శ్రీవారి లడ్డూ వివాదంలో సీఎం చంద్రబాబుకు ముచ్చెమటలు
ఏ ఆధారాలతో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని నిలదీసిన సుప్రీంకోర్టు
అడ్డంగా దొరికిపోయి మరోమారు టాపిక్ డైవర్షన్
ప్రజల్లో చులకనవుతున్నానని వివాదాన్ని కొత్త మలుపు తిప్పుతున్న వైనం
ఇందులో భాగంగానే మాట మార్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
తన దీక్ష ఒక్క లడ్డూపై మాత్రమే కాదని ముక్తాయింపు
తిరుమల టెండర్లపై సరికొత్త కథనాలు వండివారుస్తున్న ఎల్లో మీడియా
పలు విధాలుగా దారి మళ్లించి బయటపడాలనే ఎత్తుగడ
సాక్షి, అమరావతి : వంద రోజుల పాలనలో వైఫల్యాలపై ప్రజల దృష్టి మళ్లించేందుకు రాజకీయ దురుద్దేశాలతో తప్పుడు వ్యాఖ్యలు చేసి తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని తాను అపవిత్రం చేశానన్నది సుప్రీంకోర్టు సాక్షిగా ప్రజలకు తేటతెల్లమవడంతో.. దాన్నుంచి బయట పడేందుకు సీఎం చంద్రబాబునాయుడు మరోమారు టాపిక్ డైవర్షన్‌పై దృష్టి సారించారు. లడ్డూ గురించి మాట్లాడటం మానేసి.. దానికి సంబంధించిన టెండర్లు, డెయిరీలు, ధరలు, గతంలో జరిగిన సంఘటనలంటూ ఎల్లో మీడియాతో సరికొత్త కథనాలు వండివారి్పస్తున్నారు.
ఎలాంటి ఆధారాలు లేకుండా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతినేలా ఎలా మాట్లాడతారంటూ సుప్రీంకోర్టు నిలదీయడంతో బాబు అండ్ గ్యాంగ్‌కు ముచ్చెమటలు పట్టాయి. ‘కల్తీ నెయ్యి వాడలేదని ఈవో చెప్పినా, లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు ఉందని ముఖ్యమంత్రి ఎలా చెబుతారు? ఆధారాలు లేకపోయినా సీఎం మీడియా ముందు అలా ఎలా మాట్లాడతారు? ఒకవైపు విచారణ జరుగుతుండగా.. ఆ వ్యాఖ్యలతో సిట్ ప్రభావితం కాదా? తమ నివేదిక తప్పు కావచ్చని స్వయంగా ఎన్‌డీడీబీ రిపోర్టులోనే రాశారు కదా? ఎన్‌డీడీబీ నివేదికపై సెకండ్ ఒపీనియన్ ఎందుకు తీసుకోలేదు? అదొక్కటే కాదు.. దేశంలో ఎన్నో ల్యాబ్స్ ఉన్నాయి కదా? ముఖ్యమంత్రి ప్రకటనకు పూర్తి విరుద్ధంగా ఈవో ప్రకటన ఉంది.
ఆ నెయ్యి వాడనే లేదని ఈవో చెప్పారు. సీఎం చేసిన ప్రకటనకు ఎలాంటి ఆధారాలు లేవు. దర్యాప్తునకు ఆదేశించినప్పుడు పదాల గారడీ ఎంత మాత్రం అవసరం లేదు. ఎన్‌డీడీబీ నివేదిక జూలైలో వస్తే దానిపై సీఎం ఎందుకు సెపె్టంబరులో మాట్లాడినట్లు? జూలైలోనే ఎందుకు మాట్లాడలేదు? మీడియాతో మాట్లాడటానికి ముందు లడ్డూలను పరీక్షించడం సరైనదని సీఎం భావించలేదా? అసలు బహిరంగ ప్రకటనలు ఎందుకు చేయాలి? దాని వల్ల సిట్ దర్యాప్తు ప్రభావితం కాదా? అది కోట్ల మంది మనోభావాలను దెబ్బ తీస్తుందని తెలియదా? సిట్ ఏర్పాటు చేసినా, ఇంకా కల్తీ నెయ్యిపై ప్రకటన ఎలా చేస్తారు? మీడియాతో ఎలా మాట్లాడతారు?’ అని గత నెల 30వ తేదీన సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిన విషయం విదితమే. ఆ తరువాత సీబీఐ నేతృత్వంలో స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించిన సంగతి తెలిసినదే. ఈ నేపథ్యంలో తాను ప్రజల్లో మరింత చులకన కాకూడదని ఓ వైపు పవన్ కళ్యాణ్, మంత్రులు.. మరో వైపు ఎల్లో మీడియాను రంగంలోకి దించి ట్రాక్ మార్చేశారు.
లడ్డూ పోయి టెండర్లొచ్చె..
కల్తీ అయిందని చెబుతున్న నెయ్యిని అసలు వాడనేలేదని టీటీడీ ఈవో చెబుతున్నా వినిపించుకోకుండా దురుద్దేశంతో దుష్ప్రచారం చేసిన చంద్రబాబు అండ్ గ్యాంగ్.. ఇప్పుడు ఆ నెయ్యి గురించి కాకుండా టెండర్లపై వివాదం సృష్టిస్తోంది. వాస్తవానికి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం వచి్చన రోజు నుంచే ఏఆర్ డెయిరీ టీటీడీకి నెయ్యి సరఫరా ప్రారంభించింది. ఆ డెయిరీ జూలై 6, 12న సరఫరా చేసిన 4 ట్యాంకర్ల నెయ్యిలో కల్తీ ఉన్నట్లు తేలడంతో.. వాటిని వెనక్కి పంపేసి, బ్లాక్ లిస్ట్‌లో పెడుతూ షోకాజ్ నోటీలిచ్చామని టీటీడీ ఈవో జూలై 23న ప్రకటించారు. ఆ వెంటనే టెండర్ల సమయంలో ఏఆర్ డెయిరీని పరిశీలించి.. పది లక్షల కేజీల నెయ్యి సరఫరా చేసే సామర్థ్యం ఆ సంస్థకు ఉందని నివేదిక ఇచ్చిన ఘీ నిపుణుల కమిటీ సభ్యులను టీటీడీగానీ ప్రభుత్వంగానీ విచారించి చర్యలు తీసుకోలేదు.
అప్పుడే ఈ వ్యవహారంపై విచారించి.. చర్యలు తీసుకోకుండా టీటీడీ, ప్రభుత్వాన్ని ఎవరు అడ్డుకున్నారు? ప్రభుత్వం తాను చేయాల్సిన పని చేయకుండా.. ఉత్తరాఖండ్ రూర్కిలోని బోలేబాబా డెయిరీ, తిరుపతికి సమీపంలోని వైష్ణవి డెయిరీల నుంచి ఏఆర్ డెయిరీ అధిక ధరకు నెయ్యి కొనుగోలు చేసిందని కొత్త పల్లవి అందుకుంది. ఈ విషయమై ఎల్లో మీడియాతో కథనాలను వండివార్పిస్తోండటంపై విస్మయం వ్యక్తం అవుతోంది. పవన్ కళ్యాణ్.. తిరుమల లడ్డూ ఒక్కటే కాదని.. గత ఐదేళ్లలో తిరుమలలో జరిగిన ఘటనలపై తాను పశ్చాత్తాప దీక్ష చేశానని ప్లేటు ఫిరాయించారు. సనాతన ధర్మం అంటూ.. కోర్టులు అంటూ ఇటు నుంచి ఎటో తీసుకెళ్లారు. తిరుమల శ్రీవారి లడ్డూను వివాదం చేసి.. వంద రోజుల పాలన, ఎన్నికల్లో ఇచి్చన హామీల అమల్లో వైఫల్యం నుంచి ప్రజల దృష్టి మళ్లిద్దామనుకున్న చంద్రబాబుకు చేతులు కాలడంతో ఇప్పుడు ఎన్ని విధాలుగా వీలైతే అన్ని విధాలుగా దాన్ని దారి మళ్లించాలని ఎత్తులు వేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment