
సాక్షి, విజయవాడ: కామన్వెల్త్ గేమ్స్ వెయిట్ లిప్టింగ్ విభాగంలో స్వర్ణం సాధించిన తెలుగు తేజం రాగాల వెంకట్ రాహుల్ వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని కలిశారు. రాహుల్‌కు ఆర్థిక సాయం చేస్తామని వైఎస్సార్‌సీపీ అధినేత తెలిపారు. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కోన రఘుపతి రాహుల్‌కు లక్ష రూపాయల ఆర్థిక సాయం ప్రకటించారు. కామన్వెల్త్‌లో స్వర్ణం నెగ్గిన రాహుల్‌ను ఈ సందర్భంగా వైఎస్ జగన్ మరోసారి అభినందించారు. కాగా, వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర కృష్ణా జిల్లాలో దిగ్విజయంగా కొనసాగుతోంది.
గోల్డ్‌కోస్ట్ వేదికగా జరిగిన కామెన్వెల్త్ గేమ్స్‌లో 85 కేజీల విభాగంలో ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా స్టువర్ట్‌పురం ప్రాంతానికి చెందిన రాగాల వెంకట్ రాహుల్ 338 కేజీలు (స్నాచ్‌లో 151+క్లీన్ అండ్ జెర్క్‌లో 187) బరువెత్తి పసిడిని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment