న్యూఢిల్లీ, సాక్షి: ఇక నుంచి దేశంలో వికసిత్ భారత్ ఎజెండాగా పనిచేస్తామని మరోసారి కేంద్ర మంత్రిగా ఎన్నికైక బీజేపీ సీనియర్, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అంటున్నారు. తెలంగాణతో పాటు ఏపీలో తాజా రాజకీయ పరిణామాలపైనా సోమవారం ఢిల్లీలో సాక్షితో ఆయన ఎక్స్ క్లూజివ్‌గా మాట్లాడారు.
‘‘ఎన్నికలైపోయాయి, ఇక ప్రతిపక్షాలన్నీ అభివృద్ధికి సహకరించాలి. వికసిత్ భారత్ ఎజెండా పనిచేస్తాం. పేద ప్రజలకు కోట్లాది ఇల్లు నిర్మిస్తాం. తెలంగాణకు 10 లక్షల కోట్ల రూపాయల నిధులు తెచ్చాం. తెలంగాణకు నేను నిధులు తీసుకురాలేదనే వారు మూర్ఖులు. అలాంటి మూర్ఖుల మాటలకు జవాబు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. రీజినల్ రింగ్ రోడ్డుకు రాష్ట్రం తరఫున నిధులను జమ చేయడం లేదు. కేంద్రం ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం భూమి ఇవ్వడం లేదు’’ అని విమర్శించారాయన.
.. రాబోయే రోజుల్లో తెలంగాణలో 88 సీట్లు టార్గెట్‌గా పని చేస్తామని, తెలంగాణలో కచ్చితంగా అధికారాన్ని సాధిస్తామని అంటున్నారాయన. వచ్చేసారి తెలంగాణలో అసెంబ్లీ , లోక్‌సభ ఎన్నికల ఒకేసారి జరుగుతాయి. నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది. తెలంగాణలో అసెంబ్లీ సీట్లు పెరగబోతున్నాయి అని కీలక వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ చేస్తున్న బీఆర్‌ఎస్ ఓటు బదిలీ ఆరోపణలపై స్పందిస్తూ.. తెలంగాణ ఒక పార్టీ గుత్తాధిపత్యం నడవదు. కాంగ్రెస్ పార్టీ అవగాహన లేకుండా .. తెలివి తక్కువగా మాట్లాడుతోంది. మాకు బీఆర్‌ఎస్‌తో పాటు కాంగ్రెస్ ఓట్లు కూడా బదిలీ అయ్యాయి’’ అని అన్నారు.
ఇక ఏపీలో కొనసాగుతున్న రాజకీయ ఉద్రిక్తతలపైనా ఆయన స్పందించారు. ఏపీలో ఎన్నికల తర్వాత దాడులు మంచిది కాదు. అలాంటి దాడులను క్షమించే ప్రసక్తి లేదు. ఆ తరహా దాడులపై జీరో టాలరెన్స్ తో వ్యవహరిస్తాం’’ అని కేనంద్ర మంత్రి కిషన్‌రెడ్డి హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment