Srivari Laddu
-
నక్క జిత్తులు.. కొత్త ఎత్తులు!
సాక్షి, అమరావతి : వంద రోజుల పాలనలో వైఫల్యాలపై ప్రజల దృష్టి మళ్లించేందుకు రాజకీయ దురుద్దేశాలతో తప్పుడు వ్యాఖ్యలు చేసి తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని తాను అపవిత్రం చేశానన్నది సుప్రీంకోర్టు సాక్షిగా ప్రజలకు తేటతెల్లమవడంతో.. దాన్నుంచి బయట పడేందుకు సీఎం చంద్రబాబునాయుడు మరోమారు టాపిక్ డైవర్షన్‌పై దృష్టి సారించారు. లడ్డూ గురించి మాట్లాడటం మానేసి.. దానికి సంబంధించిన టెండర్లు, డెయిరీలు, ధరలు, గతంలో జరిగిన సంఘటనలంటూ ఎల్లో మీడియాతో సరికొత్త కథనాలు వండివారి్పస్తున్నారు.ఎలాంటి ఆధారాలు లేకుండా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతినేలా ఎలా మాట్లాడతారంటూ సుప్రీంకోర్టు నిలదీయడంతో బాబు అండ్ గ్యాంగ్‌కు ముచ్చెమటలు పట్టాయి. ‘కల్తీ నెయ్యి వాడలేదని ఈవో చెప్పినా, లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు ఉందని ముఖ్యమంత్రి ఎలా చెబుతారు? ఆధారాలు లేకపోయినా సీఎం మీడియా ముందు అలా ఎలా మాట్లాడతారు? ఒకవైపు విచారణ జరుగుతుండగా.. ఆ వ్యాఖ్యలతో సిట్ ప్రభావితం కాదా? తమ నివేదిక తప్పు కావచ్చని స్వయంగా ఎన్డీడీబీ రిపోర్టులోనే రాశారు కదా? ఎన్డీడీబీ నివేదికపై సెకండ్ ఒపీనియన్ ఎందుకు తీసుకోలేదు? అదొక్కటే కాదు.. దేశంలో ఎన్నో ల్యాబ్స్ ఉన్నాయి కదా? ముఖ్యమంత్రి ప్రకటనకు పూర్తి విరుద్ధంగా ఈవో ప్రకటన ఉంది.ఆ నెయ్యి వాడనే లేదని ఈవో చెప్పారు. సీఎం చేసిన ప్రకటనకు ఎలాంటి ఆధారాలు లేవు. దర్యాప్తునకు ఆదేశించినప్పుడు పదాల గారడీ ఎంత మాత్రం అవసరం లేదు. ఎన్డీడీబీ నివేదిక జూలైలో వస్తే దానిపై సీఎం ఎందుకు సెపె్టంబరులో మాట్లాడినట్లు? జూలైలోనే ఎందుకు మాట్లాడలేదు? మీడియాతో మాట్లాడటానికి ముందు లడ్డూలను పరీక్షించడం సరైనదని సీఎం భావించలేదా? అసలు బహిరంగ ప్రకటనలు ఎందుకు చేయాలి? దాని వల్ల సిట్ దర్యాప్తు ప్రభావితం కాదా? అది కోట్ల మంది మనోభావాలను దెబ్బ తీస్తుందని తెలియదా? సిట్ ఏర్పాటు చేసినా, ఇంకా కల్తీ నెయ్యిపై ప్రకటన ఎలా చేస్తారు? మీడియాతో ఎలా మాట్లాడతారు?’ అని గత నెల 30వ తేదీన సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిన విషయం విదితమే. ఆ తరువాత సీబీఐ నేతృత్వంలో స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించిన సంగతి తెలిసినదే. ఈ నేపథ్యంలో తాను ప్రజల్లో మరింత చులకన కాకూడదని ఓ వైపు పవన్ కళ్యాణ్, మంత్రులు.. మరో వైపు ఎల్లో మీడియాను రంగంలోకి దించి ట్రాక్ మార్చేశారు. లడ్డూ పోయి టెండర్లొచ్చె.. కల్తీ అయిందని చెబుతున్న నెయ్యిని అసలు వాడనేలేదని టీటీడీ ఈవో చెబుతున్నా వినిపించుకోకుండా దురుద్దేశంతో దుష్ప్రచారం చేసిన చంద్రబాబు అండ్ గ్యాంగ్.. ఇప్పుడు ఆ నెయ్యి గురించి కాకుండా టెండర్లపై వివాదం సృష్టిస్తోంది. వాస్తవానికి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం వచి్చన రోజు నుంచే ఏఆర్ డెయిరీ టీటీడీకి నెయ్యి సరఫరా ప్రారంభించింది. ఆ డెయిరీ జూలై 6, 12న సరఫరా చేసిన 4 ట్యాంకర్ల నెయ్యిలో కల్తీ ఉన్నట్లు తేలడంతో.. వాటిని వెనక్కి పంపేసి, బ్లాక్ లిస్ట్‌లో పెడుతూ షోకాజ్ నోటీలిచ్చామని టీటీడీ ఈవో జూలై 23న ప్రకటించారు. ఆ వెంటనే టెండర్ల సమయంలో ఏఆర్ డెయిరీని పరిశీలించి.. పది లక్షల కేజీల నెయ్యి సరఫరా చేసే సామర్థ్యం ఆ సంస్థకు ఉందని నివేదిక ఇచ్చిన ఘీ నిపుణుల కమిటీ సభ్యులను టీటీడీగానీ ప్రభుత్వంగానీ విచారించి చర్యలు తీసుకోలేదు. అప్పుడే ఈ వ్యవహారంపై విచారించి.. చర్యలు తీసుకోకుండా టీటీడీ, ప్రభుత్వాన్ని ఎవరు అడ్డుకున్నారు? ప్రభుత్వం తాను చేయాల్సిన పని చేయకుండా.. ఉత్తరాఖండ్ రూర్కిలోని బోలేబాబా డెయిరీ, తిరుపతికి సమీపంలోని వైష్ణవి డెయిరీల నుంచి ఏఆర్ డెయిరీ అధిక ధరకు నెయ్యి కొనుగోలు చేసిందని కొత్త పల్లవి అందుకుంది. ఈ విషయమై ఎల్లో మీడియాతో కథనాలను వండివార్పిస్తోండటంపై విస్మయం వ్యక్తం అవుతోంది. పవన్ కళ్యాణ్.. తిరుమల లడ్డూ ఒక్కటే కాదని.. గత ఐదేళ్లలో తిరుమలలో జరిగిన ఘటనలపై తాను పశ్చాత్తాప దీక్ష చేశానని ప్లేటు ఫిరాయించారు. సనాతన ధర్మం అంటూ.. కోర్టులు అంటూ ఇటు నుంచి ఎటో తీసుకెళ్లారు. తిరుమల శ్రీవారి లడ్డూను వివాదం చేసి.. వంద రోజుల పాలన, ఎన్నికల్లో ఇచి్చన హామీల అమల్లో వైఫల్యం నుంచి ప్రజల దృష్టి మళ్లిద్దామనుకున్న చంద్రబాబుకు చేతులు కాలడంతో ఇప్పుడు ఎన్ని విధాలుగా వీలైతే అన్ని విధాలుగా దాన్ని దారి మళ్లించాలని ఎత్తులు వేస్తున్నారు. -
తీరు మారని టీడీపీ: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: సుప్రీంకోర్టు న్యాయమూర్తులు చంద్రబాబునాయుడుపై తీవ్ర వ్యాఖ్యలు చేసినప్పటికీ లడ్డూ ప్రసాదం విషయంపై టీడీపీ ఇంకా రాజకీయం చేస్తూనే ఉందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ ఆక్షేపించారు. సుప్రీంకోర్టు శుక్రవారం తీర్పు వెలువరించాక తాను మీడియాతో మాట్లాడిన మాటల వీడియోను ప్రధాన మంత్రి మోదీ, కేంద్ర మంత్రులు, జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు, ఆ పార్టీల నేతలకు ట్యాగ్ చేస్తూ శనివారం ఆయన ఎక్స్ (ట్విటర్)లో పోస్టు చేశారు. ఆ వీడియోలో వైఎస్ జగన్ ఏమన్నారంటే.. ‘కల్తీ నెయ్యి వాడలేదని ఈవో చెప్పినా, లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు ఉందని ముఖ్యమంత్రి ఎలా చెబుతారు? ఆధారాలు లేకపోయినా సీఎం మీడియా ముందు అలా ఎలా మాట్లాడుతారు? ఒకవైపు విచారణ జరుగుతుండగా.. ఆ వ్యాఖ్యలతో సిట్ ప్రభావితం కాదా? తమ నివేదిక తప్పు కావచ్చని స్వయంగా ఎన్డీడీబీ రిపోర్టులోనే రాశారు కదా? ఎన్డీడీబీ నివేదికపై సెకండ్ ఒపీనియన్ ఎందుకు తీసుకోలేదు? అదొక్కటే కాదు.. దేశంలో ఎన్నో ల్యాబ్స్ ఉన్నాయి కదా? ముఖ్యమంత్రి ప్రకటనకు పూర్తి విరుద్ధంగా ఈవో ప్రకటన ఉంది. ఆ నెయ్యి వాడనే లేదని ఈవో చెప్పారు. సీఎం చేసిన ప్రకటనకు ఎలాంటి ఆధారాలు లేవు. దర్యాప్తునకు ఆదేశించినప్పుడు పదాల గారడీ ఎంత మాత్రం అవసరం లేదు. ఎన్డీడీబీ నివేదిక జూలైలో వస్తే దానిపై ముఖ్యమంత్రి ఎందుకు సెప్టెంబరులో మాట్లాడినట్లు? జూలైలోనే ఎందుకు మాట్లాడలేదు? మీడియాతో మాట్లాడటానికి ముందు లడ్డూలను పరీక్షించడం సరైనదని సీఎం భావించలేదా? అసలు బహిరంగ ప్రకటనలు ఎందుకు చేయాలి? దాని వల్ల సిట్ దర్యాప్తు ప్రభావితం కాదా? అది కోట్ల మంది మనోభావాలను దెబ్బ తీస్తుందని తెలియదా? సిట్ ఏర్పాటు చేసినా, ఇంకా కల్తీ నెయ్యిపై ప్రకటన ఎలా చేస్తారు? మీడియాతో ఎలా మాట్లాడుతారు?’.. అని సుప్రీంకోర్టు గత 30వ తేదీన వ్యాఖ్యానించింది అని చెప్పారు. Even after the critical remarks of the Hon’ble Supreme Court against @ncbn , TDP continues to politicize the Laddu Prasadam issue. @BJP4India @INCIndia @arivalayam @BRSparty @samajwadiparty @AamAadmiParty @AIADMKOfficial @narendramodi @AmitShah @ShivSenaUBT_ @AITCofficial… pic.twitter.com/vefByATGT6— YS Jagan Mohan Reddy (@ysjagan) October 5, 2024ఈవో, సీఎం పరస్పర విరుద్ధ ప్రకటనలు‘ఎఫ్ఐఆర్ సెప్టెంబరు 25న రిజిస్టర్ చేస్తే.. అంతకు ముందే సెప్టెంబరు 18న ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి స్టేట్మెంట్ ఇచ్చాడు. సిట్ ఏర్పాటైంది సెప్టెంబరు 26న అయితే.. అంతకన్నా ముందే ఎలా ప్రకటన ఇచ్చాడంటూ.. సీఎం బహిరంగ ప్రకటన కోట్ల మంది భక్తుల మనోభావాలను దెబ్బ తీస్తుందని కోర్టు చెప్పింది. ఇన్ని రకాలుగా చంద్రబాబును సుప్రీంకోర్టు ఆక్షేపించింది. అయితే మళ్లీ ఇవాళ కూడా.. కల్తీ నెయ్యి వాడలేదని ఈవో చెప్పిన విషయాన్ని ప్రస్తావిస్తూ చంద్రబాబు చేసిన తప్పును సుప్రీంకోర్టు ఎత్తి చూపింది. బాబు తాను స్వయంగా ఏర్పాటు చేసుకున్న సిట్‌ను రద్దు చేస్తూ.. సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో ఇద్దరు సీబీఐ అధికారులు, వారికి సహకారం అందించడానికి ఇద్దరు రాష్ట్ర అధికారులు.. వీరికి తోడు ఎఫ్ఎస్ఎస్ఏఐ (ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా) నుంచి ఒకరు నియమితులవుతారని.. వీరందరూ లడ్డూకి సంబంధించిన విషయంపై నివేదిక ఇస్తారని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇంత స్పష్టంగా సుప్రీంకోర్టు ఆదేశించినా.. చంద్రబాబులో ఏ మాత్రం పశ్చాత్తాపం కనిపించలేదు. ఆయనకు వ్యక్తిత్వం ఉంటే ముందు ప్రజలను క్షమాపణ కోరాలి. తర్వాత తిరుమలలో తప్పు చేశానని స్వామి వారిని వేడుకోవాలి. అవేవీ చేయడం లేదు. టీడీపీ దుష్ప్రచారం ఆపలేదు’ అని వైఎస్ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. -
కింకర్తవ్యం!? సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో చంద్రబాబు అంతర్మథనం
సాక్షి, అమరావతి: తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ‘‘జంతు కొవ్వు’’ ప్రకటనను సుప్రీంకోర్టు తీవ్రంగా ఆక్షేపించడం.. దేవుడిని రాజకీయాలకు దూరంగా ఉంచాలంటూ అత్యున్నత న్యాయస్థానం ఘాటుగా హెచ్చరించిన నేపథ్యంలో టీడీపీ శ్రేణులు గప్‌చుప్ అయ్యాయి. అసలు వాడని కల్తీ నెయ్యిని వాడినట్లుగా చిత్రీకరించి తమ అధినాయకత్వం తప్పు మీద తప్పు చేసిందనే అభిప్రాయం టీడీపీ శ్రేణుల్లో బలంగా వ్యక్తమవుతోంది. శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారనేందుకు ప్రస్తుతం ప్రాథమికంగా ఎలాంటి ఆధారాలు లేవని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో లడ్డూలో నెయ్యికి బదులు జంతువుల కొవ్వు వాడారంటూ సీఎం చంద్రబాబు చేసిన ఆరోపణలు పచ్చి అబద్ధాలనే విషయం ప్రజల్లో మరింత బలపడుతోందని టీడీపీ సీనియర్ నేత ఒకరు అభిప్రాయపడ్డారు. నష్ట నివారణ చర్యల్లో భాగంగా సుప్రీం కోర్టు వ్యాఖ్యలను తప్పుపట్టేలా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి మాట్లాడినా ఫలితం లేదని టీడీపీ శ్రేణులు వాపోతున్నాయి. ఇదొక్కటే కాకుండా గత ఐదేళ్లలో తిరుమల, ఇతర దేవాలయాలలో జరిగిన ఘటనలపై ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నానంటూ జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెబుతున్న మాటలను ప్రజలు ఏమాత్రం విశ్వసించడం లేదని పేర్కొంటున్నారు. ప్రజల మనోభావాలను రెచ్చగొట్టి రాజకీయంగా లబ్ధి పొందేందుకు విసిరిన పాచిక పారకపోగా మైనారిటీలను పార్టీకి మరింత దూరం చేసిందని టీడీపీ సీనియర్ నేత ఒకరు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంలో అధినాయకత్వం అత్యుత్సాహమే కొంపముంచిందనే అభిప్రాయం టీడీపీ శ్రేణుల్లో గట్టిగా వ్యక్తమవుతోంది. తప్పులు చెప్పించారని సన్నిహితులతో ఈవో ఆవేదన! వనస్పతి ఆయిల్ మాత్రమే కల్తీ అయినట్లు ఎన్డీడీబీ రిపోర్టులో వచ్చిందని.. ఆ రిపోర్టు వచ్చిన రోజే సీఎం చంద్రబాబుకు తాను చెప్పానని.. అయినా తన మాట పట్టించుకోలేదని ఈవో శ్యామలరావు వాపోతున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఎన్డీడీబీ రిపోర్టులో జంతువుల కొవ్వు కలిసినట్లుగా ఎక్కడా స్పష్టంగా లేదని.. కల్తీ నెయ్యి ట్యాంకర్లను వెనక్కి పంపామని.. ఆ నెయ్యిని లడ్డూల తయారీలో వాడలేదని సీఎం చంద్రబాబుకు తాను పదే పదే చెప్పానని.. అయినా తన మాట వినిపించుకోలేదని ఈవో ఆవేదన చెందుతున్నట్లు సమాచారం. ఈ వ్యవహారంలో తనతో కూడా తప్పులు చెప్పించారని ఈవో శ్యామలరావు నొచ్చుకున్నట్లు ఆయన సన్నిహితుడొకరు పేర్కొన్నారు. తప్పు మీద తప్పు.. ఎన్నికల్లో కూటమి గెలుపొందిన అనంతరం జూన్ 12న సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయగా జూన్ 14న టీటీడీ ఈవోగా జె.శ్యామలరావును ప్రభుత్వం నియమించింది. టీటీడీకి ఓ సంస్థ సరఫరా చేసిన రెండు నెయ్యి ట్యాంకర్లలో వనస్పతి ఆయిల్ కల్తీ జరిగినట్లు తేలిందని.. అయితే ఆ రెండు ట్యాంకర్లను వెనక్కి పంపామని, వాటిని అసలు వాడలేదని జూలై 23న తిరుమలలో ఈవో జె.శ్యామలరావు మీడియా సాక్షిగా ప్రకటించారు. అనంతరం రెండు నెలల తరువాత సెప్టెంబరు 18న కూటమి శాసనసభా పక్ష సమావేశంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ వైఎస్సార్సీపీ హయాంలో తిరుమల లడ్డూ తయారీలో నెయ్యికి బదులుగా జంతువుల కొవ్వును వాడి అపచారం చేశారంటూ దారుణమైన ఆరోపణలు చేశారు. ఆ తర్వాత సెప్టెంబరు 20న టీటీడీ ఈవో తిరుమలలో మీడియాతో మాట్లాడుతూ.. తమిళనాడు డెయిరీ సరఫరా చేసిన నాలుగు ట్యాంకర్ల నెయ్యిలో కల్తీ జరిగిందని ఎన్డీడీబీ రిపోర్టు ఇచ్చిందని.. అయితే ఆ నాలుగు ట్యాంకర్లను వెనక్కి పంపేశామని.. ఆ నెయ్యిని తిరుమల లడ్డూ తయారీలో వాడలేదని స్పష్టం చేశారు. ఈ మేరకు సెపె్టంబరు 22న సీఎం చంద్రబాబుకు ఆయన నివేదిక కూడా ఇచ్చారు. కానీ.. సీఎం చంద్రబాబు మాత్రం సెపె్టంబరు 22న జంతువుల కొవ్వు కలిసిన నెయ్యిని తిరుమల లడ్డూ తయారీలో వాడారంటూ అబద్ధాలు పునరుద్ఘాటించారు. కల్తీ నెయ్యిని లడ్డూ తయారీలో వాడలేదని టీటీడీ ఈవో పదే పదే స్పష్టం చేస్తున్నా... ఆ నెయ్యిని వాడారంటూ చంద్రబాబు పునరుద్ఘాటించడం ద్వారా తప్పు మీద తప్పు చేశారని టీడీపీకి చెందిన మాజీ మంత్రి ఒకరు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇతని పేరు మొగదాటి అశోక్. తోటవారి వీధిలో ఉంటున్నాడు. అక్కడే మెయిన్ రోడ్డు పక్కన కొబ్బరి బొండాలు అమ్ముకుంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. వరదకు కొట్టు మొత్తం కొట్టుకుపోయింది. ఇంట్లో సామాన్లు మొత్తం పాడైపోయాయి. నష్ట పరిహారం అంచనా వేసేందుకు అధికారులు వచ్చినపుడు ఇంట్లోనే ఉన్నాడు. ఏమేం నష్టపోయారో వివరించాడు. వారు ఫోటోలు కూడా తీసుకున్నారు. తీరా చూస్తే జాబితాలో ‘డోర్ లాక్’ వచ్చింది. ఇప్పటికీ సచివాలయం చుట్టూ పదిసార్లు తిరిగాడు. మూడు రోజులుగా కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నాడు. అర్జీలు తీసుకుంటున్నారు కానీ జాబితాలో పేరు చేర్చడం లేదు.ఈ ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు కొరగంజి మాధవ్. 46వ డివిజన్ రాజీవ్‌శర్మనగర్‌లో ఉంటున్నాడు. వరదకు తీవ్రంగా నష్టపోయాడు. ఇతను ఉండే∙వీధిలో 116 ఇళ్లు ఉంటాయి. వాటిలో కేవలం 14 ఇళ్లకు మాత్రమే నష్ట పరిహారం డబ్బులు వేశారు. మిగిలిన 101 ఇళ్లకుగాను 20 ఇళ్లు జాబితాలో ఉన్నాయి. కానీ డబ్బులు పడలేదు. మిగిలిన 81 ఇళ్లను అసలు జాబితాలోనే చేర్చలేదు. అంతా కుట్రపూరితంగానే వ్యవహరిస్తున్నారు. పై అంతస్థుల్లో ఉంటూ.. ఎలాంటి నష్టం జరగని వారికి మాత్రం డబ్బులు వేశారు. 142వ సచివాలయం పరిధిలోని రాజీవ్‌శర్మనగర్, అంబేడ్కర్ నగర్ ప్రాంతాల్లో అందరూ పేదలే. అందరూ వరద బాధితులే. అయినా వారిలో అత్యధికులకు పరిహారం అందలేదు. -
చంద్రబాబు ‘కొవ్వు’ ప్రకటనకు 'ఎలాంటి ఆధారాల్లేవ్': సుప్రీంకోర్టు
ముఖ్యమంత్రి ప్రకటనకు పూర్తి విరుద్ధంగా.. టీటీడీ ఈవో ప్రకటన ఉంది. కల్తీ నెయ్యి విషయంలో టీటీడీ వైఖరి చాలా స్పష్టంగా ఉంది. సీఎం చేసిన ప్రకటనలకు ఎలాంటి ఆధారాల్లేవ్. దర్యాప్తునకు ఆదేశించినప్పుడు పదాల గారడీ ఎంత మాత్రం అవసరం లేదు.ఎన్డీడీబీ నివేదిక జూలైలో వస్తే ముఖ్యమంత్రి సెప్టెంబర్‌లో ఎందుకు మాట్లాడినట్లు? జూలైలో వచ్చిన నివేదికపై అప్పుడే ఎందుకు మాట్లాడలేదు? నెయ్యిలో జంతు కొవ్వు కలిపారంటూ ముఖ్యమంత్రి ప్రకటన చేశారు. అసలు ఈ ప్రకటన చేయడానికి ఆయన వద్ద ఉన్న ఆధారాలు ఏమిటి?సీఎం చంద్రబాబునుద్దేశించి ‘సుప్రీం’ ఘాటు వ్యాఖ్యలుఆ లడ్డూలను పరీక్షల నిమిత్తం ఎందుకు పంపలేదు? ప్రెస్ ముందుకు వెళ్లే ముందు లడ్డూలను పరీక్షించడం సరైనదని సీఎం భావించలేదా? బహిరంగ ప్రకటనలు ఎందుకు చేయాలి?బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నవారు అలాంటి ప్రకటనలు చేయవచ్చా? దాని వల్ల సిట్ దర్యాప్తు ప్రభావితం కాదా? అది కోట్ల మంది ప్రజల మనోభావాలను దెబ్బతీస్తుందని తెలియదా? లడ్డూల తయారీలో కల్తీ నెయ్యి వాడారనేందుకు ప్రస్తుతం ఎలాంటి ప్రాథమిక ఆధారాలు లేవు. దేవుడిని రాజకీయాలకు దూరంగా ఉంచండి. – చంద్రబాబునుద్దేశించి సుప్రీంకోర్టునివేదిక జూలైలో వస్తే ముఖ్యమంత్రి సెప్టెంబర్‌లో ఎందుకు మాట్లాడారు..?ఎన్డీడీబీ నివేదిక జూలైలో వస్తే సీఎం సెప్టెంబర్‌లో ఎందుకు మాట్లాడినట్లని ధర్మాసనం ప్రశ్నించింది. జూలైలో వచ్చిన నివేదికపై అప్పుడే ఎందుకు మాట్లాడలేదు? ఈ వ్యవహారంలో ప్రెస్ ముందుకెళ్లాల్సిన అవసరం ఏముంది? ముఖ్యమంత్రి స్వయంగా దర్యాప్తునకు ఆదేశించినప్పుడు మళ్లీ ప్రెస్ ముందుకు వెళ్లడం ఏమిటి? నెయ్యిలో జంతు కొవ్వు కలిపారంటూ సీఎంప్రకటన చేశారు. అసలు ఈ ప్రకటన చేయడానికి ఆయన వద్ద ఉన్న ఆధారాలు ఏమిటి? లడ్డూల తయారీలో ఉపయోగించిన నెయ్యిలో కల్తీ జరిగిందని చెబుతున్నప్పుడు ఆ లడ్డూలను పరీక్షల నిమిత్తం ఎందుకు పంపలేదు? ప్రెస్ ముందుకు వెళ్లే ముందు లడ్డూలను పరీక్షించడం సరైనదని మీరు (సీఎం) భావించలేదా?జంతు కొవ్వు వాడారంటూ చేసిన ప్రకటన కోట్ల మంది ప్రజల మనోభావాలను దెబ్బతీస్తుందని తెలియదా? ప్రెస్ ముందుకెళ్లి బహిరంగ ప్రకటనలు ఎందుకు చేయాలి? దేవుడిని రాజకీయాలకు దూరంగా ఉంచండి. లడ్డూల తయారీలో కల్తీ నెయ్యి వాడారనేందుకు ప్రస్తుతం ఎలాంటి ప్రాథమిక ఆధారాలూ లేవు. దర్యాప్తు జరుగుతుండగా బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నవారు అలాంటి ప్రకటనలు చేయవచ్చా? దాని వల్ల సిట్ దర్యాప్తు ప్రభావితం కాదా? అని ప్రశ్నించింది.రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉన్న సీఎం ప్రెస్ ముందు అలా ఎలా మాట్లాడతారు. ప్రమాణాలకు అనుగుణంగా లేని నెయ్యిని వెనక్కిపంపించేశామని, అసలు ఆ నెయ్యిని లడ్డూ తయారీలో వాడనేలేదని టీటీడీ ఈవో చాలా స్పష్టంగా చెప్పారు. మరి అందుకు విరుద్ధంగా లడ్డూలో కల్తీ నెయ్యి ఉపయోగించారని ముఖ్యమంత్రి రాజకీయ ప్రకటనలు ఎలా చేస్తారు? – సుప్రీంకోర్టు ధర్మాసనంఅసలు దేని ఆధారంగా నెయ్యి కల్తీ అయినట్లు చెబుతున్నారు? లడ్డూలో కల్తీ నెయ్యి ఉపయోగించారనేందుకు ఆధారాలు ఏమిటి? శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగించారనేందుకు ప్రాథమిక ఆధారాలు లేవు. – సుప్రీంకోర్టు ధర్మాసనంనెయ్యి కల్తీ జరిగిందన్న విషయం ప్రజల్లోకి వెళ్లింది గానీ... తన నివేదికలో తప్పులు ఉండవచ్చని ఎన్డీడీబీ స్వయంగా చెప్పిన విషయం మాత్రం ప్రజల్లోకి వెళ్లే పరిస్థితి లేదు. – సుప్రీంకోర్టు ధర్మాసనంసాక్షి, అమరావతి: తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో వినియోగించే నెయ్యిలో కల్తీ ఆరోపణల విషయంలో వాస్తవాలు నిర్ధారణ కాక ముందే కల్తీ జరిగినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాజకీయ ప్రకటనలు చేయడాన్ని సుప్రీం కోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. లడ్డూ తయారీకి ఉపయోగించిన నెయ్యిలో జంతు కొవ్వు ఉందని చెప్పేందుకు ముఖ్యమంత్రి వద్ద ఏం ఆధారాలున్నాయని సూటిగా ప్రశ్నించింది. రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉన్న ముఖ్యమంత్రి ప్రెస్ ముందు అలా ఎలా మాట్లాడతారని నిలదీసింది. ప్రమాణాలకు అనుగుణంగా లేని నెయ్యిని వెనక్కి పంపించేశామని, అసలు ఆ నెయ్యిని లడ్డూ తయారీలో వాడనేలేదని టీటీడీ ఈవో చాలా స్పష్టంగా చెప్పారని గుర్తు చేసింది. మరి అందుకు విరుద్ధంగా లడ్డూలో కల్తీ నెయ్యి ఉపయోగించారని ముఖ్యమంత్రి రాజకీయ ప్రకటనలు ఎలా చేస్తారని విస్మయం వ్యక్తం చేసింది. అసలు దేని ఆధారంగా నెయ్యి కల్తీ అయినట్లు చెబుతున్నారు? లడ్డూలో కల్తీ నెయ్యి ఉపయోగించారనేందుకు ఆధారాలు ఏమిటి? అని ప్రశ్నించింది. శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగించారనేందుకు ప్రాథమిక ఆధారాలు లేవని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. ఒకవైపు దర్యాప్తు కొనసాగుతుండగా మరోవైపు రాజ్యాంగపరమైన ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యక్తులు రాజకీయ ప్రకటనలు చేయడం సరికాదని స్పష్టం చేసింది. అలాంటి ప్రకటనలు చేయడం వల్ల కోట్ల మంది ప్రజల మనోభావాలు ప్రభావితం అవుతాయని తేల్చి చెప్పింది. ‘కనీసం దేవుడినైనా రాజకీయాలకు దూరంగా ఉంచండి..!’ అని సీఎం చంద్రబాబు తదితరులను దృష్టిలో పెట్టుకుని ఘాటుగా వ్యాఖ్యానించింది. నెయ్యి కల్తీ జరిగిందంటూ రిపోర్టు ఇచ్చిన నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డే (ఎన్డీడీబీ) తన నివేదిక తప్పు కావొచ్చునని స్పష్టంగా పేర్కొందని ప్రస్తావించింది. నెయ్యి కల్తీ జరిగిందన్న విషయం ప్రజల్లోకి వెళ్లింది గానీ తన నివేదికలో తప్పులు ఉండవచ్చని ఎన్డీడీబీ స్వయంగా చెప్పిన విషయం మాత్రం ప్రజల్లోకి వెళ్లే పరిస్థితి లేదని వ్యాఖ్యానించింది. కల్తీపై ఎన్డీడీబీ ఇచ్చిన నివేదికపై సెకండ్ ఒపీనియన్ (రెండో అభిప్రాయం) ఎందుకు తీసుకోలేదని టీటీడీని ప్రశ్నించింది. ఎన్డీడీబీ ఒక్కటే అత్యున్నత ల్యాబ్ కాదని, దేశంలో పేరు మోసిన ల్యాబ్‌లు ఎన్నో ఉన్నాయని టీటీడీకి గుర్తు చేసింది. ఎన్డీడీబీ నివేదికలో స్పష్టత లోపించిందని పేర్కొంది. నెయ్యి కల్తీ వ్యవహారంపై దర్యాప్తు జరగాల్సిందేనని సుప్రీంకోర్టు ప్రాథమికంగా అభిప్రాయపడింది. అయితే దర్యాప్తు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) కొనసాగించాలా? లేక స్వతంత్ర సంస్థ ద్వారా దర్యాప్తు చేయాలా? అనే విషయంపై తమకు సహకరించాలని సొలిసిటర్ జనరల్ (ఎస్జీ) తుషార్ మెహతాను సుప్రీంకోర్టు ఆదేశించింది. దీనిపై తదుపరి విచారణను అక్టోబర్ 3వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. నెయ్యి కల్తీకి సంబంధించి ప్రకటనలు చేసే విషయంలో నియంత్రణ పాటించేలా మీ క్లయింట్లకు (రాష్ట్ర ప్రభుత్వం, టీటీడీ ఈవో) చెప్పాలని టీటీడీ తరఫున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రాకి ధర్మాసనం మౌఖికంగా స్పష్టం చేసింది. పలు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి లడ్డూ తయారీకి ఉపయోగించే నెయ్యిలో జంతు కొవ్వులను కలిపారన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపణలపై వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఓ కమిటీని ఏర్పాటు చేయాలని కోరుతూ బీజేపీ సీనియర్ నేత, ప్రముఖ ఆర్ధికవేత్త డాక్టర్ సుబ్రమణియన్ స్వామి ఇటీవల సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. అలాగే లడ్డూ నెయ్యి కల్తీ వ్యవహారంలో దర్యాప్తు, స్వతంత్ర విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తిని నియమించాలని అభ్యర్ధిస్తూ రాజ్యసభ సభ్యుడు, వైఎస్సార్సీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి కూడా పిల్ దాఖలు చేశారు. ఇదే అంశంపై ఇతర రాష్ట్రాలకు చెందిన సంపత్, శ్రీధర్, సురేష్ చవంకే వేర్వేరుగా రెండు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ నాలుగు వ్యాజ్యాలపై జస్టిస్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం మధ్యాహ్నం విచారణ జరిపింది. పిటిషనర్ సుబ్రమణియన్ స్వామి తరఫున సీనియర్ న్యాయవాది రాజశేఖర్‌రావు, సంపత్, శ్రీధర్ తరఫున రాఘవ్ అవస్తీ, సురేష్ చవంకే తరఫున సీనియర్ న్యాయవాది సోనియా మాథుర్, ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ, టీటీడీ తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. దాదాపు గంట పాటు ఇరుపక్షాల వాదనలు సాగాయి. చంద్రబాబు ప్రకటనతో నిష్పాక్షిక, పారదర్శక దర్యాప్తు సాధ్యమేనా? ముందుగా రాజశేఖర్‌రావు వాదనలు వినిపిస్తూ.. ‘తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ జరిగిందని ముఖ్యమంత్రి చంద్రబాబు రాజకీయ ప్రకటన చేశారు. అయితే టీటీడీ ఈవో ఇందుకు విరుద్ధంగా ఆ నెయ్యిని అసలు లడ్డూ తయారీలో ఉపయోగించలేదని పత్రికా ముఖంగా చెప్పారు. బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్న ముఖ్యమంత్రి లాంటి వ్యక్తులు ఎలాంటి ఆధారాలు లేకుండా, వాస్తవాలు తెలుసుకోకుండా ప్రకటనలు చేస్తే దాని పర్యవసానాలు దారుణంగా ఉంటాయి. అవి ప్రజల మధ్య సామరస్యాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉంది. ఇది కోట్ల మంది భక్తుల మనోభావాలకు సంబంధించింది. సీఎంప్రకటనకు భిన్నంగా టీటీడీ ఈవో ప్రకటనలు ఉన్న నేపథ్యంలో ఈ మొత్తం వ్యవహారంపై పర్యవేక్షణతో కూడిన విచారణ అవసరం. శ్రీవారి ప్రసాదంపై ప్రశ్నలు తలెత్తినప్పుడు ఆ ఆరోపణలను పరిశీలించాల్సిన అవసరం కూడా ఉంది. ముఖ్యమంత్రి ప్రకటన నేపథ్యంలో నిష్పాక్షిక, పారదర్శక దర్యాప్తు సాధ్యమేనా? ఈ మొత్తం వ్యవహారంలో రాజకీయ జోక్యాన్ని నిలువరించాలి. మా వ్యాజ్యంలో పలు కీలక ప్రశ్నలను లేవనెత్తాం’ అని నివేదించారు. ఆ వ్యాజ్యానికి విశ్వసనీయత లేదురాష్ట్ర ప్రభుత్వం తరఫున ముకుల్ రోహత్గీ వాదనలు వినిపిస్తూ.. సుబ్రమణియన్ స్వామి దాఖలు చేసిన ఈ వ్యాజ్యానికి విశ్వసనీయత లేదన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని సమర్ధించేందుకే ఆయన ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారన్నారు. స్వామి, వైవీ సుబ్బారెడ్డి వ్యాజ్యాల్లోని అంశాలు ఒకే రకంగా ఉన్నాయన్నారు. నెయ్యి సరఫరాదారులకు టీటీడీ షోకాజ్ నోటీసులు జారీ చేసిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించి దర్యాప్తు చేస్తోందని తెలిపారు. అనంతరం టీటీడీ తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపిస్తూ నెయ్యిని ఎప్పుడు సేకరించారు? ఎప్పుడు పరీక్షించారు? ఎప్పుడు వెనక్కి పంపారు? తదితర వివరాలను చదివి వినిపించారు. కల్తీ నెయ్యిని పరీక్షల నిమిత్తం ప్రఖ్యాత ఎన్డీడీబీ ల్యాబ్‌కు పంపామన్నారు. జూన్ నుంచి జూలై 4 వరకు సరఫరా చేసిన నెయ్యి శాంపిళ్లను ఎన్డీడీబీకి పంపలేదన్నారు. జూలై 6, జూలై 12న సరఫరా చేసిన నెయ్యి శాంపిళ్లనే ఎన్డీడీబీకి పంపామని లూథ్రా వెల్లడించారు. మా ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పండి..⇒ తమ ప్రశ్నలకు లూథ్రా సూటిగా సమాధానం చెప్పకుండా దాటవేస్తుండటంతో ధర్మాసనం జోక్యం చేసుకుంది. తమ ప్రశ్నలకు ముందుగా సమాధానం చెప్పాలని ఆదేశించింది. ⇒ ‘లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి ఉపయోగించారనేందుకు ఎలాంటి ప్రాథమిక ఆధారాలు లేవు. ముఖ్యమంత్రి ప్రకటనకు విరుద్ధంగా టీటీడీ ఈవో ప్రకటన ఉంది. కల్తీ నెయ్యి విషయంలో మీ (టీటీడీ) వైఖరి చాలా స్పష్టంగా ఉంది.⇒ ముఖ్యమంత్రి చేసిన ప్రకటనలకు ఎలాంటి ఆధారాల్లేవ్. దర్యాప్తునకు ఆదేశించినప్పుడు పదాల గారడీ ఎంత మాత్రం అవసరం లేదు...’ అని ధర్మాసనం ఘాటుగా స్పష్టం చేసింది. ⇒ ఎన్డీడీబీ నివేదికలో అది తప్పు అయ్యే అవకాశం కూడా ఉందని స్పష్టంగా పేర్కొన్నారని, అలాంటప్పుడు సెకండ్ ఒపీనియన్ ఎందుకు తీసుకోలేదని ధర్మాసనం ప్రశ్నించింది. ⇒ ఎన్డీడీబీ చాలా పేరున్న ల్యాబ్ అని లూథ్రా చెప్పగా.. అది ఒక్కటే కాదని, దేశంలో పేరు మోసిన ల్యాబ్‌లు చాలానే ఉన్నాయని ధర్మాసనం స్పష్టం చేసింది. ⇒ అసలు ఎంత మంది కాంట్రాక్టర్ల నుంచి నెయ్యిని సేకరిస్తున్నారని ధర్మాసనం ప్రశ్నించింది. ఐదుగురు కాంట్రాక్టర్ల వద్ద నుంచని లూథ్రా పేర్కొనడంతో.. వారి నుంచి సేకరించిన నెయ్యి మొత్తాన్ని కలిపేస్తారా? అని ధర్మాసనం ప్రశ్నించింది. కలిపేస్తామని లూథ్రా బదులివ్వడంతో మరి ఎవరు సరఫరా చేసిన నెయ్యి కల్తీ అయిందో ఎలా నిర్ధారిస్తారని ధర్మాసనం ప్రశ్నించింది. ⇒ మొత్తం నెయ్యి నుంచి కల్తీ నెయ్యిని ఎలా వేరు చేస్తారని ప్రశ్నించింది. దీనికి లూథ్రా నేరుగా సమాధానం ఇవ్వకుండా.. 50 ఏళ్లుగా శ్రీవారి ప్రసాదాల కోసం కర్ణాటక ప్రభుత్వానికి చెందిన నందిని నెయ్యిని ఉపయోగిస్తూ వచ్చామని, గత ప్రభుత్వ హయాంలోనే కాంట్రాక్టర్ మారారని పేర్కొన్నారు. ప్రజల నుంచి ఫిర్యాదు వచ్చిన నేపథ్యంలోనే నెయ్యి నాణ్యతను పరిశీలించామన్నారు. దీంతో కల్తీ వ్యవహారం బయటపడిందన్నారు. ఈ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసిన నేపథ్యంలో దానినే కొనసాగించాలా? లేక దర్యాప్తును స్వతంత్ర సంస్థకు అప్పగించాలా? అనే విషయంపై చెప్పాలని కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది. తదుపరి విచారణ అక్టోబర్ 3న మధ్యాహ్నం 3.30 గంటలకు చేపట్టనున్నట్లు ప్రకటించింది.ఇకనైనా దేవుడిని రాజకీయాల్లోకి లాగకండితిరుమల లడ్డూ ప్రసాదం వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు మండిపడింది. ల్యాబ్ రిపోర్టులో అస్పష్టత ఉంది. లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడినట్టు రుజువు లేకుండా మీడియా ముందుఎందుకు హడావుడి చేశారంటూ నిలదీసింది. జూలైలో రిపోర్టు వెలువడితే ఇప్పుడెందుకు బయటపెట్టారంటూ ప్రశ్నించింది. ఇకనైనా మీరు దేవుణ్ని రాజకీయాల్లోకి లాగకండి.. జస్ట్ ఆస్కింగ్. – ప్రకాశ్‌రాజ్, నటుడుసుప్రీంకోర్టు చంద్రబాబు చెంపలు వాయించింది తిరుమల లడ్డూ అంశంపై సరైన ఆధారాలు లేకుండా ఎలా మాట్లాడతారని సుప్రీంకోర్టు చంద్రబాబు చెంపలు వాయించింది – సుబ్రమణియన్‌స్వామి, మాజీ ఎంపీబాబు, పవన్ రాజీనామా చేయాలిచంద్రబాబు, పవన్ ఇద్దరూ వేంకటేశ్వర స్వామి ప్రసాదంపై తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేసి హిందువులను మోసం చేశారు. తిరుమల దేవస్థానంపై విశ్వాసాన్ని దెబ్బ తీసినందుకు వీరే బాధ్యత వహించాలి. హిందువులను మోసం చేసినందుకు, అబద్ధాలు ఆడినందుకు పశ్చాత్తాప్పడి పదవులకు రాజీనామా చేయాలి. – పీవీఎస్ శర్మ, ప్రభుత్వ మాజీ ఉన్నతాధికారిదేవాలయాలను రాజకీయాల్లోకి లాగుతారా? ప్రత్యర్థులను టార్గెట్ చేసేందుకు రాజకీయాల్లోకి దేవాలయాలను లాగుతారా? ఓట్ల కోసం మన ప్రార్థనా స్థలాలను లాగడం ఎంతవరకు సమంజసం? లడ్డూ విషయంలో స్వయంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబే అసత్య ప్రచారం చేసి కోట్లాది మంది ప్రజల విశ్వాసాలతో ఆడుకోవడం సబబేనా? రెండు పార్టీలతో పొత్తు పెట్టుకుని, బహిరంగంగా ఒకటి, రహస్యంగా మరొకటి.. బీజేపీ ఎందుకు ఆటలాడినట్టు? – ప్రియాంక చతుర్వేది, శివసేన ఎంపీ, రాజ్యసభబాబు మతపరమైన భావోద్వేగాలను ప్రేరేపిస్తున్నారు తిరుపతి లడ్డూను అడ్డుపెట్టుకుని మతపరమైన భావోద్వేగాలు ప్రేరేపించేందుకు చంద్రబాబు వ్యవహరిస్తున్నారని గతంలోనే ‘ఎక్స్’లో చెప్పాను. ఈరోజు సుప్రీంకోర్టు సరిగ్గా అదే చెప్పింది. – శ్రీధర్ రామస్వామి, ఏఐసీసీ సోషల్ మీడియా నేషనల్ కో–ఆర్డినేటర్బాబు ప్రజలకు క్షమాపణ చెబుతారా! చంద్రబాబూ సిగ్గు సిగ్గు. ప్రజలను తప్పుదోవ పట్టించినందుకు ఇప్పటికైనా ప్రజలకు క్షమాపణ చెబుతారా! – సుమంత్ రామన్, రాజకీయ విశ్లేషకులుపవన్ అసలు రంగు బట్టబయలైంది తిరుపతి లడ్డూ విషయంలో సుప్రీం వ్యాఖ్యలతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అసలు రంగు బట్టబయలైంది. ఇలాంటి కపట అవకాశవాదులకు మద్దతు ఇవ్వకండి – వీణా జైన్ (సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్)బాబు, పవన్‌ను చూస్తుంటే సిగ్గుగా ఉందిచంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లను చూస్తుంటే సిగ్గేస్తోంది. – గబ్బర్, ప్రముఖ మలయాళీ రచయితదేవాలయాలను రాజకీయాల్లోకి లాగుతారా? ప్రత్యర్థులను టార్గెట్ చేసేందుకు రాజకీయాల్లోకి దేవాలయాలను లాగుతారా? ఓట్ల కోసం మన ప్రార్థనా స్థలాలను లాగడం ఎంతవరకు సమంజసం? లడ్డూ విషయంలో స్వయంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబే అసత్య ప్రచారం చేసి కోట్లాది మంది ప్రజల విశ్వాసాలతో ఆడుకోవడం సబబేనా? రెండు పార్టీలతో పొత్తు పెట్టుకుని, బహిరంగంగా ఒకటి, రహస్యంగా మరొకటి.. బీజేపీ ఎందుకు ఆటలాడినట్టు? – ప్రియాంక చతుర్వేది, శివసేన ఎంపీ, రాజ్యసభహిందువుల విశ్వాసాన్ని దెబ్బతీశారురాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కోట్లాది మంది హిందువుల విశ్వాసాన్ని దెబ్బతీశారు. వీరిద్దరూ క్షమాపణ చెప్పాలి. పవన్ చాలా గొప్ప నటుడు. ఆయన నటనతో రాజకీయాల్లోనూ రాణించాలనుకుంటే అది పొరపాటే. – డాక్టర్ గిరిజా షెట్కార్, యూనివర్సల్ హెల్త్ రైట్స్ అడ్వొకేట్భారతీయ జర్నలిస్టులకు ఓ గుణపాఠం తిరుపతి లడ్డూ వ్యవహారం భారతీయ జర్నలిస్టులకు ఓ గుణపాఠం.నివేదికలు క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకోండి. ఒక ఆహార పదార్థంలో 14 రకాల కల్తీలు చేయవచ్చా? ఇక మతవాదులకు చెప్పడానికి ఏముంది! – ధన్య రాజేంద్రన్ (ది న్యూస్ మినిట్ ఎడిటర్ ఇన్ చీఫ్)ఇప్పుడేం చేస్తారు మీరందరూ అబ్బబ్బ.. పరమ పవిత్రమైన తిరుపతి లడ్డూ కోసం ఎంత రచ్చ చేశారు? భక్తుల మనోభావాల్ని ఎంత హింసించేశారు? రాజకీయ నేతల్ని పక్కన పెడదాం.. ప్రవచనకర్తలు, పండితులు, బ్రాహ్మణులు ఎంత ఓవరాక్షన్ చేశారు వీళ్లంతా. ప్రాయశి్చత్త శ్లోకాలట..! వాళ్లే కనిపెట్టేసి .. రామ రామా.. మీరు చేసింది మామూలు రచ్చనా.. పాపం ఎంత మంది భక్తుల మనోభావాలతో ఆడుకున్నారు మీరంతా! ఇప్పుడు ఏం చేస్తారు మీరందరూ? మీరు నిజంగా వేంకటేశ్వర స్వామి భక్తులైతే అదే నోటితో సోషల్ మీడియాలో మమ్మల్ని క్షమించండి అని పోస్టులు పెడతారా? పెట్టండి.. ఎంత మంది పెడతారో చూస్తాను. – వీణావాణి, వేణు స్వామి భార్యవైఎస్ జగన్‌ను దెబ్బతీయడానికి వారు ఆడిన పెద్ద అబద్ధం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని దెబ్బతీయడానికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చాలా పెద్ద అబద్ధమాడారు. ఇది వారు రాజకీయ స్వార్ధంతో ఆడిన అబద్ధం. చాలా సిగ్గు చేటు. –హర్ష్ తివారి దేవుళ్లను రాజకీయాలకు దూరంగా పెట్టండి కనీసం దేవుళ్లనైనా రాజకీయాలకు దూరంగా పెట్టండి – పూనమ్‌కౌర్, నటి -
సుప్రీం వ్యాఖ్యలు బాబుకు చెంపపెట్టు
తిరుపతి మంగళం: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై నీచ రాజకీయాలు చేసిన సీఎం చంద్రబాబుకు సుప్రీం కోర్టు వ్యాఖ్యలు చెంపపెట్టు అని వైఎస్సార్సీపీ నేత, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రి పదవి ఉందని పెదవి జారి అబద్ధాలను నిజం చేయాలని చూస్తే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి చంద్రబాబూ అని హెచ్చరించారు. భూమన సోమవారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై బురద జల్లేందుకు శ్రీ వేంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదానికి వినియోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందంటూ చంద్రబాబు కోట్లాది భక్తుల మనోభావాలు దెబ్బతీశారని అన్నారు. చంద్రబాబు స్వార్థ, కుటిల, కుతంత్ర రాజకీయాలతో మహా ప్రసాదానికి మలినం అంటించాలని చూస్తే దేవదేవుడు చూస్తూ ఊరుకోరని చెప్పారు. సాక్షాత్తు శ్రీవారే సుప్రీం కోర్టు ధర్మాసనంతో చంద్రబాబుకు చెంప పెట్టులాంటి మాటలు పలికించారని అన్నారు.టీటీడీ ఈవో శ్యామలరావు చెప్పిన మాటలకు భిన్నంగా చంద్రబాబు నెయ్యిలో జంతువుల కొవ్వు వాడినట్లు ఎలా చెబుతారని ప్రశ్నించారు. సత్యాన్ని అసత్యంగా మార్చాలన్నదే చంద్రబాబు దురాలోచన అని మండిపడ్డారు. చంద్రబాబు సిట్ అంటే కూర్చునే అధికారులను సిట్‌లో నియమించి విచారణ జరిపిస్తే ఆ రిపోర్ట్ ఎలా ఉంటుందో అందరికి తెలుసునన్నారు. శ్రీవారి లడ్డూ ప్రసాదానికి వినియోగించే నెయ్యిలో ఎలాంటి జంతువుల కొవ్వు కలపలేదు కాబట్టే తాము సుప్రీం కోర్టు సిట్టింగ్ జడ్జితో లేదా సీబీఐతో విచారణ జరిపించాలని కోరామని చెప్పారు. ప్రసాదంలో కల్తీ చేసి ఉంటే తాము సర్వనాశనం అయిపోవాలని, రక్తం కక్కుకుని చనిపోవాలని శ్రీవారి సన్నిధిలోని కోనేటిలో స్నానమాచరించి, అఖిలాండం వద్ద కర్పూరం వెలిగించి వేడుకొన్నామన్నారు.తప్పు చేసి ఉంటే నిజంగా ఆ దేవదేవుడు తమకు శిక్ష విధించేవారని అన్నారు. నిజంగా తాము తప్పు చేసి ఉంటే ఏ శిక్షకైనా సిద్ధమని స్పష్టం చేశారు. నిజం ఎప్పటికైనా గెలుస్తుందన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయిశ్చిత్త దీక్షలు చేపట్టి దుర్గమ్మ ఆలయాన్ని శుద్ధి చేశారని, పాపాలు చేసిన వారే ప్రాయిశ్చిత్తం చేసుకుంటారని ఎద్దేవా చేశారు. శ్రీవారి లడ్డూ ప్రసాదంపై నీచ రాజకీయాలు చేసిన చంద్రబాబు, పవన్‌ను, వారికి వంతపాడుతున్న ఎల్లో మీడియాను ప్రపంచ వ్యాప్తంగా హిందువులంతా ఛీకొడుతున్నారని చెప్పారు. -
దీని అర్థం ఏంటి బాబూ?: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: రాజకీయ దుర్బుద్ధితో పరమ పవిత్రమైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదంపై పచ్చి అబద్ధాలు వల్లె వేసి అపవిత్రం చేస్తూ.. తన తిరుమల పర్యటనపై అవాస్తవాలు చెబుతూ దబాయిస్తున్న సీఎం చంద్రబాబు తీరును ఆదివారం ‘ఎక్స్’ వేదికగా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎండగట్టారు. ‘నీకు నోటీసు ఇచ్చారా? తిరుమలకు పోవద్దాన్నారా? వేంకటేశ్వరస్వామి గుడికి పోనివ్వబోమని ఎవరైనా చెప్పారా...’ అంటూ శుక్రవారం సీఎం చంద్రబాబు పచ్చి అబద్ధాలను వల్లె వేశారు. మాజీ సీఎం జగన్ తిరుపతి, తిరుమల పర్యటనకు అనుమతి లేదని.. ఆ కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ వైఎస్సార్సీపీ నేతలకు శుక్రవారం నోటీసులు ఇచ్చారు. శుక్రవారం సీఎం చంద్రబాబు మాట్లాడిన మాటలకు సంబంధించిన వీడియోనూ.. వైఎస్సార్సీపీ నేతలకు పోలీసులు జారీ చేసిన నోటీసులను జత చేస్తూ ‘దీని అర్థం ఏంటి బాబూ?.. దీని కన్నా వేరే సాక్ష్యం కావాలా? సత్యమేవ జయతే’ అంటూ మాజీ సీఎం వైఎస్ జగన్ ‘ఎక్స్’లో పోస్టు చేశారు. స్వార్థ రాజకీయాల కోసం తిరుమల పవిత్రతను దెబ్బతీస్తావా? పరమ పవిత్రమైన తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో స్వచ్ఛమైన ఆవు నెయ్యికి బదులుగా జంతువుల కొవ్వు వాడారంటూ చంద్రబాబు చెబుతోన్న మాటల్లో వీసమెత్తు నిజం లేదంటూ సాక్ష్యాధారాలతో సహా మాజీ సీఎం వైఎస్ జగన్ వివరించారు. జూలై 23న టీటీడీ ఈవో.. సెప్టెంబరు 18న సీఎం చంద్రబాబు.. సెప్టెంబరు 20న టీటీడీ ఈవో.. సెప్టెంబరు 22న సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ మాట్లాడిన మాటలకు సంబంధించిన వీడియోలను.. సెప్టెంబరు 27న తాను మీడియాతో మాట్లాడిన మాటల వీడియోలను జత చేసి.. దీని అర్థం ఏంటి బాబూ? దీని కన్నా వేరే సాక్ష్యం కావాలా? సత్యమేవ జయతే అంటూ ‘ఎక్స్’లో వైఎస్ జగన్ పోస్టు చేశారు. వనస్పతి కలిసింది.. ట్యాంకర్లు రిజెక్ట్ చేశాం శాంపిళ్లలో కల్తీ జరిగిందని తేలింది. అందులో వెజిటబుల్ ఫ్యాట్ అంటే వనస్పతి కలిసిందని తేలింది. ఆ సప్లయిర్‌ను బ్లాక్ లిస్ట్ చేసేందుకు షోకాజ్ నోటీసు ఇచ్చాం. రెండు ట్యాంకర్లను రిజెక్ట్ చేశాం – జూలై 23న టీటీడీ ఈవో శ్యామలరావు కల్తీ బాబు సృష్టి.. శ్రీ వేంకటేశ్వరస్వామి దగ్గర పెట్టే ప్రసాదాన్ని అపవిత్రం చేసే విధంగా నాసిరకమైన ముడిసరుకులు వాడారు. లడ్డూ తయారీలో నెయ్యికి బదులు జంతువుల కొవ్వు వాడారు. – సెప్టెంబరు 18న సీఎం చంద్రబాబు నాలుగు ట్యాంకర్లు వెనక్కి పంపాం కల్తీ నెయ్యి అని రిపోర్టులో తేలడంతో నాలుగు ట్యాంకర్ల నెయ్యిని రిజెక్ట్ చేశాం. నాలుగు ల్యాంకర్లను వెనక్కి పంపాం. ఆ సంస్థ నుంచి సరఫరాను నిలిపేశాం. – సెప్టెంబరు 20న టీటీడీ ఈవో శ్యామలరావు బాబు నోట మళ్లీ అవే కల్తీ మాటలు నాలుగు ట్యాంకర్లు అప్పటికే వచ్చేశాయి. వాటిలోని కల్తీ నెయ్యిని వాడారు. – సెప్టెంబరు 22న సీఎం చంద్రబాబు తిరుమల లడ్డూ పవిత్రతను దెబ్బతీసిన చంద్రబాబు పచ్చి అబద్ధాలు వల్లె వేసి తిరుమల, తిరుపతి దేవస్థానం ప్రతిష్టను సీఎం చంద్రబాబు అబాసుపాలు చేశారు. పరమ పవిత్రమైన లడ్డూ విశిష్టతకు దెబ్బతీశారు. శ్రీవారి ప్రసాదం బాగాలేదని, తింటే మంచిది కాదని భక్తుల్లో అనుమానపు బీజాలు నాటారు. తాను చెబుతున్నది పచ్చి అబద్ధమని తెలిసి కూడా చంద్రబాబు పదే పదే అవాస్తవాలు చెబుతున్నారు. – సెప్టెంబరు 27న మాజీ సీఎం వైఎస్ జగన్ నేడు తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ – విచారణ జరపనున్న జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ కేవీ విశ్వనాథన్ ధర్మాసనం తిరుమల లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు కలిపారన్న సీఎం చంద్రబాబు ఆరోపణలపై వాస్తవాలు నిగ్గు తేల్చేందుకు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో కమిటీ ఏర్పాటు చేయాలని బీజేపీ సీనియర్ నేత సుబ్రమణియన్‌స్వామి, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి సహా పలువురు పిటిషన్లు వేశారు. సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి నేతృత్వంలో స్వతంత్ర దర్యాప్తు జరపాలని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అభ్యర్ధించారు. ఎన్డీడీబీ ల్యాబ్ నివేదికపై ఫోరెన్సిక్ ఆడిట్ జరపాలని విన్నవించారు. ఈ కేసులో సుబ్రమణియన్‌స్వామి స్వయంగా వాదనలు వినిపించనున్నారు. తిరస్కరించిన నెయ్యిని ప్రసాదంలో వాడలేదని స్వయంగా ఈవో చెప్పిన విషయాలను సుప్రీంకోర్టు దృష్టికి పిటిషనర్లు తీసుకెళ్లారు. తిరస్కరించిన నెయ్యిని వాడనప్పుడు లడ్డూ అపవిత్రత ఎందుకైంది, ల్యాబ్ రిపోర్టు తయారీ వెనుక రాజకీయ దురుద్దేశాలు ఉన్నాయా? అనేది కూడా తేల్చాలని పిటిషన్లో విన్నవించారు. నిరాధారమైన తప్పుడు ఆరోపణలతో శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీశారని వివరించారు. ఎస్వోపీ ప్రకారం పరీక్షల్లో ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న నెయ్యిని మాత్రమే తిరుమల ప్రసాదానికి వినియోగించే విధానం దశాబ్దాలుగా కొనసాగుతోందని, ఏదో ఒక చిన్న రిపోర్టును ఆధారంగా చేసుకుని కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని పేర్కొన్నారు. అందుకే సుప్రీంకోర్టు ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని పిటిషనర్లు అభ్యర్ధించారు. -
ఎందుకీ రాద్ధాంతం?
ఆ నెయ్యిలో ఏదో జంతువు కొవ్వు కలిసిందని జరుగుతున్న ప్రచారం కేవలం ఊహాజనితం. దీనికి ఎలాంటి శాస్త్రీయ కొలబద్ద లేదు. ఇలాగైతేనే ప్రజలు నమ్ముతారని మూఢ నమ్మకం మాటున చెబుతున్నదే. ఏదైనా విషయాన్ని ఉద్దేశ పూర్వకంగా అశాస్త్రీయంగా అంచనా వేయడంలో భాగంగానే ఇది జరిగింది. అంటే ఏదో ఆశించి ఇలా చేశారని స్పష్టమవుతోంది. ఇది ‘బ్యాడ్ కేస్ ఆఫ్ ఎక్స్‌ప్లాయిటేషన్’గా నిలుస్తుంది. – ప్రముఖ ఆర్థిక వేత్త, సామాజిక కార్యకర్త మోహన్ గురుస్వామిసాక్షి, హైదరాబాద్ : ఏ నివేదికలో నిరూపణ కాకుండానే తిరుమల లడ్డూపై దుష్ప్రచారం తగదని ప్రముఖ ఆర్థిక వేత్త, సామాజిక కార్యకర్త మోహన్ గురుస్వామి ఆవేదన వ్యక్తం చేశారు. ‘సెక్యులర్ రాజ్యంలో మతానికి చోటుండదు. మతపరమైన విశ్వాసాలు అనేవి వ్యక్తిగతం. అసలు ప్రభుత్వంలో మతం అనే దానికి చోటే లేదు. ఇలాంటి విషయాలను అడ్డుపెట్టుకుని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తిరుమలను వివాదాస్పదంగా మార్చడం సరికాదు’ అని అన్నారు.మతపరమైన విశ్వాసాలపై వివాదం సృష్టించి, తద్వారా రాజకీయ ప్రయోజనం పొందేందుకే తిరుమల లడ్డూ వివాదాన్ని తెరపైకి తీసుకొచ్చినట్టు కనిపిస్తోందని చెప్పారు. పాలకులకు ఇబ్బంది కలిగించే విషయాలను పక్కదారి పట్టించేందుకే ఇలాంటి వివాదాలు తెరపైకి తెస్తుంటారని, ఏపీలో ఇప్పుడదే జరుగుతోందన్నారు. తిరుమల లడ్డూ వివాదం, జాతీయ, రాష్ట్ర స్థాయిలో రాజకీయ పరిణామాలు, ఆర్థిక రంగంలో ఎదురవుతున్న సవాళ్లు తదితర అంశాలపై సాక్షి ప్రతినిధికి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన పలు విషయాలు వెల్లడించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. అవన్నీ రాజకీయ ఆరోపణలే ⇒ లడ్డూల తయారీకి ఉపయోగించే నెయ్యిలో కల్తీ జరిగిందనే రాజకీయ ఆరోపణలు, వాటికి ప్రభుత్వ స్థాయిలో పెద్ద ఎత్తున ప్రచారం చేయడం మినహా అది నిజమని ఏ నివేదికలోనూ వెల్లడి కాలేదు. ఈ అంశం అమూల్‌తో సహా ఏ నివేదికలోనూ నిరూపితం కాకుండానే అయినట్టుగా ప్రచారం చేస్తున్నారు. ⇒ పాలు జంతువుల ఉత్పత్తితో ముడిపడినవే. శాస్త్రీయంగా చూస్తే.. ఆవు, బర్రె, మేక ఆ మాటకొస్తే ఏదైనా మొక్క నుంచి వచ్చే కొవ్వును మారి్పడి చేస్తే నెయ్యి తయారవుతుంది. ఆవు అధికంగా మేత మేసినా, లేక తక్కువగా తిన్నా ఫలితాల్లో మార్పులు కనిపిస్తాయి. ఇదే విషయాన్ని అమూల్ టెస్ట్ రిజల్ట్ నిర్ధారించింది. కల్తీ అయిందని చెబుతున్న నెయ్యే లడ్డూ తయారీలో వాడనప్పుడు అపచారం జరిగిందనడానికి ఎక్కడ తావుంది? ⇒ ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పచ్చి అవకాశవాది. తన స్వార్థ ప్రయోజనాలు, రాజకీయ ప్రయోజనాలే ఆయనకు అత్యంత ముఖ్యం. ఇందుకోసం ఏం చేయడానికైనా ఆయన వెనుకాడరని చరిత్ర చెబుతోంది. గతంలో మోదీని నంబర్ వన్ శత్రువుగా ప్రకటించిన చంద్రబాబు.. ఇప్పుడు ఆయనకు నంబర్ వన్ మిత్రుడు ఎలా అయ్యారు? ⇒ అత్యున్నత పదవుల్లో ఉన్న వారికి లౌకికవాదమంటే అసలైన అర్థం తెలుసా? వారికి ఆ పదవిలో కొనసాగే అర్హత ఉందా? (ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌ను ఉద్దేశించి) అన్న అనుమానం కలుగుతోంది. చంద్రబాబు స్వార్థ రాజకీయాలే చేస్తారు ⇒ గతంలో చంద్రబాబు మనుషులు సైబరాబాద్ చుట్టూ భూములు కొని లాభ పడ్డారు. అప్పుడు అక్కడ భూముల పేరిట చేసిందే ఇప్పుడు అమరావతిలో పెద్ద ఎత్తున చేయబోతున్నారు. అందుకే అమరావతే ఏకైక రాజధానిగా ఉండాలని పట్టుబడుతున్నారు. తన అనుయాయులు కొన్న భూములన్నీ కూడా అక్కడే ఉండటం గమనించాల్సిన విషయం. చంద్రబాబు ఎప్పుడూ స్వార్థ రాజకీయాలే చేస్తారు. ⇒ అయితే అక్కడ మౌలిక, ఇతర అవసరాల కోసం పెట్టుబడులు పెట్టడానికి వేల కోట్ల రూపాయలు కావాలి. మోదీ ప్రభుత్వం కూడా ఆ మేరకు ఇచ్చే పరిస్థితి లేదు. ఏపీకి కేంద్రం ‘ప్రత్యేక హోదా కల్పన’ ఇవ్వడం అనేది అసాధ్యం. ఏపీలో బీహార్ మాదిరిగా వెనుకబాటుదనం లేదు. ఈశాన్య రాష్ట్రాల లాగా భౌగోళికంగా దూరప్రాంతాల్లోనూ లేదు. ప్రతిసారి కేంద్రం నుంచి గ్రాంట్లు కావాలని, డబ్బులు ఇవ్వాలని చంద్రబాబు డిమాండ్ చేసినా అది రావడం కూడా కష్టమే. సాధ్యం కాదు. ⇒ అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే చంద్రబాబు.. అమరావతిలో మెట్రో, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, పరిపాలనా కేంద్రం సచివాలయం, గవర్నమెంట్ ఉద్యోగుల క్వార్టర్లు, ఇతర ఆధునిక సదుపాయాలు, ముఖ్యమైన సంస్థలన్నీ అమరావతిలోనే ఉండాలంటున్నారు. ఇలా అన్నీ అక్కడే ఎందుకో.. దాని వెనుక ఏం ప్రయోజనాలు ఆశిస్తున్నారో లోతుగా గమనించాలి. ముందుగా ఓ కమర్షియల్ సెంటర్‌గా ఎదిగాక అవన్నీ సమకూరాలని కోరుకుంటే మంచిది. ⇒ కేంద్రంలో రాజకీయ స్థిరత్వం అనేది చంద్రబాబు, నితీ‹Ùకుమార్ వంటి నమ్మకం లేని (అన్ ట్రస్ట్ వర్తీ) వ్యక్తులపై ఆధారపడి ఉంది. వీరిద్దరూ మద్దతు ఉపసంహరించినా కేవలం ఆరుగురు ఎంపీల మెజారిటీతో ప్రభుత్వం మనగలుగుతుంది. అయితే గత రెండు పర్యాయాలతో పోలి్చతే మోదీ ప్రభుత్వం బలహీనంగానే ఉంది. దేశంలో నిరుద్యోగ శాతం, ఉద్యోగాలు, ఉపాధి కోరుకుంటున్న యువత సంఖ్య పెరుగుతోంది. ప్రభుత్వ విధానాలను, విపక్షాలను మోదీ ‘మిస్ మేనేజ్’ చేశారు. తప్పుడు గణాంకాలతో మసిపూసి మారేడు కాయ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ‘కేపిటల్ ఇన్వెస్ట్మెంట్’ అనుకున్న విధంగా జరగలేదు. కార్పొరేట్ కంపెనీలు విదేశాల్లో పెట్టుబడులు పెడుతున్నాయి. వైఎస్ జగన్ వికేంద్రీకరణ ఆలోచన బాగుంది ⇒ రాష్ట్ర రాజధానిని వికేంద్రీకరించాలనే వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచన ఎంతో బాగుంది. గతంలో కర్నూలులో రాజధాని ఉండేది. హైకోర్టు, రాష్ట్ర సచివాలయం రెండూ రాజధానిలోనే ఎందుకుండాలి? రాష్ట్ర రాజధానిలోనే మెట్రోరైల్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వంటివి ఎందుకుండాలి? భోపాల్, రాయ్‌పూర్, రాంచీ, లఖ్‌నవూ, పాట్నా వంటి రాజధానుల్లో మెట్రో, అంతర్జాతీయ విమానాశ్రయాలు లేవు. ⇒ జగన్ సీఎంగా ఉన్నప్పుడు చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు.. ముఖ్యంగా విద్య, వైద్య రంగాలపై దృష్టి సారించడం బాగుంది. మంచి ఫలితాలు వచ్చాయి. వివిధ వర్గాల ప్రజలకు, ముఖ్యంగా పేదలకు నేరుగా నగదు బదిలీ (డీబీటీ) అనేది మంచి ఆలోచన. కోవిడ్ వంటి విపత్కర పరిస్థితుల్లో ఇలా చేయడం, ఇళ్ల దగ్గరే ప్రజలకు అందించడం ఎంతో మేలు చేసింది. డీబీటీ విధానాన్ని నేను పూర్తిగా సమర్థిస్తున్నాను. ఇది ఉత్పాదకతను పెంచేదే. ఆర్థిక రంగానికి మేలు చేస్తుంది. ⇒ ఎవరైనా సంక్షేమ పథకాలు సరైనవి కాదు అనడం, వీటిపై డబ్బు ఖర్చు చేయడం వృథా అనడం తప్పు. విద్య, వైద్య సేవలకు కూడా చార్జ్ చేస్తారా? ఇవన్నీ ఆర్థికాభివృద్ధికి దోహదపడతాయి. ప్రభుత్వాలు ఏవైనా విద్యా రంగం, పబ్లిక్ హెల్త్‌కేర్‌పై ఎక్కువ నిధులు ఖర్చు చేయాలి. ప్రజలకు మేలు చేకూర్చడం అనేది ఓ మంచి ఆర్థిక కార్యక్రమంగా భావించాలి. -
దేవుడా.. ఏపీని రక్షించు!
‘‘స్వామీ.. చంద్రబాబు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా మేము మా ఊళ్లోని మీ గుడిలో పూజలు చేస్తున్నాం.. తప్పు చేసింది మేం కాదు.. ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్న చంద్రబాబు నాయుడు.. ఆయన నిర్వాకంపై మీకొస్తున్న కోపాన్ని ప్రజలపై కాకుండా చంద్రబాబుపైనే చూపండని వేడుకుంటున్నాం.. ఎందుకంటే జరిగింది ఘోర అపచారం.. కలియుగ దైవం వేంకటేశ్వరస్వామిని పలుచన చేస్తూ, ఆయన ప్రసాదాన్ని లోకువ చేస్తూ..జరగనిది జరిగినట్లుగా.. వాడని జంతువుల కొవ్వును వాడినట్లుగా, ఆ లడ్డూలు పంపిణీ చేసినట్లుగా.. పచ్చి అబద్ధాలాడుతూ మిమ్మల్ని(దేవుడు) అడ్డు పెట్టుకుని చంద్రబాబు రాజకీయం చేస్తూ అపవిత్రం చేశారు.. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది భక్తుల విశ్వాసంపై దెబ్బ కొట్టారు.. దేవుడు, దైవం.. అనే భయం, భక్తి లేకుండా.. కళ్లార్పకుండా చెప్పిన అబద్ధాన్నే పదే పదే చెబుతూ ప్రజల్లో విష బీజాలు నాటుతున్నారు..వైఎస్ జగన్‌పై కోపంతో మమ్మల్ని క్షోభకు గురిచేస్తూ.. మిమ్మల్ని అపవిత్రం చేస్తున్నారు. ఆ పాపాన్ని కడిగేయాలని అభిషేకాలు, పూజలు చేస్తున్నాం.. చంద్రబాబు క్షుద్ర రాజకీయాల నుంచి రాష్ట్రాన్ని కాపాడాలని ముకుళిత హస్తాలతో వేడుకుంటున్నాం.’’– రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్సీపీ శ్రేణులు, ప్రజల వేడుకోలు సాక్షి నెట్వర్క్: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేసిన అపచారం ప్రభావం రాష్ట్ర ప్రజలపై పడకుండా చూడాలని వేడుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా శనివారం ఆలయాల్లో వైఎస్సార్సీపీ శ్రేణులు, ప్రజలు.. హోమాలు, అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అన్ని జిల్లాలు, నియోజకవర్గాలు, మండల కేంద్రాల్లోని ఆలయాలు ప్రత్యేక పూజలతో కిటకిటలాడాయి. అనంతపురం మొదలు ఇచ్ఛాపురం వరకు హోమాలు, అభిషేకాలతో ఆలయాలు హోరెత్తాయి. పరమ పవిత్రమైన తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై సీఎం చంద్రబాబు చేసిన నిరాధార ఆరోపణలతో దేవదేవుడికి కలిగే ఆగ్రహం చంద్రబాబు వరకే పరిమితమయ్యేలా చూడాలని వైఎస్సార్సీపీ శ్రేణులు, ప్రజలు స్వామి వారిని వేడుకున్నారు. వైఎస్సార్సీపీ అ«ధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీ శ్రేణులు, నాయకులు, ప్రజలు, అభిమానులు భక్తి శ్రద్ధలతో పూజల్లో పాల్గొన్నారు.బాబు పాపాలకు ప్రక్షాళన గావించాలని కోరుతూ ప్రపంచ వ్యాప్తంగా భక్తులు, తెలుగు ప్రజలందరూ హారతులిచ్చారు. మత రాజకీయాలు చేస్తున్న సీఎం చంద్రబాబుకు మంచి బుద్ధి ప్రసాదించాలని కోరారు. శ్రీవారి పవిత్ర లడ్డూ ప్రసాదంపై దుష్ప్రచారం చేస్తూ విద్వేషాలు సృష్టిస్తున్నారని, తిరుమల పవిత్రతను ‘మంట’గలుపుతూ చలి కాచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. టీటీడీ పేరు ప్రఖ్యాతులకు విఘాతం కల్పిస్తూ భక్తులను రెచ్చగొడుతున్నారని, బాబు వ్యాఖ్యలకు మంత్రులు, టీడీపీ నేతలు, ఎల్లో మీడియా తందానా అంటుండటం బాధాకరమని అన్నారు. కల్తీ జరిగిందని చెబుతున్న నెయ్యిని అసలు ఉపయోగించనప్పుడు తప్పు జరగడానికి ఆస్కారమే లేదని, అయినా ముఖ్యమంత్రి స్థాయిలో చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని.. బాబు మహాపచారం ప్రభావం రాష్ట్రంపై పడకుండా చూడాలని పదే పదే వేడుకున్నారు. ఎక్కడికక్కడ వైఎస్సార్సీపీ శ్రేణులకు మద్దతుగా ప్రజలు తరలివచ్చి పెద్ద ఎత్తున పూజల్లో పాల్గొన్నారు. నంద్యాల జిల్లా డోన్‌లోని వేంకటేశ్వరాలయంలో పూజలు చేసేందుకు పాదయాత్రగా వెళ్తున్న మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, వైఎస్సార్సీపీ శ్రేణులు దేవదేవుడి నుంచి బాబు తప్పించుకోలేరుయూకేలో తెలుగు ప్రజల ప్రత్యేక పూజలు సాక్షి, అమరావతి: తిరుమల లడ్డూ ప్రసాదంపై సీఎం చంద్రబాబు నాయుడు చేస్తున్న దుష్ప్రచారాన్ని ఖండిస్తూ తిరుమల పవిత్రతను కాపాడాలని శనివారం లండన్ ఈస్ట్ హ్యంలో ఉన్న మహాలక్ష్మి, శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తెలుగువారు పెద్ద ఎత్తున పూజలు నిర్వహించారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపునకు స్పందిస్తూ.. పార్టీ అభిమానులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. లడ్డూ పవిత్రత విషయంలో తప్పు చేసిన చంద్రబాబు నాయుడు ఆ దేవ దేవుడి శాపం నుంచి తప్పించుకోలేడని ఈ సందర్భంగా వారు వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో మలిరెడ్డి కిషోర్ రెడ్డి, వెంకట రమణ, వినయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
లడ్డూలో ‘కుట్ర’ కోణం
సాక్షి, హైదరాబాద్: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారనడంలో కుట్రకోణం దాగి ఉందని భారత వ్యవసాయ పరిశోధన సంస్థ పాలక మండలి సభ్యుడు బద్రవాడ వేణుగోపాల్ సంచలన విషయాలు వెల్లడించారు. జాతీయ పాడి పరిశ్రమాభివృద్ధి సంస్థ (ఎన్డీడీబీ) ఇచ్చిన నివేదికలోనే అసలు కుట్ర దాగి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.ఆ నివేదికపై సమగ్ర విచారణ జరిపించాలని, కోట్లాది మంది భక్తుల మనోభావాలపై తీవ్రమైన దాడి చేసేందుకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. ఈ మేరకు శుక్రవారం ఆయన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ రాశారు. రాష్ట్రపతితో పాటు భారత ప్రధాన మంత్రి, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌లకు కూడా ఆ లేఖను పంపారు. ఆ లేఖలో ప్రధానాంశాలు ఇలా ఉన్నాయి. వ్యాపార ప్రయోజనాల కోసమే ఆ భేటీ∙టీటీడీ లడ్డూ వివాదానికి లోపభూయిష్టమైన ఎన్డీడీబీ కాఫ్ రిపోర్టుతో పాటు టీటీడీ, ఎన్డీడీబీ, రాష్ట్రీయ గోకుల్ మిషన్ (ఆర్జీఎం) పెద్దల అనుమానాస్పద వ్యాపార భేటీలు ఉత్ప్రేరకాలుగా మారాయి. ఈ నివేదిక తదనంతర పరిణామాలతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది భక్తుల విశ్వాసం దెబ్బతింది. ఈ విషయానికి లభించిన విపరీత ప్రచారం టీటీడీ విశ్వసనీయతను దెబ్బ తీసింది. ⇒ జూలై 6న నెయ్యి శాంపిళ్లను పరీక్ష కోసం పంపగా, అంతకంటే ముందు అంటే జూలై 5న టీటీడీ ఈవో జె.శ్యామలరావు, ఎన్డీడీబీ చైర్మన్ మీనేశ్.సి.షా, ఎన్ డీడీబీ మాజీ చైర్మన్ ఆర్జీఎం అదనపు కార్యదర్శి వర్షా జోషిల మధ్య భేటీ జరిగింది. ఈ భేటీ అనేక అను మానాలకు తావిస్తోంది. ⇒ ఈ భేటీ కారణంగానే నెయ్యి కల్తీ జరిగిందని వచ్చిన నివేదిక వెనుక రాజకీయ దురుద్దేశాలున్నాయేమోననే అనుమానాలు కలుగుతున్నాయి. ఈ ముగ్గురి చర్యల కారణంగా లడ్డూ ప్రసాదానికి ఉన్న విశ్వసనీయత దెబ్బతింది. ఇందుకు వారే బాధ్యత వహించాలి. వ్యాపార లావాదేవీల కోసం వారి దురాశపూరిత వైఖరి క్షమించరానిది. వారు కఠిన శిక్షలు ఎదుర్కోవాలి. వారి ఆస్తులన్నింటినీ సీజ్ చేసి, ధార్మిక సంస్థలకు దానం చేయాలి. ఈ వ్యవహారంతో సూక్ష్మ సంబంధమున్న ఎవరినైనాసరే జైలుకు పంపాలి. ⇒ వాస్తవాలను పరిశీలించి ఆరోపణల వెనుక ఉన్న నిజాలను తెలుసుకోవడం కంటే హడావుడి ప్రకటనలకే రాజకీయ నాయకులు ప్రాధాన్యమిచ్చారు. అదే నిజ మైతే సదరు రాజకీయ నాయకులు కూడా న్యాయ పరంగా తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. లడ్డూ పవిత్రతను కాపాడడం, మతపరమైన ఆచా రాలను సంరక్షించడం అత్యవసరం. ఇలాంటి రాజ కీయ అపస్వరాలు వినిపిస్తున్న వేళ దేవాలయాల నిర్వ హణను మత పెద్దలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఏకపక్షంగా నియామకం⇒ వ్యాపార లావాదేవీల కోసం టీటీడీ ఈవో శ్యామ లరావుతో భేటీ అయిన ఎన్డీడీబీ చైర్మన్ మీనేశ్.సి.షా, వర్షాజోషీల ట్రాక్ రికార్డు వివాదాస్పదం. అధికార, ఆర్థిక దుర్వినియోగాలకు సంబంధించి ఆరోప ణలు వీరిపై వచ్చాయి. 2021 మే 31న వర్షాజోషి ఎన్డీడీబీ చైర్మన్‌గా రిటైర్ అయ్యారు. ఆ తర్వాత ప్రస్తుత చైర్మన్ మీనేశ్.సి.షాను ఆమె ఏకపక్షంగా నియ మించారు. ⇒ డిప్యూటీ జనరల్ మేనేజర్ హోదాలో ఉన్న షాను అనేక హోదాలు దాటించి మరీ చైర్మన్, ఎండీగా నియమించారు. ఈ ఇద్దరు దేశీయ పశు సంపదను పెంపొందించడం కంటే బహుళ జాతి సంస్థల ప్రయోజనాల కోసం విదేశీ రకాలను, జెర్సీ ఆవులను ప్రోత్సహించడంపైనే దృష్టి పెట్టి పని చేశారు. ఇది ప్రధాని మోదీ ఆలోచనకు, ఆయన హయాంలో నడుస్తున్న రాష్ట్రీయ గోకుల్ మిషన్‌కు విరుద్ధం. వీరిద్దరిపై ఆర్‌జీఎంకు సంబంధించి రూ.4,109 కోట్లు, నేషనల్ డెయిరీ ప్లాన్–1కు సంబంధించి రూ.2,242 కోట్ల నిధుల దుర్వినియోగంపై కూడా ఆరోపణలున్నాయి.వాళ్లే జవాబుదారీ⇒ టీటీడీ ఉపయోగించిన నెయ్యిలో కల్తీ జరిగిందని నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు కాఫ్ ఇచ్చిన రిపోర్టుపై సమగ్ర విచారణ జరిపించాలి. ఇందుకు బాధ్యులైన అధి కారులతో పాటు కోట్లాది మంది భక్తులను తప్పుదోవ పట్టించినందుకు టీటీడీ ఈవో జె. శ్యామలరావుతో పాటు ఎన్డీడీబీ చైర్మన్ మీనేశ్.సి.షాలను జవాబుదారులుగా చేయాలి. ⇒ ఎన్డీడీబీ చైర్మన్‌గా మీనేశ్.సి.షా నియామకమే నేరపూరితం. ఆయన పదోన్నతి లభించేందుకు దారి తీసిన పరిస్థితులపై విచారణ జరిపించాలి. ⇒ విదేశీ రకాలను ప్రోత్సహించి, స్వదేశీ పశు సంపద కార్యక్రమాలను నిర్వీర్యం చేయడంలో ఎన్డీడీబీ చైర్మన్‌గా, రాష్ట్రీయ గోకుల్ మిషన్ అదనపు కార్య దర్శిగా వర్షాజోషి తన హోదాను దుర్విని యోగం చేయడంపై కూడా విచారణ జరిపించాలి. ⇒ దేశంలోని అన్ని దేవాలయాల్లో దేశీయ ఆవు నెయ్యి ని ప్రోత్సహించేలా చర్యలు తీసుకోవాలి. ⇒ మీనేశ్.సి.షా, వర్షాజోషిల హయాంలో రాష్ట్రీయ గోకుల్ మిషన్ , పశుసంపద వృద్ధి (సీడీడీ) కార్య క్రమాల్లో జరిగిన ఆర్థిక అక్రమాలపై విచారణ జరిపించాలి. ⇒ ఈ విచారణ పూర్తి పారదర్శకంగా, జవాబుదారీగా ఉండేందుకు సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి లేదా ఉన్నత స్థాయి అధికారితో విచారణ జరిపించాలి. కోట్లాది మంది భక్తుల విశ్వాసాలను పునరుద్ధరించడంతో పాటు ఈ వ్యక్తుల కారణంగా నష్టపో యిన రైతులకు మోదీ ప్రభుత్వం పట్ల ప్రజా విశ్వాసం కలిగేలా తక్షణ చర్యలు తీసుకోవాలి. -
వాడని నెయ్యి.. తయారు కాని లడ్డూ.. జరగని తప్పుపై ‘పచ్చ’గోల
సాక్షి, అమరావతి: తన వంద రోజుల పాలనపై ప్రజలు ఆగ్రహంగా ఉండటంతో ఆ వ్యవహారం నుంచి వారి దృష్టి మళ్లించడానికే తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పవిత్రతను, ప్రతిష్టను కోలుకోలేని విధంగా దెబ్బ తీస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దుష్ప్రచారం చేస్తున్నారని సర్వత్రా అభిప్రాయం వ్యక్తం అవుతోంది. కల్తీ అయిందని చంద్రబాబు చెబుతున్న నెయ్యిని అసలు వాడనప్పుడు లడ్డూ ఏ విధంగా కల్తీ అవుతుందని.. ఈ లెక్కన ఏ విధంగా అపచారం జరిగిందన్న ప్రశ్నకు చంద్రబాబు అండ్ గ్యాంగ్ నుంచి సమాధానం లేదు. ఆ నాలుగు ట్యాంకర్ల నెయ్యిలో వెజిటబుల్ ఆయిల్ మూలాలున్నాయని గుర్తించిన వెంటనే.. ఆ ట్యాంకర్లను వెనక్కు పంపించామని, ఆ నెయ్యిని వాడనే లేదని టీటీడీ ఈవో శ్యామలరావు మీడియా సమక్షంలో స్పష్టంగా ప్రకటించారు. ఆ ట్యాంకర్లు కనీసం టీటీడీ గోడౌన్ వరకు కూడా రాలేదని స్పష్టం చేశారు. ఇవన్నీ తలకెక్కించుకోని ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం ఈ వ్యవహారానికి రాజకీయ రంగు పులిమి రాద్ధాంతం చేయడం ద్వారా లబ్ధి పొందాలని కుట్ర పన్నారు. ఆ వెంటనే తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ అయిందని నింపాదిగా ప్రకటించారు. జంతువుల కొవ్వు కలిసిన నెయ్యితో లడ్డూలు తయారు చేశారని పచ్చిగా అబద్ధం చెప్పారు. ఇందుకు కారణం గత ప్రభుత్వమేనని నింద మోపుతూ దుష్ప్రచారం ప్రారంభించారు. ఆ వెంటనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేశ్, ఎల్లో గ్యాంగ్ ఇదే పాటను అందుకున్నారు. అసలు కల్తీ నెయ్యిని వాడనే లేదని సాక్షాత్తు ఈవోనే చెబుతున్నప్పుడు.. కల్తీ అయిన నెయ్యితో లడ్డూ తయారు చేశారని ఎలా చెబుతారంటూ ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖులు, కోట్లాది మంది భక్తులు సర్కారు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్డు సిటింగ్ జడ్జితో లేదా సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రధానికి లేఖ రాసిన వైఎస్ జగన్ పచ్చి అబద్ధాలు చెప్పే అలవాటున్న సీఎం చంద్రబాబు స్వార్థ రాజకీయాల కోసం పవిత్రమైన తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదంపై తప్పుడు ప్రచారం చేస్తూ కోట్లాది మంది భక్తుల విశ్వాసాలను దెబ్బ తీసే స్థాయికి దిగజారారని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫిర్యాదు చేశారు. జరగని తప్పుపై రాద్ధాంతం చేస్తున్న చంద్రబాబుకు బుద్ధి చెప్పాలని కోరారు. లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ అయిన నెయ్యిని ఉపయోగించనప్పుడు తప్పు జరిగే అవకాశమే లేదని చెప్పారు. చంద్రబాబు చర్యలు ప్రపంచ ప్రసిద్ధిగాంచిన టీటీడీని, ఆ సంస్థ అనుసరిస్తున్న పద్ధతుల ఔన్నత్యాన్ని దెబ్బ తీశాయని ఆవేదన వ్యక్తం చేశారు. భక్తుల విశ్వాసాలను, టీటీడీ ఔన్నత్యాన్ని దెబ్బతీసేలా అబద్ధాలను వ్యాప్తి చేస్తున్న చంద్రబాబును గట్టిగా మందలించాలని కోరుతూ ప్రధాని మోదీకి ఆదివారం లేఖ రాశారు. ప్రజల దృష్టి మళ్లించడానికే.. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం 100 రోజుల్లో ఇచి్చన హామీలు నిలబెట్టుకోవడంలో పూర్తిగా విఫలమైంది. ఈ నేపథ్యంలో ప్రజల దృష్టిని మరల్చడానికే టీటీడీ అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా చంద్రబాబు పచ్చి అబద్ధాలను ప్రచారం చేశారన్నది స్పష్టమైంది. కల్తీ జరిగిందనే ఆరోపణలతో తిరస్కరించిన నెయ్యి ట్యాంకర్లు 2024 జూలై 12న తిరుమలకు వచ్చాయి. ఆ ట్యాంకర్లలోని నెయ్యిని లడ్డూ తయారీలో వాడలేదు. దశాబ్దాలుగా టీటీడీలో ఉన్న అత్యుత్తమ విధానాల వల్ల నెయ్యిలో సందేహాస్పద పదార్థాలు ఉంటే వెంటనే గుర్తిస్తారు. అలా ఆ ట్యాంకర్లను వెనక్కి పంపారని, ఆ నెయ్యిని లడ్డూ తయారీలో వాడలేదని తెలిసి కూడా చంద్రబాబు బాధ్యతా రాహిత్యంగా వ్యాఖ్యలు చేశారు. తద్వారా కోట్ల మంది తిరుమల భక్తుల్లో తీవ్ర ఆవేదన నెలకొంది. వాస్తవానికి ఆలయంలోనికి వెళ్లే ముందు ప్రతి ట్యాంకర్ నుండి మూడు నమూనాలు తీసుకుని పరీక్షిస్తారు. ఈ మూడు శాంపిళ్లలో ఉత్తీర్ణత సాధించిన తర్వాత మాత్రమే నెయ్యిని ఉపయోగించడానికి అనుమతిస్తారు. ఏ పరీక్షలోనైనా సందేహాస్పద పదార్థాలు కనిపిస్తే ఆ ట్యాంకర్‌ను తిరస్కరిస్తారు. ఎట్టి పరిస్థితుల్లోనూ లోపలికి అనుమతించరు. ఇలాంటి అత్యుత్తమ విధానాలు పాటిస్తున్నందు వల్ల ప్రసాదాల తయారీలో నాణ్యత లేని పదార్థాలను ఉపయోగిస్తున్నారనే ప్రశ్నే తలెత్తదు. గతంలో కూడా ఈ వ్యవస్థ ఉంది. 2014–19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో 14 నుంచి 15 సార్లు ట్యాంకర్లను ఇలాగే తిరస్కరించారు. 2019–24 మధ్య వైఎస్సార్సీపీ హయాంలో 18 సార్లు ట్యాంకర్లను తిరస్కరించారు. వాస్తవంగా ఏఆర్ డెయిరీ ఫుడ్స్ నెయ్యి సరఫరా ప్రారంభించింది జూన్ 12 నుంచి అని టీటీడీ ఈవోనే చెబుతున్నారు. నెయ్యి ట్యాంకర్లను వెనక్కు పంపిన రెండు నెలల తర్వాత చంద్రబాబు ఆ విషయం గురించి రాద్ధాంతం చేయడాన్ని అందరూ ప్రస్తావిస్తున్నారు. ఆ ల్యాబ్ నివేదికను టీడీపీ కార్యాలయం నుంచి విడుదల చేయడాన్ని బట్టి ముమ్మాటికీ ఇది రాజకీయం కుట్రేనని స్పష్టమవుతోంది. మరో వైపు కల్తీకి ఆస్కారమే లేదని ఆహార రంగ నిపుణులు సైతం తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వంపై ఒత్తిడి పెరగడంతో సీఎం తన జేబులోని అధికారులతో సిట్ ఏర్పాటు చేశారు. -
దిద్దుబాటు ఫిర్యాదు!
సాక్షి ప్రతినిధి, తిరుపతి: టీటీడీ ఉన్నతాధికారుల పరిస్థితి దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మొరిగాయన్న చందంగా మారింది. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి కలిసిందనే అనుమానంతో పరీక్ష చేయించిన రెండు నెలల తర్వాత టీటీడీ.. ఏఆర్ ఫుడ్స్‌పై బుధవారం తీరిగ్గా పోలీసులకు ఫిర్యాదు చేసింది. అది కూడా వాడని నెయ్యిపై ఫిర్యాదు చేయడం గమనార్హం. తిరుమల లడ్డూలో పశువు, పందికొవ్వు కలిసిందంటూ సీఎం చంద్రబాబు చేసిన తీవ్ర ఆరోపణలు పెద్ద దుమారం లేపాయి. కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన సున్నితమైన అంశంపై సీఎం స్థాయి వ్యక్తి ఇలాంటి ఆరోపణలు చేయడాన్ని భక్తులు తీవ్రంగా తప్పు పడుతున్నారు. చేసిన తప్పుపై ఉలిక్కిపడ్డ కూటమి ప్రభుత్వ పెద్దలు.. వాటి నుంచి బయట పడేందుకు ప్రాయశ్చిత్తం అంటూ దీక్షలు, హోమాలు, యాగాలు, వంటి కార్యక్రమాలు చేపడుతున్న విషయం తెలిసిందే. చంద్రబాబు ఆరోపణలపై టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి నేరుగా తిరుమల పుష్కరణిలో స్నానం చేసి అఖిలాండం వద్ద ప్రమాణం చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. నాటి ప్రభుత్వ హయాంలో ఏ తప్పూ చేయలేదని, అలా చేసి ఉంటే తాను సర్వనాశనం అయిపోతానని, రక్తం కక్కుకుని చావాలని భూమన బహిరంగంగా ప్రకటించారు. అదేవిధంగా సీబీఐ లేదా సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం తప్పు చేయలేదని, అందుకే మాజీ చైర్మన్ భూమన ప్రమాణం చేసినప్పుడు.. కూటమి ప్రభుత్వ పెద్దలు కూడా శ్రీవారి ఎదుట ప్రమాణం చేయాలని శ్రీవారి భక్తులు డిమాండ్ చేస్తున్నారు. నెయ్యిలో కల్తీ జరిగి ఉంటే ఎందుకు చర్యలు తీసుకోలేదని, కనీసం పోలీసులకైనా ఫిర్యాదు చేశారా? అంటూ భక్తులతో పాటు పలువురు స్వామీజీలు ప్రశ్నించారు. బీజేపీ సీనియర్ నేత సుబ్రమణియన్ స్వామి సుప్రీంకోర్టులో పిల్ వేశారు. లడ్డూ వివాదం కూటమి ప్రభుత్వ మెడకు చుట్టుకుంటుండడంతో జూలై 23న నెయ్యిపై నివేదిక వచ్చిన రెండు నెలల తర్వాత అంటే సెపె్టంబర్ 25న హడావుడిగా టీటీడీ ఈఓ శ్యామలారావు ఆదేశాల మేరకు.. ప్రొక్యూర్మెంట్ జీఎం మురళీకృష్ణ తిరుపతి ఈస్ట్ పోలీస్టేషన్లో ఫిర్యాదు చేశారు. వాడని నెయ్యి ట్యాంకర్ల టెస్ట్ నివేదికపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అడల్ట్రేషన్ టెస్ట్ (కల్తీ నిర్ధారణ పరీక్ష) నివేదిక ఆధారంగా ఫిర్యాదు చేసినట్లు టీటీడీ పేర్కొంది. ఈ ఫిర్యాదుపై కేస్ నంబర్ 470/24 లో సెక్షన్లు 274, 275, 316, 318(3), 318(4), 61(2), 299 రెడ్ విత్ 494, 3(5) బీఎన్ఎస్, సెక్షన్ 51, 59 ఫుడ్ సేఫ్టీ యాక్ట్ 2006 కింద కేసు నమోదు చేశారు. టీటీడీ, కూటమి ప్రభుత్వ వైఖరిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
Tirupati Laddu Controversy: బాబూ మీరు కొన్నది రూ. 276కే
ఈ లెక్కన రివర్స్ టెండరింగ్‌తో రూ.320కే నెయ్యి కొనడం వల్ల కల్తీ జరిగిందని మీరు చెబుతున్నదంతా అబద్దమేగా? కల్తీ అయిన నెయ్యి ట్యాంకర్లను వెనక్కి పంపేశారు.. ఆ నెయ్యితో లడ్డూ ప్రసాదం తయారే చేయలేదు. మరి అపచారం జరిగిందని ఎలా ఆరోపిస్తావు? సున్నితమైన అంశాలపై ప్రజలను రెచ్చగొట్టి రాజకీయంగా లబ్ధి పొందాలన్న మీ దుర్భుద్దితోనే ఈ కుట్రకు తెరతీశావన్నది నిజం కాదా?2015లో కిలో నెయ్యి రూ.276 చొప్పున టీటీడీ కొనుగోలు చేసింది. 2018లో కూడా కిలో నెయ్యి రూ.320 చొప్పున టీటీడీ కొనుగోలు చేసింది. ఇదంతా మీ ప్రభుత్వ హయాంలోనే కదా? అప్పట్లో బహిరంగ మార్కెట్లో ఇండియా మార్ట్‌లో కేజీ రూ.1200, బిగ్ బాస్కెట్ ధర రూ.1100గా ఉందని టీటీడీ తీర్మానంలో కూడా పేర్కొన్న మాట వాస్తవం కాదా? మరి బహిరంగ మార్కెట్ కంటే ఇంత తక్కువ ధరకు ఎలా కొన్నారు? అప్పుడు కూడా జంతువుల కొవ్వు కలిసిన కల్తీ నెయ్యే సరఫరా చేశారా?సాక్షి, అమరావతి: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో వినియోగిస్తున్న నెయ్యి కిలో రూ.320కి కొనుగోలు చేయడం వల్లే కల్తీ నెయ్యి సరఫరా చేస్తున్నారంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న ఆరోపణల్లో పసలేదని మరోసారి రుజువవుతోంది. 2014–19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలోనే టీటీడీ కొనుగోలు చేసిన నెయ్యి ధరలను ఒక్కసారి పరిశీలిస్తే చంద్రబాబు బృందం చేస్తున్న ఆరోపణల్లో డొల్లతనం బట్టబయలవుతోంది. 2014లో బాబు సీంఎగా పగ్గాలు చేపట్టిన తర్వాత అక్టోబర్‌లో కిలో రూ.306, రూ.325 చొప్పున కొనుగోలు చేసిన టీటీడీ.. 2015 జూన్‌లో కిలో రూ.276, రూ.279 చొప్పున కొనుగోలు చేసిన మాట వాస్తవం కాదా? బహిరంగ మార్కెట్లో రూ.1100 నుంచి రూ.1200 ఉంటే ఏ విధంగా కిలో రూ.320కి సరఫరా చేశారని మీరు ప్రశ్నిస్తున్నారు. అదే వారు రూ. 276కు ఎలా కొన్నారు? మరీ మీ హయాంలో ఇంత తక్కువ ధరకు టీటీడీకి కొనుగోలు చేసిందంటే అప్పట్లో కూడా జంతువుల కొవ్వు కలిపిన నెయ్యినే టీటీడీకి ఆయా కంపెనీలు సరఫరా చేశాయా? సూటిగా సమాధానం చెప్పు చంద్రబాబూ. అంతే కానీ ప్రజల మనోభావాలను రెచ్చగొట్టేలా రోజుకో స్టేట్మెంట్ ఇస్తూ అదే పనిగా లేనిపోని బురద చల్లడం సరికాదు. వాస్తవానికి వైఎస్ జగన్మోహన్రెఢ్డి ప్రభుత్వ హయాంలో ఏనాడు టీటీడీ ఇంత తక్కువ ధరలకు నెయ్యి కొనుగోలు చేసిన దాఖలాలు లేవు.వాస్తవాలకు ముసుగేసి దుష్ప్రచారంకిలో నెయ్యి రూ.320కే టీటీడీకి ఎలా సరఫరా చేశారంటూ ఆరోపించడం ఎంత వరకు సమంజసమో చెప్పాల్సిన బాధ్యత మీది కాదా? వాస్తవాలకు ముసుగేసి పని గట్టుకొని అదే పనిగా బురద జల్లడంలో మిమ్మల్ని మించిన ఘనడు మరొకరు లేరన్నది ప్రజలందరికీ తెలుసు. అసలు నెయ్యి ఎలా తయారవుతుంది? ఎలాంటి ప్రమాణాలు పాటిస్తారు? కిలో నెయ్యి తయారీకి ఎంత ఖర్చవుతుందో కూడా తెలియకుండా అడ్డగోలుగా వాదించడం చంద్రబాబుకే చెల్లింది. వాస్తవానికి నెయ్యి రెండు రకాలుగా తయారు చేస్తారన్న విషయం అందరికీ తెలిసిందే. -
బాబు కుట్రకు పోలీసు వత్తాసు
సాక్షి, అమరావతి: తిరుపతి లడ్డూ ప్రసాదంపై తమ దుష్ప్రచారం బెడిసికొట్టడంతో సీఎం చంద్రబాబు కొత్త కుట్రకు తెర తీశారు. అవాస్తవ ఆరోపణల కుతంత్రం తన మెడకే చుట్టుకుంటుండడంతో ఆయన ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. శ్రీవారి లడ్డూ ప్రసాదంపై చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపించలేకపోవడంతో ఆ వివాదమంతా టీడీపీ ప్రభుత్వ సృష్టేనని జాతీయ స్థాయిలో ఏకాభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు ఈ అంశంపై మాజీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి సుప్రీంకోర్టు తలుపు తట్టడంతో చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఈ అంశంపై న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకుంటే తన కుట్ర బట్టబయలవుతుందని బెంబేలెత్తుతున్నారు. దీంతో తాను సృష్టించిన వివాదాన్ని తనకు అనుకూలంగా ముగించేందుకు చంద్రబాబు దారులు వెతుకుతున్నారు. అందులో భాగంగానే టీడీపీ వీర విధేయ పోలీసు అధికారులతో ‘సిట్’ ఏర్పాటు చేసినప్పటికీ ఆయన స్థిమితపడలేకపోతున్నారు. అందుకే లడ్డూ ప్రసాదం కోసం సరఫరా చేసిన నెయ్యిపై తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో టీటీడీ అధికారులతో బుధవారం ఫిర్యాదు చేయించారు. పోలీసు వేధింపులతో బెంబేలెత్తించి తిమ్మిని బమ్మి చేసే కుతంత్రానికి పదును పెడుతున్నారు.రాత్రికి రాత్రే సీఐ అవుట్తిరుపతి ఈస్ట్ పోలీసులకు టీటీడీ బుధవారం ఫిర్యాదు చేసింది. అయితే ఆ ముందు రోజే అంటే మంగళవారం రాత్రే తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ సీఐ మహేశ్వర్‌రెడ్డిని ప్రభుత్వం హఠాత్తుగా వీఆర్‌కు పంపించింది. ఆయన స్థానంలో స్టేషన్ హౌస్ ఆఫీసర్‌గా ఉన్న తమకు విధేయుడైన ట్రాఫిక్ సీఐ శ్రీనివాస్‌కు బాధ్యతలు అప్పగించింది. లడ్డూ అంశంపై అక్రమ కేసు నమోదు చేసేందుకు మహేశ్వర్‌రెడ్డి సుముఖత చూపలేదని సమాచారం. దాంతో ఆయన్ని తప్పించి తమకు విధేయుడైన అధికారిని నియమించినట్లు తెలుస్తోంది. పోలీస్ స్టేషన్లో నమోదు చేసే ఫిర్యాదులపై విచారణ నిర్వహించాల్సిన బాధ్యత స్టేషన్ హౌస్ ఆఫీసర్‌దే. టీడీపీ ప్రధాన కార్యాలయం చెప్పినట్లుగా దర్యాప్తు పేరిట వేధింపులకు పాల్పడే అధికారిని నియమించుకునేందుకే ఈ ఎత్తుగడ వేసినట్లు స్పష్టమవుతోంది.మరి.. నాడు బాబు హయాంలోనూ కల్తీ జరిగిందా?నెయ్యి కల్తీ జరిగినట్లు ప్రాథమిక ఆధారంగా టీటీడీ ఆ ఫిర్యాదులో ప్రస్తావించిన అంశం విడ్డూరంగా ఉంది. కేజీ నెయ్యి రూ.319.80 చొప్పున సరఫరా చేసేందుకు ఏఆర్ డెయిరీ అంగీకరించడమే కల్తీ చేశారనేందుకు ప్రాథమిక ఆధారం అని పేర్కొనడం గమనార్హం. మరి కేజీ రూ.319.80 చొప్పున సరఫరా చేయడమే కల్తీ చేసినట్టుగా భావించాలంటే.. గతంలో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో 2015లో కేజీ రూ.276 చొప్పున, 2018లో రూ.320 చొప్పునే టీటీడీ నెయ్యి కొనుగోలు చేసింది. ఇక అప్పుడు కూడా కల్తీ చేసినట్లే భావించాలి కదా...? నాడు టీడీపీ హయాంలో నెయ్యి సరఫరా చేసిన డెయిరీలపై కూడా ఫిర్యాదు చేయాలి కదా? అని నిపుణులు నిలదీస్తున్నారు.పక్కా పన్నాగంతోనే పోలీసులకు ఫిర్యాదులడ్డూ ప్రసాదంపై తమ దుష్ప్రచారాన్ని కొనసాగిస్తూనే చంద్రబాబు ప్రభుత్వం పోలీసు అస్త్రాన్ని ప్రయోగించేందుకు సిద్ధ పడింది. కల్తీ నెయ్యి సరఫరా చేశారని గుర్తించామని చెబుతున్న రెండు నెలల తరువాత టీటీడీ తీరిగ్గా తిరుపతి తూర్పు పోలీస్ స్టేషన్లో తాజాగా ఫిర్యాదు చేయడం గమనార్హం. తమిళనాడుకు చెందిన నెయ్యి సరఫరాదారు ఏఆర్ డెయిరీపై టీటీడీ జనరల్ మేనేజర్ (స్టోర్స్) పి.మురళీకృష్ణ ద్వారా ప్రభుత్వం ఫిర్యాదు చేయించింది. నెయ్యి కల్తీ జరిగిందని జూలై 23నే టీటీడీకి నివేదిక వచ్చిందన్న చంద్రబాబు సెప్టెంబరు 20న తొలిసారిగా వెల్లడించి దుష్ప్రచారానికి తెరతీశారు. మరి కల్తీ జరిగిందని తెలిసిన జూలై 23నే ఆహార భద్రతా చట్టం కింద టీటీడీ ఎందుకు కేసు నమోదు చేయలేదన్న న్యాయ నిపుణుల ప్రశ్నకు ప్రభుత్వం సూటిగా సమాధానం చెప్పలేకపోయింది. టీటీడీ ఈవో శ్యామలరావు మొదట ప్రెస్ మీట్లో మాట్లాడుతూ నెయ్యిలో వెజిటబుల్ ఫ్యాట్ కలిసిందని... అయితే ఆ నెయ్యి వాడలేదని.. తిప్పి పంపామని వెల్లడించారు. అంతేగానీ జంతువుల కొవ్వు కలిసిందని ఆయన చెప్పలేదు. జంతువుల కొవ్వు కలిసినట్లు ఎన్డీడీబీ నివేదికలో కూడా వెల్లడించలేదు. కానీ తరువాత ఈ నెల 20న సీఎం చంద్రబాబు కుట్రపూరితంగా నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందనే దుష్ప్రచారం మొదలు పెట్టడంతో శ్యామలరావు కూడా మాట మార్చక తప్పలేదు. రాష్ట్ర ప్రభుత్వ వాదనలోని డొల్లతనంపై నిపుణులు సూటిగా ప్రశ్నలు సంధిస్తుండటంతో చంద్రబాబు బెంబేలెత్తుతున్నారు. దాంతో తమను ప్రశ్నిస్తున్న గొంతులను అణచివేసేందుకు పోలీసు అస్త్రాన్ని ప్రయోగించాలని నిర్ణయించారు. లడ్డూ ప్రసాదంపై దుష్ప్రచారాన్ని పతాకస్థాయికి చేర్చిన చంద్రబాబు బృందం తాజాగా తిరుపతి పోలీసులకు ఫిర్యాదు ముసుగులో వేధింపుల కుట్రకు తెరతీసింది.విచారణ పేరిట వేధింపుల కుట్ర..రాజకీయ ప్రత్యర్థులు, డెయిరీల యాజమాన్యం, ఎంపిక చేసుకున్న అధికారులు, ఉద్యోగులపై వేధింపులకు పాల్పడాలన్నదే చంద్రబాబు ప్రభుత్వం కుట్ర. అక్రమ కేసుల్లో ఇరికించి అనంతరం కొందర్ని అప్రూవర్‌గా మార్చుకుని తమ కుట్ర వాదనను వారితో ఒప్పించాలనే కుతంత్రం పన్నింది. సిట్ పూర్తి స్వరూపాన్ని ప్రభుత్వం ఇంకా వెల్లడించలేదు. నివేదికతో సరిపెట్టాలా? అంతకుమించి అధికార పరిధి కల్పిస్తారా? అనేది స్పష్టం చేయలేదు. మరోవైపు తిరుపతి పోలీసులు కేసు విచారణ పేరిట వేధింపులకు గురి చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధంచేస్తోంది. అమరావతిలోని టీడీపీ ప్రధాన కార్యాలయం డైరెక్షన్ మేరకే తిరుపతి పోలీసుల విచారణ హైడ్రామా కొనసాగనుంది. ఎవరెవరిని విచారణకు పిలవాలి? ఎలా భయపెట్టాలి? ఎలా వేధించాలన్నది అంతా టీడీపీ పర్యవేక్షణలోనే సాగనుందన్నది సుస్పష్టం. లడ్డూ ప్రసాదంపై తమ దుష్ప్రచారానికి వత్తాసు పలకాలని.. తప్పుడు వాంగ్మూలాలు ఇవ్వాలని... లేదంటే కేసుల్లో ఇరికించి అరెస్టులతో వేధిస్తామని పోలీసు అస్త్రాన్ని ప్రయోగించాలన్నది చంద్రబాబు కుతంత్రం అని స్పష్టమవుతోంది.సిట్ వేశాక పోలీసులకు ఫిర్యాదా!లడ్డూ ప్రసాదం అంశంపై ప్రభుత్వం మంగళవారం తమకు వీర విధేయులైన పోలీసు అధికారులతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) నియమించింది. సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ అక్రమాలకు కొమ్ముకాసిన గుంటూరు ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠిని సిట్ ఇన్చార్జ్గా నియమించడంపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. ఇక సిట్‌లో సభ్యుడిగా నియమించిన విశాఖ డీఐజీ గోపీనాథ్ జెట్టీ చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కృష్ణయ్య అల్లుడు. రిటైరైన తరువాత హెరిటేజ్ ఫుడ్స్‌లో డైరెక్టర్‌గా పని చేసిన కృష్ణయ్య అనంతరం 2014–19లో టీడీపీ హయాంలో ఏపీఐఐసీ చైర్మన్‌గా ఉన్నారు. ఆయన్ని కూటమి ప్రభుత్వం తాజాగా రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్‌గా నియమించింది. ఆయన అల్లుడు గోపీనాథ్ జెట్టీని సిట్ సభ్యుడిగా నియమించడం ద్వారా చంద్రబాబు కుతంత్రం బహిర్గతమవుతోంది. అయినా సరే చంద్రబాబులో ఆందోళన తగ్గలేదు. లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపించాలని జాతీయ స్థాయిలో పార్టీలు, నిపుణులు, న్యాయవేత్తలు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. సిట్టింగ్ న్యాయమూర్తి ద్వారా విచారణ నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. తన వ్యాఖ్యలపై విచారణ జరిపించాలని మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడంతో చంద్రబాబులో ఆందోళన మరింత తీవ్రమైంది. సుప్రీంకోర్టు విచారణకు ఆదేశిస్తే టీడీపీ సర్కారు కుట్ర మొత్తం బయటపడుతుందన్నది ఆయనకు తెలుసు. తమ కుట్రను కప్పిపుచ్చేందుకు సిట్‌తో సరిపెట్టలేమని భావించారు. అందుకే పోలీసు వేధింపులతో బెంబేలెత్తించి తనకు అనుకూలంగా లొంగదీసుకునే కుతంత్రానికి తెరతీశారు. తాజాగా తిరుపతి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయించడం ద్వారా మరోవైపు నుంచి కూడా విచారణ పేరిట రాద్దాంతం చేసేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. -
రాజకీయాల్లోకి మతాన్ని లాగడమా?
రాజకీయ నాయకులు సుద్దపూసలు కారు. నాలుగు దశాబ్దాల రాజకీయ చరిత్ర కలిగిన చంద్రబాబు నాయుడు చేయగలిగినన్ని పాపాలు చేశాడు. కానీ, తిరుమల తిరుపతి దేవస్థానపు ‘లడ్డూ’ ప్రసాదం కేంద్రంగా ఆడుతున్న నాటకం మాత్రం ఆయన ప్రజా జీవితంలో అత్యంత నికృష్టమైన చేష్ట. దైవ దూషణ, నిరాధార ఆరోపణలతో కూడి ఉందీ రాజకీయం. ఒక వర్గంలో విపరీతమైన ద్వేషం, ఉన్మాదాన్ని రేకెత్తించేందుకు ఉద్దేశపూర్వకంగా చేసిన ప్రయ త్నమిది. దేవుడి పేరుతో జరుగుతున్న ఆటవిక రాజకీయం. చంద్ర బాబు గురించి తెలిసిన వాళ్లు కూడా ఊహించని విధంగా ఆయన దక్షిణాదిలో మతోన్మాదాన్ని వేగంగా వ్యాపింపజేసేందుకు కంకణం కట్టుకున్నాడని అనిపిస్తోంది. లడ్డూ ప్రసాదంపై వచ్చిన ఆరోపణలు ఏవీ నిలిచేవి కావు. ఎందుకంటే అన్నీ పరస్పర విరుద్ధమైనవి. ‘ద ప్రింట్’కు చెందిన నిచ్చెనమెట్ల ప్రసాద్ సెప్టెంబరు 21న రాసిన కథనం ప్రకారం... కల్తీ జరిగిందని భావిస్తున్న నెయ్యి దేవస్థానానికి జూలై 6 నుంచి 12 తేదీల మధ్య వచ్చింది. అంటే చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రిగా గద్దెనెక్కిన తరువాత! దేవస్థానం వ్యవహారాల్లో అత్యంత శక్తిమంతుడైన ఎగ్జిక్యూటివ్ అధికారి శ్యామల రావును నియమించింది కూడా చంద్రబాబే. లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ జరిగిందని అనుమానిస్తున్న నెయ్యిని వాడనే లేదని ఆయన విస్పష్టంగా ప్రకటించాడు.వాస్తవానికి జరిగిందేమిటంటే... నాణ్యత పరీక్షల్లో విఫలమైన కారణంగా కల్తీ జరిగిందని అనుమానించిన నెయ్యి ట్యాంకర్లను సరఫరాదారుకు తిప్పి పంపారు. ఈ ట్యాంకర్ల నుంచి సేకరించిన నమూనాలను తనిఖీల కోసం ప్రత్యేకమైన పరిశోధన సంస్థలకు పంపారు. ఈ సంస్థలు ఇచ్చిన నివేదికల ఆధారంగానే బాబు కుమారుడు లోకేశ్ కూడా ‘‘జగన్ ప్రభుత్వం తిరుపతి ప్రసాదంలో నెయ్యికి బదులు జంతువుల కొవ్వును వాడింది. జగన్, వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఈ విషయమై సిగ్గుపడాలి. కోట్లాది మంది భక్తుల సెంటిమెంట్లను గౌరవించలేకపోయారు’’ అని మాట్లాడాడు.జరిగిన పరిణామాలు, అందుబాటులో ఉన్న అరకొర సాక్ష్యాలను బట్టి చూస్తే అత్యంత మూర్ఖులు మాత్రమే ఈ రకమైన పైత్యాన్ని నమ్ముతారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సహజంగానే ఈ ఉచ్చులో పడిపోయాడు. వాస్తవాలను పరిశీలించాలన్న ఆలోచన కూడా లేకుండా లడ్డూ ప్రసాదం ‘అపవిత్రమై’పోయిందన్నాడు. ఈవో శ్యామలరావు స్వయంగా అలాంటిదేమీ జరగలేదని ప్రకటించిన విషయాన్నీ పట్టించుకోలేదు. రాహుల్ గాంధీ వైఖరి ఎంత విచిత్రంగా ఉంటుందంటే... దేశంలోని మత మైనారిటీల రక్షణకు రాకుండా, వారినే అంతమొందిస్తామన్న ఖలిస్తానీ తీవ్రవాదులకు మద్దతుగా మాట్లాడేంత! దేశంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన నేతపై క్రిస్టియన్ అన్న ఒక్క కారణంగా జరుగుతున్న దుష్ప్రచారానికి పవిత్రత కల్పిస్తూగానీ మెజారిటీ వర్గాలకు భరోసా ఇవ్వలేక పోయేంత!వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్షం చేసుకున్న అదృష్టం ఏమిటంటే... జగన్ మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ లాంటివాడు కాకపోవడం! వారసుడే అయినప్పటికీ, అట్టడుగు నుంచి అధికార పగ్గాలు చేపట్టే స్థాయికి ఎదిగిన ఆయన ప్రస్థానం షేక్స్పియర్, మారియో పూజో(‘ద గాడ్ ఫాదర్’ రచయిత) ఉమ్మడిగా రాసినట్టుండే కథనానికి ఏమాత్రం తీసిపోనిది. భారతీయ రాజకీయ యవనికపై అకస్మాత్తుగా కనుమరుగైన నేతలు ఎందరో ఉన్నారు. కానీ అత్యంత ప్రభావశీలమైన నిష్క్రమణల్లో వై.ఎస్. రాజశేఖర రెడ్డిది ఒకటి. 2009 సెప్టెంబరు 2న జరిగిన ఆ హెలికాప్టర్ ప్రమాదం నుంచి ఆయన బతికి బయటపడి ఉంటే కాంగ్రెస్ పార్టీకి పెట్టని కోటగా మారిన ఆంధ్రప్రదేశ్ అసలు విభజితమై ఉండేది కాదు. నియంతల్లా పేరుపడ్డ మోదీ, అమిత్ షా సైతం సిగ్గుపడే స్థాయిలో అప్పట్లో ఆంధ్రప్రదేశ్‌ను ముక్కలు చేయాలన్న నిర్ణయం తీసుకోవడం, అమలు చేయడం కాంగ్రెస్ పార్టీని కోలుకోలేని దెబ్బ తీశాయి. ఈ ఒక్క నిరంకుశ నిర్ణయంతో కాంగ్రెస్ పార్టీ అటు ఆంధ్రప్రదేశ్‌లోనూ, ఇటు తెలంగాణలోనూ తుడిచి పెట్టుకుపోయింది. ఈ సమయంలోనే మోదీ కూడా గుజరాత్‌ను వీడి జాతీయ రాజ కీయాల్లో చక్రం తిప్పడం మొదలుపెట్టిన విషయం గమనార్హం.ఆంధ్రప్రదేశ్‌లో దశాబ్దాల తరువాత కాంగ్రెస్ పార్టీకి అధికారం దక్కేలా చేసిన వై.ఎస్. రాజశేఖర రెడ్డి వారసుడైన జగన్ మోహన్ రెడ్డిని ఆ పార్టీ ముప్పు తిప్పలు పెట్టింది. జగన్ మోహన్‌రెడ్డిని పార్టీలోనే పరాయివాణ్ణి చేశారు. ఆంక్షలు పెట్టారు. కేసుల పేరుతో హింసకు గురిచేశారు. జగన్ పోరాడింది ఆషామాషీ వ్యక్తులతో కాదు. దేశంలోనే అత్యంత శక్తిమంతులైన రాజకీయ నేతలతో.ఢిల్లీలో గాంధీలు... హైదరాబాద్‌లోని వారి చంచాలు ఒక పక్క,ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు ఇంకోపక్క. వైఎస్ దాతృత్వంతో లబ్ధి పొందిన వాళ్ల కేసుల కారణంగానే జైల్లో మగ్గిన జగన్‌కు ఇక భవిష్యత్తు లేదని చాలామంది అనుకున్నారు. అయితే జగన్ ఈ విషయాలపై ఫిర్యాదు చేయలేదు. తనకు అన్యాయం జరిగిపోయిందని ఏడవలేదు. పోరాడాడు. సొంతంగా పార్టీ స్థాపించాడు. అత్యంత దుర్భరమైన, వేల కిలోమీటర్ల పొడవునా జన సామాన్యులతో కలిసిపోతూ పాదయాత్ర నిర్వహించాడు.పార్టీ స్థాపించిన ఎనిమిదేళ్లకు వైఎస్సార్సీపీని అధికారంలోకి తీసుకొచ్చాడు. ఏ రకంగా చూసినా ఇది అసాధారణ విజయమనే చెప్పాలి. వై.ఎస్.రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని అన్ని మతాలు, కులాల వాళ్లూ ఇష్టపడ్డారు. క్రిస్టియన్ కాబట్టి నేతగా అంగీకరించమని ఎవరూ అనుకోలేదు. రాజశేఖర రెడ్డి కూడా కులమతాలకు అతీతంగా అందరినీ కలుపుకుని పోయేవాడు. విదేశాల నుంచి తిరిగి వచ్చిన ప్రతిసారీ తిరుపతిని సందర్శించడం రాజశేఖర రెడ్డి పాటించిన పద్ధతుల్లో ఒకటి. వాళ్లు రహస్య క్రైస్తవులని అంటున్న హిందువుల మెప్పు కోసం నేను ఈ మాటలు అనడం లేదు. మత విశ్వాసాల విషయంలో రాజశేఖర రెడ్డి వైఖరి అన్నింటినీ సమాదరించే లక్షణం ఉండటం వల్ల అంటున్నా. ఆయనది అసలైన భారతీయుడి మనస్తత్వం.జగన్‌ను ప్రత్యర్థిగా చేసుకుని ఆయన్ని హిందూ వ్యతిరేకిగా ముద్రించేందుకు చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు గర్హనీయం, హేయం, అత్యంత ప్రమాదకరం, నిర్లక్ష్యపూరితం. ఈ విషయంలో చంద్రబాబు అండ్ కో రోజు రోజుకూ అత్యంత నీచమైన రాజకీయాలకు పాల్పడుతోంది. హిందూ ధర్మ పరిరక్షకుడి స్థాయిలో తానూ గుర్తుండిపోవాలని చంద్రబాబు చేస్తున్న ఈ ప్రయత్నం ఎంత అథమ స్థాయికి చేరిందంటే... టీటీడీ బోర్డు ఛైర్మన్ భార్య తన చేతిలో బైబిల్ పట్టుకుని తిరుగుతోందని ఆరోపించేంత వరకు!రాజకీయాల్లోకి మతాన్ని లాగడం ద్వారా చంద్రబాబు ఘోరమైన తప్పు చేస్తున్నాడు. దీనిపై ఆగ్రహ జ్వాలలు సర్వత్రా వ్యాపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో మెజారిటీ ప్రజానీకం ఇదంతా నాటకమని నమ్ముతూంటే, మిగిలిన వారిని రెచ్చగొట్టేందుకు పవన్ కల్యాణ్ తనవంతు ప్రయత్నం చేస్తున్నాడు. ఏది ఏమైనప్పటికీ వై.ఎస్. రాజశేఖర రెడ్డి కుటుంబానికి ఆంధ్రప్రదేశ్‌లో గట్టి మద్దతే ఉంది. మతతత్వ రాజకీయాలు ఆంధ్రప్రదేశ్‌లో పెద్దగా నడిచేవీ కావు. అధికారం ఎప్పుడూ ఓకే పార్టీ, నేతతో ఉండేదీ కాదు.విభజించి పాలించు అన్నది తాత్కాలికంగా కొన్ని లాభాలు ఇవ్వ వచ్చునేమో కానీ... ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి మార్గంలో పెట్టాలని ఆశిస్తున్న చంద్రబాబుకు దీర్ఘకాలంలో ఇది చెరగని మరకగానే మిగిలిపోతుంది.కపిల్ కొమిరెడ్డి వ్యాసకర్త ‘మాలెవొలెంట్ రిపబ్లిక్: ఎ షార్ట్ హిస్టరీ ఆఫ్ ద న్యూ ఇండియా’ పుస్తక రచయిత (‘ద ప్రింట్’ సౌజన్యంతో) -
బాబు తెచ్చిన నెయ్యే
సాక్షి, అమరావతి: జరగని తప్పు జరిగిందంటూ పరమ పవిత్రమైన శ్రీవారి లడ్డూ ప్రసాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పిచ్చి ప్రేలాపనలు పేలుతూ ఘోర అపచారానికి ఒడిగట్టారు. లడ్డూల తయారీలో స్వచ్ఛమైన ఆవు నెయ్యికి బదులు జంతువుల కొవ్వుతో తయారు చేసిన నెయ్యిని వాడారంటూ నిరాధారమైన, దారుణ ఆరోపణలు చేశారు. ఎన్డీడీబీ (నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు) కాల్ఫ్ (సెంటర్ ఫర్ ఎనాలసిస్ అండ్ లెర్నింగ్ లైవ్ స్టాక్, ఫుడ్) టెస్ట్ రిపోర్ట్‌లను సీఎం చంద్రబాబు ఆధారంగా చూపుతున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకలో పాల ఉత్పత్తులు, ఆహార నాణ్యత సంస్థలలో పనిచేస్తూ విశేష అనుభవం గడించిన పలువురు నిపుణులను ఎన్డీడీబీ కాల్ఫ్ రిపోర్టుపై ‘సాక్షి’ సంప్రదించింది. జంతువుల కొవ్వు ఆనవాళ్లు ఆ నెయ్యిలో లేవని వారంతా ముక్తకంఠంతో స్పష్టం చేశారు. ⇒ నాలుగు శాంపిళ్లను పరీక్షించి ఎన్డీడీబీ కాల్ఫ్ ఇచ్చిన నాలుగు టెస్ట్ రిపోర్టులలో మిల్క్ ఫ్యాట్ వరుసగా 99.584, 99.610, 99.618, 99.677 శాతం ఉందని.. మిగిలిన 0.416, 0.390, 0.382, 0.323 శాతం మాయిశ్చర్ (తేమ), ఇతరాలు (విటమిన్స్, కెరటిన్, మినరల్స్ తదితరాలు) ఉంటాయని నిపుణులు విశ్లేషించారు. ⇒ కేజీ నెయ్యిలో ఏ సరఫరా సంస్థైనా 20 నుంచి 30 గ్రాముల వెజిటబుల్ ఆయిల్, జంతువుల కొవ్వు కలిపే స్థాయికి దిగజారదని స్పష్టం చేశారు. ⇒ కల్తీ నెయ్యి సరఫరా చేసినందుకు ఎన్డీడీబీ కాల్ఫ్ టెస్ట్ రిపోర్టుల ఆధారంగా ఎందుకు బ్లాక్ లిస్ట్‌లో పెట్టకూడదో చెప్పాలంటూ ఏఆర్ డెయిరీ ఫుడ్స్‌కు టీటీడీ మార్కెటింగ్ విభాగం జనరల్ మేనేజర్ పి.మురళీకృష్ణ జూలై 27న జారీ చేసిన షోకాజ్ నోటీసులోనూ.. దానికి ఏఆర్ డెయిరీ ఫుడ్స్ ఇచ్చిన జవాబును తిరస్కరిస్తూ జూలై 28న ఇచ్చిన రిజాయిండర్ షోకాజ్ నోటీసులోనూ జంతువుల కొవ్వు ఆ నెయ్యిలో కలిసిందని ఎక్కడా స్పష్టంగా తేలి్చచెప్పకపోవడాన్ని నిపుణులు ప్రస్తావిస్తున్నారు. వెజిటబుల్ ఆయిల్‌తో పాటు ఫారిన్ ఫ్యాట్స్ కలిసి ఉండొచ్చునంటూ అనుమానం మాత్రమే వ్యక్తం చేశారని పేర్కొంటున్నారు. ⇒ సీఎం చంద్రబాబు మాత్రం టీటీడీ వెనక్కి పంపేసిన ఆ నాలుగు ట్యాంకర్ల నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని, దాన్ని శ్రీవారి లడ్డూల తయారీలో వాడారని.. వాటిని భక్తులకు పంపిణీ చేశారని.. భక్తులు వాటిని తినేశారంటూ పచ్చి అబద్ధాలు వల్లె వేస్తుండటంపై నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ⇒ దీన్ని బట్టి చూస్తే.. సున్నితమైన అంశంపై ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టి రాజకీయంగా లబ్ధి పొందాలన్న స్వార్థంతోనే పరమ పవిత్రమైన శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని సీఎం చంద్రబాబు అపవిత్రం చేసి ఘోర అపరాధం చేశారన్నది స్పష్టమవుతోంది. ⇒ స్వార్థ రాజకీయాల కోసం శ్రీ వేంకటేశ్వరస్వామి వారితో ఆటలాడుకోవడం... భూలోక వైకుంఠం తిరుమలను అపవిత్రం చేసే దుస్సాహసానికి ఒడిగట్టడం నారా చంద్రబాబు నాయుడికి ఇదేమీ కొత్తేమీ కాదని టీటీడీ అధికారులు, అధ్యాత్మీక వేత్తలు, భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాబు ప్రభుత్వంలోనే కల్తీ నెయ్యి సరఫరా.. ⇒ స్పెషల్ గ్రేడ్ ఆగ్ మార్క్ ఆవు నెయ్యి కోసం 2024 మార్చి 12న టీటీడీ ఈ–టెండర్లు పిలిచింది. అయితే ఎన్నికల సంఘం మార్చి 16న సాధారణ ఎన్నికల షెడ్యూలును విడుదల చేయడంతో అదే రోజు నుంచి ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చింది. దాంతో ప్రభుత్వానికి ఎలాంటి నిర్ణయాధికారం ఉండదు. ⇒ ఈ టెండర్లు 2024 మే 8న టెండర్లు ఖరారయ్యాయి. కేజీ రూ.319.80 చొప్పున పది లక్షల కిలోల నెయ్యి సరఫరా కాంట్రాక్టును తమిళనాడులోని దిండిగల్‌కు చెందిన ఏఆర్ డెయిరీ ఫుడ్స్ దక్కించుకుంది. టీటీడీకి నెయ్యి సరఫరాను జూన్ 12 నుంచి ఆ సంస్థ ప్రారంభించింది. అదేరోజు సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేశారు. దీన్ని బట్టి ఏఆర్ డెయిరీ ఫుడ్స్ సంస్థ వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో కేజీ కాదు కదా కనీసం ఒక గ్రాము నెయ్యిని కూడా టీటీడీకి సరఫరా చేయలేదన్నది స్పష్టమవుతోంది. ⇒ చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక జూన్ 12, 21, 25, జూలై 4వ తేదీలలో ఏఆర్ ఫుడ్స్ సరఫరా చేసిన నాలుగు ట్యాంకర్ల నెయ్యిలో ఒక్కో ట్యాంకర్ నుంచి మూడు శాంపిళ్లను తీసుకుని తిరుమలలోని టీటీడీ ల్యా»ొరేటరీకి టీటీడీ మార్కెటింగ్ విభాగం అధికారులు పంపారు. టెండర్లో పేర్కొన్న ప్రమాణాల మేరకు ఆ నెయ్యి ఉందని తేల్చడంతో ఆ నాలుగు ట్యాంకర్లను టీటీడీ అధికారులు గోదాములోకి అనుమతించి నెయ్యిని ఆన్లోడ్ చేసుకున్నారు. ⇒ ఈ క్రమంలో జూలై 6న రెండు ట్యాంకర్లు, జూలై 15న రెండు ట్యాంకర్ల నెయ్యిని టీటీడీకి ఏఆర్ డెయిరీ ఫుడ్స్ పంపింది. ఆ ట్యాంకర్ల నెయ్యి శాంపిళ్లను పరీక్షించిన టీటీడీ ల్యా»ొరేటరీ టెండర్లో పేర్కొన్న ప్రమాణాల మేరకు లేదని తిరస్కరించింది. ఆ 4 ట్యాంకర్ల నెయ్యిని టీటీడీ అధికారులు వెనక్కి పంపేశారు. అంటే.. కల్తీ నెయ్యిని లడ్డూ తయారీలో అసలు వాడలేదన్నది స్పష్టమవుతోంది. చంద్రబాబు మాత్రం శ్రీవారి లడ్డూల తయారీలో జంతుకొవ్వు కలిసిన నెయ్యిని వాడారంటూ పచ్చి అబద్ధాలు వల్లె వేస్తుండటం గమనార్హం.సీఎంకు ఇచ్చిన నివేదికలో ఒకలా.. షోకాజ్ నోటీసుల్లో మరోలా కల్తీ నెయ్యి వ్యవహారంపై టీటీడీ ఈవో జె.శ్యామలరావు గత ఆదివారం సీఎం చంద్రబాబుకు నివేదిక ఇచ్చారు. ఏఆర్ డెయిరీ ఫుడ్స్ సంస్థ టీటీడీకి నెయ్యి సరఫరాను జూన్ 12 నుంచి ప్రారంభించిందని.. ఎనిమిది ట్యాంకర్ల నెయ్యిని సరఫరా చేసిందని నివేదికలో పేర్కొన్నారు. ఇందులో నాలుగు ట్యాంకర్ల నెయ్యి నాణ్యంగా ఉందని టీటీడీ ల్యాబొరేటరీ తేల్చిందని వెల్లడించారు. జూలై 6, 15న సరఫరా చేసిన నాలుగు ట్యాంకర్ల నెయ్యి నాణ్యంగా లేదని.. ఆ నెయ్యి శాంపిళ్లను ఎన్డీడీబీ కాల్ఫ్కు పరీక్షల నిమిత్తం పంపామని వివరించారు. ఎన్డీడీబీ జూలై 23న టెస్ట్ రిపోర్టులు ఇచ్చిందని.. ఆ నెయ్యిలో వెజిటబుల్ ఆయిల్స్‌తోపాటు జంతువుల కొవ్వు కలిసి ఉండొచ్చునని అనుమానం వ్యక్తం చేసిందన్నారు. దాంతో నాలుగు ట్యాంకర్లను వెనక్కి పంపేశామని.. సరఫరాను ఆపేశామని.. కల్తీ నెయ్యి సరఫరా చేసిన ఏఆర్ డెయిరీ ఫుడ్స్‌ను బ్లాక్ లిస్ట్‌లో పెడుతూ జూలై 27న షోకాజ్ నోటీసులు జారీ చేశామని నివేదికలో పేర్కొన్నారు. కానీ.. ఇదే అంశంపై ఎన్డీడీబీ టెస్ట్ రిపోర్టులు ఇచ్చిన రోజు అంటే జూలై 23న తిరుమలలో ఈవో శ్యామలరావు మీడియాతో మాట్లాడుతూ.. నాలుగు ట్యాంకర్లలో నెయ్యి కల్తీ అయినట్లు నివేదికలో తేలిందని.. వనస్పతి డాల్డా లాంటి వెజిటబుల్ ఆయిల్స్ కలిసి ఉండొచ్చునని చెప్పారు. ఏఆర్ డెయిరీ ఫుడ్స్‌కు జూలై 27న ఇచ్చిన షోకాజ్ నోటీసులోనూ.. 28న ఇచ్చిన రిజాయిండర్ షోకాజ్ నోటీసులోనూ నెయ్యిలో వెజిటబుల్ ఆయిల్ కలిసిందని, ఫారిన్ ప్యాట్ కలిసి ఉండే అవకాశం ఉండొచ్చునని టీటీడీ పేర్కొంది. కానీ.. రెండు నెలల తర్వాత సీఎంకు ఇచ్చిన నివేదికలో టీటీడీ ఈవో శ్యామలరావు మాట మార్చడం గమనార్హం. సీఎంవో నుంచి తీవ్ర స్థాయిలో వచ్చిన ఒత్తిడికి తలొగ్గే ఈవో శ్యామలరావు జూలై 23న మీడియాతో ఒకలా మాట్లాడి.. ఈనెల 22న సీఎంకు మరోలా నివేదిక ఇచ్చారనే అభిప్రాయం టీటీడీ అధికారవర్గాల్లో బలంగా వ్యక్తమవుతోంది. -
సిట్.. బాబు స్కిట్
శ్రీవారి లడ్డూపై దుష్ప్రచారం తన మెడకే చుట్టుకుంటుండటంతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. దాన్నుంచి తప్పించుకోవడానికి తన నమ్మకస్తులతో కూడిన సొంత టీమ్‌కు తూతూ మంత్ర దర్యాప్తు బాధ్యతలు అప్పగించడం చర్చ నీయాంశమైంది. చంద్రబాబు అండ్ గ్యాంగ్ ఆరోపిస్తున్నట్లు తిరుమల లడ్డూ తయారీలో నిజంగానే కల్తీ నెయ్యి వాడి ఉంటే అత్యున్నత స్థాయి దర్యాప్తు జరిపించడానికి ఎందుకు వెనకాడుతున్నారనే ప్రశ్నలకు వారి వద్ద సమాధానం లేదు. ఈ వ్యవహారంపై సీబీఐ లేదా సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ప్రపంచ వ్యాప్తంగా యావత్ హిందూ భక్తులందరూ ముక్త కంఠంతో డిమాండ్ చేస్తున్నప్పటికీ ప్రభుత్వం స్పందించడం లేదు. ప్రభుత్వ పెద్దల తీరు పట్ల, టీటీడీ ఈవో రెండు నాల్కల ధోరణిపై సర్వత్రా అనుమానాలు పెల్లుబుకుతుండటంతో చంద్రబాబు నష్ట నివారణలో భాగంగా ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ బృందానికి నాయకత్వం వహించే ఐజీ.. సర్వం భ్రష్టు పట్టించే అధికారిగా ఇప్పటికే పేరుగాంచారు.ఇప్పుడు ఈ అధికారి టీడీపీ కేంద్ర కార్యాలయంలో తయారయ్యే నివేదికపై సంతకం మాత్రమే చేయాల్సి ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు.సాక్షి, అమరావతి: అనుకున్నంతా అయ్యింది.. తిరుమల లడ్డూ ప్రసాదంపై దుష్ప్రచారం చేసి భక్తుల మనోభావాలు దెబ్బతీసిన ముఖ్యమంత్రి చంద్రబాబు మరో కుట్రకు తెరతీశారు. లడ్డూ ప్రసాదం వివాదంపై విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణ పేరిట తిమ్మిని బమ్మిని చేసే కుతంత్రానికి తెరతీశారు. కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ముడిపడిన ఈ అంశంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని వైఎస్సార్సీపీతోపాటు పలు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల డిమాండ్‌ను బేఖాతరు చేస్తూ.. తాము చెప్పినట్టుగా దర్యాప్తును ప్రభావితం చేయాలన్న లక్ష్యంతోనే సిట్‌ను నియమించారు. తానే కర్త, కర్మ, క్రియగా మారి తిరుమల లడ్డూ ప్రసాదంపై దు్రష్పచారం చేసిన చంద్రబాబు.. ఆ కుట్రను కప్పిపుచ్చడమే లక్ష్యంగా ఈ సిట్‌ను ఏర్పాటు చేసినట్టు స్పష్టమవుతోంది. ఎందుకంటే అవాస్తవ ఆరోపణలతో తిరుమల పవిత్రతను టీడీపీ కూటమి ప్రభుత్వం దెబ్బ తీసిందన్నది బట్టబయలైంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై చేసిన ఏ ఆరోపణకు కూడా ఆధారం చూపించలేకపోయారు. నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసినట్టు ఎన్డీడీబీ నివేదికలో ఎక్కడా పేర్కొనలేదన్నది స్పష్టమైంది. ఇక కర్ణాటక సహకార పాడి రైతుల సమాఖ్య డెయిరీ (నందిని నెయ్యి)కి ఎందుకు కాంట్రాక్టు ఇవ్వలేదని నిలదీసేందుకు చంద్రబాబు వేసిన ఎత్తుగడ బెడిసికొట్టింది. ఎందుకంటే 2015లో అప్పటి టీడీపీ ప్రభుత్వమే తొలిసారిగా నందిని డెయిరీకి కాంట్రాక్టు ఇవ్వకుండా మహారాష్ట్రలోని ప్రైవేటు డెయిరీకి కాంట్రాక్టు కట్టబెట్టిందన్నది వెల్లడైంది. జంతువుల కొవ్వు కలిపిన నెయ్యి విపరీతమైన దుర్వాసన వస్తుందని ఆహార శాస్త్రవేత్తలు సైతం స్పష్టం చేశారు. గత ఐదేళ్లలో తిరుమల లడ్డూ ప్రసాదంపై అటువంటి ఫిర్యాదులు రాని విషయాన్ని గుర్తు చేశారు. అన్నింటికంటే ప్రధానంగా.. నెయ్యి కల్తీ జరిగినట్టు నివేదిక వస్తే టీడీపీ ప్రభుత్వం ఆహార భద్రతా చట్టం కింద కేసు ఎందుకు నమోదు చేయలేదని నిపుణుల ప్రశ్నకు చంద్రబాబు ప్రభుత్వం ఖంగుతింది. దాంతో రాజకీయ ప్రయోజనాల కోసం తిరుమల లడ్డూ ప్రసాదానికి కళంకం ఆపాదించే కుట్ర పన్నారని సర్వత్రా ఏకాభిప్రాయం వ్యక్తమవుతోంది. లడ్డూ ప్రసాదం అంశంపై నిష్పక్షపాతంగా దర్యాప్తు నిర్వహించాలని దేశ వ్యాప్తంగా డిమాండ్ వ్యక్తమవుతోంది. మరోవైపు టీడీపీ దుష్ప్రచారాన్ని వైఎస్సార్సీపీ సమర్థవంతంగా తిప్పికొట్టింది. లడ్డూ ప్రసాదం అంశంపై హైకోర్టుగానీ సుప్రీంకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తితోగానీ విచారణ జరిపించాలని డిమాండ్ చేసింది. రాజ్యసభ మాజీ సభ్యుడు, తిరుమల వ్యవహారాలపై సాధికారికత ఉన్న సుబ్రహ్మణ్య స్వామి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు వ్యాఖ్యలపై విచారించాలని కోరారు. దేశ వ్యాప్తంగా హిందూ సంస్థలు, రిటైర్డ్ బ్యూరోక్రాట్లు కూడా ఈ అంశంపై నిష్పక్షపాతంగా విచారించాలని డిమాండ్ చేస్తున్నారు. దాంతో చంద్రబాబు బెంబేలెత్తారు. సిట్టింగ్ న్యాయమూర్తి ద్వారానో మరో దర్యాప్తు సంస్థ ద్వారానో విచారణ నిర్వహిస్తే తమ కుట్ర బట్టబయలవుతుందని ఆందోళన చెందారు. ఎందుకంటే చంద్రబాబు చేసిన ఆరోపణలకు సంబంధించిన ఆధారాలను సిట్టింగ్ న్యాయమూర్తిగానీ ఇతర దర్యాప్తు సంస్థకు గానీ సమర్పించాలి. కానీ రాజకీయ ప్రయోజనాల కోసం లడ్డూ ప్రసాదంపై దు్రష్పచారం చేసిన చంద్రబాబు ఎటువంటి ఆధారాలు చూపించ లేరు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉండేట్టుగా.. తాను చెప్పింది చేసేలా సిట్ ఏర్పాటు చేశారు. సిట్ ఇన్చార్జ్గా బాబు జేబులో మనిషి అత్యంత వివాదాస్పద అధికారి, ఇటీవల ఎన్నికల్లో టీడీపీ కూటమి అక్రమాలకు కొమ్ము కాశారని ఆరోపణలు ఎదుర్కొన్న గుంటూరు ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠిని సిట్ ఇన్చార్జ్గా నియమించడం పట్ల సర్వత్రా చర్చనీయాంశమైంది. ఈ బృందంలో విశాఖపట్నం డీఐజీ గోపీనాథ్ జెట్టీ, కడప ఎస్పీ హర్షవర్దన్ రాజులను సభ్యులుగా నియమించారు. కాగా, ఎన్నికల్లో అక్రమాలకు చంద్రబాబు, దగ్గుబాటి పురందేశ్వరి పక్కా పన్నాగంతో వ్యవహరించి రాష్ట్రంలో కీలక స్థానాల్లో ఉన్న పోలీసు అధికారులపై దు్రష్పచారం చేశారు. ఎవరెవర్ని బదిలీ చేయాలి.. ఆ స్థానాల్లో ఎవర్ని నియమించాలనే జాబితాను కేంద్ర ప్రభుత్వానికి, ఎన్నికల కమిషన్‌కు సమర్పించడం గమనార్హం. టీడీపీ కూటమి ఒత్తిడికి లొంగి ఎన్నికల కమిషన్ అప్పటి గుంటూరు రేంజ్ ఐజీగా ఉన్న పాలరాజును హఠాత్తుగా బదిలీ చేసింది. ఆ స్థానంలో చంద్రబాబు ఆదేశాలతో దగ్గుబాటి పురందేశ్వరి సూచించిన జాబితాలోని సర్వశ్రేష్ఠ త్రిపాఠిని ఐజీగా నియమించింది. అనంతరం ఉమ్మడి గుంటూరు జిల్లాలో టీడీపీ రౌడీమూకలు చెలరేగిపోయి విధ్వంసకాండ సృష్టించడం తెలిసిందే. ప్రధానంగా పల్నాడులో టీడీపీ కూటమి గూండాలు దాడులు, దౌర్జన్యాలతో బెంబేలెత్తించారు. మాచర్లలో వైఎస్సార్సీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన కుటుంబ సభ్యులపై టీడీపీ రౌడీలు దాడులు చేశారు. అప్పటి గురజాల ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ అభ్యర్థి కాసు మహేశ్ రెడ్డిపై దాడికి పాల్పడ్డారు. గురజాలలో బాంబు దాడులకు పాల్పడ్డారు. పల్నాడు వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఓట్లు వేయకుండా పచ్చ రౌడీలు దాడులతో విధ్వంసం సృష్టించారు. టీడీపీ ఎన్నికల అక్రమాలకు పాల్పడుతోందని వైఎస్సార్సీపీ నేతలు ఎంతగా ఫిర్యాదులు చేసినా సరే.. సర్వశ్రేష్ఠ త్రిపాఠి పట్టించుకోలేదు. పోలింగ్ రోజున కనీసం ఫోన్లకు కూడా స్పందించ లేదు. అదీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ట్రాక్ రికార్డ్. అంతటి వివాదాస్పద అధికారిని చంద్రబాబు ప్రస్తుతం తిరుమల లడ్డూ ప్రసాదం అంశంపై ఏర్పాటు చేసిన సిట్‌కు ఇన్చార్జ్గా నియమించడం గమనార్హం. అంటే ఇక సిట్ దర్యాప్తు ఎలా సాగుతుందో.. నివేదిక ఎలా ఉండనుందో ఊహించుకోవచ్చని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. నిబద్ధులైన అధికారులను కాదని.. సిట్ ఇన్చార్జ్గా నియమించేందుకు ఐజీలు వినీత్‌బ్రిజ్‌లాల్, పీహెచ్డీ రామకృష్ణ, ఆకే రవి కృష్ణల పేర్లను పరిశీలిస్తున్నట్టుగా టీడీపీ కూటమి ప్రభుత్వం మీడియాకు లీకులు ఇచ్చింది. కానీ వినీత్ బ్రిజ్‌లాల్ నిజాయితీపరుడు, ముక్కుసూటి అధికారిగా గుర్తింపు పొందారు. ఆయన తాము చెప్పినట్టుగా తప్పుడు నివేదిక ఇవ్వరని చంద్రబాబు భావించారు. టీడీపీ కూటమి ప్రభుత్వ అడ్డగోలు వ్యవహార శైలితో విసిగిపోయిన ఆయన డెప్యుటేషన్‌పై కేంద్ర సర్వీసులకు వెళ్లాలని కూడా భావిస్తున్నారు. ఇక పీహెచ్డీ రామకృష్ణ కూడా తాము చెప్పినట్టుగా నివేదిక ఇస్తారని చంద్రబాబుకు నమ్మకం లేదు. ఆకే రవికృష్ణ పేరు పరిశీలించారు గానీ పూర్తి నమ్మకం లేకపోవడంతో పక్కన పెట్టేశారు. అందుకే ఇటీవల ఎన్నికల్లో టీడీపీ అక్రమాలకు వత్తాసు పలికిన ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠినే సిట్ ఇన్చార్జ్గా నియమించారు. లడ్డూ ప్రసాదంపై తాము వ్యాప్తిలోకి తెచ్చిన దు్రష్పచారానికి అధికారిక ముద్ర వేసేలా.. తిరుమల పవిత్రతకు భంగకరంగా నివేదిక ఇచ్చి సర్వభ్రష్ఠత్వం పట్టించాలన్న చంద్రబాబు పన్నాగంలో భాగంగానే సర్వ శ్రేష్ఠ త్రిపాఠిని సిట్ ఇన్చార్జ్గా నియమించారన్నది స్పష్టమవుతోంది. -
నెయ్యిపై నిగ్గు తేల్చండి
టీటీడీ తిరస్కరించిన నెయ్యి.. ఎన్డీడీబీ నివేదికలో ఉన్న నెయ్యి ఒకటే అయినప్పుడు ఇక అపవిత్రం ఎక్కడ? అతి సున్నితమైన అంశాన్ని ఉద్దేశపూర్వకంగా మీడియాకు లీక్ చేసి రాద్ధాంతం.. కొందరు రాజకీయ లబ్ధి కోసమే ఆ ప్రకటనలు చేస్తున్నారు ‘సుప్రీం’ పర్యవేక్షణలో కమిటీని నియమించండి ఆ ల్యాబ్ నివేదికపై ఫోరెన్సిక్ ఆడిట్ జరపాలి సాక్షి, అమరావతి: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి లడ్డూ తయారీకి ఉపయోగించే నెయ్యిలో జంతు కొవ్వులను కలిపారన్న ఆరోపణలపై వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఓ కమిటీని నియమించాలని కోరుతూ బీజేపీ సీనియర్ నేత, ప్రముఖ ఆర్ధికవేత్త డాక్టర్ సుబ్రమణియన్‌స్వామి సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. లడ్డూకి ఉపయోగించే నెయ్యిలో కల్తీ జరిగిందన్న ల్యాబ్ నివేదికపై పూర్తిస్థాయి ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించేలా ఆదేశాలు జారీ చేయాలని సుప్రీంకోర్టును అభ్యర్ధించారు. ఈ వ్యాజ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి, టీటీడీ ఈవోలను ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఈ కేసులో సుబ్రమణియన్‌స్వామి స్వయంగా (పార్టీ ఇన్ పర్సన్‌గా) వాదనలు వినిపించనున్నారు. ఏ నివేదిక ఆధారంగా అయితే రాద్దాంతం చేస్తూ భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారో... ఆ నివేదిక రూపొందించేందుకు ఉపయోగించిన నెయ్యి ఎక్కడిది? టీటీడీ తిరస్కరించిన నెయ్యిలో అది ఉందా? ఆ నివేదిక వెనుక రాజకీయ పార్టీల దురుద్దేశాలున్నాయా? అనే విషయాలను కోర్టు తేల్చాల్సిన అవసరం ఉందని స్వామి తన పిటిషన్లో సుప్రీంకోర్టును కోరారు. ఈ ప్రశ్నలపై కమిటీ దృష్టి సారించాలి... ‘21.06.2024న టీటీడీ ఈవో మంచి నాణ్యమైన నెయ్యితో శాంపిల్ లడ్డూలు తయారు చేయాలని దేవస్థానం కార్మీకులకు చెప్పారు. 17.7.2024న ల్యాబ్‌కు నెయ్యి నమూనాలు ఇచ్చారు. నెయ్యి నాణ్యతపై ల్యాబ్ ఇచ్చిన నివేదికను చూస్తే పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వీటిపై కమిటీ దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఎన్డీడీబీ నివేదిక ఆధారంగా తీవ్రమైన రాజకీయ విమర్శలు చేస్తున్నారు. అయితే ఆ నెయ్యిని 100 శాతం వాడలేదని ఈవో ‘ద ప్రింట్’ ఇంటర్వ్యూలో స్పష్టంగా చెప్పారు. తిరస్కరించిన నెయ్యిని అసలు వాడనప్పుడు నివేదిక పేరుతో ఆరోపణలు ఎలా చేస్తారు? టీటీడీ తిరస్కరించిన నెయ్యి.. ఎన్డీడీబీ నివేదికలో ఉన్న నెయ్యి ఒకటే అయినప్పుడు ఇక అపవిత్రం ఎక్కడ? నివేదిక విషయంలో రాజకీయ జోక్యం ఏదైనా ఉందా?’ అనే అంశాలను స్వామి తన పిటిషన్లో ప్రస్తావించారు. నాణ్యత ఉన్న నెయ్యి ట్యాంకర్లకే అనుమతి... ‘ప్రామాణిక నిర్వహణ విధానం (ఎస్పీవో) ప్రకారం నెయ్యి వాహన ట్యాంకర్ రాగానే అధికారులు నమూనాలను సేకరించి మౌలిక పరీక్షలు నిర్వహిస్తారు. టెండర్ నోటిఫికేషన్లో పేర్కొన్న నాణ్యతకు అనుగుణంగా ఆ నెయ్యి నమూనాలు ఉన్నట్లు ఆ పరీక్షల్లో తేలితేనే ఆ నెయ్యిని శ్రీవారి లడ్డూతో సహా అన్ని ప్రసాదాల్లో వినియోగించేందుకు వాడతారు. పరీక్షల్లో విఫలమైన నెయ్యి ట్యాంకర్లను వెనక్కి పంపేస్తారు. ఇందులో ఎలాంటి రాజీ ఉండదు. దశాబ్దాలుగా ఈ విధానాన్ని కఠినంగా అమలు చేస్తున్నారు. అందువల్ల కల్తీ నెయ్యిని లడ్డూ తయారీలో ఉపయోగించారన్నది అవాస్తవం. ‘ద ప్రింట్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో టీటీడీ ఈవో ఆ నెయ్యిని 100 శాతం ఉపయోగించలేదని స్పష్టంగా చెప్పారు. అయితే ఇందుకు భిన్నంగా లడ్డూ విషయంలో తప్పుడు, నిరాధార ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలు భక్తులను తీవ్రంగా ప్రభావితం చేశాయి’ అని స్వామి నివేదించారు. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రకటనలు... ‘కొందరు వ్యక్తులు ఓ చిన్న కాగితంలోని కొంత సమాచారాన్ని పట్టుకుని దాని ఆధారంగా రాజకీయ ప్రకటనలు చేశారు. వాస్తవానికి దేని ఆధారంగా అయితే వారు రాజకీయ ప్రకటనలు చేశారో అది ప్రజా బాహుళ్యంలో లేదు. దీనిపై తీవ్ర రాజకీయ ప్రతిఘటన మొదలైంది. వెంకటేశ్వరస్వామిని కొలిచే కోట్ల మంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. అతి సున్నితమైన విషయాన్ని ఉద్దేశపూర్వకంగా మీడియాకు లీకు చేసి దానిపై రాద్దాంతం మొదలుపెట్టారు. ఆ సమాచారాన్ని బహిర్గతం చేసిన వ్యక్తులు అలా చేయడానికి ముందు దాన్ని టీటీడీ యంత్రాంగం దృష్టికి తీసుకొచ్చి వాస్తవాలను నిర్దారించుకోవాల్సింది. అలా చేయకుండా రాజకీయ ప్రయోజనం కోసం ప్రకటనలు చేయడం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో మొత్తం వ్యవహారంలో జోక్యం చేసుకోవాలి’ అని స్వామి తన పిటిషన్లో కోర్టును అభ్యర్ధించారు.- సుప్రీంకోర్టులో బీజేపీ సీనియర్ నేత సుబ్రమణియన్ స్వామి పిల్స్వతంత్ర విచారణ జరిపించండిసుప్రీంకోర్టును కోరిన ఎంపీ వైవీ సాక్షి, న్యూఢిల్లీ: తిరుమల లడ్డూ వ్యవహారంలో స్వతంత్ర విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తిని నియమించాలని కోరుతూ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. నెయ్యి కల్తీ అయిందన్న ఆరోపణలపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఓ కమిటీని ఏర్పాటు చేయాలని సోమవారం సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ మేరకు వైవీ సుబ్బారెడ్డి తరఫున∙సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. లడ్డూకి ఉపయోగించే నెయ్యిలో కల్తీ జరిగిందన్న ల్యాబ్‌పై పూర్తిస్థాయి ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించేలా ఆదేశాలు జారీ చేయాలని అందులో కోరారు. ఆ నివేదికలో పేర్కొన్న నెయ్యిని ఎక్కడ నుంచి సేకరించారన్న దానిపై కూడా ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలని అభ్యర్ధించారు. లడ్డూపై రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తూ శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్న నేపథ్యంలో దర్యాప్తు పూర్తయ్యే వరకు ఈ వ్యవహారాన్ని ప్రచారం చేయడం గానీ, ప్రచురించడం గానీ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఈ వ్యాజ్యంలో సీఎం చంద్రబాబు, పలువురు అధికారులను ప్రతివాదులుగా చేర్చారు. -
‘రివర్స్’తో నందిని నెయ్యి
సాక్షి ప్రతినిధి, తిరుపతి: లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగించారని.. మహాపచారానికి పాల్పడ్డారని పచ్చి అబద్ధాలు వల్లిస్తూ శ్రీవారి సన్నిధిలో రివర్స్ టెండర్లు ఏమిటంటూ గద్దించిన సీఎం చంద్రబాబు తాజాగా అదే విధానంలో నిబంధనలకు విరుద్ధంగా నెయ్యి సరఫరా కాంట్రాక్టును ఆల్ఫా మిల్క్ ఫుడ్స్ సంస్థకు కేటాయించడంపై తీవ్ర విస్మయం వ్యక్తమవుతోంది.టెండర్లో ఎల్ 1గా నిలిచిన కర్ణాటకకు చెందిన నందిని డెయిరీకి పూర్తి స్థాయిలో నెయ్యి సరఫరా కాంట్రాక్టు ఇవ్వకుండా రివర్స్ టెండర్ పిలిచి అత్యధికంగా ఆల్ఫా మిల్క్ సంస్థకు కేటాయించడం గమనార్హం. నెయ్యి సరఫరా కాంట్రాక్టును ఆల్ఫా మిల్క్ ఫుడ్స్‌కు కట్టబెట్టేందుకే లడ్డూలో జంతు కొవ్వు అవశేషాలు ఉన్నాయనే ఆరోపణలు తెరపైకి తెచ్చి రివర్స్ టెండర్ విషయాన్ని పక్కదారి పట్టించారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎల్ 1 కాదని ఎల్ 2కి ఎలా ఇస్తారు? ‘రివర్స్’ మతలబేంటి?తిరుమలలో స్వామి వారి ప్రసాదాలకు వినియోగించే నెయ్యి సరఫరా కాంట్రాక్టును తమకు అనుకూలమైన వారికి కట్టబెట్టాలని కూటమి పెద్దలు ముందుగానే నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా టీటీడీ గత నెల 7 తేదీన మూడు నెలలకు సరిపడా నెయ్యి సరఫరాకు ఈ టెండర్లు పిలిచింది. ఇందులో కర్ణాటకకు చెందిన నందిని(కర్ణాటక కో–ఆపరేటివ్ మిల్క్ ప్రొడ్యూసర్స్ ఫెడరేషన్ లిమిటెడ్) కిలో నెయ్యి రూ.470 చొప్పున సరఫరా చేసేందుకు కోట్ చేసి ఎల్ 1గా నిలిచింది.ఢిల్లీకి చెందిన ఆల్ఫా మిల్క్ ఫుడ్స్ సంస్థ రూ.530 కోట్ చేసి ఎల్ 2గా నిలిచింది. నిబంధనల ప్రకారం ఎల్ 1గా నిలిచిన నందినికే టెండర్ దక్కాలి. అయితే నందినిని కాదని ‘ముఖ్య’ నేత ఆల్ఫా ఫుడ్స్ సంస్థకు నెయ్యి టెండర్ కేటాయించాలని నిర్ణయించుకున్నారు. దీంతో టీటీడీ వెంటనే రివర్స్ టెండర్లు పిలిచింది. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ నిబంధనల ప్రకారం ఈ టెండర్లు పిలిచిన తరువాత తిరిగి టెండర్లు పిలవాల్సి వస్తే మళ్లీ ఈ టెండర్‌నే పిలవాలి.రివర్స్ టెండర్‌కి అవకాశమే లేదు. అయితే టీటీడీ ఈవో ఆదేశాల మేరకు గత నెల 9న రివర్స్ టెండర్స్ నిర్వహించారు. ఈసారి ఆల్ఫా మిల్క్ ఫుడ్స్ కిలో నెయ్యి రూ.450 చొప్పున కోట్ చేయగా నందిని కిలో రూ.475కి కోట్ చేసింది. ఈ టెండర్లో ఆల్ఫా మిల్క్ ఫుడ్స్‌కి 65 శాతం నెయ్యి సరఫరా కాంట్రాక్టు ఖరారు చేశారు. రివర్స్ టెండర్‌పై వివాదాన్ని తెరపైకి తేకుండా నందినికి 35 శాతం నెయ్యి సరఫరా అవకాశం కల్పించారు. -
నందిని నెయ్యి వద్దన్నది బాబే
సాక్షి, అమరావతి: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం పవిత్రతను దెబ్బతీసేలా టీడీపీ కూటమి ప్రభుత్వ దుష్ప్రచార కుట్ర కొనసాగుతోంది. సీఎం చంద్రబాబు పూటకో కట్టు కథ, రోజుకో అవాస్తవ ఆరోపణలతో కుతంత్రానికి పదును పెడుతున్నారు. వైఎస్సార్సీపీ హయాంలో కర్ణాటకకు చెందిన నందిని డెయిరీకి టీటీడీ నెయ్యి సరఫరా కాంట్రాక్టును ఎందుకు ఇవ్వలేదని చంద్రబాబు ప్రశి్నస్తుండటం ఈ కుట్ర కథలో తాజా అంకం. వాస్తవం ఏమిటంటే.. దశాబ్ద కాలంగా టీటీడీకి నెయ్యి సరఫరా చేస్తున్న నందిని డెయిరీని 2015లో తొలిసారిగా పక్కకు తప్పించింది టీడీపీ ప్రభుత్వమే. చంద్రబాబు ఆ విషయాన్ని కప్పిపుచ్చుతూ వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై అసత్య ఆరోపణలతో దుష్ప్రచారం చేసేందుకు యతి్నస్తుండటం గమనార్హం. నందిని డెయిరీని తప్పించింది చంద్రబాబే... కర్ణాటక సహకార రంగంలోని నందిని డెయిరీ దశాబ్ద కాలంపాటు టీటీడీకి నెయ్యి సరఫరా చేసింది. ఆ ప్రక్రియను 2015లో చంద్రబాబు ప్రభుత్వమే అడ్డుకుంది. నాడు టీటీడీ నెయ్యి సరఫరా కాంట్రాక్టు కోసం నందిని డెయిరీతోపాటు పలు సంస్థలు టెండర్లు దాఖలు చేశాయి. అయితే అప్పటి టీడీపీ ప్రభుత్వం నందిని డెయిరీని కాదని మహారాష్ట్రకు చెందిన ప్రైవేటు రంగంలోని గోవింద్ డెయిరీకి నెయ్యి సరఫరా కాంట్రాక్టు ఇచి్చంది. దీనిపై అప్పట్లోనే తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి.చిత్తూరు జిల్లా పూతలపట్టు టీడీపీ ఎమ్మెల్యే మురళీమోహన్ అప్పట్లో ఓ టీవీ చానల్లో రిపోర్టర్‌గా ఉన్న సమయంలో నందినీ డెయిరీకి నెయ్యి సరఫరా కాంట్రాక్టు ఇవ్వకపోవడాన్ని తప్పుబడుతూ వార్తలు కూడా ప్రసారం చేశారు. అన్ని వైపుల నుంచి విమర్శలు వచి్చనా చంద్రబాబు ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు. నందినీ డెయిరీని కాదని గోవింద్ డెయిరీకే నెయ్యి సరఫరా కాంట్రాక్టు కట్టబెట్టింది. నందిని డెయిరీని తొలిసారిగా పక్కన పెట్టేసి మరో ప్రైవేటు డెయిరీకి కాంట్రాక్టు ఇచ్చింది చంద్రబాబు ప్రభుత్వమేనన్నది సుస్పష్టం. వైఎస్సార్సీపీ హయాంలో టెండర్లలో పాల్గొనని నందిని ఇక వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో నెయ్యి సరఫరా కోసం టీటీడీ నిర్వహించిన టెండర్ల ప్రక్రియలో నందిని డెయిరీ అసలు పాల్గొనలేదు. గతంలో చంద్రబాబు ప్రభుత్వం తాము కోట్ చేసిన ధరకు కాంట్రాక్టు ఇవ్వనందున టీటీడీ నెయ్యి సరఫరా కాంట్రాక్టులో పాల్గొనబోమని పేర్కొంది. ఈ క్రమంలో నిబంధనల ప్రకారం టెండర్ల ప్రక్రియ నిర్వహించి ఎల్ 1గా నిలిచిన ఏఆర్ డెయిరీకి నెయ్యి సరఫరా కాంట్రాక్టు ఇచ్చారు. ఇదీ అసలు విషయం. అయినా సరే ఎందుకు ఇవ్వలేదంటూ..ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ విషయాన్ని కప్పిపుచ్చుతూ వైఎస్సార్సీపీ హయాంలో నందిని డెయిరీకి నెయ్యి సరఫరా కాంట్రాక్టు ఎందుకు ఇవ్వలేదని ప్రశి్నంచడం విస్మయం కలిగిస్తోంది. అసలు వైఎస్సార్సీపీ హయాంలో టెండర్ల ప్రక్రియలో పాల్గొనని నందిని డెయిరీకి కాంట్రాక్టు ఎలా ఇస్తారు? ఈ విషయం తెలిసినా సీఎం చంద్రబాబు ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకే అసత్య ఆరోపణలు చేస్తున్నారు. 2015లో టీడీపీ హయాంలో టెండరు ప్రక్రియలో పాల్గొన్నప్పటికీ నందిని డెయిరీకి నెయ్యి సరఫరా కాంట్రాక్టు ఇవ్వనిది చంద్రబాబే అన్నది పచ్చి నిజం. ఆ వాస్తవాన్ని కప్పిపుచ్చుతూ వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయడం వెనుక చంద్రబాబు రాజకీయ కుతంత్రం ఉన్నట్లు స్పష్టమవుతోంది. -
శ్రీవారి లడ్డూపై పుట్టెడు అబద్ధాలు
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు స్వార్థ రాజకీయాల కోసం కుతంత్రం పన్ని మహాపచారం చేశారు! పరమ పవిత్రమైన శ్రీవారి లడ్డూను సీఎం చంద్రబాబు అపవిత్రం చేశారు. లడ్డూ తయారీలో ఆవు నెయ్యికి బదులు జంతువుల కొవ్వు వాడారంటూ నిరాధారమైన దారుణ ఆరోపణలు చేసి భక్తుల మనోభావాలతో చెలగాటమాడారు. నెయ్యి ట్యాంకర్లలో వెజిటబుల్ ఫ్యాట్స్ కలిసి కల్తీ అయ్యిందని నిర్ధారణ కాగానే వాటిని వెనక్కి పంపేశామని టీటీడీ ఈవో పదే పదే స్పష్టం చేశారు. శ్రీవారి లడ్డూల తయారీలో కల్తీ నెయ్యిని వాడలేదని తేల్చిచెప్పారు. అయినా సరే సీఎం చంద్రబాబు తీరు మార్చుకోలేదు. జంతువుల కొవ్వుతో లడ్డూలు తయారు చేశారంటూ పచ్చి అబద్ధాలు పదేపదే వల్లె వేస్తూ మహాపచారం చేస్తున్నారు.ఈ ప్రశ్నలకు జవాబుందా బాబూ?1. తాను టీటీడీ ఈవోగా బాధ్యతలు స్వీకరించక ముందే సీఎం చంద్రబాబును కలిశానని.. తిరుమల ప్రసాదాల తయారీలో వినియోగిస్తున్న ముడిసరుకుల్లో నాణ్యత లేదని, జంతువుల కొవ్వుతో తయారైన నెయ్యితో లడ్డూలు తయారు చేస్తున్నారని.. ఈనెల 20న మీడియాతో శ్యామలరావు చెప్పారు. ఆదివారం మీడియాతో మాట్లాడుతూ ఇదే విషయాన్ని మీరు కూడా ధ్రువీకరించారు. దీన్ని బట్టి స్వార్థ రాజకీయాల కోసమే శ్రీవారి లడ్డూ ప్రసాదంపై దుష్ఫ్రచారం చేయడానికి జూన్ 14నే మహాకుతంత్రం పన్నారన్నది స్పష్టమవు తోంది కదా?2. ఈనెల 18న కూటమి శాసనసభాపక్ష సమావేశం వేదికగా కోట్లాది భక్తుల విశ్వాసాలను.. టీటీడీ ఔన్నత్యాన్ని దెబ్బతీసేలా శ్రీవారి లడ్డూ ప్రసాదంలో ఆవు నెయ్యికి బదులు జంతువుల కొవ్వును వాడారంటూ మీరు దారుణమైన వ్యాఖ్యలు చేయడం రాజకీయ మహాకుతంత్రంలో భాగం కాదా బాబూ?3. ఏఆర్ డైయిరీ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ జూలై 6న, జూలై 15న సరఫరా చేసిన నాలుగు ట్యాంకర్ల ఆవు నెయ్యిలో వెజిటబుల్ ఫ్యాట్స్ కలిశాయని జూలై 23న ఎన్డీడీబీ నివేదిక ఇచ్చిందని అదే రోజు టీటీడీ ఈవో శ్యామలరావు ప్రకటించారు. కానీ.. రెండు నెలల తర్వాత ఎన్డీడీబీ నివేదికను టీడీపీ ఆఫీసులో విడుదల చేయడం వెనుక మీ కుట్రపూరిత ఆలోచన బహిర్గతమవుతోంది కదా?4. కల్తీ నెయ్యి ట్యాంకర్లను వెనక్కి పంపేశామని, కల్తీ నెయ్యితో శ్రీవారి లడ్డూలు తయారు చేయలేదని ఈవో శ్యామలరావు స్పష్టం చేసినప్పటికీ.. లడ్డూల తయారీలో ఆవు నెయ్యికి బదులు జంతువుల కొవ్వు వాడారంటూ భావోద్వేగాలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడం వెనుక రాజకీయంగా లబ్ధి పొందాలన్న మీ కుతంత్రం బట్టబయలైంది కదా?5. మీ ప్రభుత్వ హయాంలో అక్టోబరు 2015 నుంచి మే 2019 వరకూ నందిని బ్రాండ్ నెయ్యిని టీటీడీకి కేఎంఎఫ్(కర్ణాటక మిల్క్ ప్రొడ్యూసర్స్ ఫెడరేషన్ లిమిటెడ్) సరఫరా చేయలేదు. కానీ.. కేఎంఎఫ్‌కు ఉద్దేశపూర్వకంగా నెయ్యి సరఫరా కాంట్రాక్టును వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇవ్వలేదంటూ మీరు పచ్చి అబద్ధాలు వల్లె వేయడంలో ఆంతర్యమేంటి?6. కేజీ నెయ్యి రూ.319కే వస్తుందా? అని మీరు అంటున్నారు. తక్కువ ధరకు అప్పగించడం వల్లే కల్తీ నెయ్యిని సరఫరా చేశారంటున్నారు. మరి 2015 జూన్‌లో మీరు నిర్వహించిన టెండర్లలో రూ.324లకు కేజీ నందిని నెయ్యి సరఫరా చేస్తామని కోట్ చేసిన కేఎంఎఫ్‌ను కాదని.. రూ.276కే సరఫరా చేస్తామని గోవిందా గోవిందా మిల్క్ అండ్ మిల్క్ ప్రాడక్ట్ లిమిటెడ్ (మహారాష్ట్ర)కు నెయ్యి సరఫరా బాధ్యత ఎలా ఇచ్చారు? రూ.276కే ఇచ్చినప్పుడే కల్తీ జరగనప్పుడు రూ.319కి కొన్నప్పుడు కల్తీ ఎలా జరుగుతుంది? ఇంత చిన్న లాజిక్‌ను ఎలా మర్చిపోయి.. కళ్లార్పకుండా కమిట్మెంట్తో అబద్ధాలు చెప్పగలుగుతున్నారు?7. టెండర్ల వ్యవస్థను నీరుగార్చి అధిక ధరలకు కాంట్రాక్టర్లకు పనులు అప్పగించడం ద్వారా 2015–19 మధ్య ప్రభుత్వ ఖజానా నుంచి రూ.20 వేల కోట్లు మీరు దోచుకున్నారు. 2019–24 మధ్య వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిర్వహించిన రివర్స్ టెండరింగ్‌లో మీ అక్రమాలు బయటపడ్డాయి. ప్రభుత్వ ఖజానాకు రూ.7,500 కోట్లకుపైగా ఆదా అయ్యింది. రివర్స్ టెండరింగ్ వల్లే టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా అవుతోందని ఇప్పుడు మీరు ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణల వెనుక ఆంతర్యం మీ అక్రమాలను రివర్స్ టెండరింగ్ రట్టు చేసిందనే కడుపుమంటే కదా?8. స్వార్థ రాజకీయాల కోసం కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామి మహాప్రసాదం లడ్డూపై మీరు చేసిన వ్యాఖ్యల వల్ల కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. టీటీడీ ప్రతిష్టను దెబ్బతీశారు. ఈ వ్యవహారంలో నిజానిజాలు నిగ్గుతేల్చి.. టీటీడీ ఔన్నత్యాన్ని, భక్తుల విశ్వాసాలను పునరుద్ధరించాలని ప్రధాని నరేంద్ర మోదీని కోరుతూ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ లేఖ రాస్తే మీకు అంత ఉలుకెందుకు? ప్రధాని మోదీకి లేఖ రాసేందుకు వైఎస్ జగన్‌కు ఎంత ధైర్యమని వ్యాఖ్యానిస్తారా? కేంద్రం జోక్యం చేసుకుని దర్యాప్తు చేయిస్తే మీ రాజకీయ కుతంత్రం బహిర్గతమవుతుందనే భయమే కదా? అందుకే కదా ‘సిట్’ వేసింది?9. టీటీడీ చైర్మన్‌గా వ్యవమరించిన వైవీ సుబ్బారెడ్డి నిఖార్సైన హిందువు. 43 సార్లు అయ్యప్ప మాల ధరించారు. వైవీ సుబ్బారెడ్డి భార్య స్వర్ణలత హిందువు. రోజూ ఉదయం గో పూజతోనే ఆమె దినచర్య ప్రారంభమవుతుంది. అలాంటి మహిళ బైబిల్ పట్టుకుని తిరుగుతున్నారని.. అన్యమతస్థులను టీటీడీ చైర్మన్‌గా నియమించారని మీరు వ్యాఖ్యలు చేయడంలో ఆంతర్యం సున్నితమైన భావోద్వేగాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలన్న కుట్రే కదా?10. టీటీడీ నిర్వహించే మూడు పరీక్షల్లో కల్తీ అయ్యిందని తేలితే నెయ్యి ట్యాంకర్లను వెనక్కి పంపేస్తారు. 2014–19 మధ్య 14–15 సార్లు.. 2019–24 మధ్య 18 సార్లు ఇలా వెనక్కి పంపేశారు. కల్తీ నెయ్యితో లడ్డూలు ఎన్నడూ తయారు చేయలేదని టీటీడీ ఈవో స్పష్టంగా చెబుతుంటే.. ఆలయంలో శాంతి హోమం నిర్వహించాలని మీరు ఆదేశించడంలో ఆంతర్యమేంటి? ఇదంతా మీరు నిరాధారమైన, దారుణమైన ఆరోపణలతో పరమ పవిత్రమైన లడ్డూను అపవిత్రం చేసినందుకు ప్రాయశ్చిత్తం చేసుకోవడంలో భాగమే కదా?11. నిర్దిష్ట ప్రమాణాల మేరకు లేనందున తమిళనాడు డెయిరీ నుంచి వచ్చిన నాలుగు ట్యాంకర్ల నెయ్యిని వెనక్కి పంపేశామని, ఆ నెయ్యిని అసలు వాడలేదని ఈవో నివేదిక ఇవ్వలేదా?12. తిరుమలలో రివర్స్ టెండర్లు ఏమిటీ? అక్కడ కూడా రివర్స్ టెండర్లు నిర్వహిస్తారా? అని ప్రశ్నించిన మీరు నిబంధనలకు విరుద్ధంగా రివర్స్ టెండర్లు పిలిచి నెయ్యి సరఫరా కాంట్రాక్టును ఢిల్లీకి చెందిన ఆల్ఫా మిల్క్ ఫుడ్స్ సంస్థ 65 శాతం, నందిని డెయిరీ 35 శాతం సరఫరా చేసేలా ఈ ఏడాది ఆగస్టులో ఒప్పందం కుదుర్చుకోవడం వెనుక మతలబు ఏమిటీ?ప్రమాణ స్వీకారం చేసిన రెండు రోజులకే కుట్ర..ఎన్నికల్లో కూటమి గెలుపొందటంతో జూన్ 12న సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేశారు. జూన్ 14న టీటీడీ ఈవోగా శ్యామలరావును నియమించారు. టీటీడీ ఈవోగా బాధ్యతలు స్వీకరించక ముందే సీఎంను శ్యామలరావు కలిశారు. ఈ సమావేశంలోనే మహాకుట్రకు సీఎం చంద్రబాబు బీజం వేస్తూ.. తిరుమల ప్రసాదాల తయారీలో నాసిరకం ముడిసరుకులు వాడుతున్నారని, ఆవు నెయ్యికి బదులు జంతువుల కొవ్వును వాడుతున్నారని.. దాన్ని ప్రక్షాళన చేయాలని ఈవోను ఆదేశించారు. దీన్ని ఈవో శ్యామలరావు, సీఎం చంద్రబాబు మీడియా సాక్షిగా అంగీకరించారు. అంటే జూన్ 14నే మహాకుతంత్రానికి బీజం పడినట్లు స్పష్టమవుతోంది. -
లడ్డూ ప్రసాదంపై పిచ్చికూతలు, పరాచకాలు
సాక్షి, అమరావతి: పరమ పవిత్రమైన తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని దేశ, విదేశాల్లో భక్తులు అమృతంగా భావిస్తారు. అలాంటి శ్రీవారి లడ్డూ ప్రసాదంపై రాజకీయ ప్రయోజనాల కోసం సీఎం చంద్రబాబు పిచ్చికూతలు కూశారు. ఆవు నెయ్యితో కాకుండా జంతువుల కొవ్వుతో తిరుమల లడ్డూలను తయారు చేసి.. భక్తులకు పంపిణీ చేశారని, వాటిని భక్తులు తిన్నారంటూ దారుణమైన అబద్ధాలు చెప్పి కోట్లాది మంది భక్తుల విశ్వాసాలను, మనోభావాలను గాయ పరిచారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ యధావిధిగా సీఎం చంద్రబాబుకు వంత పాడారు. నాలుగు కల్తీ నెయ్యి ట్యాంకర్లను వెనక్కి పంపేశామని.. శ్రీవారికి సమర్పించే నైవేద్యాలు, లడ్డూ ప్రసాదాల్లో కల్తీ నెయ్యిని వాడలేదని టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం) ఈవో జె.శ్యామలరావు జూలై 23నే స్పష్టంగా చెప్పారు. కల్తీ నెయ్యిని శ్రీవారి లడ్డూ ప్రసాదాల తయారీలో వాడలేదన్నది స్పష్టమవడంతో భక్తులు, అధ్యాత్మీకవేత్తలు, టీటీడీ అధికార వర్గాల నుంచి తన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తమవుతుండటంతో.. ఆ వ్యాఖ్యలను దేవుడే తనతో చెప్పించాడేమోనంటూ చంద్రబాబు సరికొత్త డ్రామాకు తెరతీశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరో అడుగు ముందుకేసి ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. పరమ పవిత్రమైన శ్రీవారి లడ్డూ ప్రసాదంపై దారుణమైన వ్యాఖ్యలు చేసి.. అపవిత్రం చేసింది సీఎం చంద్రబాబు. ఆయన వల్లె వేసిన అబద్ధాలను సమర్ధించడం ద్వారా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం చేశారని భక్తులు మండిపడుతున్నారు. ఈవోకు భిన్నంగా సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు కల్తీ నెయ్యి ట్యాంకర్లను వెనక్కి పంపేశామని టీటీడీ ఈవో శ్యామలరావు పలు సందర్భాల్లో చెప్పారు. శ్రీవారి లడ్డూల తయారీలో కల్తీ నెయ్యిని ఎన్నడూ వాడలేదని స్పష్టం చేశారు. కానీ.. ఈ నెల 18న కూటమి శాసనసభ పక్ష సమావేశంలో తాను కూసిన పిచ్చి కూతలను నిజమని చిత్రీకరించడానికి ఆదివారం సీఎం చంద్రబాబు మరోసారి జంతువుల కొవ్వు కలిసిన నెయ్యితో లడ్డూలు తయారు చేశారని పునరుద్ఘాటించారు. ఏఆర్ డైరీ ఫుడ్స్ సంస్థ కల్తీ నెయ్యి సరఫరా చేసిందని గుర్తించిన టీటీడీ మార్కెటింగ్ విభాగం.. బ్లాక్ లిస్ట్‌లో ఎందుకు పెట్టకూడదో చెప్పాలంటూ జూలై 28న షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఆ నోటీసుకు సమాధానంగా వెనక్కి పంపిన నెయ్యి ట్యాంకర్ల స్థానంలో టెండర్ నిబంధనల మేరకు కొత్తగా నెయ్యి ట్యాంకర్లు పంపుతామని ఏఆర్ ఫుడ్స్ టీటీడీకి వివరించింది. కానీ.. దానికి ఒప్పుకోని టీటీడీ ఆ సంస్థను టెండర్ నిబంధన మేరకు బ్లాక్ లిస్ట్‌లో పెడతామని స్పష్టం చేసింది. దీన్ని బట్టి చూస్తే కల్తీ నెయ్యిని శ్రీవారి లడ్డూ తయారీలో కాదు కదా కనీసం టీటీడీ గోదాములోకి కూడా అనుమతించలేదన్నది స్పష్టమవుతోంది. సిట్ పేరుతో సరి కొత్త డ్రామా శ్రీవారి లడ్డూ ప్రసాదంపై సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి, సీబీఐలతో విచారణ జరిపించాలని టీటీడీ ఛైర్మన్లుగా పని చేసిన వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి సవాల్ విసిరారు. లేదంటే చేసిన తప్పునకు శ్రీవారి పాదాల చెంత క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో నిజానిజాలను నిగ్గు తేల్చి.. టీటీడీ ఔన్యత్యాన్ని, భక్తుల విశ్వాసాలను పరిరక్షించాలని కోరుతూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ లేఖ రాశారు. సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి, సీబీఐ విచారణ జరిగితే.. తాను చెప్పింది అబద్ధమని తేలుతుందని ఆందోళన చెందిన సీఎం చంద్రబాబు ఆదివారం రాత్రి హడావుడిగా సిట్ (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్)ను ఏర్పాటు చేసి, దర్యాప్తు చేస్తామంటూ సరికొత్త డ్రామాకు తెరతీశారు. -
లడ్డూ పేరుతో రాజకీయాలు సరికాదు..: బీవీ రాఘవులు
సాక్షి, అమరావతి: తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడినట్లు తేలితే దోషులను పట్టుకుని శిక్షించాలిగానీ, దాన్ని కూడా రాజకీయం చేయడం సరికాదని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అభిప్రాయపడ్డారు. లడ్డూలో వాడే శనగపిండి, పంచదార ఏ కల్తీ అయినా మనకు పుణ్యం తీసుకురావని, పాపమే తెస్తాయన్నారు. ఈ అంశాన్ని కులమతాలకు అంటగట్టకుండా లౌకికతత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత రాజకీయ నేతలపై ఉందని హితవు పలికారు. సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి సంతాప సభ విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య (ఎంబీ)భవన్లో ఆదివారం జరిగింది. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు అధ్యక్షతన నిర్వహించిన ఈ సభలో రాఘవులు మాట్లాడుతూ.. సనాతన ధర్మం బోర్డు పెట్టాలని ఒక పెద్ద మనిషి అంటున్నాడని, అసలు సనాతన ధర్మం అంటే ఏంటో అయన్ని చెప్పమనండి అని డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌ను పరోక్షంగా ఉద్దేశిస్తూ రాఘవులు ప్రశ్నించారు. సనాతన ధర్మం గురించి సీతారాం ఏచూరి పెద్ద పుస్తకమే రాశారని, సనాతన ధర్మంలో కీలకం కుల వ్యవస్థ అని, కులంపై అభిమానం ఉన్నవాళ్లు సనాతన ధర్మం గురించి ఎలా మాట్లాడతారన్నారు. కుల వ్యవస్థ శ్రమకు, సాటి మనిషికి గౌరవం ఇవ్వదన్నారు. అలాగే, కుల వ్యవస్థను తీసేస్తే సనాతన ధర్మం ఉండదని, అది ఆధునిక ధర్మం అవుతుందన్నారు. ఈ దేశం ప్రపంచ దేశాల సరసన నిలబడాలంటే కుల, మత వ్యవస్థను తొలగించాలని రాఘవులు తేల్చిచెప్పారు. కేంద్రంలోని బీజేపీ వంటి మతతత్వ శక్తుల కారణంగా దేశంలో ప్రజాస్వామ్యం, లౌకికవాదం, సామాజిక న్యాయం వంటివి ప్రమాదంలో పడిపోయాయని, ఈ తరుణంలో సీతారాం ఏచూరి వంటి నాయకులు లేకపోవడం దేశానికి పెద్ద లోటన్నారు.ఒకే దేశం.. ఒకే ఎన్నికతో అనర్థాలు..తాజాగా.. కేంద్ర మంత్రివర్గం ఒకే దేశం, ఒకే ఎన్నికకు ఆమోదం తెలిపిందని, ఈ నినాదం బాగుందని అనుకోవద్దని, దీనివల్ల ఏకత్వం మాటెలా ఉన్నా దేశంలో ప్రాంతాల వారీ తగదాలకు, విభజనకు దారితీస్తుందని రాఘవులు ఆందోళన వ్యక్తంచేశారు. అధ్యక్ష తరహా పాలనను గతంలో ప్రతిపాదించిన బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు దేశంలో ప్రజాస్వామ్యం ఉండకూడదనే ఉద్దేశ్యంతోనే ఒకే ఎన్నిక అంటోందన్నారు. 140 కోట్ల జనాభా కలిగిన ఈ దేశం సమైక్యంగా ఉండాలంటే లౌకికవాదం ఉండాలని, మతం ప్రాతిపదికన రాజ్యం నడవకూడదని రాఘవులు అభిప్రాయపడ్డారు. ఇక కామన్ సివిల్‌కోడ్ గురించి మనమంతా మాట్లాడుకుంటుంటే సాక్షాత్తు ప్రధానమంత్రే కమ్యూనల్ సివిల్‌కోడ్ తెస్తామని చెబుతున్నాడని.. ఇది ఏకత్వం కాదని, ఈ దేశం ఐక్యతను దెబ్బతీసే చర్యలని రాఘవులు విమర్శించారు.సిద్ధాంతానికి కట్టుబడ్డ ఏచూరి..మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ.. అధికారం కోసం కాకుండా సిద్ధాంతాలకు కట్టుబడి దేశంలో పీడిత తాడిత వర్గాల కోసం ఆహర్నిశలు పోరాడిన యోధుడు సీతారాం ఏచూరి మన తెలుగు వాడు కావడం గర్వకారణమన్నారు. ఎమర్జెన్సీ సమయంలో ఇందిరాగాంధీ అంటేనే వణికిపోతున్న రోజుల్లో ఆమె పక్కన నిలబడి ‘రాజీనామా చేయండి’ అని డిమాండ్ చేసిన ధైర్యశాలి సీతారాం అన్నారు. 1984లో ఎన్టీఆర్‌ను గద్దె దింపినప్పుడు, ఆయన్ను మళ్లీ సీఎం పీఠం ఎక్కించడానికి రాష్ట్రంలోను, ఢిల్లీలోను సీతారాం చేసిన కృషి ఎనలేనిదన్నారు.ఉత్తమ పార్లమెంటేరియన్ మన ఏచూరి : అంబటిమాజీమంత్రి, వైఎస్సార్సీపీ నాయకుడు అంబటి రాంబాబు మాట్లాడుతూ.. కమ్యూనిస్టు పార్టీ అంటేనే పేదల కోసం పోరాడే శక్తి అని, అటువంటి పార్టీలో నిబద్ధతతో రాటుదేలి రాణించడమే కాకుండా ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన సీతారాం ఏచూరి మన తెలుగువాడు కావడం గర్వకారణమన్నారు. భారత పార్లమెంట్లో ఆయన పెట్టిన సవరణలు ఆమోదించేలా పోరాడిన సీతారాం ఉత్తమ పార్లమెంటేరియన్‌గా గుర్తింపు పొందారన్నారు. సీతారాం మరణం భారత రాజకీయాలకు తీరనిలోటని, ఆయనకు ఘనంగా నివాళి అర్పించేందుకు మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచన మేరకు వచ్చానని అన్నారు. జీవితాన్నే ఉద్యమానికి అంకితం చేసిన సీతారాంకు తమ నాయకుడు జగన్ తరఫున, తన తరఫున, పార్టీ తరఫున సంతాపం తెలియజేసుకుంటున్నానని రాంబాబు పేర్కొన్నారు. సభలో ఇంకా మాజీమంత్రి, రైతు నాయకుడు వడ్డే శోభనాద్రీశ్వరరావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ, పీసీసీ అధ్యక్షురాలు షర్మిల, సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు ఎంఏ బేబీ కూడా మాట్లాడారు. పెద్ద సంఖ్యలో వామపక్ష నేతలు, అనుబంధ సంఘాల నాయకులు పాల్గొని సీతారాం చిత్రపటానికి అంజలి ఘటించారు. -
చంద్రబాబు స్వార్థ రాజకీయం.. జరగని తప్పుపై 'రాద్ధాంతం': వైఎస్ జగన్
ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. దాన్నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికే టీటీడీ అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా చంద్రబాబు పచ్చి అబద్ధాలను ప్రచారం చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతను, ప్రతిష్టను కోలుకోలేని విధంగా దెబ్బ తీసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు. శ్రీ వేంకటేశ్వరస్వామికి భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు ఉన్నారు. ఈ వ్యవహారాన్ని జాగ్రత్తగా చూడకపోతే పరిస్థితులు దిగజారే ప్రమాదం ఉంది.సాక్షి, అమరావతి: పచ్చి అబద్ధాలు చెప్పే అలవాటున్న సీఎం చంద్రబాబు స్వార్థ రాజకీయాల కోసం పరమ పవిత్రమైన తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదంపై తప్పుడు ప్రచారం చేస్తూ కోట్లాది మంది భక్తుల విశ్వాసాలను దెబ్బ తీసే స్థాయికి దిగజారారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫిర్యాదు చేశారు. జరగని తప్పుపై రాద్ధాంతం చేస్తున్న చంద్రబాబుకు బుద్ధి చెప్పాలని కోరారు. లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ అయిన నెయ్యిని ఉపయోగించనప్పుడు తప్పు జరిగే అవకాశమే లేదని చెప్పారు. వాస్తవం ఇలా ఉండగా కోట్లాది మంది హిందూ భక్తుల మదిలో అనుమానాలు సృష్టించిన చంద్రబాబును మందలించాలని విజ్ఞప్తి చేశారు. చంద్రబాబు చర్యలు ముఖ్యమంత్రి పదవినే కాకుండా ప్రజా జీవితంలో ఉన్న ప్రతి ఒక్కరి స్థాయిని దిగజార్చాయని, ప్రపంచ ప్రసిద్ధిగాంచిన టీటీడీని, ఆ సంస్థ అనుసరిస్తున్న పద్ధతుల ఔన్నత్యాన్ని దెబ్బ తీశాయాని ఆవేదన వ్యక్తం చేశారు. భక్తుల విశ్వాసాలను, టీటీడీ ఔన్యత్యాన్ని దెబ్బతీసేలా అబద్ధాలను వ్యాప్తి చేసి, నిస్సిగ్గుగా వ్యవహరిస్తున్న చంద్రబాబును గట్టిగా చీవాట్లు పెట్టాలని కోరారు. ఈ మేరకు ప్రధాని మోదీకి వైఎస్ జగన్ ఆదివారం లేఖ రాశారు. ఆ లేఖలో ప్రధానాంశాలు ఇలా ఉన్నాయి.ప్రజల దృష్టి మళ్లించడానికే.. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పవిత్రతను, ప్రతిష్టను కోలుకోలేని విధంగా దెబ్బ తీసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రయత్నాలు చేస్తున్నారు. శ్రీ వెంకటేశ్వరస్వామికి భారతదేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు ఉన్నారు. ఈ వ్యవహారాన్ని జాగ్రత్తగా చూడకపోతే పరిస్థితులు దిగజారే ప్రమాదం ఉంది. చంద్రబాబు చెబుతున్న అబద్ధాలు అందరికీ వ్యాపించి, తీవ్ర వేదనను కలిగిస్తాయి. భవిష్యత్తులో కూడా అనేక పరిణామాలకు దారి తీస్తాయి. ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తయిన సందర్భంగా, గొప్పలు చెప్పుకునేందుకు టీడీపీ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. కానీ కొత్త ప్రభుత్వం పట్ల ప్రజాభిప్రాయం ప్రతికూలంగా ఉంది. ఎన్నికలకు ముందు చేసిన వాగ్దానాలను, ఇచ్చిన హామీలను అమలు చేయడంలో, నిలబెట్టుకోవడంలో కొత్త ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఎన్నికల హామీల విషయంలో ప్రజలు ఎక్కడ నిలదీస్తారోనన్న భయంతో చంద్రబాబు కనీసం ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్‌ను కూడా ప్రవేశపెట్టలేకపోయారు. చంద్రబాబు పాలనా సమర్థతపై ప్రజలు నమ్మకాన్ని కోల్పోయారు. ఈ నేపథ్యంలో ప్రజల దృష్టిని మరల్చడానికే టీటీడీ అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా చంద్రబాబు పచ్చి అబద్ధాలను ప్రచారం చేశారు. కోట్లాది మంది భక్తుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో నెయ్యికి బదులు జంతువుల కొవ్వు వాడారని తప్పుడు ఆరోపణలు చేశారు. కేవలం రాజకీయ స్వార్థ్యంతోనే చంద్రబాబు ఇలా దారుణంగా ప్రచారం చేశారు. దీని వల్ల ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి.కల్తీ నెయ్యిని లడ్డూ తయారీలో వాడనేలేదు కల్తీ జరిగిందనే ఆరోపణలతో తిరస్కరించిన నెయ్యి ట్యాంకర్లు 2024 జూలై 12న తిరుమలకు వచ్చాయి. ఆ ట్యాంకర్లలోని నెయ్యిని లడ్డూ తయారీలో వాడలేదు. దశాబ్దాలుగా టీటీడీలో ఉన్న అత్యుత్తమ విధానాల వల్ల నెయ్యిలో సందేహాస్పద పదార్థాలు ఉంటే వెంటనే గుర్తిస్తారు. అలా ట్యాంకర్లు వెనక్కి పంపారని, ఆ నెయ్యిని లడ్డూ తయారీలో వాడలేదని తెలిసి కూడా చంద్రబాబు బాధ్యతా రాహిత్యంగా వ్యాఖ్యలు చేశారు. అది కోట్ల మంది తిరుమల భక్తుల్లో ఆవేదనకు దారి తీసింది.టీటీడీ బోర్డు స్వతంత్ర సంస్థ శ్రీవారి ఆలయం అవసరాలకు సంబంధించి ఎలాంటి కొనుగోళ్లు జరిపినా, వాటి విషయంలో టీటీడీ దశాబ్దాలుగా అత్యుత్తమ విధానాలు అనుసరిస్తోంది. శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయ వ్యవహారాలన్నింటినీ కూడా టీటీడీ బోరుŠడ్ పర్యవేక్షిస్తుంది. ఇది స్వతంత్ర సంస్థ. తిరుమల ఆలయ వ్యవహారాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాత్ర పరిమితంగా ఉంటుంది. ధర్మకర్తల మండలిలో భక్తులు, వేర్వేరు రంగాల్లో ఆధ్యాత్మిక ప్రముఖులు సభ్యులుగా ఉంటారు. కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇలాంటి వారిని టీటీడీ సభ్యులుగా సిఫార్సు చేస్తారు. ఇటీవలి టీటీడీ బోర్డులో బీజేపీకి సంబంధించిన సభ్యులు కూడా ఉన్నారు. స్వచ్ఛమైన ఆవు నెయ్యి, ముడి సరుకులు కొనుగోలు ⇒ టీటీడీ అవసరాలకు అవసరమైన ఆవు నెయ్యి కొనుగోలు కోసం ఇ⇒ టెండర్ ప్రక్రియను అనుసరిస్తోంది. ప్రతి ఆరు నెలలకు ఒకసారి టెండర్ పక్రియను చేపడుతుంది. టెండర్ పక్రియలో పేర్కొన్న నియమ నిబంధనలు, ప్రమాణాలకు అనుగుణంగా సరఫరా సంస్థను ఎంపిక చేస్తుంది. ఆమోదం కోసం టీటీడీ బోర్డు ముందు ఉంచుతారు. టీటీడీలో కొన్ని దశాబ్దాలుగా ఈ ప్రక్రియ కొనసాగుతోంది. ⇒ 2014–2019 మధ్య టీడీపీ హయాంలో కూడా అదే పద్ధతి ఉంది. నెయ్యిని వినియోగించే మందు దాని నాణ్యతను పరిశీలించడానికి తనిఖీ వ్యవస్థలు కూడా ఉన్నాయి. నెయ్యిని ఆలయానికి పంపే ముందు దాని స్వచ్ఛత, నాణ్యతలపై ఎన్ఏబీఎల్ (నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ కాలిబ్రేషన్ ల్యాబరేటరీస్) ద్వారా గుర్తింపు పొందిన ఏజెన్సీల నుంచి తప్పనిసరిగా ధృవీకరణ ఉండాలి. ⇒ అలాగే ఆలయంలోని వెళ్లే ముందు ప్రతి ట్యాంకర్ నుండి మూడు నమూనాలు తీసుకుని పరీక్షిస్తారు. ఈ మూడు శాంపిళ్లలో ఉత్తీర్ణత సాధించిన తర్వాత మాత్రమే నెయ్యిని ఉపయోగించడానికి అనుమతిస్తారు. ఏ పరీక్షలోనైనా సందేహాస్పద పదార్థాలు కనిపిస్తే ఆ ట్యాంకర్‌ను తిరస్కరిస్తారు. ఎట్టి పరిస్థితుల్లోనూ లోపలికి అనుమతించరు. ఇలాంటి అత్యుత్తమ విధానాలు పాటిస్తున్నందు వల్ల ప్రసాదాల తయారీలో నాణ్యత లేని పదార్థాలను ఉపయోగిస్తున్నారనే ప్రశ్నే తలెత్తదు. ⇒ 2014–19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో 14 నుంచి 15 సార్లు ట్యాంకర్లను ఇలాగే తిరస్కరించారు. 2019–24 మధ్య వైఎస్సార్సీపీ హయాంలో 18 సార్లు ట్యాంకర్లను తిరస్కరించారు. అటువంటి ధృఢమైన విధానాలు, పద్ధతులు అమలులో ఉన్నందున, కల్తీ నెయ్యితో ప్రసాదాలు తయారీకి ఆస్కారమే లేదు. ఈ విధానం గత కొన్ని దశాబ్దాలుగా టీటీడీలో అమలులో ఉంది. బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రి పదవిలో ఉన్న చంద్రబాబు.. టీటీడీలో పాటిస్తున్న అత్యుత్తమ విధానాల గురించి, టీటీడీ ప్రతిష్ట గురించి ప్రజలకు చెప్పాల్సింది పోయి అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారు. సామాజిక బాధ్యత లేకుండా వ్యవహరించారు.⇒ గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో, ఆ తర్వాత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ట్యాంకర్లను తిరస్కరించిన పద్ధతుల్లో భాగంగానే జూలై నెలలో కూడా నెయ్యి ట్యాంకర్లను తిరస్కరించారు. తిరస్కరించిన ట్యాంకర్లను ఆధారంగా చేసుకుని 100 రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంలో టీడీపీ రాజకీయ సమావేశంలో చంద్రబాబు సున్నితమైన ఈ అంశంపై బాధ్యతారాహిత్యమైన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు రాజకీయ ఉద్దేశాలు ఇట్టే అర్థం అవుతున్నాయి. కచ్చితంగా ఇది నేరం.నిర్ధారించుకోకుండా ఆరోపణలా? ⇒ ఎన్డీడీబీ కాల్ఫ్ లిమిటెడ్ నుంచి వచ్చిన నివేదికలో పేర్కొన్న ఎస్ ⇒ విలువలు నిర్దేశించిన విలువల పరిమితి కన్నా తక్కువ ఉండడంపై ల్యాబ్ కొన్ని సందేహాలను వ్యక్తం చేసింది. ఏయే పరిస్థితుల్లో ఈ పరీక్షలు తప్పు కావచ్చనే అంశాన్ని కూడా స్పష్టంగా పేర్కొంది. తాము ఇచ్చిన రిజల్ట్స్‌లో కొన్ని సందర్భాల్లో కచ్చితత్వం లోపించే అవకాశం ఉందని అందులో ఉంది. ⇒ పోషకాహార లోపం ఉన్న ఆవుల నుంచి వచ్చే పాలతో తయారు చేసే నెయ్యి వల్ల, వెజిటబుల్ ఆయిల్స్‌ను ఆహారంగా తీసుకునే ఆవుల నుంచి వచ్చే పాలతో తయారు చేసిన నెయ్యి వల్ల, వేర్వేరు విధానాలతో తీసే నమూనాల వల్ల కచ్చితత్వం లోపిస్తుందని నివేదికలో ఉంది. పైన పేర్కొన్న పరిస్థితుల్లో ల్యాబ్ పరీక్షల్లో తప్పుడు ఫలితాలు వస్తాయని పేర్కొంది.⇒ ఉదాహరణకు పోషకాహార లోపం ఉన్న ఆవు నుండి వచ్చే పాల నుంచి నెయ్యి పొందినట్లయితే లేదా పామాయిల్ అధికంగా తినిపించిన ఆవు పాల నుంచి నెయ్యి పొందినట్లయితే, జంతువు కొవ్వు ఉనికిని సూచించే పరీక్షల్లో కచ్చితత్వంతో సరైన ఫలితాలు కొనుగొనేందుకు అవకాశాలు ఉండవు. పరీక్షల్లో కచ్చితత్వంపై నిర్ధారణ లేకుండా బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి ఇలాంటి దిగ్భ్రాంతి కలిగించే ఆరోపణలు చేయకూడదు.⇒ ప్రజా జీవితంలో తనకు అపారమైన అనుభవం ఉందంటూ పదే పదే గొప్పలు చెప్పుకునే చంద్రబాబునాయుడు లాంటి వ్యక్తి.. ప్రపంచ ప్రసిద్ధి చెందిన టీటీడీ లాంటి సంస్థ అంకిత భావాన్ని, పవిత్రతను, కోట్ల మంది ప్రజల మనోభావాలను దెబ్బ తీసేందుకు అవకాశం ఉండే ఇలాంటి అంశాలపై తప్పుగా మాట్లాడకూడదు. ఎన్డీడీబీ పరీక్షల నివేదికను ఈ లేఖకు జత చేస్తున్నాను. పరిశీలించాలని విజ్ఞప్తి చేస్తున్నాను.టీడీపీ హయాంలోనూ కేఎంఎఫ్ సరఫరా చేయలేదు ⇒ కొన్నేళ్లుగా తిరుమలలో కర్ణాటక కో ఆప్ మిల్క్ ప్రొడ్యూసర్స్ ఫెడరేషన్ లిమిటెడ్ (కేఎంఎఫ్) నెయ్యి సరఫరా చేసేదని, దాన్ని వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిలిపేసిందని టీడీపీ నేతలు దుష్ఫ్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఇది పూర్తిగా సత్యదూరం.⇒ 2014–19 మధ్య టీటీడీ నిర్వహించిన టెండర్లలో కేఎంఎఫ్ కొన్నిసార్లు మాత్రమే టెండర్లలో పాల్గొంది. వాస్తవానికి టీడీపీ అధికారంలో ఉన్న 2015 నుంచి 2018 అక్టోబర్ వరకు కేఎంఎఫ్ టీటీడీకి నెయ్యి సరఫరా చేయక పోవడం గమనార్హం. ⇒ టెండర్ల ప్రక్రియలో పాల్గొని ఎల్–1 నిలిచి ఎంపికైన ప్రైవేటు సంస్థలే నెయ్యి సరఫరా చేశాయి. అలాగే వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో కూడా కొన్నిసార్లు కేఎంఎఫ్ ద్వారా నెయ్యి సరఫరా జరిగిన సందర్భాలు ఉన్నాయి. నందిని నెయ్యి విషయంలో టీడీపీ చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారం.టీటీడీ ప్రతిష్టను ఇనుమడింపజేసింది మేమే నిజానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో టీటీడీ చేపట్టిన కొన్ని చర్యల పట్ల నేను గర్వపడుతున్నాను. ఆలయంలో వినియోగించే నెయ్యి సహా సరుకుల స్వచ్ఛత, నాణ్యతలపై పరీక్షలు జరపడానికి ప్రయోగశాలలను బలోపేతం చేశాం. ఈ విషయంలో ప్రఖ్యాత సీఎఫ్టీఆర్ఐ (సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్) సేవలను టీటీడీ తీసుకుంది.⇒ నవనీత సేవను ప్రారంభించడమే కాకుండా, శుద్ధ నెయ్యి సరఫరా కోసం తిరుమలలో గోశాలను స్థాపించాం.⇒ టీటీడీ అర్చకుల జీతాలు రెట్టింపు చేశాం. టీటీడీ ఉద్యోగులకు ఇంటి స్థలాలు అందించాం.⇒ జమ్మూలో మాతా వైష్ణో దేవి పుణ్యక్షేత్రానికి సమీపంలో టీటీడీ ఆలయం నిర్మించాం. 2023లో దీన్ని ప్రారంభించామని గుర్తు చేస్తున్నాం. ముంబై, రాయ్‌పూర్, అహ్మదాబాద్‌లలో బాలాజీ కొత్త ఆలయాల నిర్మాణం ప్రారంభించాం.రెండు నెలల తర్వాత టీడీపీ ఆఫీసులో పరీక్ష నివేదిక విడుదల చంద్రబాబుది చిత్తశుద్ధి లేని, కపట వైఖరి అని చెప్పడానికి మరో అంశాన్ని ప్రస్తావిస్తున్నా. 2024 జూలై 12వ తేదీన తిరుమలకు చేరుకున్న నెయ్యి ట్యాంకర్‌లోని నమూనాలు సందేహాస్పదంగా ఉన్నాయని, మూడు పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించ లేకపోయాయని, వాటి నమూనాలను కూడా పంపినట్లు బహిరంగంగా వెల్లడించారు. ఆ తర్వాత ఆ నమూనాలను ఎన్డీడీబీ కాల్ఫ్ 2024 జూలై 17న పంపింది. వాటిని పరిశీలించి, పరీక్షలు చేసి విశ్లేషించిన ఫలితాలను 2024 జూలై 23న నివేదించారు. నెయ్యి కల్తీ జరిగిందన్న సందేహాలు వ్యక్తమైన ట్యాంకర్లు టీటీడీ ఆవరణలోకే అనుమతించ లేదన్న విషయాన్ని ఇక్కడ గమనించాలి. ఏది ఏమైనప్పటికీ చంద్రబాబు భక్తుల మనోభావాలను పూర్తిగా పట్టించుకోకుండా రాజకీయ ఉద్దేశాలతో అసత్యాలను ప్రచారం చేశారు. దుర్మార్గపు ఉద్దేశాలతో వ్యవహరించారు. 2024 సెప్టెంబరు 18న జరిగిన రాజకీయ పార్టీ సమావేశంలో ఈ అంశాన్ని వెలుగులోకి తెచ్చారు. ట్యాంకర్ తిరస్కరించిన రెండు నెలల తర్వాత టీడీపీ కార్యాలయం నుంచి ల్యాబ్ నివేదిక విడుదల చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానాల పవిత్రతను కించ పరిచేలా మొత్తం ఈ అంశాన్ని రాజకీయ లక్ష్యాల సాధన కోసం ఉపయోగించుకునేందుకు వేసిన పథకం ఇది. చంద్రబాబు బాధ్యతా రాహిత్య వైఖరిని ఇది స్పష్టం చేసింది. ల్యాబ్ రిపోర్టు వచ్చిన తర్వాత రెండు నెలలపాటు చంద్రబాబు మౌనంగా ఉన్నారు. నెయ్యిలో జంతువుల కొవ్వు కలపలేదని, ఒకవేళ అలా చేసి ఉంటే నిరంతరంగా జరిగే నాణ్యత, స్వచ్ఛత నిర్ధారణ తనిఖీల్లో అది తేలుతుందనే విషయం చంద్రబాబుకు తెలుసు కాబట్టే.. రెండు నెలలపాటు మౌనంగా ఉన్నారు. అందుకనే తదుపరి చంద్రబాబు చేసిన ఆరోపణలు బాధ్యతారాహిత్యం, పచ్చి అబద్ధం. కేవలం రాజకీయ లక్ష్యాల కోసం ఈ ఆరోపణలు చేశారు. -
దురుద్దేశంతో మహాపచారం
అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు వైకుంఠం నుంచి భూమిపై అడుగుపెట్టి నడయాడిన దివ్యక్షేత్రం తిరుమల. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది హిందువులకు పరమపవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వరస్వామివారి లడ్డూ ప్రసాదం భక్తులకు అమృతం.అలాంటి పరమ పవిత్రమైన దివ్యధామాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు రాజకీయ దురుద్దేశంతో అపవిత్రం చేస్తున్నారు. రాజకీయ స్వార్థంతో పచ్చి అబద్ధాలు వల్లిస్తూ.. శ్రీవారికి మహాపచారం చేస్తూ.. భక్తుల మనోభావాలతో చెలగాటమాడుతున్నారు. సాక్షి, అమరావతి: జరగనిది జరిగినట్లుగా దుష్ప్రచారం చేస్తూ ఆ దేవదేవుడికి మహాపచారం తలపెట్టే దుస్సాహసానికి సీఎం చంద్రబాబు తెగించారు. భక్తకోటి ప్రీతిపాత్రంగా స్వీకరించే శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని అప్రతిష్ట పాలు చేస్తున్నారు. లడ్డూల తయారీలో అసలు ఆ నెయ్యిని వాడకుండా ట్యాంకర్లను సైతం తిరుపతి నుంచే వెనక్కి తిప్పి పంపినప్పుడు ఇంకెక్కడ అపవిత్రం అయింది? వాడని నెయ్యితో లడ్డూలు తయారు చేసినట్లు ఏ రకంగా చెబుతారు? ఇంత మహాపచారాన్ని చంద్రబాబు రాజకీయ దురుద్దేశంతోనే చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. నెయ్యి సరఫరాకు సంబంధించి టీటీడీలో దశాబ్దాలుగా నిర్దిష్ట విధానం, ప్రక్రియ ఉంది. ఇప్పుడూ అదే ఆనవాయితీ ఉంది. మరి నాసిరకంగా తయారైందని ఎలా అంటారు? నెయ్యి ట్యాంకర్లలో నాణ్యతను మూడు దశల్లో ముగ్గురు ల్యాబ్ టెక్నీషియన్లు పరీక్షిస్తారు. ఒక్క పరీక్షలోనైనా సరే నాణ్యత లేదని తేలితే ఆ ట్యాంకర్లను తిరుపతి నుంచే వెనక్కి తిప్పి పంపిస్తారు. 2013–19 మధ్య 15 నెయ్యి ట్యాంకర్లను, 2019–24 మధ్య 18 ట్యాంకర్లను ఇలాగే తిప్పి పంపేశారు. అంటే దానర్థం నాణ్యతలో ఏమాత్రం తేడా ఉన్నా కనీసం గోడౌన్‌లోకి కూడా సరుకుల వాహనాలను అనుమతించరనే! అయినా సరే వెనక్కి పంపేసిన నెయ్యిని లడ్డూ తయారీలో వాడినట్లు చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారు. అది కూడా రిపోర్టు వచ్చిన రెండు నెలల తరువాత ఓ పకడ్భందీ పథకం ప్రకారం చంద్రబాబు వంద రోజుల పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చేందుకు ఏకంగా టీడీపీ కార్యాలయంలో విడుదల చేయడం వెనుక ఎంత కుట్ర దాగి ఉందో బహిర్గతమవుతోంది. అసలు ఏమాత్రం వాడని నెయ్యి.. తయారు కాని లడ్డూ గురించి దేవుడే తనతో మాట్లాడించాడేమో.. నిజాలు చెప్పించాడేమోనంటూ చంద్రబాబు మహాపచారానికి ఒడిగట్టడం శ్రీవారి భక్తకోటిని నివ్వెరపరుస్తోంది!! పచ్చి అబద్ధాలాడుతూ.,. ఆవు నెయ్యి ప్రమాణాల మేరకు లేదని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ల్యా»ొరేటరీలో నిర్వహించిన మూడు పరీక్షలలో తేలడంతో తిరుపతిలోని టీటీడీ గోడౌన్ బయట నుంచే నెయ్యి ట్యాంకర్లను అధికారులు సరఫరా సంస్థకు వెనక్కి పంపేశారు. శ్రీవారికి సమర్పించే నైవేద్యాలు, లడ్డూ ప్రసాదాల తయారీలో కల్తీ నెయ్యిని వాడలేదన్నది దీన్నిబట్టి స్పష్టమవుతోంది. ఇది ముఖ్యమంత్రి చంద్రబాబుకు కూడా తెలుసు. కానీ.. సరఫరా సంస్థకు వెనక్కి తప్పి పంపేసిన కల్తీ నెయ్యితో శ్రీవారికి సమర్పించే నైవేద్యాలు, లడ్డూ ప్రసాదాలను తయారు చేసినట్లు.. వాటిని భక్తులకు పంపిణీ చేసినట్లు.. భక్తులు వాటిని స్వీకరించినట్లు పచ్చి అబద్ధాలాడుతూ ప్రపంచవ్యాప్తంగా హిందువులకు పరమ పవిత్రమైన ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమలను.. అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడైన శ్రీవారిని ముఖ్యమంత్రి చంద్రబాబు అపవిత్రం చేస్తున్నారని భక్తులు, ఆధ్యాత్మికవేత్తలు, టీటీడీ అధికారవర్గాలు మండిపడుతున్నాయి. పవిత్రమైన శ్రీవారి లడ్డూని సీఎం చంద్రబాబు అపవిత్రం చేస్తూ ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్నారు. వైఎస్సార్సీపీని రాజకీయంగా దెబ్బతీయాలనే దురుద్దేశంతో సీఎం చంద్రబాబు శ్రీవారిని వాడుకుంటున్నారన్నది స్పష్టమవుతోంది. నెయ్యి, ముడిసరుకుల సేకరణకు గొప్ప వ్యవస్థటీటీడీ బోర్డు స్వతంత్ర సంస్థ. శ్రీవారికి సమర్పించే నైవేద్యాలు, లడ్డూల తయారీ, అన్నప్రసాదంలో ఉపయోగించే ఆవు నెయ్యి, ముడిసరుకుల సేకరణకు ప్రపంచంలో ఎక్కడా లేని రీతిలో టీటీడీలో గొప్ప వ్యవస్థ ఉంది. నాణ్యతా ప్రమాణాలను నిర్దేశించి ఆవు నెయ్యి, ముడిసరుకుల సేకరణకు ఈ–ప్రొక్యూర్మెంట్ వెబ్సైట్లో టీటీడీ టెండర్లు పిలుస్తుంది. తక్కువ ధరకు కోట్ చేసి ఎల్–1గా నిలిచిన సంస్థకు సరుకుల సరఫరా బాధ్యతలను అప్పగిస్తుంది. టీటీడీకి సరుకుల సరఫరా చేసే సమయంలో.. అవి టెండర్ నిర్దేశించిన ప్రమాణాల మేరకు నాణ్యంగా ఉన్నట్లుగా సంబంధిత సంస్థ ఎన్ఏబీఎల్ (నేషనల్ అక్రిడిటేషన్ బోర్డు ఫర్ ల్యాబ్స్) ధ్రువీకరించిన ల్యాబ్ నుంచి సర్టిఫికెట్ పొందాలి. తిరుపతిలోని టీటీడీ గోడౌన్ వద్దకు ఆవు నెయ్యి ట్యాంకర్ లేదా సరుకులు తెచ్చిన వాహనం చేరుకున్నాక.. మార్కెటింగ్ అధికారి, సరఫరా సంస్థ ప్రతినిధి సమక్షంలో ఒక్కో నెయ్యి ట్యాంకర్ నుంచి మూడు శాంపిళ్లను సేకరించి తిరుమలలోని టీటీడీ ల్యాబ్‌కు పంపుతారు. ఆ మూడు శాంపిళ్లను ముగ్గురు టెక్నీషియన్లతో వేర్వేరుగా పరీక్ష చేయిస్తారు. ఆ మూడు పరీక్షల్లో టెండర్లో నిర్దేశించిన ప్రమాణాల మేరకు ఉన్నట్లుగా తేలితేనే ఆ నెయ్యి ట్యాంకర్‌ను గోడౌన్‌లోకి అనుమతించి అన్లోడ్కు అవకాశం కలి్పస్తారు. నాణ్యంగా లేదని ఒక్క పరీక్షలో తేలినా ఆ నెయ్యి ట్యాంకర్‌ను గోడౌన్‌లోకి అనుమతించరు. సరఫరా సంస్థకు వెనక్కి తిప్పి పంపేస్తారు. అసలు నాసిరకం ముడిసరుకులు.. కల్తీ నెయ్యిని శ్రీవారికి సమర్పించే నైవేద్యాలు, లడ్డూ, అన్నప్రసాదాల తయారీలో వినియోగించే అవకాశమే లేదు. టీటీడీ చరిత్రలో ఎన్నడూ కల్తీ నెయ్యి, నాసిరకం ముడిసరుకులను శ్రీవారికి సమర్పించే నైవేద్యాలు, లడ్డూ, అన్నప్రసాదాల తయారీలో ఉపయోగించలేదని మార్కెటింగ్ విభాగంలో పనిచేస్తున్న ఉన్నతాధికారి ఒకరు స్పష్టం చేశారు. ల్యాబొరేటరీ ఉన్నా.. లేదంటారా?తిరుమలలో గోశాలకు సమీపంలో అధునాతనమైన ల్యా»ొరేటరీని టీటీడీ ఏర్పాటు చేసింది. టెండర్ల ద్వారా కొనుగోలు చేసిన సరుకుల శాంపిళ్లను మార్కెటింగ్ అధికారులు టీటీడీ ల్యాబ్‌కు పంపుతారు. నాణ్యతను ల్యాబ్ ధ్రువీకరిస్తేనే ఆ సరుకులను గోడౌన్‌లోకి అనుమతిస్తారు. లేదంటే సరఫరా సంస్థకు వెనక్కి పంపేస్తారు. కానీ.. ఈవో శ్యామలరావు శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ టీటీడీకి ల్యాబ్ లేదని చెప్పడంపై టీటీడీ వర్గాలు విస్తుపోతున్నాయి.ముందస్తు ప్రణాళిక మేరకే..⇒ ముఖ్యమంత్రిగా చంద్రబాబు జూన్ 12న ప్రమాణ స్వీకారం చేశారు. టీటీడీ ఈవోగా జె.శ్యామలరావును జూన్ 14న ప్రభుత్వం నియమించింది. ఈవోగా బాధ్యతలు స్వీకరించక ముందే సీఎం చంద్రబాబును తాను కలిశానని తిరుమలలో శుక్రవారం మీడియా సమావేశంలో శ్యామలరావు వెల్లడించారు. తిరుమలలో ప్రసాదాల తయారీలో వినియోగించే ముడిసరుకుల్లో నాణ్యత లేదని.. జంతువుల కొవ్వు కలిసిన నెయ్యి లడ్డూల తయారీలో వాడుతున్నారని చెప్పారన్నారు. దీన్ని బట్టి వైఎస్సార్సీపీని రాజకీయంగా దెబ్బతీయడానికి అప్పుడే చంద్రబాబు కుట్ర చేసినట్లు స్పష్టమవుతోంది. ⇒ ఏఆర్ ఫుడ్స్ సరఫరా చేసిన నాలుగు ట్యాంకర్ల నెయ్యి కల్తీ అయ్యిందని జూలై 23న ఎన్డీడీబీ నివేదిక ఇచ్చింది. అదే రోజు ఈవో శ్యామలరావు మీడియాతో మాట్లాడుతూ.. వెజిటబుల్ ఫ్యాట్స్ ఆవు నెయ్యిలో కలిసినట్లు పరీక్షల్లో వెల్లడవడంతో నాలుగు నెయ్యి ట్యాంకర్లను వెనక్కి పంపామని ప్రకటించారు. ⇒ ఈనెల 18న మంగళగిరి సీకే కన్వెన్షన్ హాల్లో కూటమి శాసనసభాపక్ష సమావేశంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ వైఎస్సార్సీపీ హయాంలో శ్రీవారి లడ్డూ ప్రసాదాల తయారీలో జంతువుల కొవ్వు కలిసిన నెయ్యిని వాడారని.. తిరుమలను అపవిత్రం చేశారంటూ ముందస్తుగా రచించిన కుట్ర అమలుకు తెరతీశారు. అదే రోజు ఎన్డీబీబీ జూలై 23న ఇచ్చిన పరీక్ష నివేదికను టీడీపీ కార్యాలయంలో విడుదల చేయించారు. ⇒ ఆ నివేదిక సాక్షిగా కల్తీ అయిన నెయ్యి సరఫరా జరిగింది టీడీపీ ప్రభుత్వంలోనే కావడంతో తాను తీసుకున్న గోతిలోనే చంద్రబాబు పడ్డారు. అయినా సరే అబద్ధాలు వల్లె వేస్తూ శ్రీవారి భక్తుల మనోభావాలతో చెలగాటమాడటం మానుకోలేదు. ⇒ టీటీడీ ఈవో శ్యామలరావు తాజాగా ఎన్డీబీబీ నివేదికపై జూలై 23న వెల్లడించిన అంశాలకు భిన్నంగా మీడియాతో మాట్లాడారు. వెజిటబుల్ ఫ్యాట్‌తోపాటు జంతువుల కొవ్వు కూడా ఆవు నెయ్యిలో కలిసినట్లు చెప్పడం గమనార్హం.బురుగులా మారుతుంది..నెయ్యిలో జంతువుల కొవ్వు, చేప నూనె ఉన్నట్లు కొందరు చెప్పడం ఆశ్చర్యమేస్తోంది. నెయ్యి ఔషధంతో సమానమైంది. అందులో వేరే ద్రవాలు ఎంత మోతాదులో కలిపినా వెంటనే దుర్వాసనతో పాటు నెయ్యి పొరలు పొరలుగా విడిపోయి బురుగులా తయారవుతుంది. మైసూరు ల్యాబోరేటరీ నివేదిక ఎందుకు బహిర్గతం చేయడం లేదు?. – శ్రీకరన్, ప్రముఖ ఫుడ్ టెస్టింగ్ ల్యాబరేటరీ విశ్రాంత అధికారి, తమిళనాడు స్పెసిఫైడ్ అథారిటీ ఏది?కొత్త ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు గడుస్తున్నా ఇంతవరకు టీటీడీ పాలకమండలి నియామకం ఊసే లేదు. టీటీడీ బోర్డు రద్దు అయిన వెంటనే స్పెసిఫైడ్ అథారిటీని నియమించకుండా ప్రభుత్వం పెద్ద తప్పు చేసింది. – టి.రాధాక్రిష్ణయ్య, ప్రముఖ టెంపుల్ రిటైర్డ్ అధికారి, తెలంగాణనోటికి వచ్చినట్లు నిందలా?నిజానిజాలు తెలుసుకోకుండా ఎన్డీడీబీ రిపోర్టు అంటూ అధికారులే రాజకీయ నాయకుల అవతారమెత్తి చెప్పడం టీటీడీ చరిత్రలో ఎన్నడూ చూడలేదు. ఇటువంటి ప్రచారం చేసే ముందు ఒకటికి పదిమార్లు ఆలోచించాలి. నోటికి వచ్చినట్టు శ్రీవారి ప్రసాదంపై నిందలు వేయడం అజ్ఞానానికి నిదర్శనం. – సోమశేఖరన్, టీటీడీకి విరాళం అందించిన దాత, ఎన్ఆర్ఐఅలా కలిపితే వెంటనే పాడవుతుందిశ్రీవారి ప్రసాదంలో వాడే నెయ్యి విషయంలో అసత్య ప్రచారాలు బాధాకరం. ఆవు పాలలో కొవ్వు అధిక శాతం ఉంటుంది. నెయ్యి తయారీ ప్రక్రియలో ఎంతో కొంత శాతం కొవ్వుకు సంబంధించిన ఆనవాళ్లు ఉంటాయి. నెయ్యిలో వేరే జాతి కొవ్వు కలిపితే వెంటనే పాడవుతుంది. చిన్న లాజిక్ కూడా తెలియకుండా అసత్య ప్రచారాలు చేయడం దారుణం. – ప్రకాష్ కుమార్, కర్ణాటకలోని ప్రముఖ పుణ్యక్షేత్రంలో క్వాలిటీ కంట్రోలర్ -
TTD: లడ్డూలు ఇక రెండే
తిరుమల/తిరుపతి కల్చరల్: తిరుమల శ్రీవారి లడ్డూ అంటే భక్తులకు ఎంతో సెంటిమెంట్. స్వామివారి దర్శనం జన్మజన్మల పుణ్యఫలంగా భావించే వీరికి ఈ లడ్డూ ప్రసాదం స్వీకరించడం ద్వారా స్వామి అనుగ్రహం లభిస్తుందని వారి ప్రగాఢ విశ్వాసం. అందుకే తిరుమలకు వచ్చేవారు సరాసరి 10–20 లడ్డూలను తీసుకెళ్తారు. ఇలా తీసుకెళ్లిన వీటిని ఆఫీసుల్లో.. ఇంటి చుట్టుపక్కల వారికి భక్తిప్రపత్తులతో పంచిపెట్టడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. ఇంత విశిష్టత కలిగిన శ్రీవారి లడ్డూపై తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తాజాగా ఆంక్షలు విధిస్తూ కోతలు పెట్టింది. ఉచితంగా ఇచ్చే లడ్డూకు అదనంగా కేవలం రెండు మాత్రమే విక్రయించాలని నిర్ణయించింది. పైగా.. ఆధార్ కార్డు ఉంటేనే అంటూ మెలిక పెట్టింది. దీనిని గురువారం నుంచే అమలు చేస్తోంది. గతంలో కోరినన్ని లడ్డూలు ఇచ్చేవారని, ఇప్పుడు కొత్తగా ఉచిత లడ్డుతో పాటు కేవలం రెండు అదనపు లడ్డూలకే పరిమితం చేయడం ఏమిటని భక్తులు ప్రశ్నిస్తున్నారు. గత ప్రభుత్వం దళారీ వ్యవస్థను అరికట్టేందుకు భక్తులు కోరినన్ని లడ్డూలు ఇస్తే కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వ నిర్ణయం దళారీ వ్యవస్థను పెంచిపోషించేలా ఉందని వారు విమర్శిస్తున్నారు. కాగా, ఈ విషయంపై టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి మీడియాతో మాట్లాడుతూ దళారులను అరికట్టేందుకే ఆధార్‌తో లడ్డూ ప్రసాదాలు విక్రయించేందుకు చర్యలు తీసుకున్నామని చెప్పారు.