దశాబ్దం పాటు టీటీడీకి నెయ్యి సరఫరా చేసిన నందిని డెయిరీ
2015లో నందిని డెయిరీని పక్కన పెట్టేసింది చంద్రబాబు ప్రభుత్వమే
వైఎస్సార్‌సీపీ హయాంలో అసలు టెండరే వేయని నందిని డెయిరీ
సాక్షి, అమరావతి: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం పవిత్రతను దెబ్బతీసేలా టీడీపీ కూటమి ప్రభుత్వ దుష్ప్రచార కుట్ర కొనసాగుతోంది. సీఎం చంద్రబాబు పూటకో కట్టు కథ, రోజుకో అవాస్తవ ఆరోపణలతో కుతంత్రానికి పదును పెడుతున్నారు. వైఎస్సార్‌సీపీ హయాంలో కర్ణాటకకు చెందిన నందిని డెయిరీకి టీటీడీ నెయ్యి సరఫరా కాంట్రాక్టును ఎందుకు ఇవ్వలేదని చంద్రబాబు ప్రశి్నస్తుండటం ఈ కుట్ర కథలో తాజా అంకం. వాస్తవం ఏమిటంటే.. దశాబ్ద కాలంగా టీటీడీకి నెయ్యి సరఫరా చేస్తున్న నందిని డెయిరీని 2015లో తొలిసారిగా పక్కకు తప్పించింది టీడీపీ ప్రభుత్వమే. చంద్రబాబు ఆ విషయాన్ని కప్పిపుచ్చుతూ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై అసత్య ఆరోపణలతో దుష్ప్రచారం చేసేందుకు యతి్నస్తుండటం గమనార్హం.
నందిని డెయిరీని తప్పించింది చంద్రబాబే...
కర్ణాటక సహకార రంగంలోని నందిని డెయిరీ దశాబ్ద కాలంపాటు టీటీడీకి నెయ్యి సరఫరా చేసింది. ఆ ప్రక్రియను 2015లో చంద్రబాబు ప్రభుత్వమే అడ్డుకుంది. నాడు టీటీడీ నెయ్యి సరఫరా కాంట్రాక్టు కోసం నందిని డెయిరీతోపాటు పలు సంస్థలు టెండర్లు దాఖలు చేశాయి. అయితే అప్పటి టీడీపీ ప్రభుత్వం నందిని డెయిరీని కాదని మహారాష్ట్రకు చెందిన ప్రైవేటు రంగంలోని గోవింద్ డెయిరీకి నెయ్యి సరఫరా కాంట్రాక్టు ఇచి్చంది. దీనిపై అప్పట్లోనే తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి.
చిత్తూరు జిల్లా పూతలపట్టు టీడీపీ ఎమ్మెల్యే మురళీమోహన్ అప్పట్లో ఓ టీవీ చానల్‌లో రిపోర్టర్‌గా ఉన్న సమయంలో నందినీ డెయిరీకి నెయ్యి సరఫరా కాంట్రాక్టు ఇవ్వకపోవడాన్ని తప్పుబడుతూ వార్తలు కూడా ప్రసారం చేశారు. అన్ని వైపుల నుంచి విమర్శలు వచి్చనా చంద్రబాబు ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు. నందినీ డెయిరీని కాదని గోవింద్ డెయిరీకే నెయ్యి సరఫరా కాంట్రాక్టు కట్టబెట్టింది. నందిని డెయిరీని తొలిసారిగా పక్కన పెట్టేసి మరో ప్రైవేటు డెయిరీకి కాంట్రాక్టు ఇచ్చింది చంద్రబాబు ప్రభుత్వమేనన్నది సుస్పష్టం.
వైఎస్సార్‌సీపీ హయాంలో టెండర్లలో పాల్గొనని నందిని ఇక వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో నెయ్యి సరఫరా కోసం టీటీడీ నిర్వహించిన టెండర్ల ప్రక్రియలో నందిని డెయిరీ అసలు పాల్గొనలేదు. గతంలో చంద్రబాబు ప్రభుత్వం తాము కోట్ చేసిన ధరకు కాంట్రాక్టు ఇవ్వనందున టీటీడీ నెయ్యి సరఫరా కాంట్రాక్టులో పాల్గొనబోమని పేర్కొంది. ఈ క్రమంలో నిబంధనల ప్రకారం టెండర్ల ప్రక్రియ నిర్వహించి ఎల్ 1గా నిలిచిన ఏఆర్ డెయిరీకి నెయ్యి సరఫరా కాంట్రాక్టు ఇచ్చారు. ఇదీ అసలు విషయం.
అయినా సరే ఎందుకు ఇవ్వలేదంటూ..
ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ విషయాన్ని కప్పిపుచ్చుతూ వైఎస్సార్‌సీపీ హయాంలో నందిని డెయిరీకి నెయ్యి సరఫరా కాంట్రాక్టు ఎందుకు ఇవ్వలేదని ప్రశి్నంచడం విస్మయం కలిగిస్తోంది. అసలు వైఎస్సార్‌సీపీ హయాంలో టెండర్ల ప్రక్రియలో పాల్గొనని నందిని డెయిరీకి కాంట్రాక్టు ఎలా ఇస్తారు? ఈ విషయం తెలిసినా సీఎం చంద్రబాబు ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకే అసత్య ఆరోపణలు చేస్తున్నారు. 2015లో టీడీపీ హయాంలో టెండరు ప్రక్రియలో పాల్గొన్నప్పటికీ నందిని డెయిరీకి నెయ్యి సరఫరా కాంట్రాక్టు ఇవ్వనిది చంద్రబాబే అన్నది పచ్చి నిజం. ఆ వాస్తవాన్ని కప్పిపుచ్చుతూ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయడం వెనుక చంద్రబాబు రాజకీయ కుతంత్రం ఉన్నట్లు స్పష్టమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment