![Rock Collapse In Singareni Mine At Bhadradri Kothagudem District - Sakshi](/styles/webp/s3/article_images/2022/11/27/26KGM342-192024_1_17.jpg.webp?itok=CbHXhGMc)
పీవీకే–5షాప్ట్ గని ముఖద్వారం
సింగరేణి (కొత్తగూడెం): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం సింగరేణి ఏరియా పరిధిలోని పీకేకే 5 షాప్ట్ గనిలో శనివారం బండ కూలింది. మొదటి షిప్ట్‌లో 36 డిప్, 121 లెవల్‌లో సీఎమ్మార్‌తో బొగ్గు ఉత్పత్తి జరుగుతున్న సమయంలో మూడు మీటర్ల బండ కంటిన్యూస్ మైనర్(సీఎమ్మార్) యంత్రంపై పడింది. ఈ ఘటనలో యంత్రం కొంతమేర దెబ్బతింది. యంత్రంపై మాత్రమే బండ పడటంతో పెనుప్రమాదం తప్పినట్లయింది. సీఎమ్మార్ మరమ్మతు పనులు పూర్తయ్యేందుకు నాలుగు రోజుల సమయం పట్టనుండటంతో అప్పటివరకు బొగ్గు ఉత్పత్తి నిలిచిపోనుంది. కాగా, తరచుగా బండ కూలే ఘటనలు పునరావృతం అవుతుండటంతో కార్మి కుల్లో ఆందోళన నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment