Bharati Cements
-
5 స్టార్ రేటింగ్ కంపెనీగా ‘భారతి సిమెంట్స్ లైమ్ స్టోన్ మైన్’
సాక్షి, న్యూఢిల్లీ: కడపలోని ‘భారతి సిమెంట్స్ లైమ్ స్టోన్ మైన్’కు ఆరోసారి అత్యంత ప్రతిష్టాత్మకమైన 5 స్టార్ రేటింగ్ లభించింది. పర్యావరణ పరిరక్షణ, విద్య, వైద్యం, పరిశుభ్రత, ఇన్ఫ్రాస్ట్రక్చర్, డిజాస్టర్ మేనేజ్మెంట్ తదితర అంశాల్లో స్థానికంగా చేసిన కృషికి భారతి సిమెంట్స్ లైమ్ స్టోన్ మైన్‌కు కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డు అందజేసింది. గనుల రంగంలో సుస్థిరాభివృద్ధి విధానాలు అమలుచేస్తూ పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్న 68 మైనింగ్ సంస్థలకు కేంద్రం 2022–23 సంవత్సరానికి ఈ అవార్డులు అందజేసింది.ఆంధ్రప్రదేశ్ నుంచి 5, తెలంగాణ నుంచి 5 సంస్థలు ఈ అవార్డులు అందుకున్నాయి. బుధవారం ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి ఈ అవార్డులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. వచ్చే ఏడాది 7 ఉత్తమ సంస్థలకు 7 స్టార్ రేటింగ్స్ కూడా ఇస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర బొగ్గు గనుల శాఖ సహాయ మంత్రి సతీశ్‌చంద్ర దూబే, గనుల శాఖ కార్యదర్శి వీఎల్ కాంతారావు, అదనపు కార్యదర్శి లోహియా, ఐబీఎం సెక్రటరీ జనరల్ పీఎన్ శర్మ, అవార్డులు సాధించిన సంస్థల ప్రతినిధులు, మైనింగ్ రంగ ప్రముఖులు పాల్గొన్నారు. ఏపీ నుంచి అవార్డు అందుకున్న సంస్థలుభారతి సిమెంట్స్ లైమ్ స్టోన్ మైన్ – కడపజేఎస్డబ్ల్యూ సిమెంట్స్ లైమ్ స్టోన్ – నంద్యాలదాల్మియా సిమెంట్స్ నవాబ్‌పేట – తలమంచిపట్నంఅల్ట్రాటెక్ – తుమ్మలపెంటశ్రీ జయజ్యోతి (మైహోం) సిమెంట్స్ – కర్నూలుతెలంగాణ నుంచి అవార్డు అందుకున్న కంపెనీలుమైహోం – చౌటుపల్లి–1,టీఎస్ఎండీసీ– దేవాపూర్ (మంచిర్యాల), మైహోం – మెల్ల చెరువు,రైన్ సిమెంట్స్ – నల్గొండ సాగర్ సిమెంట్స్ – నల్గొండ -
AP: భారతి సిమెంట్‌కు 5 స్టార్ రేటింగ్
-
AP: భారతి సిమెంట్‌కు 5 స్టార్ రేటింగ్
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ నుంచి భారతి సిమెంట్ సంస్థకు మరో గౌరవం దక్కింది. తాజాగా ఫైవ్ స్టార్ రేటింగ్ జాతీయ అవార్డు ప్రకటించింది కేంద్రం. గనుల నిర్వహణలో అత్యుత్తమ ప్రమాణాలు పాటించినందుకు గానూ భారతి సిమెంట్‌కు ఈ అవార్డును అందజేస్తున్నట్లు కేంద్రం తెలిపింది. 2021-22 గనుల నిర్వహణలో 5 స్టార్ రేటింగ్‌ను ఇచ్చింది కేంద్రం. ఈ ఏడాది వెయ్యికి పైగా గనులు పోటీ పడగా.. అందులో ఫైవ్ స్టార్ రేటింగ్ దక్కించుకున్నవి కేవలం 40 మాత్రమే కావడం విశేషం. -
భారతి సిమెంట్ వితరణ
సాక్షి, కడప: ప్రస్తుత కరోనా కష్టకాలంలో బాధితులకు అండగా నిలిచేందుకు భారతి సిమెంట్ యాజమాన్యం ముందుకొచ్చింది. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా భారతి సిమెంట్ యాజమాన్యం వైద్య సేవలకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తోంది. వైఎస్సార్ జిల్లాలో కరోనాతో ఇబ్బందులు ఎదురవుతున్న ప్రస్తుత తరుణంలో ఆక్సిజన్ సమస్యపై కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ హరికిరణ్‌లు భారతి సిమెంట్ పరిశ్రమ డైరెక్టర్ జేజే రెడ్డి, కంపెనీ వైస్ ప్రెసిడెంట్ సాయి రమేష్‌లతో చర్చించారు. వెంటనే స్పందించిన యాజమాన్యం సుమారు రూ.60 లక్షల పైచిలుకు విలువజేసే ఆక్సిజన్ ట్యాంక్‌తో పాటు వైద్య పరికరాలను యుద్ధ ప్రాతిపదికన గుజరాత్ నుంచి తెప్పించి అప్పగించారు. గురువారం సాయంత్రం ఆక్సిజన్ ట్యాంక్ కడప రిమ్స్‌కు చేరుకుంది. ట్యాంక్‌తో పాటు వైద్య పరికరాలనూ సిద్ధం చేశారు. ఆస్పత్రుల్లో ఆక్సిజన్ కొరత వెంటాడుతున్న తరుణంలో ఆక్సిజన్ ట్యాంక్‌తో పాటు వైద్య పరికరాలు అందించడంపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. -
బిల్డర్స్ లాబీని అడ్డుకోండి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ‘భవన నిర్మాణ వ్యయంలో సిమెంటు పాత్ర అతి స్వల్పం. బిల్డర్లు 100 శాతానికిపైగా మార్జిన్లను ఉంచుకుని ఇళ్ల ధరలను నిర్ణయిస్తున్నారు. పైగా పెరిగిన ఇళ్ల ధరలకు సిమెంటు కంపెనీలను బాధ్యులను చేస్తున్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే బిల్డర్లు ఇలా ఆరోపణలు చేస్తున్నారు’ అంటూ సిమెంటు తయారీ సంస్థల ప్రతినిధులు ఘాటుగా స్పందించారు. కొత్తగా ఏర్పాటైన దక్షిణ భారత సిమెంట్ తయారీదారుల సంఘం మంగళవారం వర్చువల్‌గా మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. బిల్డర్స్ లాబీని అడ్డుకోవడానికి ప్రభుత్వం తగిన చర్యలను తీసుకోవాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశామని వారు వెల్లడించారు. ‘ప్రతి బిల్డర్ ధర విషయంలో పారదర్శకంగా ముందుకు రావడంతో పాటుగా ఇళ్ల ధరలను కనీసం 50% తగ్గించాల్సిందిగా కోరాలి. అదే రీతిలో చెక్ ద్వారా లావాదేవీలు జరపకపోతే తగిన చర్యలు తీసుకోవాలి’ అని లేఖ ద్వారా ప్రధానికి విన్నవించామన్నారు. సంఘం ప్రెసిడెంట్, ఇండియా సిమెంట్స్ వీసీ, ఎండీ ఎన్.