అప్పుడు బహిరంగ మార్కెట్‌లో నెయ్యి ధర రూ.1100–1200 ఉందన్నది మీరే
అలాంటప్పుడు అంత తక్కువ ధరకు ఎలా కొన్నారు?
ఆ సమయంలో కూడా కల్తీ నెయ్యి కొన్నారా?
నెయ్యి ధరల విషయంలో మీరు చెప్పింది అబద్ధమే కదా..
ఈ లెక్కన తక్కువ ధరకు కొన్నారు కాబట్టే కల్తీ నెయ్యి సరఫరా చేశారని మీరు చెబుతున్నదంతా సొల్లే
గత ప్రభుత్వంలో అదే రేటుకు కొంటే ఎలా తప్పు?
వాడని నెయ్యి, తయారు కానీ లడ్డూ ప్రసాదంపై ఎందుకీ దుష్ప్రచారం?
అయినా నెయ్యి ధరలపై అడ్డగోలుగా బురద జల్లే ప్రయత్నం
వెన్న తీసిన పాలు, పాల పదార్థాల ద్వారా అదనంగా ఆదాయం
అందుకే తక్కువ ధరకు నెయ్యి సరఫరా
సొంత డెయిరీ కలిగిన మీకు ఈ విషయాలన్నీ తెలియవా?
తెలిసీ దుష్ప్రచారం చేయడం దుర్మార్గం కాదా?
ఈ లెక్కన రివర్స్ టెండరింగ్‌తో రూ.320కే నెయ్యి కొనడం వల్ల కల్తీ జరిగిందని మీరు చెబుతున్నదంతా అబద్దమేగా? కల్తీ అయిన నెయ్యి ట్యాంకర్లను వెనక్కి పంపేశారు.. ఆ నెయ్యితో లడ్డూ ప్రసాదం తయారే చేయలేదు. మరి అపచారం జరిగిందని ఎలా ఆరోపిస్తావు? సున్నితమైన అంశాలపై ప్రజలను రెచ్చగొట్టి రాజకీయంగా లబ్ధి పొందాలన్న మీ దుర్భుద్దితోనే ఈ కుట్రకు తెరతీశావన్నది నిజం కాదా?
2015లో కిలో నెయ్యి రూ.276 చొప్పున టీటీడీ కొనుగోలు చేసింది. 2018లో కూడా కిలో నెయ్యి రూ.320 చొప్పున టీటీడీ కొనుగోలు చేసింది. ఇదంతా మీ ప్రభుత్వ హయాంలోనే కదా? అప్పట్లో బహిరంగ మార్కెట్‌లో ఇండియా మార్ట్‌లో కేజీ రూ.1200, బిగ్ బాస్కెట్ ధర రూ.1100గా ఉందని టీటీడీ తీర్మానంలో కూడా పేర్కొన్న మాట వాస్తవం కాదా? మరి బహిరంగ మార్కెట్ కంటే ఇంత తక్కువ ధరకు ఎలా కొన్నారు? అప్పుడు కూడా జంతువుల కొవ్వు కలిసిన కల్తీ నెయ్యే సరఫరా చేశారా?
సాక్షి, అమరావతి: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో వినియోగిస్తున్న నెయ్యి కిలో రూ.320కి కొనుగోలు చేయడం వల్లే కల్తీ నెయ్యి సరఫరా చేస్తున్నారంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న ఆరోపణల్లో పసలేదని మరోసారి రుజువవుతోంది. 2014–19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలోనే టీటీడీ కొనుగోలు చేసిన నెయ్యి ధరలను ఒక్కసారి పరిశీలిస్తే చంద్రబాబు బృందం చేస్తున్న ఆరోపణల్లో డొల్లతనం బట్టబయలవుతోంది.
2014లో బాబు సీంఎగా పగ్గాలు చేపట్టిన తర్వాత అక్టోబర్‌లో కిలో రూ.306, రూ.325 చొప్పున కొనుగోలు చేసిన టీటీడీ.. 2015 జూన్‌లో కిలో రూ.276, రూ.279 చొప్పున కొనుగోలు చేసిన మాట వాస్తవం కాదా? బహిరంగ మార్కెట్‌లో రూ.1100 నుంచి రూ.1200 ఉంటే ఏ విధంగా కిలో రూ.320కి సరఫరా చేశారని మీరు ప్రశ్నిస్తున్నారు.
అదే వారు రూ. 276కు ఎలా కొన్నారు? మరీ మీ హయాంలో ఇంత తక్కువ ధరకు టీటీడీకి కొనుగోలు చేసిందంటే అప్పట్లో కూడా జంతువుల కొవ్వు కలిపిన నెయ్యినే టీటీడీకి ఆయా కంపెనీలు సరఫరా చేశాయా? సూటిగా సమాధానం చెప్పు చంద్రబాబూ.
అంతే కానీ ప్రజల మనోభావాలను రెచ్చగొట్టేలా రోజుకో స్టేట్‌మెంట్ ఇస్తూ అదే పనిగా లేనిపోని బురద చల్లడం సరికాదు. వాస్తవానికి వైఎస్ జగన్‌మోహన్‌రెఢ్డి ప్రభుత్వ హయాంలో ఏనాడు టీటీడీ ఇంత తక్కువ ధరలకు నెయ్యి కొనుగోలు చేసిన దాఖలాలు లేవు.
వాస్తవాలకు ముసుగేసి దుష్ప్రచారం
కిలో నెయ్యి రూ.320కే టీటీడీకి ఎలా సరఫరా చేశారంటూ ఆరోపించడం ఎంత వరకు సమంజసమో చెప్పాల్సిన బాధ్యత మీది కాదా? వాస్తవాలకు ముసుగేసి పని గట్టుకొని అదే పనిగా బురద జల్లడంలో మిమ్మల్ని మించిన ఘనడు మరొకరు లేరన్నది ప్రజలందరికీ తెలుసు.
అసలు నెయ్యి ఎలా తయారవుతుంది? ఎలాంటి ప్రమాణాలు పాటిస్తారు? కిలో నెయ్యి తయారీకి ఎంత ఖర్చవుతుందో కూడా తెలియకుండా అడ్డగోలుగా వాదించడం చంద్రబాబుకే చెల్లింది. వాస్తవానికి నెయ్యి రెండు రకాలుగా తయారు చేస్తారన్న విషయం అందరికీ తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment