భారత వ్యవసాయ పరిశోధన సంస్థ పాలక మండలి సభ్యుడు బద్రవాడ వేణుగోపాల్ సంచలన నిజాలు
టీటీడీ ఈవో శ్యామలరావు, ఎన్‌డీడీబీ చైర్మన్ మీనేశ్ షా, మాజీ చైర్మన్ వర్షాజోషిలే బాధ్యులు
ఎన్‌డీడీబీకి నెయ్యి శాంపిళ్లు పంపడానికి ముందు రోజు ఆ ముగ్గురి భేటీపై అనుమానాలు
వారికి కఠిన శిక్ష విధించాలి.. వారి ఆస్తులను
సీజ్ చేసి ధార్మిక సంస్థలకు దానం చేయాలి
సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ
జరిపించాలంటూ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు లేఖ
ప్రధాని నరేంద్ర మోదీ, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌లకూ లేఖ ప్రతులు
సాక్షి, హైదరాబాద్: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారనడంలో కుట్రకోణం దాగి ఉందని భారత వ్యవసాయ పరిశోధన సంస్థ పాలక మండలి సభ్యుడు బద్రవాడ వేణుగోపాల్ సంచలన విషయాలు వెల్లడించారు. జాతీయ పాడి పరిశ్రమాభివృద్ధి సంస్థ (ఎన్‌డీడీబీ) ఇచ్చిన నివేదికలోనే అసలు కుట్ర దాగి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఆ నివేదికపై సమగ్ర విచారణ జరిపించాలని, కోట్లాది మంది భక్తుల మనోభావాలపై తీవ్రమైన దాడి చేసేందుకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. ఈ మేరకు శుక్రవారం ఆయన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ రాశారు. రాష్ట్రపతితో పాటు భారత ప్రధాన మంత్రి, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌లకు కూడా ఆ లేఖను పంపారు. ఆ లేఖలో ప్రధానాంశాలు ఇలా ఉన్నాయి.
వ్యాపార ప్రయోజనాల కోసమే ఆ భేటీ
∙టీటీడీ లడ్డూ వివాదానికి లోపభూయిష్టమైన ఎన్‌డీడీబీ కాఫ్ రిపోర్టుతో పాటు టీటీడీ, ఎన్‌డీడీబీ, రాష్ట్రీయ గోకుల్ మిషన్ (ఆర్‌జీఎం) పెద్దల అనుమానాస్పద వ్యాపార భేటీలు ఉత్ప్రేరకాలుగా మారాయి. ఈ నివేదిక తదనంతర పరిణామాలతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది భక్తుల విశ్వాసం దెబ్బతింది. ఈ విషయానికి లభించిన విపరీత ప్రచారం టీటీడీ విశ్వసనీయతను దెబ్బ తీసింది.
⇒ జూలై 6న నెయ్యి శాంపిళ్లను పరీక్ష కోసం పంపగా, అంతకంటే ముందు అంటే జూలై 5న టీటీడీ ఈవో జె.శ్యామలరావు, ఎన్‌డీడీబీ చైర్మన్ మీనేశ్.సి.షా, ఎన్ డీడీబీ మాజీ చైర్మన్ ఆర్‌జీఎం అదనపు కార్యదర్శి వర్షా జోషిల మధ్య భేటీ జరిగింది. ఈ భేటీ అనేక అను మానాలకు తావిస్తోంది.
⇒ ఈ భేటీ కారణంగానే నెయ్యి కల్తీ జరిగిందని వచ్చిన నివేదిక వెనుక రాజకీయ దురుద్దేశాలున్నాయేమోననే అనుమానాలు కలుగుతున్నాయి. ఈ ముగ్గురి చర్యల కారణంగా లడ్డూ ప్రసాదానికి ఉన్న విశ్వసనీయత దెబ్బతింది. ఇందుకు వారే బాధ్యత వహించాలి. వ్యాపార లావాదేవీల కోసం వారి దురాశపూరిత వైఖరి క్షమించరానిది. వారు కఠిన శిక్షలు ఎదుర్కోవాలి. వారి ఆస్తులన్నింటినీ సీజ్ చేసి, ధార్మిక సంస్థలకు దానం చేయాలి. ఈ వ్యవహారంతో సూక్ష్మ సంబంధమున్న ఎవరినైనాసరే జైలుకు పంపాలి.
