
'బోండా ఉమకు బుద్ధి చెబుతాం'
ఐవైఆర్ కృష్ణారావుపై విమర్శలు చేసిన బోండా ఉమకు బుద్ధి చెబుతామని బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి అన్నారు.
గుంటూరు: ఐవైఆర్ కృష్ణారావుపై విమర్శలు చేసిన బోండా ఉమకు బుద్ధి చెబుతామని బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి అన్నారు. ఆదివారం గుంటూరులో జరిగిన బ్రాహ్మణ ఆత్మగౌరవ సభలో మాట్లాడిన ఆయన.. తెలుగుదేశం పార్టీ నేతలు ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని హెచ్చరించారు. డిసెంబర్‌లో లక్షలాది మంది బ్రాహ్మణులతో సభను నిర్వహిస్తామని వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ.. 'ఫేస్‌బుక్‌లో మంత్రి లోకేష్‌పై పోస్టులు పెట్టిన వారిని అరెస్ట్ చేశారు. మరి ఐవైఆర్‌పై పోస్టులు పెట్టిన వారిని అరెస్ట్ చేయరా' అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే బోండా ఓ విధి రౌడీలా మాట్లాడుతున్నారని, బోండా ఉమకు బ్రాహ్మణులు కచ్చితంగా బుద్ధి చెబుతారని జగన్‌మోహన్ రాజు అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు బ్రాహ్మణ ప్రముఖులు పాల్గొన్నారు.