సాక్షి,చిత్తూరు జిల్లా : సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి ఆర్కేరోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. తన 100 రోజుల పాలనలో జరిగిన వైఫల్యాలు కప్పి పుచ్చేందుకు చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు.
వరదలు, మహిళలపై వరుసగా జరుగుతున్న దాడులు, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, నాయకులపై దాడులు, ఇచ్చిన హామీలను చంద్రబాబు నెరవేర్చ లేకపోయారని గుర్తు చేశారు. ఇన్ని తప్పులు చేసిన చంద్రబాబు ప్రజల దృష్టి మళ్లించే విధంగా లడ్డు వివాదాన్ని తెరపైకి తెచ్చారని ఆరోపించారు.
తన రాజకీయ లబ్ధి కోసం వెంకటేశ్వర స్వామిని సైతం చంద్రబాబు వదలడం లేదు. చెడ్డ పేరు వచ్చిన ప్రతిసారి ఇలాంటి వివాదాలు ఏదొకటి తెరపైకి తెచ్చి, పార్టీ నేతలతో ప్రచారం చేయిస్తున్నారు. ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలను ప్రజలు ఖండిస్తున్నారు, చీకొడుతున్నారు. టీటీడీ స్వయం ప్రతిపత్తి సంస్థ, సీఎంకు ఎలాంటి సంబంధం ఉండదని మంత్రి లోకేష్ అంటున్నారు. మాజీ సీఎం, తమ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఫ్యాట్ మిక్స్ చేయించినట్లుగా చంద్రబాబు సృష్టిస్తున్నారు. చంద్రబాబు ఆరోపణలు సమంజసం కాదు అని అన్నారు.
ఈఓ శ్యామల రావు బాధ్యతలు తీసుకున్న వెంటనే స్వచ్ఛమైన నెయ్యిని వాడుతున్నట్లు తెలిపారు. జూలై 23న వెజిటబుల్ ఆయిల్ మిక్స్ చేశారు. అందుకే నెయ్యిని వెనక్కు పంపాం అంటూ ఈవో స్టేట్మెంట్ ఇచ్చారు. రెండు నెలల అనంతరం సీఎం స్టేట్మెంట్ ఇవ్వడం వెనుక ఆంతర్యం ఏంటి? అని ఆర్కే రోజా ప్రశ్నించారు.
టీడీపీ కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి నింద వేశారు. మళ్లీ శ్యామలరావుపై ఒత్తిడి తెచ్చి ప్రెస్ మీట్ పెట్టించారు. మీ ప్రభుత్వంలో బయటపడిన అంశం కాబట్టి బాధ్యులు ఎవరు? సీఎం చంద్రబాబునా? ఈవో శ్యామలరావు ఆ?? వైఎస్ జగన్ అధికారంలో ఉన్న సమయంలో పీఎం మోదీ, సీజేఐలు, చంద్రబాబు సైతం ఫ్యామిలీతో రావడం జరిగింది. లడ్డూ రుచిలో తేడా ఉంటే ఆ రోజే కంప్లైంట్ ఇవ్వాలి కదా! అని తెలిపారు.
ఐదేళ్లలో ఏదో జరిగిందని నింద వేయడానికి కల్తీ నెయ్యి అంటూ ప్రచారం చేస్తున్నారు. టీటీడీ ప్రతిష్టను దిగజార్చే విధంగా చేయడం ఎంతవరకు సమంజసం? బీజేపీ నాయకులు సైతం గత పాలక మండలిలో ఉన్నారు. అప్పుడు ఎందుకు కంప్లైంట్ చేయలేదు? ప్రస్తుతం టీడీపీలో ఉన్న వేమిరెడ్డి ప్రశాంతి, పార్థసారథి గత పాలకమండలిలో ఉన్నారు.తప్పు చేశారా లేదా వాళ్లైనా చెప్పాలి!
ఈరోజు ప్రాయిశ్చిత దీక్ష చేస్తానని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ప్రాయిశ్చిత్తం ఎవరు చేస్తారు? ప్రభుత్వం తప్పు చేసింది కాబట్టే పవన్ ప్రాయిశ్చిత దీక్ష చేస్తున్నానని ఆయనే ఒప్పుకున్నట్లే కదా అని ఆర్కే రోజా పునరుద్ఘాటించారు.
చదవండి : 100 రోజుల్లో సూపర్ సిక్స్ లేదు.. సెవెనూ లేదు: వైఎస్ జగన్
Comments
Please login to add a commentAdd a comment