![Huge response to Srivari Laddu Prasadam in first day sale - Sakshi](/styles/webp/s3/article_images/2020/05/26/dddddd.jpg.webp?itok=RUpHkAvC)
విజయనగరం జిల్లా కేంద్రంలోని టీటీడీ కళ్యాణమండపంలో సోమవారం భక్తులకు శ్రీవారి లడ్డూలను విక్రయిస్తున్న టీటీడీ సిబ్బంది
తిరుమల: రాష్ట్రంలోని జిల్లా కేంద్రాల్లో ఉన్న టీటీడీ కల్యాణ మండపాల్లో సోమవారం శ్రీవారి లడ్డూ ప్రసాదం విక్రయాలను ప్రారంభించారు. రూ. 50 లడ్డూను రాయితీపై ప్రస్తుతం రూ. 25కే అందజేస్తున్నారు. తొలిరోజు భక్తుల నుంచి విశేష స్పందన కనిపించింది. లడ్డూ విక్రయాలను ప్రారంభించిన మూడు గంటల్లోనే అందుబాటులో ఉన్న 2.4 లక్షల లడ్డూలను టీటీడీ విక్రయించింది. మంగళవారం మరో 2 లక్షల లడ్డూ ప్రసాదాలను జిల్లా కేంద్రాలకు తరలించనున్నారు.
గుంటూరు రెడ్‌జోన్‌లో ఉండటంతో ఈనెల 30వ తేదీ నుంచి అక్కడ లడ్డూ విక్రయాలను ప్రారంభించనున్నారు. లాక్‌డౌన్ నేపథ్యంలో తిరుమల శ్రీవారి ఆలయంలోకి భక్తుల రాకపోకలను టీటీడీ రద్దు చేసిన విషయం విదితమే. రాష్ట్ర వ్యాప్తంగా భక్తుల నుంచి వచ్చిన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో అనిల్ కుమార్ సింఘాల్ శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment