
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి ఢిల్లీలో పర్యటనలో భాగంగా శనివారం కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, పరాస్ పాశ్వాన్‌ను కలిశారు. మంత్రులతో భేటీ అనంతరం కోనరఘుపతి మీడియాతో మాట్లాడుతూ.. విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ 74శాతం వ్యవసాయంపై ఆధారపడిందని తెలిపారు.
ఫుడ్ ప్రాసెసింగ్ మినిస్ట్రీ పథకాలను కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. ఏపీలో పర్యాటక అభివృద్ధికి కృషి చేయాలని కిషన్‌రెడ్డిని కోరినట్లు ఆయన పేర్కొన్నారు. భవిష్యత్‌లో ఏపీ టూరిజం హబ్‌గా మారబోతుందని కోన రఘుపతి చెప్పారు.