
సాక్షి, హైదరాబాద్: దేశంలో డీలిమిటేషన్‌పై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి. దక్షిణాదిలో బీజేపీ బలపడకూడదని కాంగ్రెస్, బీఆర్‌ఎస్, డీఎంకే కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. స్టాలిన్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయింది. ప్రభుత్వ వ్యతిరేకతను డైవర్ట్ చేసేందుకు ముఖ్యమంత్రి స్టాలిన్ డీలిమిటేషన్ మీటింగ్ పెట్టారని అన్నారు. ఇదే సమయంలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ జతకట్టిపోవడం వాళ్ల చీకటి ఒప్పందానికి నిదర్శనమని ఘాటు విమర్శలు చేశారు.
కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి బీజేపీ ఆఫీసులో మీడియాతో మాట్లాడుతూ..‘డీలిమిటేషన్‌పై కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లు పార్టీలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీల నిజస్వరూపం మరోసారి బయటపడింది. దక్షిణాదికి అన్యాయం చేసి బీజేపీ బలపడాలని అనుకోవడం లేదు. దక్షిణాదిలో బీజేపీ బలపడకూడదని కాంగ్రెస్, బీఆర్‌ఎస్, డీఎంకే కుట్ర చేస్తున్నాయి. చెన్నై సమావేశానికి బీఆర్‌ఎస్, కాంగ్రెస్ జతకట్టిపోవడం వాళ్ల చీకటి ఒప్పందానికి నిదర్శనం. దేశంలో లేని సమస్యను సృష్టించి రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారు. లేని డీలిమిటేషన్‌పై కాంగ్రెస్, బీఆర్‌ఎస్ రాజకీయం చేస్తున్నాయి.
తమిళనాడులో కుటుంబ, అవినీతి పాలన నడుస్తోంది. డీలిమిటేషన్‌పై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. బీజేపీపై తప్పుడు ప్రచారాన్ని ఖండిస్తున్నాం. కుటుంబ, అవినీతి పార్టీలు మోదీపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాయి. ఎలాంటి వివక్ష లేకుండా అన్ని రాష్ట్రాలు అభివృద్ధి జరగాలని ప్రధాని మోదీ కోరుకుంటున్నారు. స్టాలిన్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయింది. తండ్రీకొడుకులు అక్కడ ఇచ్చిన హామీలు నెరవేర్చలేక ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. భాషల పేరు మీద దక్షిణాదికి అన్యాయం చేయాలని బీజేపీ అనుకోవడం లేదు. దక్షిణాది ప్రజలు బీజేపీవైపు చూస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేకతను డైవర్ట్ చేసేందుకు డీలిమిటేషన్ మీటింగ్ పెట్టారు. కాంగ్రెస్ కేవలం మూడు రాష్ట్రాలకే పరిమితమైంది. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తెలంగాణ, కర్ణాటకలో అధికారం బీజేపీదే. డీలిమిటేషన్ చేయాలంటే పార్లమెంట్‌లో చట్టం చేయాలి. ఇంకా జనాభా లెక్కల సేకరణే జరగలేదు’ అని చెప్పుకొచ్చారు.

డీలిమిటేషన్ గురించి గతంలో ఉన్న చట్టాలు కాంగ్రెస్ తీసుకొచ్చినవే. ఏదో జరిగిపోతుందని కేటీఆర్, రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఆరు గ్యారంటీలపైన రేవంత్ దృష్టి పెడితే బాగుంటుంది. నిన్న జరిగిన సమావేశంలో ఆయా రాజకీయ పార్టీలు వారి స్వప్రయోజనం కోసం మాట్లాడుతున్నాయి. గతంలో ఇవే రాజకీయ పార్టీలు రాజ్యాంగం మారుస్తారని ప్రచారం చేశారు. ఏది జరిగినా ఏ ప్రాంతానికి అన్యాయం జరగదు. అవినీతి, కుటుంబ పార్టీలు చేస్తున్న వాటిని ప్రజలు తిప్పికొట్టాలి. బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య సయోధ్యని కుదుర్చే పనిలో ఎంఐఎం ఉంది అని వ్యాఖ్యలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment