5 స్టార్‌ రేటింగ్‌ కంపెనీగా ‘భారతి సిమెంట్స్‌ లైమ్‌ స్టోన్‌ మైన్‌’ | Bharathi Cement Awarded Five Star Rating | Sakshi
Sakshi News home page

5 స్టార్‌ రేటింగ్‌ కంపెనీగా ‘భారతి సిమెంట్స్‌ లైమ్‌ స్టోన్‌ మైన్‌’

Published Thu, Aug 8 2024 4:03 AM | Last Updated on Thu, Aug 8 2024 10:08 AM

Bharathi Cement Awarded Five Star Rating

ఆరోసారి ఫైవ్‌ స్టార్‌ రేటింగ్‌ సాధించిన కంపెనీగా ఘనత

అవార్డు ప్రదానం చేసిన కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి

సాక్షి, న్యూఢిల్లీ: కడపలోని ‘భారతి సిమెంట్స్‌ లైమ్‌ స్టోన్‌ మైన్‌’కు ఆరోసారి అత్యంత ప్రతిష్టాత్మకమైన 5 స్టార్‌ రేటింగ్‌ లభించింది. పర్యావరణ పరిరక్షణ, విద్య, వైద్యం, పరిశుభ్రత, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ తదితర అంశాల్లో స్థానికంగా చేసిన కృషికి భారతి సిమెంట్స్‌ లైమ్‌ స్టోన్‌ మైన్‌కు కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డు అందజేసింది. గనుల రంగంలో సుస్థిరాభివృద్ధి విధానాలు అమలుచేస్తూ పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్న 68 మైనింగ్‌ సంస్థలకు కేంద్రం 2022–23 సంవత్సరానికి ఈ అవార్డులు అందజేసింది.

ఆంధ్రప్రదేశ్‌ నుంచి 5, తెలంగాణ నుంచి 5 సంస్థలు ఈ అవార్డులు అందుకున్నాయి. బుధవారం ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి ఈ అవార్డులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మాట్లా­డుతూ.. వచ్చే ఏడాది 7 ఉత్తమ సంస్థలకు 7 స్టార్‌ రేటింగ్స్‌ కూడా ఇస్తామని వెల్లడించారు. ఈ కార్య­క్రమంలో కేంద్ర బొగ్గు గనుల శాఖ సహాయ మంత్రి సతీశ్‌చంద్ర దూబే, గనుల శాఖ కార్యదర్శి వీఎల్‌ కాంతారావు, అదనపు కార్యదర్శి లోహియా, ఐబీఎం సెక్రటరీ జనరల్‌ పీఎన్‌ శర్మ, అవార్డులు సాధించిన సంస్థల ప్రతినిధులు, మైనింగ్‌ రంగ ప్రముఖులు పాల్గొన్నారు. 

ఏపీ నుంచి అవార్డు అందుకున్న సంస్థలు
భారతి సిమెంట్స్‌ లైమ్‌ స్టోన్‌ మైన్‌ – కడప
జేఎస్‌­డబ్ల్యూ సిమెంట్స్‌ లైమ్‌ స్టోన్‌ – నంద్యాల
దాల్మి­యా సిమెంట్స్‌ నవాబ్‌పేట – తలమంచిపట్నం
అ­ల్ట్రా­టెక్‌ – తుమ్మలపెంట
శ్రీ జయజ్యోతి (మైహోం) సిమెంట్స్‌ – కర్నూలు

తెలంగాణ నుంచి అవార్డు అందుకున్న కంపెనీలు
మైహోం – చౌటుపల్లి–1,
టీఎస్‌ఎండీసీ– దేవాపూర్‌ (మంచిర్యాల), 
మైహోం – మెల్ల చెరువు,
రైన్‌ సిమెంట్స్‌ – నల్గొండ 
సాగర్‌ సిమెంట్స్‌ – నల్గొండ

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement