సాక్షి, విజయవాడ: తిరుమల లడ్డూపై మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుమల లడ్డూలో కల్తీ జరిగి ఉంటుందని తాను అనుకోవడం లేదన్నారు. సీఎం స్థాయి వ్యక్తి ఆరోపణలతో దీనిపై విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. చంద్రబాబు చెప్పింది తప్పని తేలితే బాబు ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఐవైఆర్ అన్నారు.
మరోవైపు, తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాద పవిత్రతపై సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను విశ్వహిందూ పరిషత్ ఖండించింది. ఈ వ్యాఖ్యలు బాధాకరమన్న వీహెచ్‌పీ.. ఆ ఆరోపణలకు కట్టుబడి వాటిని నిరూపించాల్సిన అవసరం చంద్రబాబుకి ఉందని స్పష్టం చేసింది.
ఇదీ చదవండి: శ్రీవారి లడ్డూపై CBN ఉన్మాద రాజకీయం
తిరుపతి లడ్డులో జంతువుల కొవ్వు కలిసిందని చంద్రబాబు వ్యాఖ్యానించడం బాధాకరమని.. నిజనిర్దారణ జరగకుండా హిందువుల మనోభావాలను దెబ్బతినే విధంగా లడ్డు అపవిత్రం అయ్యిందని చెప్పడం సరికాదని విశ్వహిందూ పరిషత్ పేర్కొంది. దీక్షలు చేపట్టే భక్తులు తిరుపతి లడ్డు ప్రసాదం తీసుకుంటారు. కాబట్టి లడ్డులో జంతువుల కొవ్వు కలిసి ఉందని ఆధారాలు లేకుండా చెప్పడం ఇబ్బందికరమని చెప్పింది.
Comments
Please login to add a commentAdd a comment