
గుంటురు : ప్రత్యేక హోదా ప్రస్తావన లేకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం అసెంబ్లీలో మొక్కుబడి తీర్మానం చేశారని బాపట్ల ఎమ్మెల్యే కోన రఘపతి విమర్శించారు. హోదాపై బాబు చిత్తశుద్ధి మరోసారి బయటపడిందని ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదా కోసం, కేంద్రంపై వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అవిశ్వాసం పెడుతుంటే కూడా చంద్రబాబు ముందుకు రావడం లేదని కోన రఘుపతి అన్నారు. ఆంధ్ర ప్రజల సెంటిమెంట్‌తో చంద్రబాబు చెలగాటమాడుతున్నారని, ఇది సరైన పద్ధతి కాదని ఆయన వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment