mine
-
రూ.5,900 కోట్ల విలువైన బిట్కాయిన్లు చెత్తకుప్ప పాలు!
లండన్: అనగనగా ఒక పాత హార్డ్‌డ్రైవ్. బ్రిటన్‌కు చెందిన 39 ఏళ్ల జేమ్స్ హావెల్స్ అనే వ్యక్తి క్రిప్టోకరెన్సీ తొలినాళ్లలో అంటే 2009 ఏడాదిలో 8,000 బిట్కాయిన్లను మైనింగ్ చేశాడు. వాటికి సంబంధించిన డిజిటల్ కీని ఆ పాత హార్డ్‌డ్రైవ్‌లో దాచి ఉంచాడు. అయితే అది తర్వాత కనిపించకుండా పోయింది. తన ప్రియురాలు హఫీనా ఎడీ ఎవాన్స్‌తో కలిసి ఈ హార్డ్‌డ్రైవ్ కోసం వేట మొదలెట్టాడు. అది కనిపించట్లేదని ఫిర్యాదు కూడా చేశాడు. అయితే అది 2013 ఏడాదిదాకా ఇంట్లోనే ఒక గదిలో సొరుగులో ఉండిపోయింది. అయితే 2013లో ఇంటిని ప్రియురాలు హఫీనా శుభ్రంచేస్తుండగా పాత కంప్యూటర్ విడిభాగాలున్న ఒక పాత నల్ల సంచి కనిపించింది. దీనిని పడేయాలా? అని జేమ్స్‌ను హఫీనా అడగ్గా అవసరం లేదు పడేసెయ్ అని చెప్పాడు. దీంతో బయటికెళ్తూ దారిలో ఉన్న చెత్తకుప్పలో దానిని పడేసి వెళ్లిపోయింది. తర్వాత ఇద్దరూ దాని కోసం వేట కొనసాగించారు. అయితే తాజా దర్యాప్తులో.. ఆమె గతంలో పడేసిన సంచిలోనే హార్డ్‌వేర్ ఉందని తాజాగా వెల్లడైంది. హార్డ్‌వేర్‌లోని డిజిటల్ కీ సాయంతో అందుబాటులోకి వచ్చే 8,000 బిట్కాయిన్ల ప్రస్తుత మార్కెట్ విలువ ఏకంగా రూ.5,900 కోట్లు కావడం గమనార్హం. విషయం తెల్సి హఫీనా హుతాశురాలైంది. ప్రస్తుతం వీళ్లిద్దరూ విడిపోయారు. ‘‘జేమ్స్ సంపదను తెలీకుండా చెత్తపాలు చేశాను. దాని కోసం అతను పడుతున్న వేదనను చూడలేకపోతున్నా’’అని తాజాగా హఫీనా వాపోయారు. హఫీనా పడేసిన చెత్తకుప్పలోని వ్యర్థ్యాలు సాధారణంగా వేల్స్‌లోని న్యూపోర్ట్‌లో ఉన్న డాక్స్వే భారీ డంపింగ్ యార్డ్‌కు చేరుకుంటాయి. అక్కడ ఏకంగా 14,00,000 టన్నుల చెత్తకుప్ప కొండ ఉంది. అందులో ఎలాగైనా తన హార్డ్‌డ్రైవ్‌ను తిరిగి సంపాదిస్తానని జేమ్స్ బయల్దేరారు. అయితే అంత చెత్తను కింది నుంచి మొత్తం తిరగతోడితే కాలుష్యం పెరిగి చుట్టుపక్కల ప్రాంతాల్లో పర్యావరణ సమస్యలు వస్తాయని న్యూపోర్ట్ సిటీ కౌన్సిల్ ససేమిరా అంటోంది. యార్డ్‌లోకి అతనికి అనుమతి నిరాకరించింది. దీంతో జేమ్స్ కోర్టును ఆశ్రయించాడు. మొత్తం గాలించి హార్డ్‌డ్రైవ్ దొరికితే కుబేరుడినయ్యాక సంపదలో 10 శాతాన్ని న్యూపోర్ట్ అభివృద్ధికి కేటాయిస్తానని, నగరాన్ని దుబాయ్, లాస్ వెగాస్ సిటీలా తీర్చిదిద్దుతానని కోర్టుకు విన్నవించుకున్నాడు. ఈ అంశాన్ని డిసెంబర్లో విచారిస్తామంటూ ఈ కేసును కోర్టు వాయిదావేసింది. -
5 స్టార్ రేటింగ్ కంపెనీగా ‘భారతి సిమెంట్స్ లైమ్ స్టోన్ మైన్’
సాక్షి, న్యూఢిల్లీ: కడపలోని ‘భారతి సిమెంట్స్ లైమ్ స్టోన్ మైన్’కు ఆరోసారి అత్యంత ప్రతిష్టాత్మకమైన 5 స్టార్ రేటింగ్ లభించింది. పర్యావరణ పరిరక్షణ, విద్య, వైద్యం, పరిశుభ్రత, ఇన్ఫ్రాస్ట్రక్చర్, డిజాస్టర్ మేనేజ్మెంట్ తదితర అంశాల్లో స్థానికంగా చేసిన కృషికి భారతి సిమెంట్స్ లైమ్ స్టోన్ మైన్‌కు కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డు అందజేసింది. గనుల రంగంలో సుస్థిరాభివృద్ధి విధానాలు అమలుచేస్తూ పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్న 68 మైనింగ్ సంస్థలకు కేంద్రం 2022–23 సంవత్సరానికి ఈ అవార్డులు అందజేసింది.ఆంధ్రప్రదేశ్ నుంచి 5, తెలంగాణ నుంచి 5 సంస్థలు ఈ అవార్డులు అందుకున్నాయి. బుధవారం ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి ఈ అవార్డులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. వచ్చే ఏడాది 7 ఉత్తమ సంస్థలకు 7 స్టార్ రేటింగ్స్ కూడా ఇస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర బొగ్గు గనుల శాఖ సహాయ మంత్రి సతీశ్‌చంద్ర దూబే, గనుల శాఖ కార్యదర్శి వీఎల్ కాంతారావు, అదనపు కార్యదర్శి లోహియా, ఐబీఎం సెక్రటరీ జనరల్ పీఎన్ శర్మ, అవార్డులు సాధించిన సంస్థల ప్రతినిధులు, మైనింగ్ రంగ ప్రముఖులు పాల్గొన్నారు. ఏపీ నుంచి అవార్డు అందుకున్న సంస్థలుభారతి సిమెంట్స్ లైమ్ స్టోన్ మైన్ – కడపజేఎస్డబ్ల్యూ సిమెంట్స్ లైమ్ స్టోన్ – నంద్యాలదాల్మియా సిమెంట్స్ నవాబ్‌పేట – తలమంచిపట్నంఅల్ట్రాటెక్ – తుమ్మలపెంటశ్రీ జయజ్యోతి (మైహోం) సిమెంట్స్ – కర్నూలుతెలంగాణ నుంచి అవార్డు అందుకున్న కంపెనీలుమైహోం – చౌటుపల్లి–1,టీఎస్ఎండీసీ– దేవాపూర్ (మంచిర్యాల), మైహోం – మెల్ల చెరువు,రైన్ సిమెంట్స్ – నల్గొండ సాగర్ సిమెంట్స్ – నల్గొండ -
గనిలో చిక్కుకున్న 14 మంది అధికారులు.. కొనసాగుతున్న సహాయక చర్యలు!
రాజస్థాన్‌లోని నీమ్ కా థానా జిల్లాలో మంగళవారం రాత్రి హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్‌లో ప్రమాదం సంభవించింది. సంస్థకు చెందిన 14 మంది అధికారులు, విజిలెన్స్ బృందం సభ్యులు గనిలో చిక్కుకున్నారు.ఉద్యోగులను గని లోపలికి, బయటికి తరలించేందుకు ఉపయోగించే వర్టికల్ షాఫ్ట్ పనిచేయకపోవడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మైనింగ్ అధికారి ఒకరు తెలిపిన వివరాల ప్రకారం గనిలో చిక్కుకున్న అధికారులను బయటకు తీసుకువచ్చే పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కోలిహన్ గని వద్ద విజిలెన్స్ బృందం కంపెనీ సీనియర్ అధికారులతో కలిసి తనిఖీలు చేసేందుకు వందల మీటర్ల మేర గనిలోకి దిగింది. వారు పైకి వస్తున్న సమయంలో షాఫ్ట్ (కేజ్) వైర్ తెగిపోయింది. దీంతో గని లోపల తనిఖీ చేయడానికి వెళ్లిన 14 మంది అధికారులు లోపలే చిక్కుకుపోయారు.సమాచారం అందుకున్న వెంటనే ఖేత్రికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే ధరంపాల్ గుర్జార్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటనా స్థలంలో పలువురు అధికారులతో పాటు ఏడు అంబులెన్స్‌లు ఉన్నాయి. అధికారులను బయటకు తీసుకువచ్చే పనిలో రెస్క్యూ టీమ్ నిమగ్నమైంది. ప్రస్తుతానికి ప్రాణనష్టం గురించి ఎలాంటి సమాచారం లేదు. -
ఒకప్పుడు అది ఉప్పుగని!
రుమేనియా క్లజ్ కౌంటీలోని టుర్డా నగరంలో ఉన్న భూగర్భ థీమ్‌పార్కు ఒకప్పుడు ఉప్పుగని. పురాతన రోమన్ సామ్రాజ్యంలో సహజమైన ఉప్పు నిక్షేపాలు ఉన్న ఈ చోట 1217లో ఉప్పును వెలికి తీసేందుకు గని తవ్వకాలు మొదలుపెట్టారు. ప్రపంచంలోని అత్యంత పురాతనమైన ఉప్పు గనుల్లో ఇదొకటి. శతాబ్దాల తరబడి ఇక్కడి నుంచి ఉప్పు సేకరించేవారు. ఇందులోని ఉప్పు నిల్వలు అంతరించిపోయాక చాలాకాలం ఖాళీగా మిగిలింది. పాడుబడిన దశలో ఉన్న ఈ గనిలో 120 మీటర్ల లోతున 2010లో ఒక థీమ్‌పార్కును ఏర్పాటు చేశారు. జెయింట్ వీల్, ఫెర్రీవీల్, టేబుల్ టెన్నిస్, బిలియర్డ్స్ వంటి క్రీడా వినోదాల కోసం ఏర్పాట్లు చేశారు. అప్పటి నుంచి ఈ భూగర్భ థీమ్‌పార్కు పర్యాటక ఆకర్షణగా మారింది. రుమేనియా స్థానికులతో పాటు ఇక్కడకు వచ్చే విదేశీ పర్యాటకులు కూడా పెద్దసంఖ్యలో ఇక్కడకు వస్తుంటారు. ప్రపంచంలో భూగర్భంలో ఏర్పాటు చేసిన తొలి థీమ్‌పార్కు ఇదే కావడం విశేషం. (చదవండి: తవ్వకాల్లో అరుదైన సమాధి..లోపల దృశ్యం చూసి కంగుతిన్న శాస్త్రవేత్తలు!) -
గెలాక్సీ గ్రానైట్‌లో ప్లాటినం
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: ఎంతో ప్రఖ్యాతిగాంచిన గెలాక్సీ గ్రానైట్‌లో అత్యంత విలువైన ప్లాటినం నిక్షిప్తమై ఉంది. విభిన్న రంగాలకు ఎంతో ఉపయుక్తమైన ఈ ఖనిజం ప్రకాశం జిల్లా చీమకుర్తిలో లభ్యమవుతున్న గెలాక్సీ గ్రానైట్‌లో మిళితమై ఉందని భూగర్భ శాస్త్రవేత్తలు ఇప్పటికే గుర్తించారు. జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) లాంటి కేంద్ర సంస్థలు పరిశోధనలు నిర్వహించి ప్లాటినం లభ్యత ఏ స్థాయిలో ఉందనేది నిర్ధారిస్తే ప్రభుత్వానికి ఖనిజాదాయం పెరుగుతుంది. చీమకుర్తి మండలం రామతీర్థం పరిసరాల్లో 500 హెక్టార్లకు పైగా విస్తీర్ణంలో గెలాక్సీ గ్రానైట్ నిక్షిప్తమై ఉన్న సంగతి తెలిసిందే. గ్రానైట్ వెలికితీతకు ప్రభుత్వాలు 136 లీజులను మంజూరు చేయగా 32 మందికి పైగా లీజుదారులు 139 క్వారీలను నడుపుతూ గ్రానైట్ బ్లాక్‌లను తీస్తున్నారు. విభిన్న కారణాలరీత్యా పలు క్వారీల నుంచి బ్లాక్‌లు ఆశించిన స్థాయిలో రావడంలేదు. దాదాపు మూడు దశాబ్దాలుగా నడుస్తున్న ఈ క్వారీలకు సంబంధించిన డంప్‌లు సుమారు 200 హెక్టార్లకు విస్తరించాయి. ఈ డంప్‌ల్లో 200 కోట్ల టన్నులకు పైగా గ్రానైట్ వేస్ట్ ఉంటుందనేది అంచనా. దక్షిణాఫ్రికాలో 80 శాతం వరకు... ప్రపంచంలో అత్యధికంగా దక్షిణాఫ్రికాలోని సుర్బురి బేసిన్లో 80 శాతం వరకు ప్లాటినం నిల్వలు ఉండగా, రష్యాలోని యురల్ పర్వత శ్రేణులు, అమెరికా, జింబాబ్వే, ఆస్ట్రేలియాలోనూ ఇది లభిస్తోంది. మన దేశంలో కర్ణాటకలోని హుట్టి బంగారు గనుల దిగువన, ఒడిశాలోని బౌలా–నౌషాహిలలో, తమిళనాడులోని సీతంపూడి గనులు, ఛత్తీస్గడ్, మహారాష్ట్ర, కేరళ తదితర రాష్ట్రాల్లోనూ ‘ప్లాటినం గ్రూప్ ఆఫ్ మెటల్స్ (పీజీఎం)’ లభ్యతను నిర్ధారిస్తూ పదేళ్ల కిందటే జీఎస్ఐతో సహా ఇతర కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు తమ పరిశోధనల ఫలితాలను వెల్లడించాయి. ఎన్నెన్నో ప్రయోజనాలు.. నిజానికి.. ప్లాటినం, పల్లాడియం, ఇరిడియం, రోడియం, రుథేనియం, ఓస్మియం ఖనిజాల మిళితాన్ని ‘ప్లాటినం గ్రూప్ ఆఫ్ మెటల్స్ (పీజీఎం)’ అంటారు. ఈ ఆరు ఖనిజాలు భౌతిక, రసాయనిక గుణాల సారూప్యతను కలిగి ఉంటాయి. ఈ ఖనిజాల సమ్మిళితాన్ని ఇరిడియం, ప్లాటినం సబ్ గ్రూపులుగా విభజిస్తారు. ప్లాటినం, పల్లాడియం, రోడియం ఖనిజాలు శాస్త్ర సాంకేతిక, ఆరోగ్య రంగాలకు ఎంతగానో ఉపయుక్తమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అలాగే.. పెట్రోలియం రిఫైనరీ, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ ఇండస్ట్రీ (యాంటీ పొల్యూషన్ డివైజస్), ఫార్మాసూ్యటికల్స్, గ్లాస్, ఫెర్టిలైజర్స్, ఎక్స్పో్లజివ్స్, లాబ్స్ పరికరాల తయారీలో ప్లాటినం ఎంతగానో ఉపయోగపడుతుంది. జ్యువెలరీ రంగంలో ప్లాటినానిది ప్రత్యేక స్థానం. బంగారం, వెండి, రాగి లోహాలతో కూడిన అలంకరణ వస్తువుల తయారీలోనూ వినియోగిస్తారు. వైద్య రంగానికి సంబం«ధించి క్యాన్సర్ చికిత్సలో ప్లాటినం గ్రూప్ ఆఫ్ మెటల్స్ కీమోథెరపీకి ప్రాథమికంగా ఉపయోగపడతాయి. పేస్‌మేకర్ తయారీకి, (డెంటిస్టరీ.. దంతసంబంధ వైద్యం) ఎగుడు దిగుడు దంతాలు, ఎత్తు దంతాలను సరిచేసి వాటిని ఒకేరీతిన అమర్చి అందాన్ని ఇనుమడింపజేయడంలోనూ ప్లాటినానిది ప్రధానపాత్ర. ఇక ప్లాటినం– ఇరిడియంలను బయోమెడికల్ పరికరాల తయారీకి విరివిగా వినియోగిస్తారు. ప్లాటినం–రోడియం కలిసిన ఖనిజాలు ఫ్లాట్ స్క్రీన్ టెలివిజన్, కంప్యూటర్ మోనిటర్, హార్డ్‌డిస్క్‌లు, సెల్ఫోన్లు, డిజిటల్ కెమెరాలు, డిస్ప్లే ప్యానల్స్, ఆటోమొబైల్ డిస్ప్లేల తయారీకి ఉపయోగపడతాయి. వంద గ్రాములు రూ.2.37 లక్షలు.. ప్లాటినం ధర కూడా ఎక్కువే. పలు సందర్భాలలో బంగారం ధరతో పోటీపడుతుంది. ప్రస్తుతం మార్కెట్లో ఒక గ్రాము ప్లాటినం ధర రూ.2,374లు. వంద గ్రాములు రూ.2.37 లక్షలకు పైగా పలుకుతోంది. ఆభరణాల తయారీ, అలంకరణలకు ప్లాటినం పెట్టింది పేరు. గ్రానైట్ డంప్‌ల నుంచి.. చీమకుర్తి గ్రానైట్‌లో ప్లాటినం ఉందనేది నిర్ధారితమైనందున ఇందులో ప్లాటినం సమ్మిళితాలు ఎంతశాతం.. ఎంతమేరకు లాభదాయకమనే స్పష్టత కోసం తదుపరి పరిశోధనలు నిర్వహించాలని గనుల శాఖ కేంద్ర ప్రభుత్వ సంస్థలను కోరాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర విభజన జరగకముందు వరకు జీఎస్ఐ, ఓఎన్జీసీ, ఎన్జిఆర్ఐ, ఎన్ఎండీసీ, ఎంఇఎల్ఎల్ (మినరల్ ఎక్స్ల్పిరేషన్ కంపెనీ లిమిటెడ్), ఏఎండీ (అటావిుక్ మినరల్ డివిజన్), ఐబీఎం (ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్) తదితర కేంద్ర సంస్థలతో పాటు రాష్ట్ర పరిధిలోని అటవీ, జలవనరులు తదితర శాఖలతో సంయుక్తంగా స్టేట్ జియలాజికల్ ప్రోగ్రామింగ్ బోర్డు సమావేశాలు జరిగేవి. ఈ సందర్భంగా.. రాష్ట్రంలో తమకు కావాల్సిన సర్వేలు చేయాలని మైనింగ్ విభాగాలు కోరడంతో పాటు కేంద్ర సంస్థలు నిర్వహించిన ఖనిజాన్వేషణ నివేదికలను పొందేవి. తద్వారా మైనింగ్ రంగంలో ఏ రీతిన పురోగతి సాధించాలి, ఆదాయ సముపార్జన మార్గాల ప్రణాళిక సాధ్యమవుతుంది. ఇందులో భాగంగానే చీమకుర్తిలోని డంప్‌ల్లోని దాదాపు 200 కోట్ల టన్నుల గ్రానైట్ వేస్ట్‌ను ప్రాసెస్ చేయడానికి సాధ్యాసాధ్యాలపై దృష్టిసారించాలని నిపుణులు సూచిస్తున్నారు. -
ఘోర గని ప్రమాదం.. ఆరుగురు మృతి.. 47 మంది ఆచూకీ గల్లంతు..
బీజింగ్: చైనాలోని ఇన్నర్ మంగోలియా ప్రాంతంలోని అల్గ్జా లీగ్ గని కూలిన ఘటనలో మృతుల సంఖ్య ఆరుకు చేరింది. మరో 47 మంది జాడ తెలియాల్సి ఉందని చైనా అధికార వార్తాసంస్థ గురువారం తెలిపింది. భారీగా మట్టిచరియలు విరిగిపడటంతో బుధవారం ఆగిపోయిన సహాయక చర్యలను గురువారం తిరిగి ప్రారంభించారు. ఇప్పటివరకు ఐదుగురు చనిపోయినట్లు ధ్రువీకరించారు. గాయపడిన ఆరుగురిని ఆస్పత్రికి తరలించారు. 47 మంది జాడ గుర్తించాల్సి ఉంది. ఇటీవలికాలంలో చైనాలో గని ప్రమాదాలు సర్వసాధారణంగా మారాయి. గత ఏడాది జరిగిన 367 గని ప్రమాద ఘటనల్లో 518 మంది చనిపోయినట్లు సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ కథనం వెల్లడించింది. చదవండి: అమెరికాలో భీకర మంచు తుపాను -
గోదావరిఖని.. ఇక పర్యాటక గని!
గోదావరిఖని: పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పర్యాటక శోభను సంతరించుకుంటోంది. మూతపడిన జీడీకే 7 ఎల్ఈపీ గనికి సింగరేణి అధికారులు కొత్తరూపు ఇస్తున్నారు. పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతున్నారు. మరోవైపు సింగరేణి టూరిజం ప్యాకేజీని టీఎస్ ఆర్టీసీ ప్రవేశపెట్టడంతో ఈ నెల 27 నుంచే పర్యాటకులు ఇక్కడకు రానున్నట్లు తెలుస్తోంది. సింగరేణి డైరెక్టర్(పా) చంద్రశేఖర్ మూడు ఏరియా జీఎంలు కె.నారాయణ, ఎ.మనోహర్, టి.వెంకటేశ్వర్రావుతో కలిసి 7 ఎల్ఈïపీ గనిని సందర్శించారు. సంస్థ సీఎండీ శ్రీధర్ ఆదేశాల మేరకు పర్యాటకులను ఆకట్టుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. సింగరేణి బొగ్గు గనులు అంటే అందరికీ తెలిసినప్పటికీ భూగర్భ గనిలోకి కార్మికులు ఎలా వెళ్తారు..? ఉత్పత్తి ఎలా తీస్తారు..? రక్షణ చర్యలు ఎలా ఉంటాయి..? ఇలా అనేక సందేహాలను పర్యాటకులకు నివృత్తి చేసేలా సింగరేణి చర్యలు తీసుకుంటోంది. దేశంలోనే మొదటిసారిగా సింగరేణి సహకారంతో ఆర్టీసీ టూరిజం ప్యాకేజీ సిద్ధం చేస్తోంది. ఇటీవల రామగుండంకు వచ్చిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆర్జీ–2 ఏరియాలోని వకీల్‌పల్లి గనిని కుటుంబసభ్యులతో సందర్శించారు. బొగ్గు గనులు, ఇక్కడి ప్రాజెక్టులతో కలిపి ఆర్టీసీ టూరిజం ప్యాకేజీ చేస్తే బాగుంటుందని ప్రకటించిన ఆయన ప్యాకేజీకి సహకరించాలని సింగరేణికి లేఖ రాశారు. సింగరేణి బొగ్గు గని, ఓసీపీ, పవర్ ప్లాంట్‌తోపాటు రాబోయే రోజుల్లో పార్వతీ బ్యారేజీ, కాళేశ్వరంలోని ముక్తీశ్వరాలయం, కాళేశ్వరం ప్రాజెక్టు వంటి పర్యాటకస్థలాలను పొందుపర్చనున్నట్లు చెప్పారు. ఈ మేరకు సీఎండీ శ్రీధర్‌కు లేఖ రాయడంతో టూరిజం ప్యాకేజీ పనుల్లో వేగం పెరిగింది. టూర్ ఇలా.. హైదరాబాద్ నుంచి బయల్దేరే టూరిస్టులు మార్గమధ్యంలో లోయర్ మానేర్ డ్యాం సందర్శిస్తారు. ళీ అక్కడి నుంచి జీడీకే–7 ఎల్ఈపీ గనికి చేరుకుంటారు. అక్కడ సింగరేణి ఏర్పాటు చేసిన ప్రొజెక్టర్ ద్వారా సంస్థ పనితీరు, బొగ్గు ఉత్పత్తి, కార్మికుల సంక్షేమం, రక్షణ చర్యల గురించి వివరిస్తారు. ళీ ఇందుకు యైటింక్లయిన్ కాలనీలోని మెయిన్ రెస్క్యూ స్టేషన్‌కు పర్యాటకులను తీసుకెళ్తారు. ళీ అక్కడ భోజనాలు ముగిసిన తర్వాత ఓసీపీ–3 వ్యూపాయింట్ నుంచి మధ్యాహ్నం 3.30 గంటలకు ఓసీపీ–3లో జరిగే బ్లాస్టింగ్ చూపిస్తారు. ళీ అక్కడి నుంచి సింగరేణి థర్మల్ ప్లాంట్‌కు తీసుకెళ్లి విద్యుదుత్పత్తి తీరును వివరిస్తారు. -
సింగరేణి గనిలో కూలిన బండ
సింగరేణి (కొత్తగూడెం): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం సింగరేణి ఏరియా పరిధిలోని పీకేకే 5 షాప్ట్ గనిలో శనివారం బండ కూలింది. మొదటి షిప్ట్‌లో 36 డిప్, 121 లెవల్లో సీఎమ్మార్తో బొగ్గు ఉత్పత్తి జరుగుతున్న సమయంలో మూడు మీటర్ల బండ కంటిన్యూస్ మైనర్(సీఎమ్మార్) యంత్రంపై పడింది. ఈ ఘటనలో యంత్రం కొంతమేర దెబ్బతింది. యంత్రంపై మాత్రమే బండ పడటంతో పెనుప్రమాదం తప్పినట్లయింది. సీఎమ్మార్ మరమ్మతు పనులు పూర్తయ్యేందుకు నాలుగు రోజుల సమయం పట్టనుండటంతో అప్పటివరకు బొగ్గు ఉత్పత్తి నిలిచిపోనుంది. కాగా, తరచుగా బండ కూలే ఘటనలు పునరావృతం అవుతుండటంతో కార్మి కుల్లో ఆందోళన నెలకొంది. -
జీడీకే–10 గని మూసివేత
సాక్షి, రామగిరి(మంథని): సింగరేణి సంస్థలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన జీడీకే–10 గనిని మూసివేయాలని యాజమాన్యం నిర్ణయించింది. గత ఏడాది డిసెంబర్లోనే 10వ గనిని మూసివేయా లని యాజమాన్యం భావించినప్పటికి అనేక కారణాల వల్ల ఆ ప్రక్రియ ఆగిపోయి.. ఈ ఏడాది మార్చి వరకు యాజమాన్యం గడువు పెంచింది. గనిలో బొగ్గు ఉత్పత్తి చేయాలంటే ముఖ్యంగా కోల్కట్టర్స్, సపోర్ట్మెన్లు కావల్సి ఉంటుంది. అయితే సంస్థలో కొత్తగా కార్మికుల నియామకాలు లేకపోవడంతో పాటు ఉత్పత్తి వ్యయం పెరిగిపోవడం గని మూసివేతకు కారణంగా తెలుస్తోంది. 520 మంది కార్మికుల బదిలీ.. 1976లో స్థాపించిన జీడీకే–10ఇంక్లైన్(గని) తనకు కేటాయించిన ఉత్పత్తి లక్ష్యాన్ని సాధిస్తూ.. ఎంతో మందికి ఉపాధి అందించి.. బంగారు గనిగా పేరొందింది. యావత్ సింగరేణిలో మొట్టమొదటి బీజీ(బ్లాసింగ్ గ్యాలరీ)ప్యానల్ ఏర్పాటు చేసిన 10వ గనిలో బొగ్గు ఉత్పత్తి కోసం ఖర్చులు అధికం కావడంతో గనిని మూసివేయాలనే యాజమా న్యం నిర్ణయించింది. ఇప్పటికే గనిలో పని చేస్తున్న సుమారు సుమారు 520 మంది కార్మికులను బది లీ చేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. వారికి ఇష్టమైన ప్రాంతాలకు బదిలీ చేసేందుకు దరఖాస్తులు చేసుకోవాలని ఉత్తర్వు లు జారీ చేశారు. ఈ మేరకు వీరిలో 157 మంది కార్మికులు ఆర్జీ3 పరిధిలోని ఓసీపీ1, ఓసీపీ 2 గనులకు బది లీ కోసం దరఖాస్తులు చేసుకున్నా రు. మిగిలిన వారు వివిధ ఏరియాలకు బదిలీ కోసం దరఖాస్తు పెట్టుకున్నారు. గనిలో ప్రస్తుతం ఉన్న 180 మంది కార్మికులు ఉన్నారు. గని లోపల డ్యామ్ నిర్మాణం, యంత్రాల తరలింపునకు అవసరం మేరకు కార్మి కులను ఇక్కడే ఉంచుకుని మిగిలిన కార్మికులను వివిధ గనులకు యాజమాన్యం బదిలీ చేస్తోంది. భూగర్భంలోని నాలుగు పొరల్లో ఉన్న బొగ్గు నిక్షేపాలను వెలికి తీయడం కోసం 1989లో యావత్ సింగరేణిలోనే మొట్టమొదటి సారిగా ఈ గనిలో బీజీ ప్యానల్ ఏర్పాటు చేశారు. అనేక ఒడిదొడుకులను ఎదు ర్కొని నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యాన్ని గని సాధించింది. ఈ క్రమంలో గనిలో వర్క్స్పాట్(పని స్థలం)దూరం పెరింగింది. దాదాపు 250 మీటర్ల లోతులో ఉన్న బొగ్గును ఉత్పత్తి చేసేందుకు మ్యాన్ వైడింగ్ షాప్టును ఏర్పా టు చేశారు. అయితే పనిస్థలం దూరంగా ఉండటంతో ఆశించినస్థాయిలో ఉత్పత్తి జరగడం లేదు. దీంతో నష్టాలను చవిచూడాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో ఈ గనిని ఆర్జీ3 పరిధి లోని ఓపీసీ1కు అప్పగించాలని యాజమాన్యం నిర్ణయించింది. పెరగనున్న ఓసీపీ–1 జీవితకాలం.. జీడీకే–10 గనిని మూసివేసి ఆర్జీ –3 పరిధిలోని ఓసీపీ–1కు అప్పగించాలని యాజమాన్యం నిర్ణయించింది. దీంతో ఓసీపీ–1 జీవితకాలం దాదాపు 16 సంవత్స రాలు పెరగనుంది. ఓసీపీ–1కు అప్పగించనున్న 10వ గని ప్రాంతంలో 2019 డిసెంబర్ నాటికి బొగ్గు ఉత్పత్తి ప్రా రంభం అవుతుంది. అదే విధంగా సింగరేణి సంస్థ లో మొట్టమొదటి సారి లాంగ్వాల్ టెక్నాలజీని ప్రవేశపెట్టిన జీడీకే 10ఏ గనిని 2015లో యాజమాన్యం మూసివేసింది. జీడీకే 10ఏ గనిని 1985 లో ప్రారంభించారు. భూగర్భంలో నాలుగు పొర ల్లో ఉన్న బొగ్గు నిక్షేపాల్లో పై రెండు పొరల్లోని బొగ్గు నిక్షేపాలను వెలికితీయడం కోసం 1994లో 10ఏ గనిలో లాంగ్వాల్ టెక్నాలజీని ప్రవేశపెట్టారు. జీడికే 10, జీడీకే 10ఏ గనుల ఆవరణలో సుమారు 336 మిలియన్ టన్నుల బొగ్గు ఉండగా.. 34 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేశారు. మిగిలిని 302 మిలియన్ టన్నుల బొగ్గును యాజమాన్యం ఓసీపీ–1 ద్వారా వెలికితీయనుంది. బొగ్గు ఉత్పత్తి ఖర్చులు పెరిగాయి జీడీకే 10వ గనిని జీవితకాలం ముగిసింది. గనిలో బొగ్గు ఉత్పత్తి చేయాలంటే కోల్కర్టర్స్, సపోర్టుమెన్ కార్మికులు అవసరం కాగా.. కొత్తగా నియాకాలు లేవు. దీనికి తోడు పని స్థలం దూరం కావడంతో బొగ్గు ఉత్పత్తికి ఖర్చులు అ«ధికం కావడం వల్ల గనిని మూసివేయాలని యాజమాన్యం నిర్ణయించింది. అయితే ఓసీపీ–1 విస్తరణ వల్ల ఏఎల్పీకి ఎలాంటి ముప్పు వాటిళ్లకుండా రెండు డ్యామ్‌లను నిర్మించి, గనిలోపల ఉన్న యంత్రాలను పైకి తరలించిన తరువాతే.. గనిని పూర్తిస్థాయిలో మూసివేయడం జరుగుతుంది. –బి.వీరారెడ్డి, ఏఏపీ జీఎం -
చరిత్ర గుట్టు విప్పే ఉప్పు గని!!
హాల్‌స్టాట్... ఆస్ట్రియాలోని ముండెన్ జిల్లాలో ఉన్న అతి పురాతనమైన ఉప్పుగని. 1997లో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన ఈ ప్రదేశం పర్యాటకులను ఆకర్షించడంతో పాటుగా, చరిత్రకారుల పరిశోధనలకు గమ్యస్థానంగానూ మారింది. హాల్‌స్టాట్ సంస్కృతికి చిహ్నంగా నిలిచిన ఈ ఉప్పుగని గర్భంలో చరిత్ర పూర్వ యుగానికి సంబంధించిన ఎన్నెన్నో నిజాలు దాగున్నాయంటున్నారు పురావస్తు శాస్త్రవేత్త హాన్స్ రెష్రెటెర్. ఏడు వేల ఏళ్లుగా ఉప్పు ఉత్పత్తికి ప్రధాన కేంద్రంగా నిలిచిన ఈ ప్రదేశం... ఒకప్పుడు సంపన్న నాగరికతకు ఆనవాలుగా గుర్తింపు పొందిందని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి తమ పరిశోధనల్లో వెలుగు చూసిన ఆసక్తికర విషయాలు వెల్లడించారు. 3 వేల ఏళ్ల నాటి చెక్క వంతెన... నిత్యం పర్యాటకులతో రద్దీగా ఉండే ఈ చారిత్రక ప్రదేశానికి సంబంధించిన ఆసక్తికర అంశాలు తెలుసుకునేందుకు 1838 నుంచే తవ్వకాలు ప్రారంభించారు. ఇందులో భాగంగా క్రీ. పూర్వం 1100 నాటి చెక్క వంతెనను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ వంతెన ద్వారానే గనిలోకి వెళ్లి ఉప్పును సేకరించి ఉంటారని అభిప్రాయం వ్యక్తం చేశారు. ‘ ఒకప్పుడు యూరప్‌లోని సగం దేశాలకు హాల్‌స్టాట్ ఉప్పు సరఫరా కేంద్రంగా ఉండేది. ఈ గని ద్వారా రోజుకు సుమారు ఒక టన్ను ఉప్పును ఉత్పత్తి చేసేవారు. అయితే ఇక్కడ దొరికిన ఈటెల వంటి పదునైన ఆయుధాలు కాంస్య యుగం నాటికి చెందినవిగా భావిస్తున్నామని’ పేర్కొన్నారు. ఇన్ని వేల సంవత్సరాలైనా ఆ వంతెన మాత్రం చెక్కుచెదరలేదని, అయితే ప్రస్తుతం చేపట్టిన పునరుద్ధరణ కార్యక్రమాల్లో భాగంగా చిన్న చిన్న మరమ్మతులు చేస్తున్నారని తెలిపారు. రెండో దఫా తవ్వకాల్లో షాకింగ్ నిజాలు.. వియన్నాకు చెందిన మ్యూజియం ఆఫ్ నాచురల్ హిస్టరీ గత 60 ఏళ్లుగా హాల్స్టాట్లో తవ్వకాలు జరుపుతోంది. ఈ క్రమంలో... తాజాగా జరుపుతున్న రెండో దఫా తవ్వకాల్లో వేలాది అస్థిపంజరాలు బయల్పడ్డాయని హాన్స్ పేర్కొన్నారు. ‘ ప్రస్తుత తవ్వకాల్లో భాగంగా వేలాది అస్థిపంజరాలు బయల్పడ్డాయి. వీరిలో చాలా మంది మెడలో కాంస్య యుగం నాటి ఆభరణాలు ధరించి ఉన్నట్లు కనుగొన్నాం. అలాగే వారి అస్థికల పటుత్వాన్ని బట్టి శరీర నిర్మాణం కూడా చాలా ధృడంగా ఉండేదని అర్థమవుతోంది. దీన్ని బట్టి ఒకప్పుడు ఇక్కడ సంపన్న నాగరికత విలసిల్లిందని భావించవచ్చు. కానీ ఇక్కడ కూడా ఆర్థిక అసమానతలు ఉండేవని నిరూపించేందుకు మరికొన్ని పూర్తిగా ఎదగని శరీర నిర్మాణాలను కనుగొన్నామని’ ఆయన వ్యాఖ్యానించారు. పారిశ్రామిక విప్లవానికి నాంది.. 19 వ శతాబ్దంలో బయల్పడిన సమాధుల ఆధారంగా పూర్వ రాతి యుగానికి సంబంధించిన చరిత్రను తెలుసుకునే దిశగా చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా.. గనిలోని 100 మీటర్ల లోపలికి వెళ్లి పరిశోధనలు కొనసాగిస్తున్నామని హాన్స్ చెప్పారు. ఇందులో భాగంగా 3 వేల ఏళ్ల క్రితం నాటి లెదర్ గ్లోవ్స్, మందమైన తాళ్లు, గొడ్డలి వంటి నిర్మాణం కలిగిన పదునైన ఆయుధాలు కనుగొన్నామని.... వీటిని బట్టి వేల ఏళ్ల క్రితం నాడే పారిశ్రామిక విప్లవానికి పునాది పడిందని భావించవచ్చన్నారు. సందర్శకులకు స్వర్గధామం కూడా.. సముద్ర మట్టం నుంచి 800 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ సహజ సిద్ధమైన సరస్సును, అందులో నిక్షిప్తమైన ఉప్పు గని సందర్శించేందుకు ఏటా లక్షల మంది పర్యాటకులు వస్తూంటారని ఎగువ ఆస్ట్రియా గవర్నర్ థామస్ స్టెల్జర్ అన్నారు. వీరిలో ఎక్కువ మంది ఆసియా నుంచి వచ్చే వారి సంఖ్య అధికంగా ఉంటుందని పేర్కొన్నారు. హాల్‌స్టాట్ సంస్కృతికి చిహ్నంగా నిలిచిన ఈ గని ద్వారా ఏటా 2 లక్షల 50 వేల టన్నుల ఉప్పును ఉత్పత్తి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రకృతి అందాలకు నిలయంగా విలసిల్లుతున్న ఈ చారిత్రక సంపదను రక్షించుకోవడం తమ కర్తవ్యమని వ్యాఖ్యానించారు. -
గని కార్మికుడు మృతి
