
రాజమహేంద్రవరం కల్చరల్: వివిధ జిల్లాల్లో టీటీడీ కల్యాణ మండపాల ద్వారా జరుగుతున్న శ్రీవారి లడ్డూల అమ్మకాలపై సోషల్ మీడియాలో కొందరు ఉద్దేశపూర్వకంగా చేస్తున్న అసత్య కథనాలను మానుకోవాలని విశాఖ శ్రీశారదా పీఠం ఉత్తరాధికారి స్వామి స్వాత్మానందేంద్ర సరస్వతి అన్నారు. సీఎం వైఎస్ జగన్ పరిపాలన ఏడాది పూర్తయిన సందర్భంగా, లోకకల్యాణార్థం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఎంపీ మార్గాని భరత్‌రామ్ తన కార్యాలయ ప్రాంగణంలో ధన్వంతరీ సహిత మహాసుదర్శన యాగం, రాజశ్యామల సహిత రుద్రయాగం శుక్రవారం ప్రారంభించారు. ఈ యాగ పూర్ణాహుతిలో పాల్గొనడానికి ఆదివారం నగరానికి వచ్చిన స్వాత్మానందేంద్ర విలేకర్లతో మాట్లాడారు. ఆయన ఇంకా ఏమన్నారంటే...
► శ్రీవారి అనుగ్రహం, ఆశీస్సులు ఈ లడ్డూల రూపేణా లభిస్తున్నట్టు భావించాలి.
► టీటీడీ ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా ప్రభుత్వం తీసుకున్న చర్యలు అభినందనీయం.
► శార్వరి నామ సంవత్సరం కాలసర్ప దోషంతో ప్రారంభమైంది.. గ్రహకూటమి అనుకూలంగా లేదు.
► కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి ఆధ్యాత్మిక శక్తితో ప్రతి ఒక్కరిలోనూ మానసిక స్థైర్యం తప్పకుండా చేకూరుతుంది.
Comments
Please login to add a commentAdd a comment