ్రాహ్మణులు ఉన్నారని, రూ.1.45 లక్షల కోట్లు బ్రాహ్మణ సామాజిక వర్గానికి రావాల్సి ఉందన్నారు. ఇదంతా ఐవైఆర్ కృష్ణారావు చెప్పడం వల్లనే ఆయన తొలగించారని ఆరోపించారు. చంద్రబాబు బ్రాహ్మణ వ్యతిరేకని, కనీసం ఒక్క అభ్యర్థికి కూడా ఎమ్మెల్యే సీటు ఇవ్వలేకపోయారన్నారు. టీటీడీపై రమణదీక్షితులు చేసిన ఆరోపణలపై ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా సీబీఐ విచారణకు సిద్ధం కావాలన్నారు. వెంకన్నభక్తుల మనోభావాలను ప్రభుత్వం దెబ్బతీస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రమణ దీక్షితులు ప్రశ్నింస్తుండటం వల్లే ఆయనపై దాడి చేయిస్తున్నారని తెలిపారు. -
వైఎస్ జగన్‌ను కలిసిన వెయిట్‌లిఫ్టర్ రాహుల్
విజయవాడ స్పోర్ట్స్: కామన్వెల్త్ గేమ్స్ వెయిట్‌లిఫ్టింగ్‌లో స్వర్ణ పతకం సాధించిన తెలుగు తేజం రాగాల వెంకట్ రాహుల్ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశాడు. ప్రజా సంకల్ప యాత్రలో ఉన్న వైఎస్ జగన్‌ను ఆదివారం ఆగిరిపల్లి క్యాంపు వద్ద రాహుల్ తన తండ్రి మధుతో పాటు కలిశాడు. రాహుల్‌కు ఆర్థిక సాయం చేస్తామని ఈ సందర్భంగా జగన్ తెలిపారు. భవిష్యత్‌లో మరిన్ని పతకాలు సాధించాలని ఆకాంక్షించారు. రాహుల్‌కు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కోన రఘుపతి లక్ష రూపాయలు ఆర్థిక సాయం ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా స్టువర్టుపురం ప్రాంతానికి చెందిన రాగాల వెంకట్ రాహుల్ గోల్డ్‌కోస్ట్ (ఆస్ట్రేలియా) వేదికగా జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో 85 కేజీల విభాగంలో స్వర్ణ పతకం సాధించిన విషయం తెలిసిందే. -
స్వర్ణ విజేత రాహుల్‌కు వైఎస్సార్సీపీ ఆర్థికసాయం
-
వైఎస్ జగన్‌ను కలిసిన స్వర్ణ విజేత రాహుల్
సాక్షి, విజయవాడ: కామన్వెల్త్ గేమ్స్ వెయిట్ లిప్టింగ్ విభాగంలో స్వర్ణం సాధించిన తెలుగు తేజం రాగాల వెంకట్ రాహుల్ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. రాహుల్‌కు ఆర్థిక సాయం చేస్తామని వైఎస్సార్సీపీ అధినేత తెలిపారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కోన రఘుపతి రాహుల్‌కు లక్ష రూపాయల ఆర్థిక సాయం ప్రకటించారు. కామన్వెల్త్లో స్వర్ణం నెగ్గిన రాహుల్‌ను ఈ సందర్భంగా వైఎస్ జగన్ మరోసారి అభినందించారు. కాగా, వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర కృష్ణా జిల్లాలో దిగ్విజయంగా కొనసాగుతోంది. గోల్డ్‌కోస్ట్ వేదికగా జరిగిన కామెన్వెల్త్ గేమ్స్‌లో 85 కేజీల విభాగంలో ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా స్టువర్ట్పురం ప్రాంతానికి చెందిన రాగాల వెంకట్ రాహుల్ 338 కేజీలు (స్నాచ్‌లో 151+క్లీన్ అండ్ జెర్క్‌లో 187) బరువెత్తి పసిడిని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. -
చంద్రబాబుది మొక్కుబడి తీర్మానం
గుంటురు : ప్రత్యేక హోదా ప్రస్తావన లేకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం అసెంబ్లీలో మొక్కుబడి తీర్మానం చేశారని బాపట్ల ఎమ్మెల్యే కోన రఘపతి విమర్శించారు. హోదాపై బాబు చిత్తశుద్ధి మరోసారి బయటపడిందని ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదా కోసం, కేంద్రంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవిశ్వాసం పెడుతుంటే కూడా చంద్రబాబు ముందుకు రావడం లేదని కోన రఘుపతి అన్నారు. ఆంధ్ర ప్రజల సెంటిమెంట్‌తో చంద్రబాబు చెలగాటమాడుతున్నారని, ఇది సరైన పద్ధతి కాదని ఆయన వ్యాఖ్యానించారు. -
జగన్ పాదయాత్ర అద్భుతంగా సాగుతోంది
-
‘ప్రభుత్వంలో ఎటువంటి చలనం లేదు’
సాక్షి, అమరావతి: ప్రతిపక్షం లేకుండా శాసనసభ సమావేశాలు నిర్వహించి టీడీపీ ప్రభుత్వం కొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టిందని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే కోన రఘుపతి విమర్శించారు. బుధవారం ఆయన అసెంబ్లీలో హమీల కమిటీ సమావేశానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... మొట్ట మొదటి సమావేశం కావడంతో హాజరైనట్టు చెప్పారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తేనే తాము శాసనసభ సమావేశాలకు హాజరవుతామని పునరుద్ఘాటించారు. అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించడం ద్వారా తాము లేవనెత్తిన సమస్య తీవ్రతను వ్యక్తం చేస్తున్నామన్నారు. ఏ పార్టీకి రాజ్యాంగ విలువలు ఉన్నాయే ప్రజలు తేలుస్తారని, శాసనసభ సమావేశాలను బహిష్కరించడం ద్వారా తమ పార్టీ గళం అందరికీ వినిపించిందని పేర్కొన్నారు. ప్రతిపక్షాలు రాకుండా అసెంబ్లీ సమవేశాలు నిర్వహించడం తప్పు అని ప్రభుత్వం రియలైజ్ కాలేదన్నారు. ప్రజలకు వ్యవస్థలపై నమ్మకం పోయిందని, ఇలాంటి ధోరణితో గతంలో ఏ పార్టీ వ్యవహరించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్షం ప్రశ్నించినా ప్రభుత్వంలో ఎటువంటి చలనం లేదని ధ్వజమెత్తారు. కృష్ణా నదిలో పడవ ప్రమాదంపై ఇప్పటి వరకు ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేగా అసెంబ్లీ వచ్చి ఎంతో నేర్చుకోవాలని తమకు కూడా ఉందని అన్నారు. ఇప్పుడు జనాకర్షణ ఉన్న ఒకైక నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని కోన రఘుపతి అన్నారు. -
'ఆయనను దుర్మార్గంగా తప్పించింది'
సాక్షి, కాకినాడ(తూర్పుగోదావరి జిల్లా): ప్రభుత్వానికి 30 సంవత్సరాల పాటు సేవలందించిన ఐవైఆర్ కృష్ణారావును బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పదవి నుంచి చంద్రబాబు సర్కార్ దుర్మార్గంగా తప్పించిందని వైఎస్సార్సీపీ నాయకులు విమర్శించారు. కాకినాడలో ఎమ్మెల్యే కోన రఘుపతి, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విలేకరులతో మాట్లాడుతూ.. తనపై చేసిన ఆరోపణలపై ఐవైఆర్ చేసిన సవాల్‌కు ఇంతవరకు టీడీపీ నేతలు సమాధానం చెప్పలేదని తెలిపారు. కార్పొరేషన్లో 14 పథకాలున్నాయి కానీ వాటిని అమలు చేసేందుకు డబ్బులు లేవని, మూడున్నర ఏళ్లుగా రూ. 135 కోట్లు బ్రాహ్మణ కార్పొరేషన్‌కు నిధులు విడుదల చేసిన ప్రభుత్వం కేవలం రూ.90 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని వివరించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్ మెంట్ పథకం ద్వారా బ్రాహ్మణ విద్యార్థులకు ఎంతో మేలు జరిగిందని చెప్పారు. అర్చకులకు రూ.5వేలు జీతం ఇచ్చేందుకు 18,500 దేవాలయాలను 3,300కి కుదించారని మండిపడ్డారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వస్తే బ్రాహ్మణులకు తగిన గుర్తింపు ఇస్తుందని హామీయిచ్చారు. -
'బోండా ఉమకు బుద్ధి చెబుతాం'
గుంటూరు: ఐవైఆర్ కృష్ణారావుపై విమర్శలు చేసిన బోండా ఉమకు బుద్ధి చెబుతామని బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి అన్నారు. ఆదివారం గుంటూరులో జరిగిన బ్రాహ్మణ ఆత్మగౌరవ సభలో మాట్లాడిన ఆయన.. తెలుగుదేశం పార్టీ నేతలు ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని హెచ్చరించారు. డిసెంబర్లో లక్షలాది మంది బ్రాహ్మణులతో సభను నిర్వహిస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ.. 'ఫేస్బుక్లో మంత్రి లోకేష్‌పై పోస్టులు పెట్టిన వారిని అరెస్ట్ చేశారు. మరి ఐవైఆర్‌పై పోస్టులు పెట్టిన వారిని అరెస్ట్ చేయరా' అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే బోండా ఓ విధి రౌడీలా మాట్లాడుతున్నారని, బోండా ఉమకు బ్రాహ్మణులు కచ్చితంగా బుద్ధి చెబుతారని జగన్మోహన్ రాజు అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు బ్రాహ్మణ ప్రముఖులు పాల్గొన్నారు. -
'బ్రాహ్మణ సమాజానికి ఇది అవమానమే'
గుంటూరు: గతంలో ఏపీ ప్రధాన కార్యదర్శి హోదాలో చేసిన ఐవైఆర్ కృష్ణారావు లాంటి వ్యక్తికి సీఎం చంద్రబాబు నాయుడు ఆరు నెలలుగా కలుసుకునే అవకాశం ఇవ్వక పోవడం దారుణమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోన రఘుపతి అన్నారు. కార్పొరేషన్ చైర్మన్‌గా ఉన్న ఐవైఆర్ బ్రాహ్మణుల సమస్యలపై మాతో చర్చిస్తే పదవి నుంచి తొలగిస్తారా అని ప్రశ్నించారు. కృష్ణారావును విమర్శిస్తూ పదవి నుంచి తొలగించడం బ్రాహ్మణ సమాజానికి జరిగిన అవమానమేనని పేర్కొన్నారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు. 'శాసనసభలో ఏకైక బ్రాహ్మణ ఎమ్మెల్యేను నేను. దీంతో కార్పొరేషన్‌కు సంబంధించి కొన్ని సమస్యలపై కృష్ణారావు నాతో చర్చించారు. బ్రాహ్మణ కార్పొరేషన్ ఓ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటుచేసింది. ఇటీవల ఆయనను నేను కలిసిన సందర్భంగా.. బ్రాహ్మణ కార్పొరేషన్‌కు రూ. 500 కోట్లు ఇస్తామన్నారు. కానీ మూడేళ్లలో ఇచ్చింది మాత్రం కేవలం 125 కోట్లేనని కృష్ణారావు తెలిపారు. కాపుల ఓట్లే మీరు ఓట్లుగా లెక్కేస్తున్నారు. బ్రాహ్మణుల ఓట్లు మీకు లెక్కలోకి రావా?. 3 ఏళ్లలో ప్రవేశపెట్టిన 4 బడ్జెట్లలోనూ బ్రాహ్మణులకు అన్యాయమే జరిగింది. ఈ విషయాన్ని ఐవైఆర్ ప్రశ్నించారు. నేను వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేను కావడం, ఆయన నాతో ఈ విషయాలను చర్చించడంతో ఆయనపై కక్ష పెంచుకుని చైర్మన్ పదవి నుంచి అవమానకర రీతిలో తొలగించడం బాధాకరం. విలువలతో కూడిన వ్యక్తి, నిజాయతీగా తన పనిని నిర్వర్తించే అతికొద్ది మందిలో కృష్ణారావు ఒకరు. కేవలం ప్రభుత్వ చర్యలను సమర్థించడమే పనిగా పెట్టుకోవాలని