శ్రీనివాసన్, వైస్ ప్రెసిడెంట్, భారతి సిమెంట్స్ మార్కెటింగ్ డైరెక్టర్ రవీందర్ రెడ్డి, సెక్రటరీ, పెన్నా సిమెంట్స్ డైరెక్టర్ కృష్ణ శ్రీవాస్తవ మీడియాతో మాట్లాడారు. లేఖలో వెల్లడించిన అంశాలు వారి మాటల్లోనే... సిమెంట్ తయారీ కేంద్రంగా..: అసలైన ఆత్మనిర్భర్ సాధించిన పరిశ్రమలలో సిమెంట్ రంగం ఒకటి. పరిమాణం పరంగా 500 మిలియన్ టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో భారత్ రెండవ స్థానంలో ఉంది. చైనా 2.5 బిలియన్ టన్నులతో అగ్రస్ధానంలో, యుఎస్ 70 మిలియ న్ టన్నులతో 3వ స్థానంలో ఉంది. దక్షిణాది రాష్ట్రాల్లోని కంపెనీల వార్షిక ఉత్పత్తి సామర్థ్యం ఏకంగా 200 మిలియన్ టన్నులకు చేరుకుంది. లైమ్‌స్టోన్ డిపాజిట్లతో కేవలం 7 రాష్ట్రాల్లోనే సిమెంట్ ఉత్పత్తి సాధ్యమవుతుంది. భారత్ లైమ్‌స్టోన్ నిల్వల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక మూడింట ఒకవంతు కలిగి ఉన్నా యి. భారత్‌తోపాటు ఎగుమతుల పరంగానూ భవిష్యత్‌లో సిమెంట్ కేంద్రంగా నిలిచే సామర్థ్యం దక్షిణాదికి ఉంది. కృత్రిమ ధరలతో విక్రయాలు..: సిమెంట్ పరిశ్రమకు తదనుగుణంగా భారతదేశపు వృద్ధికి సమస్యగా పరిణమిస్తున్నది గృహ రంగంలో వృద్ధి సానుకూలంగా లేకపోవడం. ఇందుకు ఏకైక కారణమేమిటంటే కృత్రిమంగా ఫ్లాట్స్, గృహాలను అధిక ధరలకు విక్రయిస్తుండటమే. క్రెడాయ్ మరియు బిల్డర్స్ అసోసియేషన్ పేరిట స్పష్టంగా బిల్డర్లతో కూడిన బృందం దీని కోసం పనిచేస్తోంది. వీరు ఏకంగా 100%కు పైగా మార్జిన్లును ఉంచుకుని ధరలను నిర్ణయిస్తున్నారు. ఎబిటా మార్జిన్ నిర్మాణ సంస్థలకు 35–50 శాతం ఉంటే, సిమెంటు కంపెనీలకు 15 శాతంలోపే ఉంది. దురదృష్టవశాత్తు అధికార యంత్రాంగ లాభదాయక విధానాల కోసమే పాటుపడుతున్న వీరిపై ఎలాంటి కఠినచర్యలనూ తీసుకోలేదు. కొనుగోలుదార్లకు ఫ్లాట్స్, గృహాలను సహేతుక ధరలో విక్రయిస్తే మనీ సర్క్యులేషన్ గణనీయంగా వృద్ధి చెందుతుంది. తద్వారా భారతీయ ఆర్ధిక వ్యవస్థ సైతం వృద్ధి చెంది ఉపాధి కల్పనకూ దోహద పడుతుంది. నిర్మాణ రంగం బాగుంటే సిమెంట్‌కు డిమాండ్ సైతం పెరుగుతుంది. నిర్మాణ వ్యయం కంటే అధికంగా.. ఓ ఫ్లాట్ ధరలో అత్యంత కీలకపాత్ర పోషించేది భూమి. చెన్నైలో అత్యధిక రేటు కలిగిన ప్రాంతంలో భూముల ధరలకు సంబంధించిన మార్గదర్శకాలను మేము పరిశీలించాము. అది చదరపు అడుగుకు రూ.10 వేలు. 2/2.4 ఎఫ్ఎస్ఐను తీసుకుంటే.. ఓ ఫ్లాట్‌లో అది చదరపు అడుగుకు సుమారు రూ.4,200 అవుతుంది. దీనికి నిర్మాణ ఖర్చు చదరపు అడుగుకు రూ.2,000–2,500 జోడిస్తే ఫ్లాట్ ఖర్చు గరిష్టంగా చదరపు అడుగుకు రూ.6,700 అవుతుంది. అయితే ఇక్కడ విక్రయ ధర చదరపు అడుగుకు రూ.15–20 వేలు ఉంది. అమ్ముడు కాకుండా అసాధారణ ఇన్వెంటరీ ఉంది. కానీ బిల్డర్స్ లాబీ మాత్రం ధరలను కొద్దిగా కూడా తగ్గడానికి అనుమతించడం లేదు. లక్షల్లో ఇన్వెంటరీ ఉన్నా.. దేశ వ్యాప్తంగా 9 ప్రధాన మార్కెట్లలోనే 75 లక్షల ఫ్లాట్స్ అమ్ముడు కాకుండా ఉన్నట్లు అంచనా. దీనిలో అసంపూర్తిగా నిర్మితమైన ఫ్లాట్స్‌ను మినహాయించడం జరిగింది. ఒకవేళ బిల్డర్లు తమ ధరలను తగ్గించుకుంటే ఈ మొత్తం అమ్ముడవుతుంది. రియల్టీ డిమాండ్ కూడా పెరుగుతుంది. మధ్య తరగతి, అల్పాదాయ వర్గాలకు ఓ గూడు కూడా లభ్యమవుతుంది. బిల్డర్లు ఇప్పుడు ప్రధానమంత్రి అందుబాటు గృహ పథక ప్రయోజనాలను పొందడమే కాదు.. ప్రజలకు ఈ లబ్ధి అందించేందుకు సైతం నిరాకరిస్తున్నారు. ఎవరైనా దీని గురించి ప్రశ్నిస్తే పెరిగిన ఇన్పుట్ ధరలు మరీ ముఖ్యంగా సిమెంట్ గురించి చెబుతుంటారు. కానీ ఒక చదరపు అడుగు నిర్మించడానికి అరబ్యాగు సిమెంట్ మాత్రమే ఖర్చవుతుంది. విక్రయ ధరలో సిమెంట్ వాటా కేవలం 1.5–2 శాతం మాత్రమే. ఒకవేళ బస్తాకు రూ.100 సిమెంట్ ధర పెరిగినా నిర్మాణ ఖర్చు అడుగుకు రూ.50 మాత్రమే అధికం అవుతుంది. -
వరద భాదితులకు భారతి సిమెంట్స్ సాయం
-
సీఎం సహాయనిధికి భారతి సిమెంట్స్ రూ. 5 కోట్ల విరాళం
-
భారతీ సిమెంట్స్‌పై తాపీ మేస్త్రీలకు అవగాహన సదస్సు
-
ఇంత దిగజారుడు రాజకీయమా?
-
తొలిసారిగా రీజినల్ యాడ్ ఏజెన్సీలకు అవార్డ్స్
-
భారతీ సిమెంట్స్ డైరెక్టర్ ఇంట పెళ్లి సందడి
-
భారతి సిమెంట్స్ తరఫున బాలాజీని అనుమతించలేం: సీబీఐ కోర్టు
వైఎస్ జగన్మోహన్రెడ్డి కంపెనీల్లో దాల్మియా సిమెంట్స్ పెట్టుబడులకు సంబంధించిన కేసులో నిందితుల జాబితాలోనున్న భారతి సిమెంట్స్ (రఘురామ్స్) తరఫున ఆ కంపెనీ ఫైనాన్షియల్ డెరైక్టర్ బాలాజీ కోర్టు విచారణకు హాజరయ్యేందుకు అనుమతించలేమని సీబీఐ ప్రత్యేక కోర్టు స్పష్టం చేసింది. భారతి సిమెంట్స్ అధినేత హోదాలో వైఎస్ జగన్‌ను సీబీఐ నిందితునిగా చేర్చింది. అయితే ఇతర చార్జిషీట్లలో భారతి సిమెంట్స్ ఫైనాన్షియల్ డెరైక్టర్ బాలాజీ హాజరుకు ఇదే కోర్టు అనుమతించిందని, ఈ నేపథ్యంలో ఈ చార్జిషీట్లోనూ కోర్టు విచారణకు బాలాజీ హాజరుకు అనుమతించాలని భారతి సిమెంట్స్ న్యాయవాది విన్నవించారు. ఇందుకు సీబీఐ అభ్యంతరం తెలిపింది. బాలాజీ తమ తరఫున సాక్షిగా ఉన్న నేపథ్యంలో భారతి సిమెంట్స్ ప్రతినిధిగా ఆయన హాజరుకు అనుమతించరాదని కోర్టును కోరింది. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయమూర్తి యు.దుర్గాప్రసాద్‌రావు... భారతి సిమెంట్స్ తరఫున బాలాజీ హాజరుకు అనుమతించలేమని స్పష్టం చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. -
ఈశ్వర ఉపాసన.. మానవ కర్తవ్యం
కొరుక్కుపేట (చిత్తూరు), న్యూస్‌లైన్: ఈశ్వర ఉపాసన చేయడమే మానవ కర్తవ్యమని, అప్పుడే జీవించడానికి కావాల్సిన సర్వశక్తులూ లభిస్తాయని బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ అన్నారు. ఋషి పీఠం చారిటబుల్ ట్రస్ట్, శర్వాణీ సంగీత సభ, భారతీ సిమెంట్స్ సంయుక్త ఆధ్వర్యంలో బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ ఆధ్వర్యంలో మహాభారతంలో శివలీల అనే అంశంపై ఆథ్యాత్మిక ఉపన్యాస కార్యక్రమం జరుగుతోంది. ఇందులో భాగంగా శ్రీ రామకృష్ణ మిషన్ మెట్రిక్ హైయర్ సెకండరీ స్కూల్ శ్రీ శారదా భవన్ హాల్(ఇన్ఫోసిస్ హాల్)లో చివరిరోజు బుధవారం ఆథ్యాత్మిక ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా శివనామ స్మరణతో ప్రారంభమైన ప్రవచన కార్యక్రమంలో బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ.. ద్రోణ పర్వం, సాత్విక పర్వం, సైందవ వధ, అర్జణుడి శిబిరంలో కృష్ణ పరమాత్మ వచ్చే సన్నివేశం, కృష్ణ పరమాత్మ అవతార ధర్మాన్ని వివరించటం తదితర అంశాలపై ఆథ్యాత్మిక ప్రసంగం చేశారు. సర్వలోకాలకూ అధిపతి అయిన ఈశ్వరుడి ఉపన్యాసం చేయటం ద్వారా మానవులు జీవించడానికి కావాల్సిన సర్వశక్తులూ అందుతాయన్నారు. కొంత మంది శివుడు, విష్ణువులను పూజించకూడదని చెబుతుంటురాని, ఇది చాలా తప్పు అని చెప్పారు. ఋషులు, యోగుల ద్వారానే దివ్య విద్యలు కాపాడబడుతున్నాయని, ప్రపంచం అంతా వీరి ద్వారానే రక్షించపబడుతోందని వివరించారు. తల్లిదండ్రులు తమ పిల్లల్లో ఆథ్యాత్మిక చింతనను పెంపొందించాలని, అప్పుడే వారి జీవితానికి సార్థకతగా చేకూరుతుందని బోధించారు. కార్యక్రమంలో ముందుగా ఉషా హరిహరన్ బృందంచే నామసంకీర్తన జరిగింది. ఆథ్యాత్మిక ప్రవచనం అనంతరం ఈ కార్యక్రమంలో తెలుగు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మకు చెన్నై టీటీడీ వేద పండితులు వేద ఆశీర్వరచనాలను అందజేసి సత్కరించారు. కార్యక్రమంలో వ్యాఖ్యాతగా కేసరి మహోన్నత పాఠశాల మైలాపూర్ ప్రధానోపాధ్యాలు శ్రీనివాసులు వ్యవహరించారు. తెలుగు ప్రముఖులు ఉపద్రిష్ట నరసింగమూర్తి తదితరులు పాల్గొన్నారు.