కొలిమిగుండ్ల: నాపరాళ్ల గనిలో ఓ కార్మికుడు ప్రమాదవశాత్తు మృతి చెందాడు. అంకిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన గంగయ్య (39) అదే గ్రామానికి చెందిన పుల్లారెడ్డి నాపరాతి గనిలో సోమవారం కూలీకి వెళ్లాడు. కటింగ్ మిషన్‌తో కోత కోసిన ఆరడుగల ఎత్తైన నాపరాయిని వెలికి తీసి వరుసలో పెట్టేక్రమంలో కాలు జారి కింద పడ్డాడు. అతని తలపై నాపరాయి పడటంతో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అనంతపురం జిల్లా తాడిపత్రి ప్రభుత్వ వైద్యశాలకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతుడికి భార్య కుళ్లాయమ్మ, కుమారుడు గణేష్ ఉన్నారు. ఏఎస్ఐ ఉస్మాన్‌ఘని తాడిపత్రి ప్రభుత్వ వైద్యశాలకు చేరుకొని వివరాలు సేకరించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు తెలిపారు. -
నాపరాతి గనిలో కార్మికుడి దుర్మరణం
కొలిమిగుండ్ల: రాఘవరాజుపల్లె–అంకిరెడ్డిపల్లె గ్రామాల మధ్యనున్న నాపరాతి గనిలో జరిగిన ప్రమాదంలో ఓ కార్మికుడు దుర్మరణం చెందాడు. కనకాద్రిపల్లెకు చెందిన మేకల లింగారెడ్డి (55) రోజు మాదిరిగానే అంకిరెడ్డిపల్లెకు చెందిన విశ్వనాథరెడ్డి నాపరాతి గనిలో కూలీ పనికి వెళ్లాడు. కోత కోసిన రాయిన నడిపిస్తున్న తరుణంలో వంద అడుగుల పైనుంచి బండ రాయి నేరుగా తలపై పడింది. తోటి కార్మికులు చూస్తుండగానే కుప్పకూలిపోయాడు. క్షణాల్లోనే రక్తపు మడుగులో తుదిశ్వాస విడిచాడు. లింగారెడ్డి గనిలో పని చేస్తుండగా... భార్య పార్వతి పాలీష్ ఫ్యాక్టరీలో పని చేస్తుండేది. ఒక్కగానొక్క కుమార్తెకు వివాహం జరిపించారు. మరి కొద్ది సేపట్లో పని ముగించుకొని ఇంటికి చేరాల్సిన కార్మికుడు రెప్పపాటులో అనంత లోకాలకు చేరాడు. విషయం తెలుసుకున్న ఎస్ఐ బీటీ వెంకటసుబ్బయ్య అక్కడికి చేరుకొని వివరాలు సేకరించారు. కొద్ది రోజుల నుంచి నాపరాతి గనుల్లో కోతులు సంచరిస్తున్నాయి. ఈ క్రమంలోనే గని పైభాగంలో సంచరించే సమయంలో రాయి కిందకు పడటంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని సహ కార్మికులు పేర్కొన్నారు. కోతుల బెడద ఎక్కువగా ఉంటే తరచూ టపాసులు పేల్చాలని ఎస్ఐ యజమానులకు సూచించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని బనగానపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. -
21 ఇన్‌క్లైన్ బొగ్గు గని మూత!
ఏడు నెలల్లో ముగియనున్న భూగర్భ గని జీవితకాలం బదిలీ భయంతో కార్మికుల ఆందోళన నూతన గని ప్రారంభించాలని డిమాండ్ ఇల్లెందుఅర్బన్: ఇల్లెందు ఏరియాలోని 21 ఇన్‌క్లైన్ భూగర్భ గని జీవితకాలం మరో ఏడు నెలల్లో ముగియనుంది. 2017 మార్చి నాటికి గనిలో ఉత్పత్తి నిలిచిపోనుంది. దీంతో కార్మికులను ఇతర ప్రాంతాలకు బదిలీ చేయనున్నారు. ప్రస్తుతం గనిలో 497 మంది కార్మికులు పనిచేస్తున్నారు. గని జీవితకాలం ముగిసేనాటికి సుమారు 60 మందికి పైగా కార్మికులు ఉద్యోగ విరమణ పొందనున్నారు. మిగిలిన కార్మికుల్లో మాత్రం బదిలీ భయం పట్టుకుంది. ఏళ్లతరబడి స్థానికంగా పని చేసి దూరప్రాంతాలకు వెళ్లాల్సివస్తుందని ఆవేదన చెందుతున్నారు. యాజమాన్యం రెండేళ్ల నుంచి దశలవారీగా బదిలీ చేస్తూ కార్మికుల సంఖ్యను కుదించింది. గని జీవితం కాలం మరికొంత కాలం పెంచాలని, అది సాధ్యపడకపోతే నూతన గనిని ప్రారంభించాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. పలు విభాగాలకు ముప్పు 21 ఇన్‌క్లైన్ మూతపడితే సమీపంలోని వర్క్‌షాపు, ఆటోవర్క్షాపు, స్టోర్స్‌లతో పాటు ఏరియా వైద్యశాల తదితర విభాగాలకు ముప్పు వాటిల్లనుంది. గని మూతపడితే ఆయా విభాగాలు కూడా ఎత్తివేసే అవకాశం ఉందని కార్మికులు వాపోతున్నారు. ఇప్పటికే పలు విభాగాల్లో కార్మికుల సంఖ్య 15 మంది కంటే మించిలేరు. మూతపడే నాటికి సగానికిపైగా కార్మికులు ఉద్యోగ విరమణ పొందనున్నారు ఎటు తేలని సొసైటీ అవినీతి గని మరో ఏడు నెలల్లో మూతపడనుందని యాజమాన్యమే చెబుతోంది. రెండేళ్లుగా 21 ఇన్‌క్లైన్ సొసైటీ అవినీతిపై విచారణ జరుగుతోంది. అక్రమార్కులను ఇప్పటివరకు తేల్చలేదు. డిపాజిటర్లకు రావాల్సిన నగదును పూర్తిగా చెల్లించలేకపోయారు. వాయిదాలతో నెట్టుకొస్తున్నారు. కొందరు అక్రమార్కులు చక్రం తిప్పుతూ గని మూతపడే వరకు విచారణ ముందుకు సాగకుండా అడ్డుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. గని మూతపడితే తమ పరిస్థితి ఏమిటని డిపాజిటర్లు ఆందోళన చెందుతున్నారు. ఓపెన్కాస్టులే దిక్కు ఇల్లెందు ఏరియాలో ఉన్న ఒకే ఒక్క అండర్ గ్రౌండ్మైన్ మూతపడటంతో కేఓసీ, జేకే–5 ఓసీల్లో మాత్రమే బొగ్గు ఉత్పత్తి కొనసాగనుంది. యాజమాన్యం గని మూతపడిన అనంతరం మెగా ఓసీకి ప్రతిపాదనలు రూపొందిస్తోంది. మూతపడిన గని ప్రదేశాన్ని ఓసీగా మార్పు చేసి ఉత్పత్తి సాధించేందుకు చర్యలు చేపడుతున్నారు. 21 ఇన్‌క్లైన్‌కు చివరి గుర్తింపు ఎన్నికలు సింగరేణిలో జరగనున్న ఈ దఫా గుర్తింపు సంఘం ఎన్నికల్లో 21 ఇన్‌క్లైన్ కార్మికులు ఓటు వేయనున్నారు. మళ్లీ జరగనున్న గుర్తింపు సంఘం ఎన్నికల నాటికి గని మూతపడి ఉంటుంది. మళ్లీ దఫా జరగనున్న ఎన్నికల నాటికి ఇక్కడి కార్మికులు వివిధ ప్రాంతాల్లో పని చేయనున్నారు. గని జీవితకాలం పెంచాలి గనిలో బొగ్గు నిక్షేపాలు అధికంగా ఉన్నాయి. మూసివేయడం సరికాదు. యాజమాన్యం ప్రత్యేక దృష్టి సారించి మరో నాలుగైదేళ్లు గని జీవితం కాలం పెంచవచ్చు. కార్మికులను బదిలీ చేయొద్దు –కె.సారయ్య, ఏఐటీయూసీ నేత నూతన గనులు ప్రారంభించాలి యాజమాన్యం నూతన గనుల ఏర్పాటు విషయమై ఆలోచించడంలేదు. గుర్తింపు సంఘం, ప్రాతినిధ్య సంఘాలు గని జీవితకాలాన్ని పెంచడంలో విఫలమయ్యారు. యాజమాన్యం పునరాలోచించి నూతన గనులను ప్రారంభించాలి. –సత్యనారాయణ, హెచ్ఎంఎస్ నేత యాజమాన్యానికి విన్నవించాం ఇల్లెందు ఏరియాలో నూతన గనులు ప్రారంభించాలని యాజమాన్యానికి పలుమార్లు వినతి పత్రాలు అందజేశాం. ఇల్లెందు ఏరియాలో బొగ్గు నిక్షేపాలు అధికంగా ఉన్నాయి. 21ఇన్‌క్లైన్ గని జీవిత కాలం పెంచాలి. కార్మికులను బదిలీ చేయొద్దు. –జగన్నాథం, టీబీజీకేఎస్ నేత -
గని కార్మికుడి మృతి
ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లాలోని ఓ బొగ్గు గనిలో సోమవారం ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఓ కార్మికుడు మృతి చెందాడు. వివరాలు జిల్లాలోని శ్రీరాంపూర్ డివిజన్లో ఉన్న ఎస్సార్-3 గనీలో ప్రమాదవశాత్తు గడర్స్లో నీళ్లు చేరాయి. దీంతో అక్కడ విధులు నిర్వర్తిస్తున్న మైనింగ్ సర్ధార్ సత్యనారామణ అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సిఉంది. (మంచిర్యాల) -
''బాక్సైట్ జోలికి రావొద్దు''
-
రూ. 233 కోట్ల బ్యాంకు గ్యారంటీ ఇవ్వండి
న్యూఢిల్లీ: చత్తీస్‌గఢ్‌లోని బొగ్గు గని అభివృద్ధి పనులను వేగవంతం చేసే దిశగా రూ. 233 కోట్ల బ్యాంకు గ్యారంటీ ఇవ్వాలని విద్యుత్ రంగ దిగ్గజం ఎన్టీపీసీని కేంద్రం ఆదేశించింది. ష్యూరిటీ ఇవ్వని పక్షంలో గని కేటాయింపులను రద్దు చేయాల్సి ఉంటుందని సంస్థ సీఎండీ అరూప్ రాయ్ చౌదరికి పంపిన నోట్లో బొగ్గు శాఖ హెచ్చరించింది. లారా సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టుకు కావాల్సిన బొగ్గును ఉత్పత్తి చేసుకునేందుకు 2006 జనవరిలో మాండ్ రాయగఢ్ ప్రాంతంలోని తలైపల్లి బ్లాకును కేంద్రం ఎన్టీపీసీకి కేటాయించింది. దీనిపై ఇప్పటిదాకా ఎన్టీపీసీ సుమారు రూ. 1,464.5 కోట్లు వెచ్చించింది. ఇది 2011 ఫిబ్రవరిలో అందుబాటులోకి రావాల్సి ఉంది. కానీ, రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్థలం కేటాయింపులు జరగకపోవడం, రెండో దశ అటవీ శాఖ క్లియరెన్స్ లభించకపోవడం తదితర కారణాల వల్ల పనుల్లో జాప్యం జరుగుతోందని కంపెనీ చెబుతోంది. ఈ నేపథ్యంలోనే ఇటీవలే ప్రైవేట్, పబ్లిక్ సంస్థలకు ఇచ్చిన బొగ్గు బ్లాకుల అభివృద్ధి పనుల పురోగతిని సమీక్షించిన అంతర్ మంత్రిత్వ బృందం (ఐఎంజీ).. ఎన్టీపీసీ నుంచి ష్యూరిటీ తీసుకోవాలని సూచించింది. -
ధన్ బాద్ లో గనిలో కూలిన పైకప్పు, 4 గురు మృతి