సూచించగా కృష్ణారావు తిరస్కరించారని' కోన రఘుపతి వివరించారు. మాజీ సీఎం ఎన్టీఆర్‌ను గోచితో చూపిస్తూ వేసిన అసభ్య కార్టూన్లపై ఎలాంటి చర్యలు తీసుకోని చంద్రబాబు.. ప్రస్తుతం ప్రభుత్వ విధానాలపై పోస్టులు పెట్టిన కృష్ణారావుపై వేటు వేయడం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. రాజధాని అమరావతి పేరుతో 30 వేల ఎకరాలలో జరిగే వ్యాపార వేడుకలు మాత్రమే పూర్తి రాష్ట్రమని సర్కార్ భ్రమిస్తోందని ఆయన ఎద్దేవా చేశారు. ఈ ఏడాది బడ్జెట్లో రూ.75 కోట్లు కేటాయించగా, మూడు నెలలు పూర్తవుతున్నా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని తెలిపారు. ఇలాంటి లోపాలను ఎత్తి చూపిస్తే చైర్మన్ కృష్ణారావుపై టీడీపీ నేతలు సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేయగా చైర్మన్ పదవి నుంచి తొలగించారు. నిజాయితీపరుడైన కృష్ణారావును తొలగించిన తీరుపై బ్రాహ్మణ సంఘాలు మండి పడుతున్నాయి. -
'చంద్రబాబు పిరికి సైనికుడు.. ముందే తెల్లజెండా'
అసెంబ్లీలో మొత్తం 36 అంశాలపై చర్చించాలని తాము నిర్ణయించినట్లు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధరరెడ్డి, కోన రఘుపతి తెలిపారు. ప్రత్యేక హోదా, ఓటుకు కోట్లు, రాజధాని భూ కుంభకోణాలు, కరువు నివారణ చర్యల్లో వైఫల్యంతో పాటు మిగిలిన అంశాలను సభలో చర్చించాలన్నారు. ఇందుకోసం అసెంబ్లీని కనీసం 15-20 రోజుల పాటు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదాపై ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తామని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలని ఎమ్మెల్యేలు అన్నారు. అసెంబ్లీ వేదికగా చంద్రబాబు తీరును ఎండగడతామని స్పష్టం చేశారు. యుద్ధం ప్రారంభం కావడానికి ముందే తెల్లజెండా చూపించి వెనుదిరిగిన పిరికి సైనికుడు చంద్రబాబని, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాల్సిన సమయంలో ఆయన ఎందుకు మౌనంగా ఉంటున్నారని కోటంరెడ్డి శ్రీధరరెడ్డి, కోన రఘుపతి నిలదీశారు. ఆడియో టేపుల్లో ఉన్నది తన గొంతు కాదని చంద్రబాబు ప్రకటించగలరా అని సవాలు చేశారు. ప్రత్యేక హోదాపై ఇప్పుడు వెనకడుగు వేస్తే.. రాష్ట్ర భవిష్యత్తు నాశనం అవుతుందని, హోదా రాకపోతే చంద్రబాబు చరిత్రహీనుడిగా మిగిలిపోతారని అన్నారు. చంద్రబాబు నేరస్తుడిలా తలదించుకోవడం ఏపీ ప్రజలకు అవమానమే అవుతుందన్నారు. ఆడియో టేపులలో ఉన్నది తన గొంతు కాదని కేసీఆర్‌కు చంద్రబాబు సవాలు విసరాలని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధరరెడ్డి, కోన రఘుపతి అన్నారు. -
'నియోజకవర్గానికి అరకొర నిధులు'
గుంటూరు జిల్లా : ' తన నియోజకవర్గానికి అరకొరగానే నిధులొస్తున్నాయని, వాటితోనే ప్రాధాన్యత క్రమంలో అభివృద్ధి పనులు చేస్తున్నట్లు' బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి చెప్పారు. రాజకీయాలంటే ఎన్నికలప్పుడే చూడాలని, అనంతరం అభివృద్ధికే ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన పేర్కొన్నారు. కోన ప్రభాకర్‌రావు 18వ నాటక పరిషత్ సందర్భంగా శనివారం బాపట్లలో ఆయన మాట్లాడుతూ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడేది లేదని స్పష్టం చేశారు. పార్టీ అభివృద్ధికి అనునిత్యం కృషి చేస్తున్నానని, పార్టీ ఏ పిలుపు ఇచ్చినా బాపట్లలో విజయవంతం కావడమే ఇందుకు నిదర్శనమని ఆయన తెలిపారు. -
'బాపట్ల ఆసుపత్రిలో పరిస్థితులు దారుణం'
హైదరాబాద్ : గుంటూరు జిల్లా బాపట్ల ఏరియా అసుపత్రిలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని స్థానిక ఎమ్మెల్యే కోన రఘుపతి ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం ఏపీ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో కోన రఘుపతి మాట్లాడుతూ... ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ సిబ్బందికి జీతాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఆసుపత్రి పరిసరాలు కూడా అపరిశుభ్రంగా ఉన్నాయన్నారు. వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోన రఘుపతి డిమాండ్ చేశారు. -
'చీప్ పాలిటిక్స్ కు లొంగం'
హైదరాబాద్: వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, తమ ప్రయాణం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెంటే అని ఎమ్మెల్యేలు కోన రఘుపతి, ముస్తఫా సృష్టం చేశారు. శుక్రవారం వారు మాట్లాడుతూ' టీడీపీలోకి చేర్చుకోవడానికి రకరకాల ఆఫర్స్ ఇస్తున్నారు. అటువంటి చీప్ పాలిటిక్స్ కి లొంగే వ్యక్తులం కాదు. ప్రజలు వారి సమస్యలు పరిష్కరించడం కోసం మమ్మల్నీ ఎమ్మెల్యేలుగా గెలిపించారు. వైఎస్ఆర్ సీపీ సింబల్ పై గెలిచిన మేము ప్రతిపక్షంగా ప్రభుత్వంపై పోరాడతాం. అధికార పార్టీకి వంత పాడుతున్న ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం మానుకోవాలి' అని సూచించారు. -
నా రక్తం ఇస్తా.. ఆపరేషన్ చేయండి
*వైద్యులతో ఎమ్మెల్యే కోన రఘుపతి బాపట్ల: ‘సార్.. నాకు ఆపరేషన్ చేయరంట.. నన్ను గుంటూరు వెళ్లమంటున్నారు’ అంటూ ఓ గర్భిణి బాపట్ల వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కోన రఘుపతి ఎదుట బోరుమంది. గణపవరానికి చెందిన గర్భిణి అన్నామణి మంగళవారం బాపట్ల ఆస్పత్రికి చేరుకుని ఆపరేషన్ చేసి తనను, బిడ్డను కాపాడాలని కోరింది. బీ పాజిటివ్ బ్లడ్ లేకపోవటంతో గుంటూరు వెళ్లాలని వైద్యులు సూచించారు. ఆ సమయంలో ఆస్పత్రిలో అభివృద్ధి పనులు పరిశీలనకు వచ్చిన ఎమ్మెల్యే దృష్టికి అన్నామణి తన బాధను తీసుకెళ్లగా.. స్పందించిన ఆయన ‘నాది బీ పాజిటివ్ బ్లడ్.. నా బ్లడ్ తీసుకుని ఆపరేషన్ ప్రారంభించండి’ అని ముందుకొచ్చారు. చివరకు ఎమ్మెల్యే చొరవతో గుంటూరులోని బ్లడ్‌బ్యాంకు నుంచి అదే గ్రూపు రక్తం తెప్పించి వైద్యులు ఆమెకు ఆపరేషన్ చేశారు. -
ప్రజా సమస్యలపై సమగ్ర చర్చ
జెడ్పీ స్థాయూ సంఘ సమావేశాల్లో గళమెత్తిన సభ్యులు పాతగుంటూరు: జిల్లాలో నెలకొన్న సమస్యలపై బుధవారం జరిగిన జెడ్పీ స్థాయూ సంఘాల సమావేశాల్లో సభ్యులు సమగ్రంగా చర్చించారు. పలు సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలను మెరుగుపరచాలని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్ల ద్వారా ఎంపికైన లబ్ధిదారులకు రుణాలు మంజూరు చేస్తారా? లేదా? అని గుంటూరు రూరల్ మండల జెడ్పీటీసీ సభ్యుడు కొలకలూరి కోటేశ్వరరావు, కొల్లిపర జెడ్పీటీసీ సభ్యురాలు భట్టిప్రోలు వెంకటలక్ష్మి, ముప్పాళ్ల జెడ్పీటీసీ సభ్యురాలు మమత ప్రశ్నించారు. జెడ్పీ సమావేశ మందిరంలో 1వ స్థాయూ సంఘ సమావేశం చైర్పర్సన్ జానీమూన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆర్థిక వ్యవహారాలు, బడ్జెట్, ఇతర స్థాయి సంఘాలకు సంబంధించిన పనుల సమన్వయంపై చర్చించారు. వైఎస్సార్ సీపీ ఫ్లోర్ లీడర్ దేవళ్ల రేవతి మాట్లాడుతూ ఇసుక రీచ్‌లను డ్వాక్రా గ్రూపులకు ఏ విధానంలో కేటాయిస్తున్నారో చెప్పాలని ప్రశ్నిం చారు. దీంతో అధికారులు వివరాలతో కూడిన కాపీలను సభ్యులకు అందజేశారు. జెడ్పీ చైర్పర్సన్ షేక్ జానీమూన్ అధ్యక్షతన జరిగిన రెండో స్థాయూ సంఘ సమావేశంలో గ్రామీణాభివృద్ధి, ఉపాధి హామీ, గృహ నిర్మాణ ం, సహకారం, పొదుపు, పరిశ్రమలు, ట్రస్టులపై చర్చ జరిగింది. మూడో స్థాయూ సంఘ చైర్మన్ వడ్లమూడి పూర్ణచంద్రరావు ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో మాచర్ల, దాచేపల్లి, రెంటచింతల జెడ్పీటీసీ సభ్యులు శౌర్రెడ్డి, ప్రకాష్‌రెడ్డి, భాస్కరరెడ్డి మాట్లాడుతూ పత్తి కొనుగోళ్ల తీరుపై ప్రశ్నించారు. మొదటి కేటగిరి పత్తినే కొనుగోలు చేస్తున్నారని, మిగిలిన రెండు కేటగిరిల పత్తిని కొనుగోలు చేయకపోవడం వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. సీసీఐ కేంద్రాల ద్వారా అన్నిరకాల పత్తిని కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని కోరారు. పూర్ణచంద్రరావు స్పందిస్తూ వ్యవసాయ శాఖ మంత్రితో చర్చించి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. 4వ స్థాయూ సంఘ సమావేశంలో విద్య, వైద్యం, ప్రజారోగ్యం, పారిశుద్ధ్యం అంశాలపై చర్చ జరిగింది. బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి మాట్లాడుతూ కొన్ని మండలాల్లో పీహెచ్‌సీలు అధ్వానంగా ఉన్నాయని చెప్పారు. పీహెచ్‌సీల్లో వైద్యులు విధులు సక్రమంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలన్నారు. బాపట్ల ప్రభుత్వ వైద్యశాలలో ఏర్పాటు చేసినట్టే మిగిలిన వైద్యశాలల్లో కూడా క్యాంటిన్లు ఏర్పాటు చేయాలన్నారు. ఎమ్మెల్సీ లక్ష్మణరావు మాట్లాడుతూ పీహెచ్‌సీల అభివృద్ధి కమిటీలను వెంటనే సమావేశపరిచి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. దుగ్గిరాల జెడ్పీటీసీ సభ్యురాలు జయలక్ష్మి మాట్లాడుతూ దుగ్గిరాలలో పీహెచ్సీ ఏర్పాటు చేయాలని కోరారు. స్థలం ఇవ్వడానికి దాతలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. మహిళల రక్షణ చట్టాలను సక్రమంగా అమలు చేయాలని 5వ స్థాయూ సంఘ సమావేశంలో జెడ్పీటీసీ సభ్యురాలు సంధ్యారాణి కోరారు. మండలాల అభివృద్ధికి నిధులు కేటారుుంచాలని 7వ స్థాయూ సంఘ సమావేశంలో నరసరావుపేట జెడ్పీటీసీ సభ్యులు షేక్ నూరుల్ అక్తాఫ్ కోరారు. గ్రామాల్లో సీసీ రోడ్లు వేయాలన్నారు. త్వరలోనే గ్రావెల్ రోడ్లు మంజూరవుతాయని అధికారులు చెప్పారు.