Venkata Rahul
-
టాప్స్ నుంచి రెజ్లర్ సాక్షి ఔట్
న్యూఢిల్లీ: తెలుగు తేజం, వెయిట్‌లిఫ్టర్ రాగాల వెంకట రాహుల్ టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ (టాప్స్)కు దూరమయ్యాడు. రియో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత, స్టార్ రెజ్లర్ సాక్షి మలిక్‌తో పాటు రాహుల్‌ని ఆ పథకం నుంచి భారత స్పోర్ట్స్ అథారిటీ (సాయ్) తొలగించింది. రెజ్లర్ సాక్షి గత కొంతకాలంగా నిరాశాజనక ప్రదర్శన కనబరుస్తోంది. గుంటూరుకు చెందిన వెంకట్ కూడా కొంతకాలంగా గాయం కారణంగా అంతర్జాతీయ టోరీ్నలకు దూరంగా ఉన్నాడు. ప్రతిభావంతులైన క్రీడాకారులను ఒలింపిక్ విజేతలుగా తీర్చిదిద్దేందుకు ఈ పథకాన్ని తెచ్చారు. కోచింగ్, ఇతర వసతులతో పాటు టాప్స్‌లో ఉన్న క్రీడాకారులకు నెలకు రూ. 50 వేల చొప్పున ఆరి్థక సాయం అందజేస్తారు. క్రీడాకారులకు అండదండలు అం దించే ఈ పథకంలో కొత్తగా రెజ్లర్ రవి దహియాకు చోటు దక్కింది. అతను ఇటీవల కజకిస్తాన్‌లో జరిగిన ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో 57 కేజీల కేటగిరీలో కాంస్యం గెలిచాడు. ఆ ఈవెంట్లో సాక్షి (62 కేజీలు) కూడా తలపడింది. కానీ... తొలి రౌండ్లోనే ని్రష్కమించింది. హైదరాబాదీ వెటరన్ షట్లర్ సైనా నెహా్వల్ తనకు వ్యక్తిగత ట్రెయినర్ సేవల్ని పొడిగించాలన్న అభ్యర్థనను ‘సాయ్’ మన్నించింది. ఈ ఏడాది డిసెంబర్ ఆఖరు దాకా ఆమె వ్యక్తిగత ఫిట్నెస్ ట్రెయినర్ స్వరూప్ సిన్హా ఏడు అంతర్జాతీయ టోర్నీల్లో ఆమెతో పాటు వెళ్లేందుకు అయ్యే ఖర్చుల్ని ‘సాయ్’ భరిస్తుంది. -
స్వర్ణ విజేత రాహుల్‌కు వైఎస్సార్సీపీ ఆర్థికసాయం
-
వైఎస్ జగన్‌ను కలిసిన స్వర్ణ విజేత రాహుల్
సాక్షి, విజయవాడ: కామన్వెల్త్ గేమ్స్ వెయిట్ లిప్టింగ్ విభాగంలో స్వర్ణం సాధించిన తెలుగు తేజం రాగాల వెంకట్ రాహుల్ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. రాహుల్‌కు ఆర్థిక సాయం చేస్తామని వైఎస్సార్సీపీ అధినేత తెలిపారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కోన రఘుపతి రాహుల్‌కు లక్ష రూపాయల ఆర్థిక సాయం ప్రకటించారు. కామన్వెల్త్లో స్వర్ణం నెగ్గిన రాహుల్‌ను ఈ సందర్భంగా వైఎస్ జగన్ మరోసారి అభినందించారు. కాగా, వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర కృష్ణా జిల్లాలో దిగ్విజయంగా కొనసాగుతోంది. గోల్డ్‌కోస్ట్ వేదికగా జరిగిన కామెన్వెల్త్ గేమ్స్‌లో 85 కేజీల విభాగంలో ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా స్టువర్ట్పురం ప్రాంతానికి చెందిన రాగాల వెంకట్ రాహుల్ 338 కేజీలు (స్నాచ్‌లో 151+క్లీన్ అండ్ జెర్క్‌లో 187) బరువెత్తి పసిడిని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. -
‘బెస్ట్ లిఫ్టర్’ రాహుల్
గోల్డ్ కోస్ట్ (ఆస్ట్రేలియా): కామన్వెల్త్ చాంపియన్‌షిప్‌లో సంచలన ప్రదర్శనతో 16 రికార్డులు కొల్లగొట్టిన ఆంధ్రప్రదేశ్ వెయిట్ లిఫ్టర్ రాగాల వెంకట రాహుల్ తాజాగా రెండు అవార్డుల్ని కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. సీనియర్ పురుషులు, జూనియర్ పురుషుల 85 కేజీల విభాగాల్లో ‘బెస్ట్ లిఫ్టర్’ అవార్డులను రాహుల్ చేజిక్కించుకున్నాడు. ఈ చాంపియన్‌షిప్‌లో భారత బృందానికి నాలుగు అవార్డులు రాగా... అందులో రెండు ఏపీ లిఫ్టర్కే దక్కడం విశేషం. మీరాబాయి చానుకు సీనియర్ మహిళల కేటగిరీలో, దీపక్ లాథెర్‌కు యూత్ బాలుర విభాగంలో అవార్డులు లభించాయి. మొత్తం మీద ఈ టోర్నీలో 34 రికార్డుల్ని భారత లిఫ్టర్లు నెలకొల్పారు. శనివారం చివరి రోజు పోటీల్లో పర్దీప్ సింగ్ బంగారు పతకం సాధించి, వచ్చే ఏడాది కామన్వెల్త్ గేమ్స్‌కు అర్హత సంపాదించాడు. 105 కేజీల కేటగిరీలో పర్దీప్ స్నాచ్‌లో 147 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 195 కేజీలు, మొత్తం 342 కేజీల బరువెత్తాడు. జూనియర్ మహిళల ప్లస్ 94 కేజీల విభాగంలో పూర్ణిమా పాండే రజతం నెగ్గగా... జూనియర్ పురుషుల 105 కేజీల కేటగిరీలో లవ్‌ప్రీత్ సింగ్ స్వర్ణం గెలిచాడు. ప్లస్ 105 కేజీల విభాగంలో గుర్దీప్ సింగ్‌కు కాంస్యం లభించింది. -
స్టూవర్ట్‌పురం యువకుడు సూపర్
ఆల్ ఇండియా వెయిట్‌లిఫ్టింగ్ పోటీల్లో గుంటూరు జిల్లా బాపట్ల మండలం స్టూవర్టుపురం గ్రామానికి చెందిన రాగాల వెంకట రాహూల్ తన సత్తా చాటాడు. సబ్ జూనియర్స్ 77 కిలోల కేటగిరిలో స్నాచ్‌లో 135 కిలోలు, క్లీన్ అండ్ జర్క్‌లో 155 కిలోల బరువులు ఎత్తి రెండు స్వర్ణపతకాలు, ఓవరాల్ ఛాంపియన్ షిప్ సాధించినందుకు మరో స్వర్ణ పతకం అందుకున్నాడు. వీటితోపాటు ఉత్తమ క్రీడాకారుడిగా మరో గౌరవ పురస్కారం కూడా స్వీకరించాడు.