సాక్షి, హైదరాబాద్: నగరంలో మూసీ సుందరీకరణ అంశంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో పేదల ఇల్లు కూల్చకుండా మూసీ సుందరీకరణ చేయాలని ప్రభుత్వానికి సూచించారు. అలాగే, మూసీ నదిలో డ్రైనేజీలు కలవకుండా చూడాలన్నారు.
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘మూసీ సుందరీకరణ చేసినా పునర్జీవం చేసినా మేం వ్యతిరేకం కాదు. మూసీకి రెండు వైపులా రిటైనింగ్ వాల్ కట్టండి. డ్రైనేజీ మూసీలో కలవకుండా చూడండి. పేదల ఇల్లు కూల్చకుండా మూసీ సుందరీకరణ చేయవచ్చు. ఆ తర్వాత మూసీ పునర్జీవం చేయండి.
రాష్ట్రంలో గ్రూప్-1 అభ్యర్థుల న్యాయ బద్ధమైన సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నా. తెలంగాణ సమాజానికి బీఆర్‌ఎస్ వ్యతిరేకం. కేసీఆర్ కుటుంబంపై తెలంగాణలో ఇంకా వ్యతిరేకత ఉంది. లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు సీట్లే ఇవ్వలేదు అంటూ కామెంట్స్ చేశారు.
ఇది కూడా చదవండి: పనికిమాలిన మాటలు.. పాగల్ పనులు: కాంగ్రెస్‌పై కేటీఆర్ ఫైర్
Comments
Please login to add a commentAdd a comment