⇒ వాస్తవాలను పరిశీలించి ఆరోపణల వెనుక ఉన్న నిజాలను తెలుసుకోవడం కంటే హడావుడి ప్రకటనలకే రాజకీయ నాయకులు ప్రాధాన్యమిచ్చారు. అదే నిజ మైతే సదరు రాజకీయ నాయకులు కూడా న్యాయ పరంగా తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. లడ్డూ పవిత్రతను కాపాడడం, మతపరమైన ఆచా రాలను సంరక్షించడం అత్యవసరం. ఇలాంటి రాజ కీయ అపస్వరాలు వినిపిస్తున్న వేళ దేవాలయాల నిర్వ హణను మత పెద్దలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
ఏకపక్షంగా నియామకం
⇒ వ్యాపార లావాదేవీల కోసం టీటీడీ ఈవో శ్యామ లరావుతో భేటీ అయిన ఎన్‌డీడీబీ చైర్మన్ మీనేశ్.సి.షా, వర్షాజోషీల ట్రాక్ రికార్డు వివాదాస్పదం. అధికార, ఆర్థిక దుర్వినియోగాలకు సంబంధించి ఆరోప ణలు వీరిపై వచ్చాయి. 2021 మే 31న వర్షాజోషి ఎన్‌డీడీబీ చైర్మన్‌గా రిటైర్ అయ్యారు. ఆ తర్వాత ప్రస్తుత చైర్మన్ మీనేశ్.సి.షాను ఆమె ఏకపక్షంగా నియ మించారు.
⇒ డిప్యూటీ జనరల్ మేనేజర్ హోదాలో ఉన్న షాను అనేక హోదాలు దాటించి మరీ చైర్మన్, ఎండీగా నియమించారు. ఈ ఇద్దరు దేశీయ పశు సంపదను పెంపొందించడం కంటే బహుళ జాతి సంస్థల ప్రయోజనాల కోసం విదేశీ రకాలను, జెర్సీ ఆవులను ప్రోత్సహించడంపైనే దృష్టి పెట్టి పని చేశారు. ఇది ప్రధాని మోదీ ఆలోచనకు, ఆయన హయాంలో నడుస్తున్న రాష్ట్రీయ గోకుల్ మిషన్‌కు విరుద్ధం. వీరిద్దరిపై ఆర్‌జీఎంకు సంబంధించి రూ.4,109 కోట్లు, నేషనల్ డెయిరీ ప్లాన్–1కు సంబంధించి రూ.2,242 కోట్ల నిధుల దుర్వినియోగంపై కూడా ఆరోపణలున్నాయి.
వాళ్లే జవాబుదారీ
⇒ టీటీడీ ఉపయోగించిన నెయ్యిలో కల్తీ జరిగిందని నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డు కాఫ్ ఇచ్చిన రిపోర్టుపై సమగ్ర విచారణ జరిపించాలి. ఇందుకు బాధ్యులైన అధి కారులతో పాటు కోట్లాది మంది భక్తులను తప్పుదోవ పట్టించినందుకు టీటీడీ ఈవో జె. శ్యామలరావుతో పాటు ఎన్‌డీడీబీ చైర్మన్ మీనేశ్.సి.షాలను జవాబుదారులుగా చేయాలి.
⇒ ఎన్‌డీడీబీ చైర్మన్‌గా మీనేశ్.సి.షా నియామకమే నేరపూరితం. ఆయన పదోన్నతి లభించేందుకు దారి తీసిన పరిస్థితులపై విచారణ జరిపించాలి.
⇒ విదేశీ రకాలను ప్రోత్సహించి, స్వదేశీ పశు సంపద కార్యక్రమాలను నిర్వీర్యం చేయడంలో ఎన్‌డీడీబీ చైర్మన్‌గా, రాష్ట్రీయ గోకుల్ మిషన్ అదనపు కార్య దర్శిగా వర్షాజోషి తన హోదాను దుర్విని యోగం చేయడంపై కూడా విచారణ జరిపించాలి.
⇒ దేశంలోని అన్ని దేవాలయాల్లో దేశీయ ఆవు నెయ్యి ని ప్రోత్సహించేలా చర్యలు తీసుకోవాలి.
⇒ మీనేశ్.సి.షా, వర్షాజోషిల హయాంలో రాష్ట్రీయ గోకుల్ మిషన్ , పశుసంపద వృద్ధి (సీడీడీ) కార్య క్రమాల్లో జరిగిన ఆర్థిక అక్రమాలపై విచారణ జరిపించాలి.
⇒ ఈ విచారణ పూర్తి పారదర్శకంగా, జవాబుదారీగా ఉండేందుకు సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి లేదా ఉన్నత స్థాయి అధికారితో విచారణ జరిపించాలి. కోట్లాది మంది భక్తుల విశ్వాసాలను పునరుద్ధరించడంతో పాటు ఈ వ్యక్తుల కారణంగా నష్టపో యిన రైతులకు మోదీ ప్రభుత్వం పట్ల ప్రజా విశ్వాసం కలిగేలా తక్షణ చర్యలు తీసుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment