సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలతో చంద్రబాబు అంతర్మథనం
ఈ వ్యవహారంలో బాబు చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలేననే భావన బలంగా ప్రజల్లోకి.. నష్ట నివారణలో భాగంగా సుప్రీంకోర్టును తప్పుబట్టేలా పురందేశ్వరి వ్యాఖ్యలు
గత ఐదేళ్లలో దేవాలయాల్లో జరిగిన ఘటనలపై దీక్ష చేస్తున్నానన్న డిప్యూటీ సీఎం పవన్
ప్రజలను రెచ్చగొట్టి లబ్ధి పొందే పాచిక వికటించిందని..
తప్పు మీద తప్పు చేశామని టీడీపీ సీనియర్లలో ఆందోళన
ఆ నెయ్యి అసలు వాడనేలేదని ముందు నుంచి చెబుతున్నా
సీఎం పట్టించుకోలేదని సన్నిహితుల వద్ద టీటీడీ ఈవో ఆవేదన.. తనతోనూ అబద్ధాలు చెప్పించారంటూ నిర్వేదం
సాక్షి, అమరావతి: తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ‘‘జంతు కొవ్వు’’ ప్రకటనను సుప్రీంకోర్టు తీవ్రంగా ఆక్షేపించడం.. దేవుడిని రాజకీయాలకు దూరంగా ఉంచాలంటూ అత్యున్నత న్యాయస్థానం ఘాటుగా హెచ్చరించిన నేపథ్యంలో టీడీపీ శ్రేణులు గప్‌చుప్ అయ్యాయి. అసలు వాడని కల్తీ నెయ్యిని వాడినట్లుగా చిత్రీకరించి తమ అధినాయకత్వం తప్పు మీద తప్పు చేసిందనే అభిప్రాయం టీడీపీ శ్రేణుల్లో బలంగా వ్యక్తమవుతోంది.
శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారనేందుకు ప్రస్తుతం ప్రాథమికంగా ఎలాంటి ఆధారాలు లేవని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో లడ్డూలో నెయ్యికి బదులు జంతువుల కొవ్వు వాడారంటూ సీఎం చంద్రబాబు చేసిన ఆరోపణలు పచ్చి అబద్ధాలనే విషయం ప్రజల్లో మరింత బలపడుతోందని టీడీపీ సీనియర్ నేత ఒకరు అభిప్రాయపడ్డారు. నష్ట నివారణ చర్యల్లో భాగంగా సుప్రీం కోర్టు వ్యాఖ్యలను తప్పుపట్టేలా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి మాట్లాడినా ఫలితం లేదని టీడీపీ శ్రేణులు వాపోతున్నాయి.
ఇదొక్కటే కాకుండా గత ఐదేళ్లలో తిరుమల, ఇతర దేవాలయాలలో జరిగిన ఘటనలపై ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నానంటూ జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెబుతున్న మాటలను ప్రజలు ఏమాత్రం విశ్వసించడం లేదని పేర్కొంటున్నారు. ప్రజల మనోభావాలను రెచ్చగొట్టి రాజకీయంగా లబ్ధి పొందేందుకు విసిరిన పాచిక పారకపోగా మైనారిటీలను పార్టీకి మరింత దూరం చేసిందని టీడీపీ సీనియర్ నేత ఒకరు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంలో అధినాయకత్వం అత్యుత్సాహమే కొంపముంచిందనే అభిప్రాయం టీడీపీ శ్రేణుల్లో గట్టిగా వ్యక్తమవుతోంది.
తప్పులు చెప్పించారని సన్నిహితులతో ఈవో ఆవేదన!
వనస్పతి ఆయిల్ మాత్రమే కల్తీ అయినట్లు ఎన్‌డీడీబీ రిపోర్టులో వచ్చిందని.. ఆ రిపోర్టు వచ్చిన రోజే సీఎం చంద్రబాబుకు తాను చెప్పానని.. అయినా తన మాట పట్టించుకోలేదని ఈవో శ్యామలరావు వాపోతున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఎన్‌డీడీబీ రిపోర్టులో జంతువుల కొవ్వు కలిసినట్లుగా ఎక్కడా స్పష్టంగా లేదని.. కల్తీ నెయ్యి ట్యాంకర్లను వెనక్కి పంపామని.. ఆ నెయ్యిని లడ్డూల తయారీలో వాడలేదని సీఎం చంద్రబాబుకు తాను పదే పదే చెప్పానని.. అయినా తన మాట వినిపించుకోలేదని ఈవో ఆవేదన చెందుతున్నట్లు సమాచారం. ఈ వ్యవహారంలో తనతో కూడా తప్పులు చెప్పించారని ఈవో శ్యామలరావు నొచ్చుకున్నట్లు ఆయన సన్నిహితుడొకరు పేర్కొన్నారు.
తప్పు మీద తప్పు..
ఎన్నికల్లో కూటమి గెలుపొందిన అనంతరం జూన్ 12న సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయగా జూన్ 14న టీటీడీ ఈవోగా జె.శ్యామలరావును ప్రభుత్వం నియమించింది. టీటీడీకి ఓ సంస్థ సరఫరా చేసిన రెండు నెయ్యి ట్యాంకర్లలో వనస్పతి ఆయిల్ కల్తీ జరిగినట్లు తేలిందని.. అయితే ఆ రెండు ట్యాంకర్లను వెనక్కి పంపామని, వాటిని అసలు వాడలేదని జూలై 23న తిరుమలలో ఈవో జె.శ్యామలరావు మీడియా సాక్షిగా ప్రకటించారు.
అనంతరం రెండు నెలల తరువాత సెప్టెంబరు 18న కూటమి శాసనసభా పక్ష సమావేశంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ హయాంలో తిరుమల లడ్డూ తయారీలో నెయ్యికి బదులుగా జంతువుల కొవ్వును వాడి అపచారం చేశారంటూ దారుణమైన ఆరోపణలు చేశారు. ఆ తర్వాత సెప్టెంబరు 20న టీటీడీ ఈవో తిరుమలలో మీడియాతో మాట్లాడుతూ.. తమిళనాడు డెయిరీ సరఫరా చేసిన నాలుగు ట్యాంకర్ల నెయ్యిలో కల్తీ జరిగిందని ఎన్‌డీడీబీ రిపోర్టు ఇచ్చిందని.. అయితే ఆ నాలుగు ట్యాంకర్లను వెనక్కి పంపేశామని.. ఆ నెయ్యిని తిరుమల లడ్డూ తయారీలో వాడలేదని స్పష్టం చేశారు.
ఈ మేరకు సెపె్టంబరు 22న సీఎం చంద్రబాబుకు ఆయన నివేదిక కూడా ఇచ్చారు. కానీ.. సీఎం చంద్రబాబు మాత్రం సెపె్టంబరు 22న జంతువుల కొవ్వు కలిసిన నెయ్యిని తిరుమల లడ్డూ తయారీలో వాడారంటూ అబద్ధాలు పునరుద్ఘాటించారు. కల్తీ నెయ్యిని లడ్డూ తయారీలో వాడలేదని టీటీడీ ఈవో పదే పదే స్పష్టం చేస్తున్నా... ఆ నెయ్యిని వాడారంటూ చంద్రబాబు పునరుద్ఘాటించడం ద్వారా తప్పు మీద తప్పు చేశారని టీడీపీకి చెందిన మాజీ మంత్రి ఒకరు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
ఇతని పేరు మొగదాటి అశోక్. తోటవారి వీధిలో ఉంటున్నాడు. అక్కడే మెయిన్ రోడ్డు పక్కన కొబ్బరి బొండాలు అమ్ముకుంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. వరదకు కొట్టు మొత్తం కొట్టుకుపోయింది. ఇంట్లో సామాన్లు మొత్తం పాడైపోయాయి. నష్ట పరిహారం అంచనా వేసేందుకు అధికారులు వచ్చినపుడు ఇంట్లోనే ఉన్నాడు.
ఏమేం నష్టపోయారో వివరించాడు. వారు ఫోటోలు కూడా తీసుకున్నారు. తీరా చూస్తే జాబితాలో ‘డోర్ లాక్’ వచ్చింది. ఇప్పటికీ సచివాలయం చుట్టూ పదిసార్లు తిరిగాడు. మూడు రోజులుగా కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నాడు. అర్జీలు తీసుకుంటున్నారు కానీ జాబితాలో పేరు చేర్చడం లేదు.
ఈ ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు కొరగంజి మాధవ్. 46వ డివిజన్ రాజీవ్‌శర్మనగర్‌లో ఉంటున్నాడు. వరదకు తీవ్రంగా నష్టపోయాడు. ఇతను ఉండే∙వీధిలో 116 ఇళ్లు ఉంటాయి. వాటిలో కేవలం 14 ఇళ్లకు మాత్రమే నష్ట పరిహారం డబ్బులు వేశారు. మిగిలిన 101 ఇళ్లకుగాను 20 ఇళ్లు జాబితాలో ఉన్నాయి. కానీ డబ్బులు పడలేదు. మిగిలిన 81 ఇళ్లను అసలు జాబితాలోనే చేర్చలేదు.
అంతా కుట్రపూరితంగానే వ్యవహరిస్తున్నారు. పై అంతస్థుల్లో ఉంటూ.. ఎలాంటి నష్టం జరగని వారికి మాత్రం డబ్బులు వేశారు. 142వ సచివాలయం పరిధిలోని రాజీవ్‌శర్మనగర్, అంబేడ్కర్ నగర్ ప్రాంతాల్లో అందరూ పేదలే. అందరూ వరద బాధితులే. అయినా వారిలో అత్యధికులకు పరిహారం అందలేదు.
Comments
Please login to add a commentAdd a comment