
సాక్షి, విజయవాడ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కుల గజ్జి పట్టుకుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు కోన రఘుపతి, మల్లాది విష్ణు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తన సామాజిక వర్గానికి చెందిన పోలీసు అధికారులను కీలక స్థానాల్లో నియమించడమే ఇందుకు నిదర్శనమని దుయ్యబట్టారు. శనివారమిక్కడ విలేరులతో మాట్లాడుతూ... సర్వేల పేరుతో టీడీపీ బరితెగించి అక్రమాలకు పాల్పడుతోందని విమర్శించారు. ఇప్పటికే తమకు వ్యతిరేకులుగా భావిస్తున్న పలువురి ఓట్లను తొలగించిందని ఆరోపించారు.
గత ఎన్నికల్లో తమ పార్టీ కేవలం 5 లక్షల ఓట్ల తేడాతో అధికారం కోల్పోయిందని.. అందుకే ప్రస్తుతం చంద్రబాబు కుయుక్తులతో గెలవాలని చూస్తున్నారని మండిపడ్డారు. అందుకే దిగజారుడు చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఓట్ల తొలగింపు, బోగస్ ఓట్ల విషయమై తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారని తెలిపారు. ఇప్పుడు గవర్నర్‌కు కూడా ఫిర్యాదు చేయనున్నారని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment