
బీజింగ్: చైనాలోని ఇన్నర్ మంగోలియా ప్రాంతంలోని అల్‌గ్జా లీగ్ గని కూలిన ఘటనలో మృతుల సంఖ్య ఆరుకు చేరింది. మరో 47 మంది జాడ తెలియాల్సి ఉందని చైనా అధికార వార్తాసంస్థ గురువారం తెలిపింది. భారీగా మట్టిచరియలు విరిగిపడటంతో బుధవారం ఆగిపోయిన సహాయక చర్యలను గురువారం తిరిగి ప్రారంభించారు.
ఇప్పటివరకు ఐదుగురు చనిపోయినట్లు ధ్రువీకరించారు. గాయపడిన ఆరుగురిని ఆస్పత్రికి తరలించారు. 47 మంది జాడ గుర్తించాల్సి ఉంది. ఇటీవలికాలంలో చైనాలో గని ప్రమాదాలు సర్వసాధారణంగా మారాయి. గత ఏడాది జరిగిన 367 గని ప్రమాద ఘటనల్లో 518 మంది చనిపోయినట్లు సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ కథనం వెల్లడించింది.
చదవండి: అమెరికాలో భీకర మంచు తుపాను